అన్వేషించండి

Bike Riding Tips: బైక్ నడిపేటప్పుడు ఈ టిప్స్ ఫాలో అవుతున్నారా? - అయితే సరిగ్గా నడుపుతున్నట్లే!

చలికాలంలో టూ వీలర్ డ్రైవ్ చేసేటప్పుడు కొన్ని టిప్స్ ఫాలో అవ్వాలి.

Two Wheeler Riding Tips: భారతదేశంలో చాలా మంది ఆఫీసులకు వెళ్లడానికి టూ వీలర్ ఎక్కువగా ఉపయోగిస్తారు. ఎందుకంటే ఇది ఎకనమికల్‌గా ఉండటమే కాకుండా సమయాన్ని ఆదా చేయడంలో కూడా ప్రభావవంతంగా ఉంటుంది. ట్రాఫిక్ జామ్‌లో ఇరుక్కుపోయే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. కొంచెం స్థలం దొరికినా ముందుకు వెళ్లిపోవచ్చు. అయితే ప్రస్తుతం రోడ్లపై చిన్న పొరపాటు జరిగినా పెద్ద నష్టం వాటిల్లే వాతావరణం నెలకొంది. అటువంటి పరిస్థితిలో మీరు ద్విచక్ర వాహనం నడుపుతున్నప్పుడు కొన్ని విషయాలను గుర్తుంచుకోవాలి. వీటి గురించి మనం తెలుసుకుందాం.

హెల్మెట్ లేకుండా బయటకు వెళ్లవద్దు
వాతావరణం ఎలా ఉన్నా హెల్మెట్ లేకుండా ద్విచక్ర వాహనం నడపడం మంచిది కాదు. వింటర్ సీజన్‌లో హెల్మెట్ లేకుండా రైడింగ్ చేయడం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. దీంతోపాటు చలి మీ ఆరోగ్యాన్ని పాడు చేస్తుందని కూడా చెప్పవచ్చు.

దుస్తులు ధరించడంలో నిర్లక్ష్యం చేయవద్దు
బైక్ రైడింగ్ ఔత్సాహికులు కొన్నిసార్లు, స్టైలిష్‌గా కనిపించడం కోసం, వాతావరణానికి అనుగుణంగా దుస్తులు ధరించకుండా రైడ్ చేయడం ప్రారంభిస్తారు. ఈ కఠినమైన శీతాకాలంలో ఇది చాలా హానికరం.

అన్ని లైట్లు బాగానే ఉండేలా చూసుకోండి
ఈ సీజన్‌లో హెడ్‌లైట్లు, వెనుక లైట్లు, టర్న్ ఇండికేటర్‌లతో సహా ద్విచక్ర వాహనానికి సంబంధించిన అన్ని లైట్లు మంచి కండీషన్‌లో ఉండాలి. ఎందుకంటే రాత్రిపూట నడిపేటప్పుడు, పొగమంచు మొదలైనప్పుడు లైట్లు కూడా చాలా సహాయకారిగా ఉంటాయి. దీని కారణంగా మీ ముందున్న మార్గం, మీ వెనుక నడిచే వ్యక్తి గురించి మీకు ఒక ఆలోచన వస్తుంది.

బ్రేకులు, టైర్లు కండీషన్‌లో ఉండాలి
ఈ సీజన్‌లో రోడ్లు తడిగా మారడం వల్ల బైక్ జారిపోయే ప్రమాదం ఉంది. అందువల్ల టైర్లు సరైన స్థితిలో ఉండటం ముఖ్యం. తద్వారా స్కిడ్ అయ్యే అవకాశాలు తక్కువగా ఉంటాయి. బ్రేకులు మంచి స్థితిలో ఉంటే బైక్‌ను సరిగ్గా ఆపవచ్చు.

