Honda Activa 6G: రోజూ ఆఫీసుకు వెళ్లేందుకు హోండా యాక్టివా 6G సరిపోతుందా? - లోన్‌పై కొంటే EMI ఎంతవుతుంది?
Honda Activa 6G: హోండా యాక్టివా 6Gలో 109.51 cc సింగిల్ సిలిండర్, ఫ్యూయల్-ఇంజెక్టెడ్, ఎయిర్-కూల్డ్ ఇంజిన్ ఉంది. ఈ స్కూటర్ ఫుల్ ట్యాంక్‌తో 316 కి.మీ. వరకు ప్రయాణించగలదు.

Honda Activa 6G Price, Range And Features In Telugu: హోండా యాక్టివా, భారత మార్కెట్లో అత్యంత డిమాండ్ ఉన్న స్కూటర్లలో ఒకటి & దాని క్లాస్‌లో అత్యంత ప్రజాదరణ పొందిన టూవీలర్. ఈ స్కూటర్‌లో మూడు వేరియంట్లు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి, అవి - Standard, Deluxe & H-Smart. స్టాండర్డ్ వేరియంట్ ఎక్స్-షోరూమ్ ధర (Honda Activa 6G ex-showroom price) 84,173 రూపాయలు. Deluxe వేరియంట్ రేటు 94,693 రూపాయలు & H-Smart వేరియంట్ ధర 97,694 రూపాయలు. ఈ స్కూటర్ కొనడానికి మీరు బ్యాంకు నుంచి లోన్ కూడా తీసుకోవచ్చు, ప్రాసెస్ చాలా ఈజీగా ఉంటుంది.
హైదరాబాద్ లేదా విజయవాడలో... హోండా యాక్టివా 6G స్టాండర్డ్ మోడల్ ఆన్-రోడ్ ధర (Honda Activa 6G on-road price) దాదాపు రూ. 1.12 లక్షలు. ఈ హోండా స్కూటర్ కోసం మీరు రూ. 1.06,000 రుణం పొందవచ్చు. అంటే, మీరు కేవలం రూ. 6,000 డౌన్ పేమెంట్ చేస్తే చాలు. ఈ రుణంపై బ్యాంక్ స్థిర వడ్డీని వసూలు చేస్తుంది, దీని ప్రకారం ప్రతి నెలా EMI రూపంలో బ్యాంకులో స్థిర మొత్తాన్ని డిపాజిట్ చేయాలి.
హోండా యాక్టివా 6G ఫైనాన్స్ ప్లాన్
మీరు హోండా యాక్టివా కొనడానికి రూ. 6,000 డౌన్ పేమెంట్ చేసి మిగిలిన 1.06 లక్షలను లోన్‌గా తీసుకుంటే, బ్యాంక్ ఈ రుణంపై 9 శాతం వార్షిక వడ్డీ రేటు వసూలు చేస్తుందనుకుంటే...
4 సంవత్సరాల కాలం కోసం రుణం తీసుకుంటే, మీరు ప్రతి నెలా రూ. 2,976 EMI చెల్లించాలి.
3 సంవత్సరాల లోన్ టెన్యూర్ ఎంచుకుంటే, మీరు ప్రతి నెలా రూ. 3,705 EMI చెల్లించాలి.
2 సంవత్సరాల్లో లోన్ క్లియర్ చేయాలనుకుంటే, మీరు ప్రతి నెలా రూ. 5,164 EMI చెల్లించాలి.
1 సంవత్సరం రుణ కాల వ్యవధి పెట్టుకుంటే, మీరు ప్రతి నెలా రూ. 9,540 EMI చెల్లించాలి.
మీరు హోండా యాక్టివా కోసం ఏ బ్యాంకు నుంచి రుణం తీసుకున్నా, బ్యాంక్ ఇచ్చే లోన్ & వసూలు చేసే వడ్డీ రేటు మీ క్రెడిట్ స్కోర్, బ్యాంక్ పాలసీపై ఆధారపడి ఉంటాయి. వివిధ బ్యాంకుల వివిధ విధానాల ప్రకారం ఈ గణాంకాలలో స్వల్ప తేడాలు ఉండవచ్చు.
హోండా యాక్టివా 6G ఇంజిన్ కెపాసిటీ & మైలేజ్
హోండా యాక్టివా 6G, 109.51 cc సింగిల్-సిలిండర్, ఫ్యూయల్-ఇంజెక్టెడ్, ఎయిర్-కూల్డ్ ఇంజిన్‌తో పవర్ పొందుతుంది, ఇది 7.84 PS పవర్‌ను & 8.90 Nm పీక్ టార్క్‌ను జనరేట్ చేస్తుంది. దీని ARAI (Automotive Research Association of India) సర్టిఫైడ్ మైలేజ్ లీటరుకు 59.5 km. ప్రస్తుతం ఉన్న స్కూటర్లతో పోలిస్తే ఇది బెస్ట్ మైలేజీగా చెప్పాలి, దీనివల్ల డబ్బు ఆదా అవుతుంది. ఈ టూవీలర్ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ 5.3 లీటర్లు. ఈ లెక్క ప్రకారం, ఈ స్కూటర్ ఫుల్ ట్యాంక్‌తో 315 కి.మీ వరకు ప్రయాణించగలదు.
డైలీ జర్నీకి & ఫ్యామిలీకి అనుకూలం
హోండా యాక్టివా 6Gలో ఇంధన సామర్థ్యాన్ని మెరుగుపరిచేందుకు BS6 ఇంజిన్ ఇవ్వడమే కాకుండా, స్మూత్ రైడింగ్ అనుభవాన్ని అందించేందుకు PGGF ఇంజిన్ టెక్నాలజీ కూడా అందించారు. సైడ్ స్టాండ్ ఇంజిన్ కట్-ఆఫ్, ACG స్టార్టర్ మోటార్, ఇంజిన్ ఆన్/ఆఫ్ స్విచ్, డిజిటల్-ఆనలాగ్ కాంబినేషన్ మీటర్, ఎడ్జ్ లెడ్ హెడ్‌ల్యాంప్ వంటి ఆధునిక సదుపాయాలు ఇందులో ఉన్నాయి. టెలిస్కోపిక్ ఫ్రంట్ సస్పెన్షన్, 3-స్టెప్ అడ్జస్టబుల్ రియర్ సస్పెన్షన్ వల్ల సిటీ రోడ్లపై సౌకర్యవంతంగా డైలీ జర్నీ చేయవచ్చు. అంతేకాకుండా, 18 లీటర్ల అండర్‌సీట్ స్టోరేజ్, ఎక్స్‌టర్నల్ ఫ్యూయల్ ఫిల్లింగ్ వంటి ఉపయోగకరమైన ఫీచర్లు దీనిని ఫ్యామిలీ యూజర్లకు మరింత అనుకూలంగా చేస్తాయి.





















