అన్వేషించండి

Upcoming Cars in India: ఆగస్టులో లాంచ్ కానున్న కార్లు ఇవే - పంచ్ సీఎన్‌జీ నుంచి కొత్త ఆడీ దాకా!

2023 ఆగస్టులో మనదేశంలో లాంచ్ కానున్న కార్లు ఇవే.

Upcoming Cars in August: 2023 ఆగస్టులో చాలా కొత్త కార్లు విడుదల కానున్నాయి. వీటిలో ఎక్కువ భాగం లగ్జరీ సెగ్మెంట్ మోడల్స్ ఉన్నాయి. టాటా మోటార్స్ సీఎన్‌జీ పవర్‌ట్రెయిన్‌తో పంచ్‌ను తీసుకువస్తుంది. మారుతి సుజుకి ఎర్టిగా ఆధారంగా టయోటా కొత్త రూమియన్ ఎంపీవీని విడుదల చేస్తుంది. లగ్జరీ సెగ్మెంట్‌లో ఉండగా మెర్సిడెస్-బెంజ్, వోల్వో, ఆడి కూడా తమ కొత్త మోడళ్లను విడుదల చేయనున్నాయి.

టాటా పంచ్ సీఎన్‌జీ
టాటా మోటార్స్ ఈ సంవత్సరం ప్రారంభంలో జరిగిన ఆటో ఎక్స్‌పోలో పంచ్ సీఎన్‌జీని మొదటిసారి ప్రదర్శించింది. కంపెనీ కొత్త ట్విన్-సిలిండర్ ట్యాంక్ పంచ్‌లో ఉపయోగించారు. ఇది 1.2 లీటర్, 3 సిలిండర్ పెట్రోల్ ఇంజన్‌తో 5 స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌ను పొందుతుంది. పెట్రోల్‌పై ఇది 86 హెచ్‌పీ, 113 ఎన్ఎమ్‌ పీక్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. సీఎన్‌జీ మోడ్‌లో ఇది 77 హెచ్‌పీ, 97 ఎన్ఎమ్‌ పీక్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

రెండో తరం మెర్సిడెస్ బెంజ్ జీఎల్సీ
మెర్సిడెస్ బెంజ్ ఇండియా రెండో తరం జీఎల్సీ ఎస్‌యూవీనిని విడుదల చేయనుంది. ఇది జీఎల్సీ 300 పెట్రోల్, జీఎల్సీ 220డీ డీజిల్ వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది. రెండూ మెర్సిడెస్ 4మ్యాటిక్ ఆల్ వీల్ డ్రైవ్ సిస్టమ్‌ను పొందుతాయి. 2.0 లీటర్ ఇంజన్ 4వీV ఇంటిగ్రేటెడ్ స్టార్టర్ మోటార్‌ను కూడా రెంటిలో అందించనున్నారు. ఇది 23 హెచ్‌పీ ఎక్కువ శక్తిని ఇస్తుంది. ఈ ఎస్‌యూవీ లోపలి భాగం దాదాపుగా కొత్త సీ-క్లాస్‌తో సమానంగా ఉంటుంది. ఇందులో రెండు స్క్రీన్‌లు (12.3 అంగుళాల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, 11.9 అంగుళాల పోర్ట్రెయిట్ ఓరియెంటెడ్ టచ్‌స్క్రీన్) ఉన్నాయి.

ఆడి క్యూ8 ఈ-ట్రాన్
ఆడి ఇండియా ఇటీవలే తన క్యూ8 ఈ-ట్రాన్‌ను భారతదేశంలో పరిచయం చేసింది. ఇది ఫేస్‌లిఫ్టెడ్ ఆడి క్యూ ఈ-ట్రాన్ ఎస్‌యూవీ. క్యూ ఈ-ట్రాన్ ఎస్‌యూవీ, కూపే బాడీ స్టైల్స్‌లో కొత్త ఫ్రంట్ ఫాసియా వెనుక బంపర్‌తో 'ఆడీ', 'క్యూ8 ఈ-ట్రాన్ క్వాట్రో' బ్యాడ్జింగ్‌తో బీ-పిల్లర్‌పై వస్తుంది. క్యూ8 ఈ-ట్రాన్ ఎస్‌యూవీ 95 కేడబ్ల్యూహెచ్, 114 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్‌ను పొందుతుంది. పెద్ద బ్యాటరీ ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 600 కిలోమీటర్ల వరకు ప్రయాణించగలదు. క్యూ8 ఈ-ట్రాన్ 170 కేడబ్ల్యూ డీసీ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుందని ఆడి తెలిపింది.

