అన్వేషించండి

Citroen Basalt: సిట్రోయిన్‌ నుంచి కొత్త కారు లాంచ్‌.. ధర కేవలం రూ. 7.99 లక్షలు మాత్రమే!

Citroen Basalt Launch సిట్రోయిన్‌ బసాల్ట్ SUV కూపే రూ. 7.99 లక్షలు (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరతో భారత్‌లో విడుదల అయ్యింది. ICE వెర్షన్‌లో వస్తున్న తొలి ఎస్‌యూవీ కూపే గా బసాల్ట్‌ నిలిచింది.

Citreon Basalt SUV Coupe Launched: ఫ్రెంచ్‌ కార్ల తయారీ సంస్థ సిట్రోయిన్ భారత్‌లో సరికొత్త బసాల్ట్ SUV కూపే ను నేడు మార్కెట్‌లోకి అధికారికంగా విడుదల చేసింది. కేవలం రూ. 7.99 లక్షలు (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరతో దీనిని తీసుకువచ్చి ఆశ్యర్యానికి గురిచేసింది. ICE వెర్షన్‌లో రాబోతున్న తొలి SUV కూపే ఇదే కావడం గమనార్హం. ఇదే నెల ఆగస్టు 7న టాటా మోటార్స్‌ నుంచి లాంచ్‌ అయిన కర్వ్ ఎలక్ట్రిక్ కూపే స్టైల్‌ డిజైన్‌తో వచ్చిన తొలి కారుగా నిలిచింది. అయితే టాటా కర్వ్ ICE వెర్షన్ సెప్టెంబర్ 2, 2024న మార్కెట్‌లో అడుగుపెట్టనుంది. 

2021లో భారత మార్కెట్లోకి ప్రవేశించినప్పటి నుంచి సిట్రోయిన్ ఆశించిన స్థాయిలో అంచనాలను అందుకోలేకపోయింది. ఈ సారి ఎలాగైనా భారతీయ మార్కెట్‌లో నిలదొక్కుకోవాలనే ఉద్దేశంతో సిట్రోయిన్ తన ఐదవ ఉత్పత్తిని మార్కెట్‌లోకి తీసుకువచ్చింది. ఈ కంపెనీ నుంచి ప్రస్తుతం, C5 Aircross, C3, EC3, C3 Aircross మోడల్స్‌ భారతదేశంలో కొనుగోలుకి అందుబాటులో ఉన్నాయి.

ఇంజిన్ ఆప్షన్స్‌:
సిట్రోయిన్‌ బసాల్ట్ రెండు ఇంజిన్ ఆప్షన్స్‌తో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది. ఇందులోని 1.2-లీటర్ నేచురల్ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ ఒకటి 80 bhp , 115 Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. మరో 1.2-లీటర్ మూడు-సిలిండర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ 109 bhp పవర్‌తో మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో 190 Nm , ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో 205 Nm గరిష్ట టార్క్‌ను విడుదల చేస్తుంది. నేచ్‌రల్‌ ఆస్పిరేటెడ్‌ ఇంజిన్ 18 kmpl మైలేజీని అందిస్తుంది. టర్బో పెట్రోల్ మాన్యువల్ 19.5 kmpl, , ఆటోమేటిక్ వెర్షన్ 18.7 kmplని అందిస్తుంది.

ఫీచర్లు & భద్రత
కొత్త బసాల్ట్‌లో LED ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్‌లు, 16-అంగుళాల అల్లాయ్ వీల్స్, ర్యాప్-అరౌండ్ టెయిల్‌లైట్లు, వెనుక AC వెంట్‌లు , వెనుక ప్రయాణీకులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు సర్దుబాటు చేయగల (3 స్టెప్‌ థై సపోర్ట్‌) ఆప్షన్‌ ఉంది. ఇది ఎత్తుగా ఉండే వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేస్తుంది. ఇక ఫీచర్లు విషయానికి వస్తే ఇది ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్‌తో పాటు వైర్‌లెస్ Apple CarPlay , Android Autoతో కూడిన 10.25-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ను కూడా కలిగి ఉంది.