మరోవైపు భారతదేశ మార్కెట్లో ఉన్న ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో ఇటీవల తన కొత్త టూ ఇన్ వన్ కారుతో అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇది టూ వీలర్, త్రీ వీలర్ల కలయిక అని చెప్పవచ్చు. దీన్ని కావాలంటే రెండు విధాలుగా కూడా ఉపయోగించవచ్చు. సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఎక్స్/ట్విట్టర్‌లో షేర్ చేసిన వీడియోలో ఈ ప్రత్యేకమైన త్రీ వీలర్‌ను స్కూటర్ అవతార్‌గా మార్చడానికి కేవలం మూడు నిమిషాలు మాత్రమే పడుతుందని కంపెనీ అధికారికంగా ప్రకటించారు. హీరో తన ప్రత్యేకమైన కన్వర్టిబుల్ వాహనానికి ‘సర్జ్’ అని పేరు పెట్టడం విశేషం. ఇది సర్జ్ ఎస్32 సిరీస్‌లో భాగంగా భారతీయ మార్కెట్లోకి రానుంది. భారతదేశంలోనే కాకుండా ప్రపంచంలోనే మొదటి షిఫ్టింగ్ వెహికిల్‌గా ఇది నిలిచింది. దీన్ని వ్యక్తిగతంగా, వాణిజ్యపరంగా కూడా ఉపయోగించవచ్చు. ప్రస్తుతానికి హీరో ఈ ప్రత్యేక వాహనం ధర గురించి లేదా దాని లాంచ్ ఎప్పుడు అనే విషయం గురించి ఎటువంటి సమాచారం ఇవ్వలేదు.

Also Read: రూ.8 లక్షల్లోపు ధరలో టాప్-5 కార్లు ఇవే - బడ్జెట్‌లో కార్లు కావాలనుకునేవారికి బెస్ట్ ఆప్షన్ - ఈవీ కూడా!

టాప్ హెడ్ లైన్స్

మిడిల్ క్లాస్‌ బడ్జెట్‌లోనే లగ్జరీ కార్‌ ఫీచర్లు.. క్రెటా కంటే తక్కువ ధరలో వస్తున్న హ్యుందాయ్ బేయాన్!
మిడిల్‌క్లాస్‌ కోసం ప్రీమియం కారు.. లాంచ్‌కు సిద్ధమైన Hyundai Bayon.. ఈ కారుతో మీరు మాట్లాడవచ్చు!
Royal Enfield Guerrilla 450 - Triumph Tracker 400 మధ్య పోటీ.. ఏ బండి ముందుగా 100 కి.మీ. వేగాన్ని అందుకుంది?
రాయల్ ఎన్‌ఫీల్డ్ గెరిల్లా 450 vs ట్రయంఫ్ ట్రాకర్ 400.. వేగంలో ఏది కింగ్? రియల్‌ టెస్ట్‌లో తేలిన నిజాలివే!
పెట్రోల్, డీజిల్‌కు ఇక CNG తోడు.. మహీంద్రా ఎక్స్‌యూవీ 3XOలో సన్‌రూఫ్‌తో కొత్త లుక్‌
Mahindra XUV 3XO తో మరింత మైలేజ్‌.. CNG వేరియంట్‌ వచ్చేస్తోంది.. అక్టోబర్ 15న!
పెద్ద చక్రాలు, కొత్త ఇంజిన్‌.. Aprilia SXR GT 125లో ఇంకా ఏం ఉన్నాయో కొనే ముందే తెలుసుకోండి
సూపర్‌ స్టైలిష్‌ స్కూటర్‌ Aprilia SXR GT 125 మీద ఇంట్రెస్ట్‌ ఉందా?, ఈ 5 విషయాలు మీకు తెలుసా?