టయోటా రూమియన్
మారుతి సుజుకి ఎర్టిగా ఆధారంగా టయోటా రూమియన్ ఎంపీవీని మార్కెట్లోకి తీసుకురానుంది. ఇది ఇప్పటికే దక్షిణాఫ్రికా వంటి మార్కెట్లలో అమ్ముడవుతోంది. ఆల్ బ్యాడ్జ్ ఇంజనీరింగ్ మారుతి సుజుకి, టయోటా ఉత్పత్తుల లాగానే ఇది ఎర్టిగాను పోలి ఉంటుంది. ఇది 103 హెచ్‌పీ, 137 ఎన్ఎం అవుట్‌పుట్‌ అందించే 1.5 లీటర్ పెట్రోల్ ఇంజిన్‌ను పొందుతుంది. ఇది 5 స్పీడ్ మాన్యువల్ లేదా 6 స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో లభిస్తుంది.

వోల్వో సీ40 రీఛార్జ్
భారతదేశంలో రెండో ఈవీని ప్రారంభించేందుకు వోల్వో సిద్ధమవుతుంది. కంపెనీ లాంచ్ చేయనున్న వోల్వో సీ40 రీఛార్జ్ గతంలో లాంచ్ అయిన ఎక్స్‌సీ40 రీఛార్జ్‌ని పోలి ఉంటుంది. లోపలి భాగంలో రెండు ఈవీలు ఒకే లేఅవుట్‌ను పంచుకుంటాయి. ఇవి రెండూ 9.0 అంగుళాల పోర్ట్రెయిట్ ఆధారిత టచ్‌స్క్రీన్‌ను పొందుతాయి. ఇది వోల్వో సీఎంఏ (కాంపాక్ట్ మాడ్యులర్ ఆర్కిటెక్చర్) ప్లాట్‌ఫారమ్‌పై ఆధారపడి ఉంటుంది. 408 హెచ్‌పీ పవర్, 660 ఎన్ఎం టార్క్‌ను పొందుతుంది. ఇది 530 కిలోమీటర్ల రేంజ్‌ను అందిస్తుందని కంపెనీ అంటోంది.

హ్యుందాయ్ క్రెటా అల్కాజార్ అడ్వెంచర్ ఎడిషన్
హ్యుందాయ్ తన క్రెటా, అల్కాజార్ కోసం ప్రత్యేక ఎడిషన్‌ను తీసుకురావడానికి సన్నాహాలు చేస్తోంది. దీనిని అడ్వెంచర్ ఎడిషన్‌గా పరిచయం చేయవచ్చు. ఇది క్రెటా నైట్ ఎడిషన్‌ స్థానంలో రానుంది. ఈ ఎడిషన్‌లో కేవలం కాస్మెటిక్ మార్పులు మాత్రమే చేయనున్నారు. రెండు ఎస్‌‌యూవీలు కొత్త 'రేంజర్ ఖాకీ' పెయింట్‌ను పొందుతాయి. ఇది పూర్తిగా నలుపు రంగు ఇంటీరియర్, మరికొన్ని ఇంటీరియర్ అప్‌డేట్‌లను పొందే అవకాశం ఉంది.

Read Also: వర్షంలో ఎలక్ట్రిక్ వాహనాలు నడపడం, ఛార్జ్ చేయడం సురక్షితమేనా?

Read Also: రూ.10 లక్షలలోపు లాంచ్ కానున్న లేటెస్ట్ కార్లు ఇవే - కొత్త కారు కొనాలనుకుంటే కొంచెం ఆగండి!

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.