సేఫ్టీ కోసం కూపే SUVలో ఆరు స్టాండర్డ్‌ ఎయిర్‌బ్యాగ్‌లు, ESP, సెన్సార్‌లతో కూడిన బ్యాక్‌ పార్కింగ్ కెమెరా , టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ (TPMS) ఉన్నాయి. ఇది ఏడు కలర్‌ ఆప్షన్స్‌లో అందుబాటులో ఉంది. అవి పోలార్ వైట్, స్టీల్ గ్రే, ప్లాటినం గ్రే, కాస్మో బ్లూ, గార్నెట్ రెడ్ మోనోటోన్‌ కలర్స్‌..  గ్రే రూఫ్ పోలార్ వైట్ , బ్లాక్ రూఫ్ గార్నెట్ రెడ్  రెండు డ్యూయల్-టోన్ ఆప్షన్స్‌తో అందుబాటులో ఉంటుంది.

మార్కెట్‌లో పోటీ
హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్, మారుతి సుజుకి గ్రాండ్ విటారా అలాగే ఫోక్స్‌వ్యాగన్ టైగూన్‌, హోండా ఎలివేట్ , స్కోడా కుషాక్ వంటి కాంపాక్ట్ SUVలకు సిట్రోయిన్‌ బసాల్ట్ గట్టి పోటీని ఇస్తుంది. అంతే కాకుండు త్వరలోనే విడుదల కానున్న టాటా కర్వ్ ఐసీఈ వెర్షన్‌తో నేరుగా టాటా కర్వ్ మోడల్‌తో పోటీపడుతుంది. ఈ కొత్త మోడల్ ఎయిర్‌క్రాస్ సిరీస్‌లో ఉండే కొన్ని ఫీచర్లను పంచుకుంటుంది. ఇందులో ఆకట్టుకునే ఇంటీరియర్ థీమ్‌,  TFT డిస్ప్లే థీమ్స్‌, షార్క్ ఫిన్ యాంటెన్నా, బ్యాక్‌లో సిట్రోయెన్ బ్యాడ్జ్‌లు సరికొత్తగా ఉన్నాయి. ఆహ్లాదకరమైన డ్రైవింగ్ అనుభవంతో పాటు మంచి పనితీరును కోరుకునే కొనుగోలుదారులకు సిట్రోయిన్ బసాల్ట్ అనువైనదిగా ఉంటుంది.

టాప్ హెడ్ లైన్స్

Hyundai Creta EV:హ్యుందాయ్‌ క్రెటా ఈవీపై భారీ తగ్గింపు! కొత్త ధరల పూర్తి వివరాలు ఇవే!
హ్యుందాయ్‌ క్రెటా ఈవీపై భారీ తగ్గింపు! కొత్త ధరల పూర్తి వివరాలు ఇవే!
దూసుకుపోతున్న ఎలక్ట్రిక్ స్కూటర్లు - జూన్‌ సేల్స్‌లో TVS నంబర్ వన్; Bajaj, Ather, Vida జోరు
పెట్రోల్‌ రేట్ల దెబ్బకి జూన్‌లో పెరిగిన ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ అమ్మకాలు - పోటీ గట్టిగానే ఉంది బాసూ!
జూన్ కార్ల అమ్మకాల్లోనూ మారుతి హవా - టాటా, మహీంద్రా హోరాహోరీ రేస్‌
జూన్‌లో లక్షన్నర కార్లు అమ్మిన మారుతి - దరిదాపుల్లో కూడా లేని ఇతర కంపెనీలు
Ather 450Xలో మూడు కొత్త కలర్ ఆప్షన్లు - మీ టైమ్‌ సేవ్‌ చేసే కొత్త ఛార్జర్‌ కూడా లాంచ్
కొత్త కలర్‌ కాంబినేషన్‌తో Ather 450X ఓవర్‌టోన్‌ సిరీస్‌ - చూపు తిప్పుకోనివ్వని స్టైల్‌!

