అన్వేషించండి

Honda CB 125 Hornet vs Bajaj Pulsar N125: ఏ బైక్‌ రేటు తక్కువ, ఏది బెస్ట్‌ మైలేజ్‌ ఇస్తుంది?

Latest & Best 125cc Bikes In India: హోండా CB 125 హార్నెట్ & బజాజ్ పల్సర్ N125 మధ్య ప్రత్యక్ష పోటీ ఉంది. ఈ రెండు బైక్‌ల ధర, ఫీచర్లు, ఇంజిన్, మైలేజ్ & డిజైన్‌ వివరాలు తెలుసుకోండి.

Honda CB125 Hornet vs Bajaj Pulsar N125 Comparison: హోండా, తన కొత్త 125cc సెగ్మెంట్ బైక్ CB125 హార్నెట్‌ను లాంచ్‌ చేసింది, బజాజ్ పల్సర్ N125 కు డైరెక్ట్‌ పోటీగా దీనిని మార్కెట్‌లోకి దింపింది. ఈ రెండు బైక్‌లు 125cc రేంజ్‌లో ఉన్నప్పటికీ.. రెండింటి స్టైల్‌, టెక్నాలజీ & పెర్ఫార్మెన్స్‌ భిన్నంగా ఉంటాయి. మీరు, బెస్ట్‌ పెర్ఫార్మెన్స్‌ ఇచ్చే ఫీచర్-రిచ్ 125cc బైక్‌ను కొనాలనుకుంటే, ముందుగా వాటి గురించి పూర్తిగా తెలుసుకోవాలి.

ధర
హోండా CB125 హార్నెట్ ఎక్స్-షోరూమ్ ధర (Honda CB125 Hornet Price) దాదాపు రూ. 95,000 నుంచి రూ. 1 లక్ష వరకు ఉండవచ్చు, దీనిని ఆగస్టు 1, 2025న అధికారికంగా ప్రకటిస్తారు. బజాజ్ పల్సర్ N125 ధర (Bajaj Pulsar N125 Price) రూ. 93,158 నుంచి రూ. 99,213 (ఎక్స్-షోరూమ్) వరకు ఉంటుంది. బజాజ్ పల్సర్ కొంచెం చౌకగా ఉంటుంది, కానీ హోండా హార్నెట్‌లో అందుబాటులో ఉన్న ప్రీమియం ఫీచర్లు మీ డబ్బుకు తగిన విలువను అందిస్తాయి.

డిజైన్ & స్టైల్‌ 
హోండా CB125 హార్నెట్ డిజైన్ స్పోర్టీ & స్ట్రీట్‌ ఫైటర్ లుక్‌తో ఉంటుంది. ఇందులో షార్ప్ ట్యాంక్ డిజైన్, స్ల్పిట్ LED హెడ్‌లైట్లు & గోల్డెన్ USD ఫోర్కులు ఉన్నాయి. ఈ బైక్ నాలుగు స్టైలిష్ రంగులలో లభిస్తుంది. మరోవైపు, బజాజ్ పల్సర్ N125 లుక్ కొంచెం సాంప్రదాయకంగా ఉంటుంది, కానీ దాని ట్యాంక్‌ను బలంగా & ADV-ఇన్‌స్పిరేషన్‌తో డిజైన్‌ చేశారు. దీనిలో LED లైటింగ్ కూడా అందుబాటులో ఉంది. హోండా హార్నెట్ లుక్ మరింత ఆధునికంగా & స్పోర్టీగా ఉంటుంది, అయితే క్లాసిక్ & నమ్మకమైన డిజైన్‌ను కోరుకునే వారు పల్సర్ N125 ను ఇష్టపడతారు.

ఇంజిన్ & పనితీరు
హోండా CB125 హార్నెట్ 123.94cc ఇంజిన్‌ను కలిగి ఉంది, ఇది 11.14 PS శక్తిని & 11.2 Nm టార్క్‌ను ఇస్తుంది. ఈ బైక్ 5-స్పీడ్ గేర్‌బాక్స్‌తో వస్తుంది & కేవలం 5.4 సెకన్లలో 0 నుంచి 60 kmph వేగాన్ని అందుకుంటుంది. దీని బరువు 124 కిలోలు, 166 mm గ్రౌండ్ క్లియరెన్స్ & 12 లీటర్ల ఫ్యూటల్‌ ట్యాంక్ కెపాసిటీ ఉంది. బజాజ్ పల్సర్‌ N125 లో 124.58cc ఇంజిన్‌ ఉంది, ఇది 12 PS శక్తిని & 11 Nm టార్క్‌ను ఇస్తుంది. దీని బరువు 127.5 కిలోలు, 198 mm గ్రౌండ్ క్లియరెన్స్ & 9.5 లీటర్ల ఇంధన ట్యాంక్ ఉంది. ఇంజిన్‌ పవర్‌లో పల్సర్ N125 కొంచెం శక్తివంతమైనది. హోండా హార్నెట్ కాస్త తేలికైనది & పెద్ద ఇంధన ట్యాంక్ వల్ల సుదూర ప్రయాణాలకు చక్కగా సరిపోతుంది.

