By: ABP Desam | Updated at : 10 Mar 2023 02:15 PM (IST)
హీరో సూపర్ స్ప్లెండర్ ఎక్స్‌టెక్ ఆఫర్ ( Image Source : Hero Motocorp )
Super Splendor Xtec: దేశంలోని ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ తన సూపర్ స్ప్లెండర్ మోడల్ ఎక్స్‌టెక్ అప్‌డేటెడ్ వెర్షన్‌ను ఇటీవల విడుదల చేసింది. ఈ బైక్ డిజైన్, లుక్, ఫీచర్లు, ఇంజిన్‌లో హీరో మార్పులు చేసింది. హోండా సీబీ షైన్, టీవీఎస్ రైడర్ వంటి వాటికి సూపర్ స్ప్లెండర్ ఎక్స్‌టెక్ ప్రత్యర్థిగా నిలుస్తుంది.
సూపర్ స్ప్లెండర్ Xtec ధర
సూపర్ స్ప్లెండర్ ఎక్స్‌టెక్‌లో టాప్ ఎండ్ వేరియంట్ డిస్క్ బ్రేక్ వేరియంట్ గురించి తెలుసుకుందాం. దీని ఎక్స్ షోరూం ధర రూ. 87,268గా ఉంది. ఇక ఆన్ రోడ్ రేటు మాత్రం రూ. లక్ష దాటిపోవచ్చ.
పైన పేర్కొన్న విధంగా బైక్ ధర రూ. లక్షగా ఉంది. కానీ మీరు కనీసం రూ. 10,000 డౌన్‌పేమెంట్‌తో ఈ బైక్‌ను ఇంటికి తీసుకు వెళ్లిపోవచ్చు. ఆన్‌లైన్ కాలిక్యులేటర్ ప్రకారం మీరు రూ. 10,000 డౌన్ పేమెంట్ చేస్తే, ఈ బైక్‌ను కొనుగోలు చేయడానికి మీరు మిగిలిన రూ.90,651పై రుణం తీసుకోవాలి.
లోన్‌ను పాస్ చేసిన తర్వాత రూ. 10,000 డౌన్‌పేమెంట్‌ను డిపాజిట్ చేయడం ద్వారా మీరు బైక్‌ను ఇంటికి తీసుకురావచ్చు. యావరేజ్ వడ్డీ రేటు 9.7 శాతం ఉంటుంది అనుకున్నా, మీరు మూడు సంవత్సరాల వరకు కాల పరిమితి పెట్టుకోవచ్చు. అలాంటి సందర్భంలో ప్రతి నెలా మీరు రూ. 2,912 ఈఎంఐగా చెల్లించాలి.
సూపర్ స్ప్లెండర్ ఎక్స్‌టెక్ ఫీచర్లు
సూపర్ స్ప్లెండర్ ఎక్స్‌టెక్ ఫీచర్ల గురించి చెప్పాలంటే డిజిటల్ స్పీడోమీటర్‌లో కూడా బ్లూటూత్ కనెక్టివిటీ అందించారు. దీనికి స్మార్ట్‌ఫోన్‌ను కనెక్ట్ చేయడం ద్వారా వినియోగదారులు అక్కడికక్కడే కాల్, SMS అలెర్ట్ నోటిఫికేషన్లను చూడవచ్చు.
దీంతో పాటు రియల్ టైమ్ మైలేజ్, సైడ్ స్టాండ్, లో ఫ్యూయల్, అధిక బీమ్, i3S గురించి సమాచారాన్ని ఇందులో పొందవచ్చు. అలాగే యూఎస్‌బీ ఛార్జింగ్ పోర్ట్, స్లిమ్ ఎగ్జాస్ట్ పైప్‌లు కూడా ఈ బైక్‌లో ఉన్నాయి.