వీడియోలు

IND W vs AUS W World Cup | టీ20 వరల్డ్ కప్ లో ముగిసిన భారత్ పోరాటం
IND vs IRE 2nd T20 Highlights | ఐర్లాండ్ చేతిలో భారత్ క్లీన్ స్వీప్
Vaibhav Debut in England Series | ఇంగ్లాండ్ సిరీస్ లో వైభవ్ సూర్యవంశీ ఎంట్రీ ?
Ricky Ponting To Replace Gautam Gambhir ? | త్వరలోనే టీమిండియాకు కొత్త హెడ్ కోచ్ ?
IND vs AUS Women's T20 World Cup 2026 | ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్ వెళ్తామా?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Drugs Smuggling via Speed Post: వీడు మామూలోడు కాదు - తపాలా శాఖ ద్వారానే గంజాయి డెలివరీ !
వీడు మామూలోడు కాదు - తపాలా శాఖ ద్వారానే గంజాయి డెలివరీ !
Sri Sathya Sai District Solar Plant Farmers Issue: కదిరిలో రైతులకు ప్రైవేటు సోలార్ ప్లాంట్ యాజమాన్యం బెదిరింపులు - బాధితులకు అండగా బీజేపీ !
కదిరిలో రైతులకు ప్రైవేటు సోలార్ ప్లాంట్ యాజమాన్యం బెదిరింపులు - బాధితులకు అండగా బీజేపీ !
Yashasvi Jaiswal In FIFA World Cup : ఇండియన్ స్టార్ యశస్వి జైస్వాల్ సందడి.. మెస్సి జెర్సీతో ఫుట్‌బాల్ మ్యాచ్ చూస్తూ ఎంజాయ్, ఎంబాప్పే డబుల్ గోల్స్ ధమాకా!
ఫిఫా ప్రపంచకప్ లో ఇండియన్ స్టార్ యశస్వి జైస్వాల్ సందడి.. మెస్సి జెర్సీతో ఫుట్‌బాల్ మ్యాచ్ చూస్తూ ఎంజాయ్, ఎంబాప్పే డబుల్ గోల్స్ ధమాకా!
Stay Positive : రోజంతా పాజిటివ్‌గా ఉండాలంటే.. ఉదయాన్నే ఈ అలవాట్లు ఫాలో అయిపోండి
రోజంతా పాజిటివ్‌గా ఉండాలంటే.. ఉదయాన్నే ఈ అలవాట్లు ఫాలో అయిపోండి
Superfoods for Healthy Hair : జుట్టు మంచిగా పెరగాలంటే డైట్లో ఈ ఫుడ్స్ చేర్చుకోండి.. రోజూ తింటే హెయిర్​ ప్రాబ్లమ్స్ దూరమవుతాయట
జుట్టు మంచిగా పెరగాలంటే డైట్లో ఈ ఫుడ్స్ చేర్చుకోండి.. రోజూ తింటే హెయిర్​ ప్రాబ్లమ్స్ దూరమవుతాయట
Telangana Cabinet : తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. టీచర్లకూ మధ్యాహ్న భోజనం - మూసీ ప్రాజెక్ట్, ఆస్పత్రుల్లో ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్!
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. టీచర్లకూ మధ్యాహ్న భోజనం - మూసీ ప్రాజెక్ట్, ఆస్పత్రుల్లో ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్!
India Selection Policy Dispute: వైభవ్ సూర్యవంశీ ఎంట్రీకి 'హైరార్కీ' బ్రేకులు.. గంభీర్ మేనేజ్‌మెంట్ ప్లాన్ పై కస్సుమన్న వెటరన్లు, బెంచ్ కే పరిమితం చేయడంపై ఆగ్రహం!
వైభవ్ సూర్యవంశీ ఎంట్రీకి 'హైరార్కీ' బ్రేకులు.. గంభీర్ మేనేజ్‌మెంట్ ప్లాన్ పై కస్సుమన్న వెటరన్లు, బెంచ్ కే పరిమితం చేయడంపై ఆగ్రహం!
Cheating Partner : మీ భాగస్వామి(Partner) ప్రవర్తనలో ఈ 7 మార్పులు కనిపిస్తే జాగ్రత్త.. చీటింగ్ కావచ్చు
మీ భాగస్వామి(Partner) ప్రవర్తనలో ఈ 7 మార్పులు కనిపిస్తే జాగ్రత్త.. చీటింగ్ కావచ్చు
Embed widget