Tata Nexon EV 2023: కారు నుంచి కారుకు ఛార్జింగ్, మిగతా వస్తువులకు కూడా - నెక్సాన్ కొత్త వేరియంట్లో సూపర్ ఫీచర్లు!
త్వరలో లాంచ్ కానున్న టాటా నెక్సాన్ ఈవీ కొత్త మోడల్లో ఉండనున్న వీ2వీ, వీ2ఎల్ ఫీచర్లు ఇవే.
![Tata Nexon EV 2023: కారు నుంచి కారుకు ఛార్జింగ్, మిగతా వస్తువులకు కూడా - నెక్సాన్ కొత్త వేరియంట్లో సూపర్ ఫీచర్లు! Check Out The New Features Of Upcomung Tata Nexon EV V2V V2L Useful to Charge Another Vehicle or Appliances Tata Nexon EV 2023: కారు నుంచి కారుకు ఛార్జింగ్, మిగతా వస్తువులకు కూడా - నెక్సాన్ కొత్త వేరియంట్లో సూపర్ ఫీచర్లు!](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/09/05/7cb2a19d006d196aae27bc3c39fda0ec1693853312147456_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Tata Nexon EV Features: టాటా మోటార్స్ ఇటీవల తన కొత్త నెక్సాన్ ఈవీ ఫేస్‌లిఫ్ట్‌ను పరిచయం చేసింది. ఇందులో అనేక కొత్త ఫీచర్లు అందించడంతో పాటు చాలా మార్పులు కూడా చేశారు.. వీటిలో వీ2ఎల్, వీ2వీ ఫీచర్లు కూడా ప్రముఖమైనవి. దీని అర్థం వాహనం నుంచి వాహనానికి లోడింగ్, వాహనం నుంచి వాహనానికి ఛార్జింగ్. సాధారణంగా ఈ ఫీచర్లు చాలా ఎక్కువ ధర ఉన్న సెగ్మెంట్ ఎలక్ట్రిక్ కార్లలో కనిపిస్తాయి. అయితే బడ్జెట్ సెగ్మెంట్ ఎలక్ట్రిక్ కారులో ఈ ఫీచర్ రావడం ఇదే మొదటిసారి.
వెహికిల్ 2 లోడ్ (V2L)
ఈ ఫీచర్ ప్రత్యేకత ఏమిటంటే దీని ద్వారా ఈ కారును పెద్ద పవర్ బ్యాంక్‌గా ఉపయోగించవచ్చు. నెక్సాన్ ఈవీ ఫేస్‌లిఫ్ట్ V2L ఫీచర్ ద్వారా కాఫీ మెషీన్‌లు, టెంట్ జనరేటర్లు, ఇతర గృహోపకరణాలకు పవర్ ఇస్తుంది. ఇది చాలా ఉపయోగకరమైన ఫీచర్, వినియోగదారులు కారు బ్యాటరీని దాని పూర్తి సామర్థ్యానికి ఉపయోగించుకునేలా అనుమతిస్తుంది. అయితే బ్యాటరీ ఎక్కువగా డ్రెయిన్ అవ్వకుండా చూసుకోవడానికి, వినియోగదారులు బ్యాటరీ లెవల్‌కి లిమిట్ సెట్ చేసుకోవచ్చు. అందువల్ల ఇది ఎనర్జీ సోర్స్‌గా కూడా పనిచేస్తుంది.
వెహికిల్ టు వెహికిల్ (V2L)
రెండో ఫీచర్ వీ2వీ అంటే వెహికల్ టు వెహికల్. ఇది మరొక వాహనాన్ని అత్యవసర సమయంలో ఛార్జింగ్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఇది నెక్సాన్ ఈవీకి మాత్రమే కాకుండా ఇతర ఎలక్ట్రిక్ కార్లను కూడా ఛార్జ్ చేయడానికి అనుమతిస్తుంది. ఇది అత్యవసర పరిస్థితుల్లో చిక్కుకున్న ఇతర ఎలక్ట్రిక్ కారు వినియోగదారులకు సహాయం చేస్తుంది. దీని కోసం రెండు కార్లలో ఒకే విధమైన ఛార్జింగ్ పోర్ట్ ఉండటం అవసరం. తద్వారా రెండు కార్ల మధ్య పవర్‌ను మార్చుకునే సౌకర్యం అందించబడుతుంది. చాలా ప్రీమియం ఈవీలు ప్రస్తుతం ఈ ఫీచర్‌ని కలిగి ఉన్నాయి. అయితే ఈ ఫీచర్‌తో వచ్చిన మొదటి మాస్ మార్కెట్ ఎలక్ట్రిక్ వాహనం నెక్సాన్ ఈవీనే.
ఎప్పుడు లాంచ్ చేస్తారు?
టాటా మోటార్స్ కొత్త నెక్సాన్ ఈవీని సెప్టెంబర్ 14వ తేదీన విడుదల చేస్తుంది. దాని బుకింగ్‌లు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. ఈ SUV ఇప్పటి వరకు కంపెనీకి సంబంధించి అత్యధికంగా అమ్ముడైన ఎలక్ట్రిక్ కారుగా నిలిచింది. ప్రస్తుతం భారతదేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న ఎలక్ట్రిక్ కారు ఇదే.
టాటా నెక్సాన్ ఈవీ తక్కువ సమయంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన ఎలక్ట్రిక్ కారుగా నిలిచింది. కొత్త కస్టమర్లకు ఇది ఫేవరెట్ ఆప్షన్‌గా ఉంది. అలాగే ప్రస్తుతం మార్కెట్లో అత్యధికంగా అమ్ముడవుతున్న ఎలక్ట్రిక్ కారుగా స్థానాన్ని దక్కించుకుంది. మూడు సంవత్సరాల స్వల్ప వ్యవధిలోనే టాటా నెక్సాన్ ఈవీ 50,000 యూనిట్ల అమ్మకాల మార్కును దాటింది. మనదేశంలో అత్యధికంగా అమ్ముడుపోయిన ఎలక్ట్రిక్ కారుగా అగ్రస్థానాన్ని దక్కించుకుంది. నెక్సాన్ దాని వేరియంట్‌లు అన్నీ కలిపి దేశీయ మార్కెట్‌లో 15 శాతం అమ్మకాలను సొంతం చేసుకున్నాయి.
Read Also: వర్షంలో ఎలక్ట్రిక్ వాహనాలు నడపడం, ఛార్జ్ చేయడం సురక్షితమేనా?
Read Also: రూ.10 లక్షలలోపు లాంచ్ కానున్న లేటెస్ట్ కార్లు ఇవే - కొత్త కారు కొనాలనుకుంటే కొంచెం ఆగండి!
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)