News
News
వీడియోలు ఆటలు
X

Expensive Bikes: దేశంలో అత్యంత ఖరీదైన బైక్స్ ఇవే - చూడటం తప్ప కొనడం కష్టమే!

మనదేశంలో అత్యంత ఖరీదైన బైకులు ఇవే.

FOLLOW US: 
Share:

Expensive Motorcycles: రోడ్డు మీద కాస్ట్లీ సూపర్ బైక్ వెళ్తుంటే రైడింగ్ ఇష్టపడే వాళ్లు అలానే చూస్తూ ఉంటారు. సూపర్ బైక్స్‌కు ఉన్న క్రేజ్ అలాంటిది మరి. మనదేశంలో అత్యంత ఖరీదైన సూపర్ బైక్స్‌పై ఒక లుక్కేద్దాం. వీటిని చూడటం తప్ప కొనడం చాలా కష్టం.

కవాసాకి నింజా హెచ్2ఆర్ (ఎక్స్-షోరూం ధర రూ.79.9 లక్షలు)
మోటోజీపీ, ఫార్ములా 1లో ఉపయోగించే టెక్నాలజీని ఈ బైక్‌లో కూడా ఉపయోగించారు. ఈ కారు రేసింగ్‌లో రికార్డులు బద్దలు కొట్టగలదు. భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని కూడా ఈ బైక్‌ను కొనుగోలు చేశాడు. ధోనికి బైక్‌లు అంటే ఎంత పిచ్చో మనకు తెలియంది కాదు.

డుకాటి స్ట్రీట్ ఫైటర్ వీ4 లాంబోర్గిని (ఇంకా లాంచ్ కాలేదు. ధర రూ.72 లక్షల రేంజ్‌లో ఉండవచ్చు)
డుకాటి, లాంబోర్గిని రెండు కంపెనీలు కలిసి ఈ సూపర్ బైక్‌ను రూపొందించాయి. దీని డిజైన్ చూడటానిక హురాకాన్ ఎస్టీవో నుంచి ఇన్‌స్పైర్ అయినట్లు ఉంటుంది. ఈ ఎక్స్‌క్లూజివ్ స్ట్రీట్ ఫైటర్ మనదేశంలో ఈ సంవత్సరమే లాంచ్ కానుంది. ప్రస్తుతానికి దీని ధర రూ.72 లక్షల రేంజ్‌లో ఉండనుందని కంపెనీ హింట్ ఇస్తుంది. కానీ లాంచ్ సమయానికి రూ.80 లక్షల వరకు వెళ్లే అవకాశం ఉంది. ఈ కారుకు సంబంధించి ఇప్పటివరకు 630 యూనిట్లు మాత్రమే తయారు చేశారు.

డుకాటి పనిగలే వీ4 ఆర్ (ఇంకా లాంచ్ అవ్వలేదు. ధర రూ.70 లక్షల రేంజ్‌లో ఉండవచ్చు)
ఈ బైక్‌లో 998 సీసీ ఇంజిన్‌ను అందించడం విశేషం. ఏకంగా 16,800 ఆర్‌పీఎం వరకు ఇది అందించనుంది. కాబట్టి మీరు మోటో జీపీ బైక్ కోసం ఎదురు చూస్తుంటే ఈ బైక్‌ను కూడా ఒక ఆప్షన్‌గా పెట్టుకోవచ్చు.

బీఎండబ్ల్యూ ఎం 1000 ఆర్ఆర్ (ఎక్స్-షోరూం ధర రూ.45 లక్షలు)
ఈ సూపర్ బైక్ ముందు భాగాన్ని ఆప్టిమైజ్ చేశారు. కార్బన్ ఫైబర్ వింగ్లెట్స్‌ను ఫిట్ చేశారు. ఇది డౌన్‌ఫోర్స్‌ను పెంచుతుంది. సైడ్ ట్రిమ్ ప్యానెల్స్‌ను కార్బన్‌తో చేశారు. ఇది వాహనం వేగాన్ని మరింత పెంచుతుంది. ఎం ఏరో వీల్ కవర్స్‌ను కూడా అందించారు. రేసింగ్ బైక్స్‌లోనే ఇలాంటివి ఉంటాయి. దీని ధర రూ.45 లక్షలుగా ఉంది.

హోండా గోల్డ్‌వింగ్ టూర్ (ఎక్స్-షోరూం ధర రూ.39.16 లక్షలు)
హోండా గోల్డ్ వింగ్ టూర్ చూడటానికి చాలా స్టైలిష్‌గా ఉంటుంది. 7 స్పీడ్ డ్యూయల్ క్లచ్ ట్రాన్స్‌మిషన్‌ను ఇందులో అందించారు. ఎయిర్‌బ్యాగ్‌తో వచ్చే మోటార్ సైకిల్ ఇదే. లిక్విడ్ కూల్డ్, ఫ్లాట్ 6 ఇంజిన్ ఇందులో ఉంది. 170 ఎన్ఎం టార్క్, 125 బీహెచ్‌పీ, 7 స్పీడ్ డ్యూయల్ క్లచ్ ట్రాన్స్‌మిషన్ అందించారు. 

