బంపర్ ఆఫర్: కార్లపై 2.8లక్షల భారీ డిస్కౌంట్ ప్రకటించిన Citreon
ఫ్రెంచ్ కార్ల కంపెనీ Cetroen సిట్రిన్ తమ కార్లపై జూన్ నెలలో భారీ డిస్కౌంట్లు ప్రకటించింది. గరిష్టంగా ఒక్కో కారుపై 2.8లక్షల వరకూ బెనిఫిట్ పొందవచ్చు

Citroen Car Discount: కొత్తగా కారు కొనాలనుకుంటున్నాారా...? లేదా మీ పాత కారు అమ్మి కొత్తది తీసుకోవాలా.. అలా అయితే ఇది చాలా ఎగ్జైటింగ్ ఆఫర్. ఫ్రెంచ్ కంపెనీ సిట్రిన్ Cetroen భారీ ఆఫర్‌లను ఓసారి లుక్కోయచ్చు. వాళ్ల మోడల్స్‌పై ఏకంగా 2లక్షల 80వేల వరకూ డిస్కౌంట్ వచ్చే అవకాశం ఉంది. .
Citroen ప్రకటించిన భారీ ఆఫర్లు:
భారతీయ ఆటోమొబైల్ మార్కెట్లో ప్రవేశించి నాలుగు సంవత్సరాలు పూర్తి కావడంతో, సిట్రిన్ Cetroen సంస్థ తమ కార్ల మోడళ్లపై కస్టమర్‌లకు తప్పనిసరిగా లభించే ఆఫర్లను ప్రకటించింది. తన పోర్ట్‌ఫోలియోలోని అన్ని కార్లపై భారీ ఆఫర్లను అందించడంతో పాటు, ఇప్పటికే ఉన్న వినియోగదారులకు వివిధ చౌక ధరల సేవలను కూడా ప్రకటించింది. కొత్త కార్ కొనుక్కోవాలనుకునే వారికి.. ఉన్న కార్లకు మార్చుకోవాలనుకునే వారికి ఇది కచ్చితంగా మంచి వార్తనే. ఫ్రెంచ్ స్టైల్ కార్ అనుభవం, తక్కువ ధరలో కొంచం మంచి SUV సొంతం చేసుకోవాలనుకుంటే ఇదే మంచి తరుణం. ఎందుకంటే ఈ ఆఫర్ జూన్ వరకూ మాత్రమే వాళ్లు ఇస్తున్నారు.
4వ వార్షికోత్సవ ఆఫర్లు:
నాల్గవ వార్షికోత్సవ వేడుకలను పురస్కరించుకుని, సిట్రోయెన్ తన అన్ని కార్ల మోడళ్లపై రూ.2.80 లక్షల తగ్గింపును ప్రకటించింది. స్వల్పకాలికంగా అందించే ఈ ఆఫర్ జూన్ 30వ తేదీ వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. ధర తగ్గింపుతో పాటు, ఇప్పటికే ఉన్న కస్టమర్‌లకు ఉచిత కార్ స్పాని అందిస్తోంది. కొత్త కస్టమర్‌లను రాబట్టుకోవడంతో పాటు.. పాత వాళ్లకి మంచి లాయల్టీ ప్రోగ్రామ్ అందించాలన్న లక్ష్యంతో ఈ చర్య చేపట్టింది.
ఏయే కార్లపై ఆఫర్:
ఈ స్వల్పకాలిక ఆఫర్ బడ్జెట్ వెహికిల్ eC3, బసాల్ట్, C3X, C3, ఎయిర్‌క్రాస్ తోపాటు.. టాప్ ఎండ్ C5 ఎయిర్‌క్రాస్ వంటి అన్ని సిట్రోయెన్ కార్లకు వర్తిస్తుంది. ఇవి బడ్జెట్‌లో లభించే ఎంట్రీ లెవెల్ కార్ల నుండి టాప్ ఎండ్ SUVల వరకు ఉంటాయి. eC3 కారు మోడల్ ధర రూ.12.76 లక్షల నుండి ప్రారంభమవుతుంది. బసాల్ట్ కారు మోడల్ ధర రూ.8.25 లక్షల నుండి ప్రారంభమై రూ.14.1 లక్షల వరకు ఉంటుంది. టాప్ ఎండ్ C5 ఎయిర్‌క్రాస్ ధర రూ.39.99 లక్షల నుండి ప్రారంభమవుతుంది. Cetroen తన అధికారిక వెబ్‌సైట్‌లో Basalt మోడల్‌పై 2.1లక్షల ఆఫర్‌ను చూపిస్తోంది. అయితే ఇది మిగిలిన బెనిఫిట్స్‌తో కలుపుకుని 2.8 వరకూ ఉండొచ్చని ఆటోమొబైల్ నిపుణులు చెబుతున్నారు. అలాగే ఏమోడల్‌పై ఎంత డిస్కౌంట్ అన్న బ్రేకప్‌ను కూడా వాళ్లు ప్రకటించలేదు. ఇవి ప్రాంతం, మోడల్, డీలర్‌లను బట్టి వేర్వేరు డిస్కౌంట్లు ఉన్నాయి. పూర్తి వివరాలకు సమీపంలోని డీలర్లను సంప్రదించాల్సి ఉంటుంది.
విక్రయాలు తగ్గాయి:
C3 హ్యాచ్‌బ్యాక్, eC3 ఎలక్ట్రిక్, C3 ఎయిర్‌క్రాస్ SUV తోపాటు ఇటీవల విడుదలైన బసాల్ట్ కూపేతో సహా సిట్రోయెన్ పోర్ట్‌ఫోలియో విస్తరించినప్పటికీ, సంస్థ నెలవారీ విక్రయాలు తగ్గాయి. ఈ ఏాడాది మే నెలలో మొత్తం 333 యూనిట్లు మాత్రమే అమ్ముడయ్యాయి. దీని ప్రకారం, C3 కార్లు 110 యూనిట్లు, బసాల్ట్ కార్లు 95 యూనిట్లు, C3 ఎయిర్‌క్రాస్ 66 యూనిట్లు, eC3 కార్లు 60 యూనిట్లు C5 ఎయిర్‌క్రాస్ 2 యూనిట్లు అమ్ముడయ్యాయి.
కిందటిసంవత్సరం ఇదే కాలంలో 515 యూనిట్లు అమ్ముడయ్యాయి. దానికంటే మే నెలలో విక్రయాలు 35 శాతం తగ్గాయి. ఈ ఏప్రిల్ నెలలో కూడా ఆ సంస్థ 339 యూనిట్లను మాత్రమే విక్రయించింది. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లోనే సిట్రోయెన్ కార్ల మోడళ్లపై భారీ ఆఫర్లను ప్రకటించింది.





















