(Source: ECI/ABP News/ABP Majha)
Bike Tips: బైక్ ఉపయోగిస్తున్నారా - ఈ టిప్స్ పాటిస్తే లైఫ్ మరింత పెరిగినట్లే!
బైక్ లైఫ్ ఎక్కువ కాలం రావాలంటే ఈ టిప్స్ పాటించండి.
భారతదేశంలో అత్యధిక సంఖ్యలో బైక్ లవర్స్ ఉన్నారు. దీనికి కారణం బైక్స్ బడ్జెట్‌లో దొరుకుతాయి. అలాగే బైక్ నడపడం ద్వారా ట్రాఫిక్ సమస్య కాస్త తక్కువగా ఉంటుంది. అయితే సరైన జాగ్రత్తలు తీసుకోకుంటే బైక్ ఒక్కోసారి మొరాయిస్తూ ఉంటుంది. మీ బైక్ జీవిత కాలం ఎక్కువగా ఉండాలంటే కొన్ని సులభమైన చిట్కాలను పాటిస్తే సరిపోతుంది.
ఇంజిన్ ఆయిల్ ఎప్పటికప్పుడు మారుస్తూ ఉండాలి
ఇంజిన్ ఆయిల్ బైక్‌లో రక్తంలా పనిచేస్తుంది. ఇది సరిగా లేకుంటే బైక్ మంచి పనితీరును ఇవ్వదు. అందువల్ల దీన్ని ఎప్పటికప్పుడు చెక్ చేస్తూ ఉండండి. ఇంజిన్ ఆయిల్ తక్కువగా ఉంటే దాన్ని టాప్ అప్ చేయండి. బాగా డార్క్‌గా మారినా వెంటనే మార్చండి.
ఎయిర్ ఫిల్టర్ శుభ్రపరచాలి
ఎయిర్ ఫిల్టర్ ద్వారా మాత్రమే బైక్ ఇంజిన్‌లోకి గాలి ప్రవేశిస్తుంది. అందువల్ల ఇది శుభ్రంగా లేకపోయినా, పాడైపోయినా... అప్పుడు ఇంజిన్ స్వచ్ఛమైన గాలిని పొందలేదు. దీని కారణంగా ఇంజిన్ దాని పూర్తి సామర్థ్యంతో పనిచేయదు. కాబట్టి ఎయిర్ ఫిల్టర్‌ను ఎప్పటికప్పుడు శుభ్రం చేయడం ముఖ్యం.
క్లచ్ గట్టిగా ఉండాలి
బైక్‌ను మనం తరచుగా ఉపయోగిస్తూ ఉంటాం కాబట్టి క్లచ్ వదులుగా మారుతూనే ఉంటుంది. ఇది బైక్ ఇంజిన్‌లో ఉన్న క్లచ్ ప్లేట్‌ను డైరెక్ట్‌గా ప్రభావితం చేస్తుంది. మరియు ఇవి త్వరగా పాడవుతూ ఉంటాయి. అందువల్ల క్లచ్‌ను అప్పుడప్పుడు టైట్ చేస్తూ ఉండండి. తద్వారా క్లచ్ ప్లేట్ త్వరగా పాడవకుండా ఉంటుంది.
బ్యాటరీని చెక్ చేస్తూ ఉండండి
బైక్‌ను ఎప్పటికప్పుడు వాడుతూనే ఉన్నా లేదా ఎక్కువ రోజులు వాడకుండా వదిలేసినా ఎప్పటికప్పుడు బ్యాటరీని చెక్ చేస్తూ ఉండటం ముఖ్యం. ఎందుకంటే రెండు సందర్భాల్లోనూ దానికి అవసరం అయిన డిస్టిల్డ్ వాటర్ తగ్గుతూ ఉంటుంది. ఇది సరైన పరిమాణంలో ఉండటం ముఖ్యం.
చెయిన్ శుభ్రంగా ఉంచండి
మీరు ఎక్కువ సమయం కఠినమైన రోడ్లపై బైక్‌ను డ్రైవ్ చేస్తూ ఉంటే వీలైనంత తరచుగా బైక్‌ను శుభ్రం చేస్తూ ఉండాలి. తద్వారా దానిపై పేరుకుపోయిన దుమ్ము శుభ్రం అవుతుంది. ఇంజిన్ శక్తిని చక్రానికి సరిగ్గా అందించడం సాధ్యం అవుతుంది.
బ్రేక్‌లను సర్దుబాటు చేస్తూ ఉండండి
బైక్ నడుస్తున్నప్పుడు బ్రేక్ షూ అరిగిపోవడం సర్వసాధారణం, దీని కారణంగా బ్రేక్ వదులుకోవడం ప్రారంభమవుతుంది మరియు చక్రంపై దాని పట్టు తగ్గుతుంది. అందుకే ఎప్పటికప్పుడు అడ్జస్ట్ చేస్తూ ఉండండి.
మరోవైపు ద్విచక్ర వాహన తయారీ కంపెనీ హోండా మోటార్‌సైకిల్ తన కొత్త 2023 హార్నెట్ 2.0ని భారతదేశంలో ఇటీవలే లాంచ్ చేసింది. ఈ బైక్ ఎక్స్ షోరూమ్ ధర రూ.1.39 లక్షలుగా నిర్ణయించారు. కొత్త హార్నెట్‌లో కంపెనీ కొన్ని కాస్మెటిక్ అప్‌డేట్‌లు కూడా అందించింది. దీని బీఎస్6 ఇంజన్ ఓబీడీ2 కంప్లైంట్‌గా ఉండటం విశేషం. కొత్త హోండా హార్నెట్ 2.0 మొత్తం నాలుగు రంగులలో లాంచ్ అయింది. ఇందులో పెర్ల్ ఇగ్నియస్ బ్లాక్, మ్యాట్ సాంగ్రియా రెడ్ మెటాలిక్, మ్యాట్ మార్వెల్ బ్లూ మెటాలిక్, మ్యాట్ యాక్సిస్ గ్రే మెటాలిక్ ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి.
Read Also: వర్షంలో ఎలక్ట్రిక్ వాహనాలు నడపడం, ఛార్జ్ చేయడం సురక్షితమేనా?
Read Also: రూ.10 లక్షలలోపు లాంచ్ కానున్న లేటెస్ట్ కార్లు ఇవే - కొత్త కారు కొనాలనుకుంటే కొంచెం ఆగండి!
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial