By: ABP Desam | Updated at : 14 Mar 2023 03:02 PM (IST)
Edited By: anjibabuchittimalla
Photo@@Hero_Electric/twitter
భారత్ లో ఎలక్ట్రిక్ వాహనాల వాడకం రోజు రోజుకు పెరుగుతోంది. వీటి వినియోగం నగరాలు, పట్టణాల నుంచి ఇప్పుడు గ్రామ స్థాయికి చేరుకుంది. ఈ నేపథ్యంలో ఆయా టూ వీలర్ కంపెనీలు ఎలక్ట్రిక్ స్కూటర్లను మార్కెట్లోకి తీసుకొస్తున్నాయి. తాజాగా ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ HERO, మరో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ ను అందుబాటులోకి తీసుకురాబోతోంది. ఈ నేపథ్యలో కొత్త స్కూటర్ కు సంబంధించిన టీజర్ ను విడుదల చేసింది. ఈ స్కూటర్ లుక్ చూస్తే ఇప్పటికే అమ్మకాలు జరుపుకుంటున్న ఆప్టిమా మాదిరిగా కనిపిస్తోంది. ఈ లేటెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్ ను మార్చి 15న మార్కెట్లోకి తీసుకురానున్నట్లు తెలుస్తోంది.
A new era of intelligent and sustainable mobility is all set to dawn! Are you ready to experience the newest electrifying ride from Hero Electric? Watch this space to know more 🛵⚡#TheSmartMove pic.twitter.com/0nH6eSvFkO
— Hero Electric (@Hero_Electric) March 12, 2023
లేటెస్ట్ టెక్నాలజీ, అదిరిపోయే ఫీచర్లు
హీరో నుంచి రాబోతున్న స్కూటర్ కు సంబంధించి పలు వివరాలు అందుబాటులోకి వచ్చాయి. స్కైటర్ ఫ్రంట్ కౌల్ పైభాగంలో ఉండే ఎల్ఈడీ హెడ్ ల్యాంప్ చూడ్డానికి చాలా ఆకర్షణీయంగా ఉంది. దానికి సెంటర్ లో ఎల్ఈడీ టర్న్ ఇండికేటర్స్ ను కలిగి ఉంది. ఇవి స్కూటర్ కు అదిరిపోయే లుక్ ఇవ్వనుంది. హెడ్ ల్యాంప్, టర్న్ ఇండికేటర్ డిజైన్ ను చూస్తుంటే హీరో ఆప్టిమా మాదిరిగానే కనిపిస్తోంది. ఈ స్కూటర్ అల్లాయ్ వీల్స్ తో వస్తోంది. అంతేకాదు, ఫ్రంట్ డిస్క్ బ్రేక్ ను కలిగి ఉంటుంది. కర్వీ సీట్, బ్లూ పెయింట్ థీమ్ తో కూడిన అల్లాయ్ వీల్స్ తో ఈ స్కూటర్ చాలా ఆకట్టుకునేలా ఉంది. కంపెనీ అధికారికంగా విడుదల రోజు అన్ని వివరాలను వెల్లడించే అవకాశం ఉంది.
హీరో 8వ ఎలక్ట్రిక్ స్కూటర్ గా మార్కెట్లోకి
హీరో ఎలక్ట్రిక్ కంపెనీ ఇప్పటికే 7 మోడళ్లను మార్కెట్లోకి తీసుకొచ్చింది. తాజా స్కూటర్ ఎనిమిదవది కానుంది. ప్రత్యర్థి కంపెనీలకు దీటుగా ఈ వాహనాన్ని రూపొందిచినట్లు తెలుస్తోంద. దేశంలో ప్రస్తుతం పెట్రో వాహనాల వినియోగం తగ్గుతోంది. ఈ నేపథ్యంలో ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలుకు వినియోగదారులు మొగ్గు చూపుతున్నారు.
జనవరితో పోల్చితే తగ్గిన అమ్మకాలు
ఇక హీరో ఎలక్ట్రిక్ కంపెనీ ఫిబ్రవరి 2023లో దేశ వ్యాప్తంగా 5,861 యూనిట్లను అమ్మింది. జనవరితో పోల్చితే ఫిబ్రవరిలో అమ్మకాలు తగ్గాయి. జనవరిలో 6,393 యూనిట్లను అమ్మింది. ఇక ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో హీరో కంపెనీ ఇప్పటి వరకు 80,954 యూనిట్లను అమ్మింది. ఇక ఈ వాహనాలు FAME-II స్కీమ్ సబ్సిడీ ప్రకారం అందుబాటులో ఉన్నాయి.
దేశ వ్యాప్తంగా పెరుగుతున్న ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం
ప్రస్తుతం పర్యవరణ హితమైన ప్రయాణం పట్ల వాహనదారులు మొగ్గు చూపుతున్నారు. ఇప్పటికే ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం రోజు రోజుకు పెరుగుగోంది. ప్రస్తుతం దేశంలో ఎక్కువ రేంజ్ కలిగిన ఎలక్ట్రిక్ స్కూటర్ గా బ్రిస్క్ కొనసాగుతోంది. ఒక్క చార్జ్ తో 300కుపైగా కిలోమీటర్లు ప్రయాణించే అవకాశం ఉంటుంది. ఇటీవలే హైదరాబాద్ లో ఈ స్కూటర్ ను ఆవిష్కరించారు.
Read Also: మహీంద్రా ఎలక్ట్రిక్ రిక్షా నడిపిన బిల్ గేట్స్, ఆనంద్ మహీంద్రా ఏమన్నారంటే?
Best Bikes: రూ.లక్షలోపు ఈ ఫీచర్ ఉన్న బెస్ట్ బైక్స్ ఇవే - ఇది ఉంటేనే మోడర్న్ బైక్!
Honda City: రూ.1.3 లక్షలు కట్టి హోండా సిటీ ఇంటికి తీసుకెళ్లిపోవచ్చు - పూర్తి వివరాలు తెలుసుకోండి!
Bikes For Beginner Riders: మీకు బైక్ రైడింగ్ ఇంట్రస్ట్ ఉందా? - అయితే ఈ ఐదు బిగినర్ బైక్స్పై ఓ లుక్కేయండి!
Chetak Electric Scooter: ఒక్క చార్జ్ తో 108 కిలో మీటర్ల ప్రయాణం, చేతక్ నుంచి అప్డేటెడ్ వెర్షన్
Car Discontinue: ఏప్రిల్ 1 నుంచి ఈ కార్లు మార్కెట్లో కనిపించవు - చాలా పాపులర్స్ మోడల్స్ కూడా - ఎందుకు ఆపేస్తున్నారు?
AP News: మహిళా ఉద్యోగులకు ఏపీ సర్కార్ శుభవార్త - చైల్డ్ కేర్ లీవ్ ఎప్పుడైనా వాడుకోవచ్చని వెల్లడి
వడగళ్ల వానతో నష్టపోయిన ప్రాంతాల్లో పర్యటించనున్న సీఎం కేసీఆర్
CM Jagan : ఓ స్కిల్డ్ క్రిమినల్ చేసిన స్కామ్ స్కిల్ డెవలప్మెంట్, దేశంలోనే అతి పెద్ద కుంభకోణం - సీఎం జగన్
Kota Srinivasa Rao : డబ్బు కోసం మనిషి ప్రాణాలతో ఆడుకోవద్దు - మరణ వార్తపై కోట శ్రీనివాస రావు సీరియస్