ఇప్పుడు కొత్త ఆర్డీఈ నిబంధనలు అమలులోకి రావడానికి కేవలం ఒక వారం మాత్రమే మిగిలి ఉంది. అటువంటి పరిస్థితిలో అన్ని ఆటోమొబైల్ కంపెనీలు తమ వాహనాలను కొత్త ఉద్గార నిబంధనల ప్రకారం అప్‌డేట్, వాహనాల కొత్త ధరలను ప్రకటించడంలో నిమగ్నమై ఉన్నాయి. ప్రముఖ వాహన తయారీ సంస్థ హీరో మోటార్‌కార్ప్ కూడా ఏప్రిల్ 1వ తేదీ నుంచి తమ వాహనాల ధరలను రెండు శాతం పెంచనున్నాయి.

Published at : 27 Mar 2023 04:38 PM (IST) Tags: Mahendra Singh Dhoni BMW India Ducati Kawasaki Ninja Most Expensive Bikes in India

సంబంధిత కథనాలు

Tata Altroz CNG: దేశంలోనే అత్యంత చవకైన సన్‌రూఫ్ కారు లాంచ్ చేసిన టాటా - రూ.8 లక్షల లోపే!

Tata Altroz CNG: దేశంలోనే అత్యంత చవకైన సన్‌రూఫ్ కారు లాంచ్ చేసిన టాటా - రూ.8 లక్షల లోపే!

Top 5 160 CC Bikes: బెస్ట్ 160 సీసీ బైక్ కొనాలనుకుంటున్నారా - ఈ ఐదు ఆప్షన్లపై ఓ లుక్కేయండి!

Top 5 160 CC Bikes: బెస్ట్ 160 సీసీ బైక్ కొనాలనుకుంటున్నారా - ఈ ఐదు ఆప్షన్లపై ఓ లుక్కేయండి!

MS Dhoni: మహేంద్ర సింగ్ ధోని టాప్-5 కార్ కలెక్షన్ - ఆర్మీ స్పెషల్ కారు కూడా గ్యారేజ్‌లో!

MS Dhoni: మహేంద్ర సింగ్ ధోని టాప్-5 కార్ కలెక్షన్ - ఆర్మీ స్పెషల్ కారు కూడా గ్యారేజ్‌లో!

Luna moped EV: లూనా మోపెడ్ మళ్లీ వచ్చేస్తోంది, దీనికి పెట్రోల్ అక్కర్లేదు - గుడ్‌న్యూస్ చెప్పిన కైనెటిక్ CEO

Luna moped EV: లూనా మోపెడ్ మళ్లీ వచ్చేస్తోంది, దీనికి పెట్రోల్ అక్కర్లేదు - గుడ్‌న్యూస్ చెప్పిన కైనెటిక్ CEO

Royal Enfield Hunter: బైక్ లవర్స్‌కు షాక్ - రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్స్ ధరలు పెంపు, ఏ బైక్ ధర ఎంత పెరిగిందంటే?

Royal Enfield Hunter: బైక్ లవర్స్‌కు షాక్ - రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్స్ ధరలు పెంపు, ఏ బైక్ ధర ఎంత పెరిగిందంటే?

టాప్ స్టోరీస్

Katakam Sudarshan: గుండెపోటుతో మావోయిస్టు అగ్రనేత కటకం సుదర్శన్ మృతి

Katakam Sudarshan: గుండెపోటుతో మావోయిస్టు అగ్రనేత కటకం సుదర్శన్ మృతి

Guduvada Amarnath: ఒడిశా ప్రమాదంలో సురక్షితంగా ఏపీ వాసులు, ఒకరు మృతి - మంత్రి గుడివాడ వెల్లడి

Guduvada Amarnath: ఒడిశా ప్రమాదంలో సురక్షితంగా ఏపీ వాసులు, ఒకరు మృతి - మంత్రి గుడివాడ వెల్లడి

Mahesh Babu - Fidaa : మహేష్ బాబు - దీపికా పదుకోన్ - 'ఫిదా' చేసి ఉంటేనా? ఎందుకు 'నో' చెప్పారంటే?

Mahesh Babu - Fidaa : మహేష్ బాబు - దీపికా పదుకోన్ - 'ఫిదా' చేసి ఉంటేనా? ఎందుకు 'నో' చెప్పారంటే?

Anasuya Wedding Anniversary : మేం పర్ఫెక్ట్ జంట కాదు కానీ - మమ్మల్ని చికాకు పెట్టాలని చేశారు, బలంగా ఉన్నాం : అనసూయ 

Anasuya Wedding Anniversary : మేం పర్ఫెక్ట్ జంట కాదు కానీ - మమ్మల్ని చికాకు పెట్టాలని చేశారు, బలంగా ఉన్నాం : అనసూయ