రూ.మూడు లక్షల్లోపు బెస్ట్ రెట్రో బైక్స్ ఇవే - కొనాలనుకుంటే ఓ లుక్కేయండి!
మనదేశంలో రూ.మూడు లక్షల్లోపు ఎన్నో రెట్రో బైకులు అందుబాటులో ఉన్నాయి. వాటిలో టాప్-5 ఇవే!
Retro Bikes Under 3 Lakh: భారతీయ మార్కెట్లో రెట్రో మోటార్‌సైకిళ్లకు మంచి డిమాండ్ ఉంది. ఇటీవల ఈ విభాగంలో అనేక కొత్త మోడల్స్ కూడా ప్రవేశించాయి. వీటిలో కొన్ని అద్భుతమైన పనితీరుతో పాటు సౌకర్యవంతమైన రైడ్ అనుభవాన్ని అందిస్తాయి. ప్రస్తుతం భారతీయ మార్కెట్‌లో రూ.3 లక్షల కంటే తక్కువ ధరకు లభించే టాప్-5 రెట్రో రోడ్‌స్టర్ మోటార్‌సైకిళ్ల గురించి తెలుసుకుందాం.
రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350 (Royal Enfield Hunter 350)
రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350 ఈ సెగ్మెంట్లో అందుబాటులో ఉన్న అత్యంత చవకైన మోడళ్లలో ఒకటి. ఈ బైక్ ఎక్స్ షోరూమ్ ధర రూ. 1.50 లక్షల నుంచి రూ. 1.75 లక్షల మధ్యలో ఉంది. ఇది 349 సీసీ సింగిల్ సిలిండర్, ఎయిర్ ఆయిల్ కూల్డ్, ఫ్యూయల్ ఇంజెక్ట్ ఇంజిన్‌ను పొందుతుంది. ఇది 20.2 బీహెచ్‌పీ శక్తిని, 27 ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 5 స్పీడ్ గేర్‌బాక్స్‌ని కూడా పొందుతుంది.
యెజ్డీ రోడ్‌స్టర్ (Yezdi Roadster)
మహీంద్రా యాజమాన్యంలోని యెజ్డీ బ్రాండ్‌కు చెందిన రోడ్‌స్టర్ బైక్ ధర రూ. 2.08 లక్షల నుంచి రూ. 2.14 లక్షల మధ్యలో ఉంది. ఇది ఎక్స్ షోరూమ్ ధర. ఈ బైక్ 334 సీసీ, సింగిల్ సిలిండర్, లిక్విడ్ కూల్డ్ ఇంజిన్‌ను పొందుతుంది. 29 బీహెచ్‌పీ పవర్‌ని, 28.95 ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 6 స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌ని పొందుతుంది.
హార్లే డేవిడ్‌సన్ ఎక్స్440 (Harley Davison X440)
హీరో మోటోకార్ప్ సహకారంతో హార్లే డేవిడ్‌సన్ ఇటీవల ఎక్స్440ని భారతదేశంలో విడుదల చేసింది. ఈ బైక్ ధర రూ. 2.27 లక్షల నుంచి ప్రారంభం అవుతుంది. ఇది 27 బీహెచ్‌పీ పవర్, 38 ఎన్ఎం టార్క్ ఉత్పత్తి చేస్తుంది. 440 సీసీ, సింగిల్ సిలిండర్, ఎయిర్ అండ్ ఆయిల్ కూల్డ్, ఫ్యూయల్ ఇంజెక్ట్ ఇంజిన్‌ను ఈ బైక్ పొందుతుంది. ఇందులో 6 స్పీడ్ గేర్‌బాక్స్ అందించారు.
ట్రయంఫ్ స్పీడ్ 400 (Triumph Speed 400)
ట్రయంఫ్ స్పీడ్ 400 ఇటీవలే మార్కెట్లోకి వచ్చింది. బజాజ్ ఆటో సహకారంతో ఈ బైక్ మార్కెట్లో లాంచ్ అయింది. దీని ఎక్స్ షోరూమ్ ధర రూ. 2.33 లక్షలుగా ఉంది. ఇది 39.5 బీహెచ్‌పీ పవర్, 37.5 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేసే కొత్త 398.15 సీసీ, సింగిల్ సిలిండర్, లిక్విడ్ కూల్డ్ ఇంజన్‌ను పొందుతుంది. ఈ బైక్‌లో 6 స్పీడ్ గేర్‌బాక్స్ కూడా అందించారు.
హోండా సీబీ300ఆర్ (Honda CB300R)
హోండా సీబీ300ఆర్ నియో రెట్రో రోడ్‌స్టర్ ఎక్స్ షోరూమ్ ధర రూ. 2.77 లక్షలుగా ఉంది. ఇది 30 బీహెచ్‌పీ పవర్, 27.5 ఎన్ఎం టార్క్ ఉత్పత్తి చేసే 286.01 సీసీ సింగిల్ సిలిండర్, లిక్విడ్ కూల్డ్, ఫ్యూయల్ ఇంజెక్ట్ ఇంజిన్‌ను పొందుతుంది. దీంతోపాటు 6 స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌ని కూడా ఈ బైక్‌లో అందించారు.
Read Also: వర్షంలో ఎలక్ట్రిక్ వాహనాలు నడపడం, ఛార్జ్ చేయడం సురక్షితమేనా?
Read Also: రూ.10 లక్షలలోపు లాంచ్ కానున్న లేటెస్ట్ కార్లు ఇవే - కొత్త కారు కొనాలనుకుంటే కొంచెం ఆగండి!
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial