అన్వేషించండి

Renault Kwid లేదా Alto K10.. తక్కువ బడ్జెట్‌లో మీకు ఏ కారు బెస్ట్ ఆప్షన్

Kwid vs Alto K10: మంచి సేఫ్టీ ఫీచర్లతో బడ్జెట్ కారు కొనాలని ప్లాన్ చేస్తున్నారా? మైలేజ్, సేఫ్టీ, ధర పరంగా రెనాల్ట్ క్విడ్, మారుతి ఆల్టో కె10 లలో మీకు ఏది బెస్ట్ ఆప్షనో తెలుసుకోండి.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • క్విడ్ ₹4.53 లక్షలు, ఆల్టో కె10 ₹3.7 లక్షలు ప్రారంభం.
  • ఆల్టో కె10 మెరుగైన భద్రత, 24.9 కిమీ మైలేజీ ఇస్తుంది.
  • క్విడ్ ఎక్కువ స్థలం, టచ్‌స్క్రీన్; ఆల్టో మంచి ఎంపిక.

Kwid vs Alto K10: మీ చిన్న కుటుంబం కోసం తక్కువ బడ్జెట్‌లో మంచి కారును వెతుకుతుంటే, ఈ వివరాలు మీకు హెల్ప్ అవుతాయి. చిన్న కుటుంబానికి ఖచ్చితంగా సరిపోయే 2 బడ్జెట్ కార్ల వివరాలు ఇక్కడ అందిస్తున్నాం. మీరు బడ్జెట్ కారును చూస్తున్నట్లయితే, మీరు రెనాల్ట్ కొత్త క్విడ్, మారుతి ఆల్టో కె10 లపై నమ్మకం ఉంచవచ్చు. రెనాల్ట్ క్విడ్ ఇటీవల కొత్త అవతారంలో లాంచ్ అయింది. ఆ తర్వాత ఈ రెండింటి మధ్య పోటీ మరింత పెరిగింది. మరి మీ కోసం క్విడ్, ఆల్టో కె10 లలో ఏ కారు బెస్ట్ అనేది ఈ వివరాలు చూసి కన్ఫామ్ చేసుకోండి. 

రెనాల్ట్ క్విడ్ ఎంతవరకు మారింది?

రెనాల్ట్ తన కొత్త క్విడ్‌లో పెద్దగా మార్పులేమీ చేయలేదు. కేవలం లుక్‌కి కొద్దిగా కొత్త టచ్ ఇచ్చి, కొత్త లోగోను అమర్చిందని చెప్పవచ్చు. రెనాల్ట్ కంపెనీ దీని ప్రారంభ ధరను రూ. 4.53 లక్షలకు తగ్గించింది, అయితే ఇప్పుడు ఇందులో కేవలం రెండు వేరియంట్లు మాత్రమే లభిస్తాయి. వేరియంట్లు తక్కువగా ఉండటం వల్ల క్విడ్‌ను కొనుగోలు చేయడం ఇప్పుడు కొంచెం ఇబ్బందికర వ్యవహారంగా అనిపించవచ్చు.

కారులో మీకు పాత 1.0 లీటర్ పెట్రోల్ ఇంజన్ వస్తుంది. ఇది మ్యాన్యువల్, ఏఎమ్‌టి (AMT) గేర్‌బాక్స్‌తో వస్తుంది. ఫీచర్ల పరంగా 8 ఇంచుల టచ్‌స్క్రీన్ దీనిని నేటికీ ట్రెండీగా ఉంచుతుంది.

సేఫ్టీ పరంగా ఏ కారు బెస్ట్?
కారు కొనే ముందు ప్రజలు మైలేజీతో పాటు సేఫ్టీపై ఫోకస్ చేస్తారు. రెనాల్ట్ కొత్త క్విడ్ బేస్ వేరియంట్‌లో కేవలం రెండు ఎయిర్‌బ్యాగ్‌లు మాత్రమే లభిస్తాయి. అయితే 6 ఎయిర్‌బ్యాగ్‌ల కోసం మీరు టాప్ వేరియంట్‌ను మాత్రమే కొనుగోలు చేయాలి. 2026 సంవత్సరంలో స్టాండర్డ్‌గా 6 ఎయిర్‌బ్యాగ్‌లను అందించకపోవడం క్విడ్ బలహీనతగా అనిపిస్తుంది.

Also Read: యమహా నుంచి త్వరలో కొత్త స్పోర్ట్స్ బైక్.. KTM RC200కు పెరిగిన పోటీ- YZF-R2 ప్రత్యేకతలివే

మరోవైపు మారుతి ఆల్టో కె10 తన సేఫ్టీ విషయానికొస్తే మరింత జాగ్రత్తలు తీసుకున్నారు. మీకు మెరుగైన సేఫ్టీ ఫీచర్లు లభిస్తాయి. కుటుంబ జర్నీకి సేఫ్టీ పరంగా ఆల్టో పైచేయి సాధిస్తుంది.

మైలేజీలో నిజమైన ఎవరు బెస్ట్?
ఏ కస్టమర్ అయినా కారు కొనే ముందు అది ఎంత మైలేజ్ ఇస్తుందో తప్పక తెలుసుకోవాలి. దాంతో మీకు మెయింటనెన్స్ ఖర్చులపై అవగాహన వస్తుంది. ఆల్టో కె10 కారు 1.0 లీటర్ ఇంజన్ క్విడ్‌తో పోలిస్తే చాలా రెస్పాన్సివ్‌గా, నడపడానికి ఈజీగా  ఉంటుందని చెప్పాలి. మైలేజ్ పరంగా కూడా ఆల్టో చాలా ముందుంది.

క్విడ్ లీటరుకు 22.5 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుండగా, ఆల్టో కె10 ఏకంగా 24.9 కిలోమీటర్ల మైలేజీతో ప్రూవ్ చేసుకుంది. ప్రతిరోజూ ప్రయాణంలో ఆల్టో మీ పెట్రోల్ డబ్బును చాలా వరకు ఆదా చేస్తుంది.

ఏ కారు కొంటే మంచిది..

ఇప్పుడు రెండు కార్ల ధరలు తెలుసుకోవాలి. మారుతి ఆల్టో కె10 కేవలం రూ. 3.7 లక్షల ప్రారంభ ధరలోనే లభిస్తుంది. ఇది క్విడ్ (4.53 లక్షలు) కంటే చాలా చౌక. రెనాల్ట్ క్విడ్‌లో మీకు కొంచెం ఎక్కువ కేబిన్ స్పేస్, మస్కులర్ లుక్, మంచి టచ్‌స్క్రీన్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

Also Read:  Honda కార్‌ కొనాలనుకునేవారికి గుడ్‌ న్యూస్ - Elevate, Amazeపై రూ.2.15 లక్షల వరకు డిస్కౌంట్లు

తక్కువ బడ్జెట్‌లో అద్భుతమైన పర్ఫార్మెన్స్, ఎక్కువ మైలేజ్, బలమైన సేఫ్టీని కోరుకుంటే, ఆల్టో కె10 మీకు వాల్యూ ఫర్ మనీ, స్మార్ట్ ఛాయిస్‌గా నిలుస్తుంది.

Frequently Asked Questions

రెనాల్ట్ క్విడ్ కొత్త మోడల్‌లో వచ్చిన మార్పులు ఏమిటి?

కొత్త రెనాల్ట్ క్విడ్ లుక్‌కి కొద్దిగా కొత్త టచ్, కొత్త లోగోతో వచ్చింది. దీని ప్రారంభ ధర రూ. 4.53 లక్షలకు తగ్గించబడింది, మరియు ఇప్పుడు కేవలం రెండు వేరియంట్లు మాత్రమే లభిస్తాయి.

సేఫ్టీ పరంగా క్విడ్, ఆల్టో కె10లో ఏది మెరుగైనది?

ఆల్టో కె10 మెరుగైన సేఫ్టీ ఫీచర్లతో వస్తుంది. క్విడ్ బేస్ వేరియంట్‌లో కేవలం రెండు ఎయిర్‌బ్యాగ్‌లు మాత్రమే ఉండగా, ఆల్టో సేఫ్టీ పరంగా పైచేయి సాధిస్తుంది.

మైలేజీ పరంగా క్విడ్, ఆల్టో కె10లో ఏ కారు ఎక్కువ ఇస్తుంది?

ఆల్టో కె10 ఎక్కువ మైలేజీని అందిస్తుంది. క్విడ్ లీటరుకు 22.5 కి.మీ. ఇవ్వగా, ఆల్టో కె10 లీటరుకు 24.9 కి.మీ. మైలేజీని ఇస్తుంది.

క్విడ్ కంటే ఆల్టో కె10 చౌకగా లభిస్తుందా?

అవును, ఆల్టో కె10 చౌకగా లభిస్తుంది. మారుతి ఆల్టో కె10 ప్రారంభ ధర రూ. 3.7 లక్షలు కాగా, క్విడ్ ప్రారంభ ధర రూ. 4.53 లక్షలు.

తక్కువ బడ్జెట్‌లో మంచి కారు కోసం దేనిని ఎంచుకోవాలి?

తక్కువ బడ్జెట్, ఎక్కువ మైలేజ్, మంచి సేఫ్టీ కోరుకుంటే ఆల్టో కె10 స్మార్ట్ ఛాయిస్. ఇది వాల్యూ ఫర్ మనీని అందిస్తుంది.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

యమహా బైక్ కొనేవాళ్లకు పండగే! FZ నుంచి R15 వరకు ఆఫర్ల వర్షం.. ఈ రాష్ట్రాల్లో మాత్రం నో ఛాన్స్!
యమహా బైక్‌లు, స్కూటర్లపై పండుగ ఆఫర్లు.. రూ.వేలల్లో బెనిఫిట్స్! కేవలం రూ.2,499 డౌన్‌పేమెంట్
మార్కెట్‌లోకి వచ్చిన మహీంద్రా XUV 3XO కొత్త వెర్షన్‌.. పెట్రోల్ పవర్‌తో CNG SUV - ఫీచర్లు, ధరలు ఇవే!
దసరా కానుకగా Mahindra XUV 3XO CNG లాంచ్‌.. రూ.10 లక్షలకే 25 కి.మీ. మైలేజీ!
Triumph Bonneville 350 ఫీచర్లలో భారీ తేడాలు.. వేరియంట్ల వారీగా ధరలు, ప్రత్యేకతలు ఇవే!
Triumph Bonneville 350లో 3 వేరియంట్లు.. T4, T40, T40 బ్లాక్‌లో ఏది కొనాలి?
2026 Toyota Glanza Faceliftలో అదిరిపోయే ఫీచర్లు.. కానీ ఈ 3 విషయాల్లో నిరాశ తప్పదు!
కొత్త టయోటా గ్లాంజా ఫేస్‌లిఫ్ట్‌లో 4 ప్లస్ పాయింట్లు, 3 మైనస్‌లు

వీడియోలు

Why North India Worships Rama & South Devi on Dussehra | దసరా అసలు కథ ఇదే
Fresh Snowfall Blankets Gulmarg Apharwat Peak Tourists Thrilled As Winter Early Arrival Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో మొదలైన మంచు పండగ.. గుల్‌మార్గ్ అఫర్వాత్ పీక్‌ను కప్పేసిన తెల్లటి హిమపాతం
Tilak Varma Breaks Silence on Run Out Confusion | రనౌట్ పై నోరు విప్పిన తిలక్
IND vs WI 4th T20 Shreyas Iyer | ఉప్పల్‌లో ఓటమిపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
West Indies Beat India by 24 Runs | ఉప్పల్‌లో వెస్టిండీస్ విధ్వంసం.. నాలుగో టీ20లో భారత్ ఓటమి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Local Body Elections : స్థానిక పోరులో బలమైన వ్యూహం - సీట్ల కేటాయింపుతో ఆగని టీడీపీ-జనసేన రగడ.. ఓటు బదిలీ సాధ్యమేనా?
స్థానిక పోరులో బలమైన వ్యూహం - సీట్ల కేటాయింపుతో ఆగని టీడీపీ-జనసేన రగడ.. ఓటు బదిలీ సాధ్యమేనా?
National Saras Mela Droupadi Murmu: విజయవాడలో జాతీయ సరస్ మేళా 2026 - లఖ్‌పతి కాదు.. మహిళలను కరోడ్‌పతి దీదీలుగా మార్చాలి – రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పిలుపు!
విజయవాడలో జాతీయ సరస్ మేళా 2026 - లఖ్‌పతి కాదు.. మహిళలను కరోడ్‌పతి దీదీలుగా మార్చాలి – రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పిలుపు!
Vijay Deverakonda Rashmika : పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విరోష్ కపుల్ - సత్యసాయి సన్నిధిలో ప్రత్యేక పూజలు
పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విరోష్ కపుల్ - సత్యసాయి సన్నిధిలో ప్రత్యేక పూజలు
Actor Imran Khan Leave India Notice : అమెరికా సిటిజన్ అయి ఉండి కాక్రోచ్ నిరసనల్లో పాల్గొంటారా - అమీర్ ఖాన్ మేనల్లుడికి భారత్‌ను వీడాలని నోటీసులు!
అమెరికా సిటిజన్ అయి ఉండి కాక్రోచ్ నిరసనల్లో పాల్గొంటారా - అమీర్ ఖాన్ మేనల్లుడికి భారత్‌ను వీడాలని నోటీసులు!
Jailer 2 Review - 'జైలర్ 2' రివ్యూ: 600 కోట్లు సినిమాకు సీక్వెల్... రజనీ మళ్ళీ బ్లాక్ బస్టర్ కొట్టారా?
'జైలర్ 2' రివ్యూ: 600 కోట్లు సినిమాకు సీక్వెల్... రజనీ మళ్ళీ బ్లాక్ బస్టర్ కొట్టారా?
Today OTT Movies : గురువారం ఓటీటీ మూవీస్ - ఒక్క రోజే 11 సినిమాలు స్ట్రీమింగ్... ఇవి అస్సలు మిస్ కావొద్దు
గురువారం ఓటీటీ మూవీస్ - ఒక్క రోజే 11 సినిమాలు స్ట్రీమింగ్... ఇవి అస్సలు మిస్ కావొద్దు
IAS Vikrant Marmat Transfer: బెంగళూరు పబ్ ఘటనపై ఏపీ ప్రభుత్వం సీరియస్.. ఐఏఎస్ అధికారి విక్రాంత్ మర్మత్‌పై బదిలీ వేటు!
బెంగళూరు పబ్ ఘటనపై ఏపీ ప్రభుత్వం సీరియస్.. ఐఏఎస్ అధికారి విక్రాంత్ మర్మత్‌పై బదిలీ వేటు!
CM Chandrababu: సీఎం చంద్రబాబు కేసుల బదిలీ పిటిషన్ పై హైకోర్టులో విచారణ.. ఈ నెల 26కి వాయిదా!
సీఎం చంద్రబాబు కేసుల బదిలీ పిటిషన్ పై హైకోర్టులో విచారణ.. ఈ నెల 26కి వాయిదా!
Embed widget