అన్వేషించండి

ఈ నెలలో హోండా కార్లపై భారీ ఆఫర్లు - City, Amaze, Elevate కొంటే రూ.1.97 లక్షల వరకూ డిస్కౌంట్‌

ఈ ఫిబ్రవరి నెలలో Honda Cars India తన City, Amaze, Elevate మోడళ్లపై రూ.1.97 లక్షల వరకు డిస్కౌంట్లు ఇస్తోంది.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • హోండా సిటీ, అమేజ్, ఎలివేట్ కార్లపై భారీ తగ్గింపులు.
  • అమేజ్ ప్రి-ఫేస్‌లిఫ్ట్‌ మోడల్‌పై రూ.68,000 వరకు ఆఫర్లు.
  • ఎలివేట్ SUVపై రూ.1.48 లక్షల వరకు తగ్గింపు ప్రయోజనాలు.
  • హైబ్రిడ్ సిటీ e:HEV మోడల్‌పై రూ.1.97 లక్షల ఆఫర్.

Honda Car Discounts February 2026: ఈ నెలలో (ఫిబ్రవరి 2026) కొత్త కారు కొనాలనుకునే వారికి హోండా నుంచి శుభవార్త చెప్పింది. Honda Cars India, తన పాపులర్‌ మోడళ్లైన City, Amaze, Elevate కార్లపై భారీ డిస్కౌంట్లు ప్రకటించింది. ఈ నెల చివరి వరకే వర్తించే ఈ ఆఫర్లలో రూ.1.97 లక్షల వరకూ ప్రయోజనాలు లభిస్తున్నాయి. క్యాష్‌ డిస్కౌంట్‌, ఎక్స్చేంజ్‌ బెనిఫిట్స్‌, స్క్రాపేజ్‌ ఆఫర్‌, లాయల్టీ బోనస్‌ వంటి వాటితో హోండా కార్లు ఇప్పుడు ఇంకా ఎక్కువ ఆకర్షణీయంగా మారాయి.

Honda Amaze డిస్కౌంట్‌

హోండా అమేజ్‌ విషయంలో రెండు జనరేషన్ల మోడళ్లపై ఆఫర్లు ఉన్నాయి.
సెకండ్‌ జనరేషన్‌ ప్రి-ఫేస్‌లిఫ్ట్‌ అమేజ్‌ మోడల్‌పై గరిష్టంగా రూ.68,000 వరకూ డిస్కౌంట్‌ లభిస్తోంది.
ఫేస్‌లిఫ్ట్‌ అమేజ్‌ మోడల్‌పై రూ.57,000 వరకూ బెనిఫిట్స్‌ ఉన్నాయి.

ఈ కారులో 1.2 లీటర్‌ i-VTEC పెట్రోల్‌ ఇంజిన్‌ ఉంటుంది. ఇది 89 bhp శక్తి, 110 Nm టార్క్‌ ఇస్తుంది. 5-స్పీడ్‌ మాన్యువల్‌, 7-స్పీడ్‌ CVT ఆటోమేటిక్‌ గేర్‌బాక్స్‌ ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. ఫేస్‌లిఫ్ట్‌ అమేజ్‌ V, VX, ZX వేరియంట్లలో లభిస్తుంది. దీని ఎక్స్‌-షోరూమ్‌ ధర రూ.7.47 లక్షల నుంచి రూ.9.99 లక్షల వరకూ ఉంటుంది.

Honda Elevate డిస్కౌంట్‌

హోండా మిడ్‌ సైజ్‌ SUV అయిన Elevate పై ఈ నెల రూ.1.48 లక్షల వరకూ డిస్కౌంట్‌ అందిస్తోంది.
ఈ SUVలో City సెడాన్‌లో ఉండే అదే 1.5 లీటర్‌ పెట్రోల్‌ ఇంజిన్‌ ఉంటుంది. ఇది 121 hp శక్తి, 145 Nm టార్క్‌ ఇస్తుంది.
SUV తరహాలో ఉండే స్టాన్స్‌, లగ్జరీ ఫీచర్లు, కంఫర్ట్‌ డ్రైవింగ్‌తో Elevate ఇప్పుడు డిస్కౌంట్లతో మరింత విలువైన ఎంపికగా మారింది.