సూపర్ స్ప్లెండర్ ఎక్స్‌టెక్ ఇంజిన్
ఈ బైక్ 124.7cc ఎయిర్-కూల్డ్ ఇంజన్‌ను పొందుతుంది. ఇది గరిష్టంగా 10.7 bhp శక్తిని, 10.6 Nm టార్క్‌ను ఉత్పత్తి చేయగలదు. ఈ బైక్‌లో ఫైవ్ స్పీడ్ గేర్‌బాక్స్‌ను కూడా అందించారు. మరోవైపు మైలేజీ గురించి చెప్పాలంటే కంపెనీ తెలుపుతున్న దాని ప్రకారం ఇది లీటరు పెట్రోలుకు 68 కిలోమీటర్ల మైలేజీని ఇవ్వగలదు.
ఫిబ్రవరిలో ద్విచక్ర వాహనాల మార్కెట్‌ను హీరో పూర్తిగా డామినేట్ చేసింది. టాప్ ఫైవ్ టూ వీలర్ తయారీ కంపెనీల్లో 3,82,317 వాహనాలను విక్రయించి 37.65 మార్కెట్ షేర్‌ను సంపాదించింది. గత సంవత్సరం ఫిబ్రవరితో పోలిస్తే 15.34 శాతం వృద్ధిని హీరో కనపరించింది. అలాగే గత నెలతో పోలిస్తే 9.41 శాతం ఎక్కువ అమ్మకాలను సాధించింది. కానీ రెండో స్థానంలో ఉన్న హోండా మాత్రం హీరోకు పూర్తిగా తిరోగమనంలో సాగుతోంది. గతేడాది ఫిబ్రవరితో పోలిస్తే 20.52 శాతం, గత నెలతో పోలిస్తే 18.36 శాతం అమ్మకాలను హోండా కోల్పోయింది.
ఇక మూడో స్థానంలో ఉన్న టీవీఎస్ దాదాపుగా హోండాను చేరుకుంది. ఈ రెండిటి మధ్య 5,662 యూనిట్ల వ్యత్యాసం మాత్రమే ఉంది. టీవీఎస్ గతేడాది ఫిబ్రవరితో పోలిస్తే 27.83 శాతం, గత నెలతో పోలిస్తే 2.28 శాతం వృద్ధిని సాధించింది. ప్రస్తుతం టీవీఎస్ మార్కెట్ షేర్ 21.80 శాతంగా ఉంది. ఇది హోండా కంటే కేవలం 0.56 మాత్రమే తక్కువ.
2023 Honda SP 125: కొత్త హోండా షైన్ వచ్చేసింది - రూ. లక్ష లోపే!
Mahindra Thar SUV: సైలెంట్‌గా సూపర్ హిట్ అవుతున్న మహీంద్రా ఎస్యూవీ - కీలకమైన మైలురాయి!
Kia EV9 SUV: టెస్లా కంటే మెరుగైన ఆటోపైలట్ ఫీచర్‌తో కియా కొత్త కారు - మస్క్‌కి మంట పెడతారా?
Key steps To Buy Car: సెకండ్ హ్యాండ్ కారు కొనాలి అనుకుంటున్నారా? ఈ 5 విషయాల్లో జాగ్రత్తగా ఉండండి!
Expensive Bikes: దేశంలో అత్యంత ఖరీదైన బైక్స్ ఇవే - చూడటం తప్ప కొనడం కష్టమే!
Data Theft Case : వినయ్ భరద్వాజ ల్యాప్ టాప్ లో 66.9 కోట్ల మంది డేటా- 24 రాష్ట్రాలు, 8 మెట్రోపాలిటిన్ సిటీల్లో డేటా చోరీ
PBKS Vs KKR: కోల్‌కతాకు వర్షం దెబ్బ - డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో పంజాబ్ విక్టరీ!
BRSలో చేరిన మహారాష్ట్ర రైతు సంఘాల నేతలు, తన జీవితమంతా పోరాటాలేనన్న కేసీఆర్
Nellore Adala : టీడీపీకి అభ్యర్థులు లేకనే ఫిరాయింపులు - నెల్లూరు వైఎస్ఆర్సీపీ ఎంపీ లాజిక్ వేరే...