అధునాతన ఫీచర్లు
హోండా CB125 హార్నెట్‌లో 4.2 అంగుళాల TFT డిస్‌ప్లే, బ్లూటూత్ కనెక్టివిటీ, హోండా రోడ్‌సింక్ యాప్, టర్న్-బై-టర్న్ నావిగేషన్, USB టైప్-సి ఛార్జర్ పోర్ట్‌, సింగిల్ ఛానల్ ABS, గోల్డెన్ USD ఫోర్క్ & 5-స్టెప్ అడ్జస్టబుల్ మోనోషాక్ వంటి అనేక అధునాతన ఫీచర్లు ఉన్నాయి. బజాజ్ పల్సర్ N125లో LCD డిస్‌ప్లే, బ్లూటూత్ కనెక్టివిటీ (టాప్ వేరియంట్లలో మాత్రమే) & సైలెంట్-స్టార్ట్ టెక్నాలజీ వంటి ఫీచర్లు ఉన్నాయి; TFT డిస్‌ప్లే, & USD ఫోర్క్ ఇందులో లేవు.

మైలేజ్ & ఇంధన రకం
హోండా CB125 హార్నెట్ అంచనా వేసిన మైలేజ్ లీటరుకు 50 km నుంచి 55 kmలు; కాగా, బజాజ్ పల్సర్ N125 లీటరు దాదాపు 50 km మైలేజ్ ఇస్తుంది. రెండు బైక్‌లు E20 ఇంధనానికి అనుకూలంగా ఉంటాయి, అంటే భవిష్యత్తులో అవి పర్యావరణ అనుకూల ఇంధనానికి సిద్ధంగా ఉంటాయి.

టాప్ హెడ్ లైన్స్

5,600 కి.మీ. నడిచిన Hero Xpulse 210.. డైలీ జర్నీలో ఈ బండిలో బయటపడిన మైనస్‌లు ఏంటి?
Hero Xpulse 210 రియల్‌ రివ్యూ - 5,600km తిరిగిన ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉంది?
Bikes Under 10000 Down Payment: పదివేలు చేతిలో ఉంటే ఈ బైక్‌లు సొంతం చేసుకోవచ్చు! పూర్తి EMI లెక్కలు ఇవే!
పదివేలు చేతిలో ఉంటే ఈ బైక్‌లు సొంతం చేసుకోవచ్చు! పూర్తి EMI లెక్కలు ఇవే!
లక్ష రూపాయలకే E3 Trion ఎలక్ట్రిక్ స్కూటర్.. 82km స్పీడ్‌, 165km రేంజ్‌, AI ఫీచర్లు
ఈ ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ భలే ఉందే! రేటు లక్ష రూపాయలే.. ఏకంగా 165km రేంజ్‌!
రూ. 2 లక్షల డౌన్ పేమెంట్‌తో Tata Nexon కొంటే, EMI ఎంత చెల్లించాలి
రూ. 2 లక్షల డౌన్ పేమెంట్‌తో Tata Nexon కొంటే, EMI ఎంత చెల్లించాలి

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pruthvishwar Reddy: లైంగిక వేధింపుల కేసు.. TBA జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు
లైంగిక వేధింపుల కేసు.. TBA జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు
Telangana High Court: హైడ్రాకు హైకోర్టు షాక్: రంగనాథ్‌కు, అధికారులకు ధిక్కరణ నోటీసులు
హైడ్రాకు హైకోర్టు షాక్: రంగనాథ్‌కు, అధికారులకు ధిక్కరణ నోటీసులు
Tirupati Latest News:
"వైఎస్ జగన్ ఇంటి ముందే కుటుంబంతో ఆ*త్మ*హత్య చేసుకుంటా" భూమన బాధితుడి హెచ్చరిక!
SBI Clerk Notification 2026:ఎస్సీ, ఎస్టీ, బీసీల కోసమే SBI క్లర్క్ నోటిఫికేషన్! అర్హతలు, దరఖాస్తు విధానం పూర్తి వివరాలు ఇవే!
ఎస్సీ, ఎస్టీ, బీసీల కోసమే SBI క్లర్క్ నోటిఫికేషన్! అర్హతలు, దరఖాస్తు విధానం పూర్తి వివరాలు ఇవే!
PM Modi:
"క్యాంపస్ లైఫ్‌కు, బయటి ప్రపంచానికి చాలా తేడా ఉంది, ప్రశ్న గుర్తించి సమాధానాలు వెతుక్కోవాలి" ఐఐటి ఢిల్లీలో ప్రధాని మోదీ ప్రసంగం 
Hyderabad Metro RTC Common Pass: హైదరాబాద్‌ వాసులకు గుడ్‌ న్యూస్! ఆర్టీసీ, మెట్రోకు ఒకటే పాస్ ! ఎప్పటి నుంచి ప్రారంభం?
హైదరాబాద్‌ వాసులకు గుడ్‌ న్యూస్! ఆర్టీసీ, మెట్రోకు ఒకటే పాస్ ! ఎప్పటి నుంచి ప్రారంభం?
Samantha : సమంత లేటెస్ట్ ఫోటో షూట్ - ఆగస్ట్ ఎనర్జీ అంటూ...
సమంత లేటెస్ట్ ఫోటో షూట్ - ఆగస్ట్ ఎనర్జీ అంటూ...
Crime Thriller OTT : నగరంలో దారుణ హత్యలు... కిల్లర్ ఎవరు? - ఓటీటీలోకి సరికొత్త క్రైమ్ థ్రిల్లర్ సడన్ స్ట్రీమింగ్
నగరంలో దారుణ హత్యలు... కిల్లర్ ఎవరు? - ఓటీటీలోకి సరికొత్త క్రైమ్ థ్రిల్లర్ సడన్ స్ట్రీమింగ్
Embed widget