Honda City డిస్కౌంట్‌

హోండా ఫిఫ్త్‌ జనరేషన్‌ City సెడాన్‌పై రూ.1.27 లక్షల వరకూ బెనిఫిట్స్‌ లభిస్తున్నాయి.
ఈ ఆఫర్లు కార్పొరేట్‌ డిస్కౌంట్లకు అదనంగా ఉండడం విశేషం.
City మోడల్‌ SV, V, VX, ZX వేరియంట్లలో అందుబాటులో ఉంది. అన్ని వేరియంట్లలోనూ 1.5 లీటర్‌ న్యాచురల్‌ ఆస్పిరేటెడ్‌ పెట్రోల్‌ ఇంజిన్‌ ఉంటుంది.

Honda City e:HEV హైబ్రిడ్‌ డిస్కౌంట్‌

ఈ ఫిబ్రవరిలో అత్యధిక డిస్కౌంట్‌ హోండా City e:HEV హైబ్రిడ్‌ మోడల్‌పైనే ఉంది. ఈ కారుపై రూ.1.97 లక్షల వరకూ ప్రయోజనాలు లభిస్తున్నాయి.
ఈ మోడల్‌లో 1.5 లీటర్‌ పెట్రోల్‌ ఇంజిన్‌తో పాటు రెండు ఎలక్ట్రిక్‌ మోటార్లు ఉంటాయి.
109 hp ట్రాక్షన్‌ మోటార్‌, 95 hp మోటార్‌ జనరేటర్‌ కలిసి 126 hp శక్తి, 253 Nm టార్క్‌ అందిస్తాయి. దీనికి eCVT గేర్‌బాక్స్‌ ఉంటుంది.

తెలుగు రాష్ట్రాల్లో కార్ కొనుగోలు ప్లాన్‌ చేస్తున్న వారికి ఇది మంచి అవకాశం. అయితే ఈ ఆఫర్లు డీలర్‌, వేరియంట్‌, స్టాక్‌ లభ్యత ఆధారంగా మారే అవకాశం ఉంది. అందుకే కస్టమర్లు తమ దగ్గరలోని హోండా షోరూమ్‌ను సంప్రదించడం మంచిది.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.

Frequently Asked Questions

ఫిబ్రవరి 2026 లో హోండా కార్లపై ఎలాంటి ఆఫర్లు ఉన్నాయి?

ఈ నెలలో హోండా సిటీ, అమేజ్, ఎలివేట్ కార్లపై రూ.1.97 లక్షల వరకు డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి.

హోండా అమేజ్ కారుపై ఎంత డిస్కౌంట్ లభిస్తుంది?

సెకండ్ జనరేషన్ ప్రీ-ఫేస్‌లిఫ్ట్ అమేజ్ మోడల్‌పై గరిష్టంగా రూ.68,000 వరకు, ఫేస్‌లిఫ్ట్ మోడల్‌పై రూ.57,000 వరకు డిస్కౌంట్ ఉంది.

హోండా ఎలివేట్ SUV పై డిస్కౌంట్ ఎంత?

హోండా ఎలివేట్ SUV పై ఈ నెల రూ.1.48 లక్షల వరకు డిస్కౌంట్ లభిస్తుంది, ఇది ఈ కారును మరింత ఆకర్షణీయంగా మార్చింది.

హోండా సిటీ e:HEV హైబ్రిడ్ కారుపై గరిష్ట డిస్కౌంట్ ఎంత?

ఈ ఫిబ్రవరిలో హోండా సిటీ e:HEV హైబ్రిడ్ మోడల్‌పై అత్యధికంగా రూ.1.97 లక్షల వరకు ప్రయోజనాలు లభిస్తున్నాయి.

టాప్ హెడ్ లైన్స్

BE 6 రేసింగ్‌ లుక్‌ను పక్కన పెట్టిన మహీంద్రా.. త్రివర్ణాలు, 540 డిగ్రీల కెమెరాతో కొత్త 'ఫ్రీడమ్‌ ఎడిషన్‌'
ఆగస్టు 15 సందర్భంగా మహీంద్రా BE 6కు కొత్త లుక్‌.. ఫార్ములా ఈ ఫ్రీడమ్‌ ఎడిషన్‌లో ప్రత్యేక మార్పులు!
స్కార్పియో ఎన్‌ కంటే రఫ్‌ అండ్‌ టఫ్‌ లుక్స్‌.. మహీంద్రా కొత్త లైఫ్‌స్టైలర్‌ పికప్‌ ట్రక్‌ వచ్చేసింది!
మహీంద్రా స్కార్పియో లైఫ్‌స్టైలర్‌ పికప్‌ ట్రక్‌.. టయోటా, ఇసుజుకి స్ట్రాంగ్‌ కాంపిటీషన్‌!
Clean Cloudy Car Headlights: వర్షంలో హెడ్‌లైట్లు మసకగా కనిపిస్తున్నాయా? ఈ చిట్కాలు మీకు హెల్ప్ అవుతాయి!
వర్షంలో హెడ్‌లైట్లు మసకగా కనిపిస్తున్నాయా? ఈ చిట్కాలు మీకు హెల్ప్ అవుతాయి!
Brezza vs Venue EMI Comparison: Brezza vs Venue EMIల మధ్య తేడా ఏంటి? పూర్తి వివరాలు తెలుసుకోండి!
Brezza vs Venue EMIల మధ్య తేడా ఏంటి? పూర్తి వివరాలు తెలుసుకోండి!