వీడియోలు

West Indies Beat India by 24 Runs | ఉప్పల్‌లో వెస్టిండీస్ విధ్వంసం.. నాలుగో టీ20లో భారత్ ఓటమి
1000-Year History of Bathukamma | వెయ్యేళ్ల చరిత్ర కలిగిన బతుకమ్మ పండుగ.. ఎప్పుడు, ఎలా మొదలైంది?
Dussehra in Telangana and Andhra Pradesh | బతుకమ్మ కేవలం తెలంగాణలోనే ఎందుకు చేస్తారు?
Uses of GPS Vests Worn by Cricket Players | ప్లేయర్స్ వేసుకునే జీపీఎస్ జాకెట్ తో లాభం ఏంటి?
400-Year History of Mysore Dussehra 2026 | ప్రపంచ ప్రసిద్ధ మైసూర్ దసరా ప్రత్యేకత

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Jailer 2 Twitter Review - 'జైలర్ 2' ట్విట్టర్ రివ్యూ: రజనీకాంత్ ట్రేడ్ మార్క్ స్టైల్ సూపర్... మరి సినిమా? అమెరికా ప్రీమియర్స్ టాకేంటి?
'జైలర్ 2' ట్విట్టర్ రివ్యూ: రజనీకాంత్ ట్రేడ్ మార్క్ స్టైల్ సూపర్... మరి సినిమా? అమెరికా ప్రీమియర్స్ టాకేంటి?
AP Sarpanch Elections Schedule: ఏపీలో 3 విడతల్లో సర్పంచ్ ఎన్నికలు.. ముఖ్యమైన తేదీలు చెక్ చేసుకోండి
ఏపీలో 3 విడతల్లో సర్పంచ్ ఎన్నికలు.. ముఖ్యమైన తేదీలు చెక్ చేసుకోండి
Vangaveeti Radha Joins Jana Sena: జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ.. విజయవాడ మేయర్ స్థానంపై ఉత్కంఠ
పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ.. విజయవాడ మేయర్ స్థానంపై ఉత్కంఠ
CM Revanth Reddy: భయపడొద్దు, పెట్టుబడులు పెట్టండి- 2034 నాటికి ట్రిలియన్ డాలర్ ఎకానమీ: సీఎం రేవంత్ రెడ్డి
భయపడొద్దు, పెట్టుబడులు పెట్టండి- 2034 నాటికి ట్రిలియన్ డాలర్ ఎకానమీ: సీఎం రేవంత్ రెడ్డి
YS Jagan Cases: జగన్ అక్రమాస్తుల కేసులో కీలక పరిణామం.. రోజువారీ విచారణకు సీబీఐ కోర్టు నిర్ణయం
జగన్ అక్రమాస్తుల కేసులో కీలక పరిణామం.. రోజువారీ విచారణకు సీబీఐ కోర్టు నిర్ణయం
Dussehra Navratri Day 5 : అమ్మవారికి 5వ రోజు పెట్టాల్సిన నైవేద్యం ఇదే.. శ్రీ లలితా త్రిపుర సుందరి దేవి కోసం పులిహోర, పెసర బూరెలు
అమ్మవారికి 5వ రోజు పెట్టాల్సిన నైవేద్యం ఇదే.. శ్రీ లలితా త్రిపుర సుందరి దేవి కోసం పులిహోర, పెసర బూరెలు
UP Blue Drum Case: మీరట్ బ్లూ డ్రమ్ హత్య కేసు.. భార్య, ప్రియుడికి మరణశిక్ష.. కోర్టులో 'మహాభారత' ప్రస్తావన!
మీరట్ బ్లూ డ్రమ్ హత్య కేసు.. భార్య, ప్రియుడికి మరణశిక్ష.. కోర్టులో 'మహాభారత' ప్రస్తావన
మూలా నక్షత్రం రోజు కనకదుర్గమ్మ దర్శనం అందరికీ ఉచితం, ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలు సమర్పించనున్న చంద్రబాబు!
మూలా నక్షత్రం రోజు కనకదుర్గమ్మ దర్శనం అందరికీ ఉచితం, ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలు సమర్పించనున్న చంద్రబాబు!
Embed widget