By: ABP Desam | Updated at : 25 Sep 2022 04:13 PM (IST)
Edited By: anjibabuchittimalla
Photo@EVIndiaonline/twitter
చాలా టూ వీలర్ తయారీ కంపెనీలు ఇప్పటికే ఎలక్ట్రిక్ వాహనాలను మార్కెట్లోకి తీసుకురాగా.. ఆలస్యంగా ఈ విభాగంలోకి అడుగు పెడుతున్నది హీరో మోటోకార్ప్. ఈ కంపెనీ తన మొదటి ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాన్ని అక్టోబర్ 7న విడుదల చేయడానికి రెడీ అవుతోంది. హీరో కంపెనీ తన సబ్ బ్రాండ్ అయిన విడా నుంచి ఈ ఎలక్ట్రిక్ వాహనాన్ని వినియోగదారులకు అందుబాటులోకి తీసుకురాబోతుంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ TVS iQube, Bajaj Chetak, Ola S1 వంటి వాటికి గట్టి పోటీగా ఉంటుంది.
గతేడాది ఆగస్టులో ఎలక్ట్రిక్ స్కూటర్ ప్రదర్శన
హీరో మోటోకార్ప్ గత ఏడాది ఆగస్టులో టీజర్ ద్వారా ఎలక్ట్రిక్ స్కూటర్‌ను ప్రదర్శించింది. ఈ ఎలక్ట్రిక్ వాహనం మాస్ మార్కెట్ ను భర్తీ చేసే అవకాశం ఉంది. బ్రాండ్ తో పాటు ధరను దాని సామాన్యులకు అందుబాటులో ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలుస్తున్నది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ భద్రత, రేంజ్‌పై స్పషల్ ఫోక్ పెడుతున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఉన్న ఇ-స్కూటర్లతో పోల్చితే అన్ని అంశాల్లో ఈ ద్విచక్ర వాహనం మెరుగైన లక్షణాలను కలిగి ఉంటుందని తెలుస్తోంది.
విడుదల ఆలస్యం ఎందుకంటే?
వాస్తవానికి Vida ఎలక్ట్రిక్ స్కూటర్ జూలైలోనే మార్కెట్లోకి వస్తుందని అందరూ భావించారు. కానీ, సప్లై చైన్ ఇష్యూస్, సెమీ కండక్టర్ల కొరత కారణంగా జాప్యం జరిగిందని హీరో మోటోకార్ప్ చైర్మన్, CEO పవన్ ముంజాల్ వెల్లడించారు. "కస్టమర్లకు అత్యంత మెరుగైన వాహనాన్ని అందించమే తమ లక్ష్యం. అందుకే, ముందుగా ప్రకటించినట్లు జూలైలో కాకుండా రాబోయే పండుగ కాలంలో తమ తొలి ఈవీని విడుదల చేస్తున్నాం” అని ముంజాల్ తెలిపారు.
ఏపీలోనే ఇ-స్కూటర్ తయారీ
హీరో మోటోకార్ప్ తన మొదటి ఎలక్ట్రిక్ స్కూటర్‌ను ఆంధ్ర ప్రదేశ్ లోని చిత్తూరు తయారీ కేంద్రంలో తయారు చేయనుంది. కంపెనీ ఈ ఎలక్ట్రిక్ వాహనాల కోసం రూ. 760 కోట్లను పెట్టుబడి పెడుతున్నది. ఇప్పటికే ఈ డబ్బును సిద్ధం చేసింది. తమ తదుపరి ఉత్పత్తులను ఎలక్ట్రిక్ దిశగా మళ్లించబోతున్నది. ఇందులో భాగంగా బ్యాటరీ మార్పిడి సాంకేతికత కోసం గోగోరో అనే తైవాన్ కంపెనీతో హీరో కంపెనీ ఒప్పందం కుదుర్చుకున్నారు.అటు ఎన్విరాన్ మెంటల్, సోషల్, గవర్నెన్స్ పరిష్కారాల కోసం 10,000 మంది ఎంటర్ పెన్యూర్స్ ను తీసుకోబోతున్నది.
ఐదు ఎలక్ట్రిక్ SUVలు
భారత్‌లో ఎక్కువ డిమాండ్ ఉన్న స్పోర్ట్స్ యుటిలిటీ వెహికల్ (SUV) స్పేస్‌లో మహీంద్ర గ్రూప్ (Mahindra Group) స్పీడ్ పెంచుతోంది. ఈ విభాగంలో కొత్త ఎలక్ట్రిక్ కార్లను తీసుకురావడం మీద ఫోకస్ పెంచింది. దేశీయ & అంతర్జాతీయ మార్కెట్ల కోసం ఐదు ఎలక్ట్రిక్ SUVలను విడుదల చేయనున్నట్లు గత నెలలో యునైటెడ్ కింగ్‌డమ్‌లో (UK) జరిగిన ఒక కార్యక్రమంలో ఈ ఇండియన్ ఆటో మేజర్ ప్రకటించింది. ఈ ఐదు ఎలక్ట్రిక్ SUV మోడళ్లను XUV, BE (ఆల్ న్యూ ఎలక్ట్రిక్ ఓన్లీ) బ్రాండ్ల క్రింద మార్కెట్లకు పరిచయం చేయనున్నట్లు మహీంద్ర & మహీంద్ర తెలిపింది. లెగసీ మోడళ్లను XUV బ్రాండ్ కింద, కొత్త ఎలక్ట్రిక్ మోడల్ BE బ్రాండ్ కింద కంపెనీ విడుదల చేస్తుంది.
Tata Nexon EV: టాటా నెక్సాన్ ఈవీ బుక్ చేసుకుంటే ఎంత కాలం ఎదురు చూడాలి? - వెయిటింగ్ పీరియడ్లు ఎలా ఉన్నాయి?
Upcoming Electric SUVs: త్వరలో మనదేశంలో రానున్న ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలు ఇవే - లిస్ట్‌లో ఏ కార్లు ఉన్నాయి?
సెకండ్ హ్యాండు కారును అమ్మాలనుకుంటున్నారా? - మంచి రేటు రావాలంటే ఏం చేయాలి?
2023 Hyundai i20 N Line: కొత్త హ్యుందాయ్ ఐ20 లాంచ్ - ధర రూ.10 లక్షలలోపే!
Hyundai Alcazar Facelift: హ్యుందాయ్ అల్కజార్‌ను అప్‌డేట్ చేయనున్న కంపెనీ - ధర ఎంత ఉండవచ్చు? ఏం మారుతుంది?
Chandrababu Bail Petition: చంద్రబాబు బెయిల్, సీఐడీ కస్టడీ పిటిషన్లపై విచారణ రేపటికి వాయిదా
Skanda Release Trailer: సీఎంకు కాబోయే అల్లుడిగా రామ్ - ‘స్కంద’ కొత్త ట్రైలర్ చూశారా?
AIADMK Breaks With BJP: ఎన్డీఏ కూటమికి అన్నాడీఎంకే గుడ్ బై - అన్నాదురైపై బీజేపీ వివాదాస్పద వ్యాఖ్యలతో కీలక నిర్ణయం
చాలామంది నన్ను ఉంచుకుంటా అన్నారు, కానీ పెళ్లి చేసుకుంటా అనలేదు: జయలలిత
/body>