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Independence Day 2026: గోల్కొండ కోటపై జెండా ఆవిష్కరించిన రేవంత్ రెడ్డి! నీటి హక్కులు, రైతు సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రగతి ప్రస్థానం!
గోల్కొండ కోటపై జెండా ఆవిష్కరించిన రేవంత్ రెడ్డి! నీటి హక్కులు, రైతు సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రగతి ప్రస్థానం!
Independence Day 2026 At Amaravati: అమరావతి గడ్డపై తొలిసారి స్వాతంత్య్ర వేడుకలు! చంద్రబాబు ప్రసంగంలోని ముఖ్యాంశాలు!
అమరావతి గడ్డపై తొలిసారి స్వాతంత్య్ర వేడుకలు! చంద్రబాబు ప్రసంగంలోని ముఖ్యాంశాలు!
Komatireddy Rajagopal Reddy New Party: రాజగోపాల్ రెడ్డి కొత్త పార్టీ పెడతారా? కాంగ్రెస్ పై తిరుగుబాటా లేక మంత్రి పదవి కోసం ప్రెజర్ పాలిటిక్సా?
రాజగోపాల్ రెడ్డి కొత్త పార్టీ పెడతారా? కాంగ్రెస్ పై తిరుగుబాటా లేక మంత్రి పదవి కోసం ప్రెజర్ పాలిటిక్సా?
AP Teacher Suspension:మెగా డీఎస్సీపై కేంద్రానికి ఉపాధ్యాయుల ఫిర్యాదు! నలుగురిపై విద్యాశాఖ చర్యలు!
మెగా డీఎస్సీపై కేంద్రానికి ఉపాధ్యాయుల ఫిర్యాదు! నలుగురిపై విద్యాశాఖ చర్యలు!
Vande Mataram at Red Fort: ఎర్రకోటపై చారిత్రక ఘట్టం! 80వ స్వాతంత్య్ర వేడుకల్లో తొలిసారిగా
ఎర్రకోటపై చారిత్రక ఘట్టం! 80వ స్వాతంత్య్ర వేడుకల్లో తొలిసారిగా "వందేమాతరం" ఆలాపన!
YS Jagan Press Meets vs Protests: వైఎస్ జగన్ పరామర్శ రాజకీయం - రోడ్డెక్కుతున్న క్యాడర్.. ప్రెస్ మీట్లకే పరిమితమవుతున్న అధినేత! ఏపీలో వైఎస్సార్‌సీపీ ప్లాన్ ఏంటి?
వైఎస్ జగన్ పరామర్శ రాజకీయం - రోడ్డెక్కుతున్న క్యాడర్.. ప్రెస్ మీట్లకే పరిమితమవుతున్న అధినేత! ఏపీలో వైఎస్సార్‌సీపీ ప్లాన్ ఏంటి?
Telangana Police Recruitment 2026: తెలంగాణలో నిరుద్యోగులకు ఊరట! యూనిఫామ్ కొలువుల వయోపరిమితి రెండేళ్లు పెంపు!
తెలంగాణలో నిరుద్యోగులకు ఊరట! యూనిఫామ్ కొలువుల వయోపరిమితి రెండేళ్లు పెంపు!
PM Modi Sports Vision: 2036 ఒలింపిక్స్ ఆతిథ్యంతో పాటు నేషన్ వైడ్ టాలెంట్ హంట్.. క్వాలిఫై కానీ ఈవెంట్లపై ఫోకస్: ప్రధాని మోదీ
2036 ఒలింపిక్స్ ఆతిథ్యంతో పాటు నేషన్ వైడ్ టాలెంట్ హంట్.. క్వాలిఫై కానీ ఈవెంట్లపై ఫోకస్: ప్రధాని మోదీ
Embed widget