Join Us on Telegram: https://t.me/abpdesamofficial

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Sharmila On Jagan : జగన్, వైసీపీ ఎమ్మెల్యేలకు అసెంబ్లీకి వెళ్లే ధైర్యం లేకపోతే రాజీనామా చేయాలి -  షర్మిల డిమాండ్
జగన్, వైసీపీ ఎమ్మెల్యేలకు అసెంబ్లీకి వెళ్లే ధైర్యం లేకపోతే రాజీనామా చేయాలి - షర్మిల డిమాండ్
Minister Atchannaidu: రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - 2 రోజుల్లోనే అకౌంట్లలో డబ్బులు జమ
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - 2 రోజుల్లోనే అకౌంట్లలో డబ్బులు జమ
Dharmavaram lands: ధర్మవరం మాజీ ఎమ్మెల్యేకు చెరువు కబ్జా నోటీసులు - కోర్టుకెళ్తానన్న కేతిరెడ్డి - ఆ చెరువు ఇల్లు మాత్రం నెక్ట్ లెవల్ !
ధర్మవరం మాజీ ఎమ్మెల్యేకు చెరువు కబ్జా నోటీసులు - కోర్టుకెళ్తానన్న కేతిరెడ్డి - ఆ చెరువు ఇల్లు మాత్రం నెక్ట్ లెవల్ !
KTR Arrest : అరెస్ట్‌కు మానసికంగా సిద్ధం అయిన కేటీఆర్ - కాంగ్రెస్ ఆటంబాంబు ఈ సారి పేలడం ఖాయమేనా ?
అరెస్ట్‌కు మానసికంగా సిద్ధం అయిన కేటీఆర్ - కాంగ్రెస్ ఆటంబాంబు ఈ సారి పేలడం ఖాయమేనా ?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

అధికారుల నిర్లక్ష్యం, ఉద్యోగాలు కోల్పోయిన ఏడుగురు టీచర్లుఆ గ్రామంలో కుల గణన సర్వే బహిష్కరణPV Sindhu Badminton Academy Visakhapatnam | పీవీ సింధు బ్యాడ్మింటన్ అకాడమీకి శంకుస్థాపన | ABP DesamCurious Case of Manuguru Boy Shiva Avatar | శివుడి అవతారం అని చెబుతున్న 18ఏళ్ల బాలుడు | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Sharmila On Jagan : జగన్, వైసీపీ ఎమ్మెల్యేలకు అసెంబ్లీకి వెళ్లే ధైర్యం లేకపోతే రాజీనామా చేయాలి -  షర్మిల డిమాండ్
జగన్, వైసీపీ ఎమ్మెల్యేలకు అసెంబ్లీకి వెళ్లే ధైర్యం లేకపోతే రాజీనామా చేయాలి - షర్మిల డిమాండ్
Minister Atchannaidu: రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - 2 రోజుల్లోనే అకౌంట్లలో డబ్బులు జమ
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - 2 రోజుల్లోనే అకౌంట్లలో డబ్బులు జమ
Dharmavaram lands: ధర్మవరం మాజీ ఎమ్మెల్యేకు చెరువు కబ్జా నోటీసులు - కోర్టుకెళ్తానన్న కేతిరెడ్డి - ఆ చెరువు ఇల్లు మాత్రం నెక్ట్ లెవల్ !
ధర్మవరం మాజీ ఎమ్మెల్యేకు చెరువు కబ్జా నోటీసులు - కోర్టుకెళ్తానన్న కేతిరెడ్డి - ఆ చెరువు ఇల్లు మాత్రం నెక్ట్ లెవల్ !
KTR Arrest : అరెస్ట్‌కు మానసికంగా సిద్ధం అయిన కేటీఆర్ - కాంగ్రెస్ ఆటంబాంబు ఈ సారి పేలడం ఖాయమేనా ?
అరెస్ట్‌కు మానసికంగా సిద్ధం అయిన కేటీఆర్ - కాంగ్రెస్ ఆటంబాంబు ఈ సారి పేలడం ఖాయమేనా ?
HBD Revanth Reddy: రేవంత్ రెడ్డికి కేటీఆర్ బర్త్‌డే విశెష్‌- సీఎం పుట్టిన రోజు కేక్ కట్‌ చేస్తానంటూ ట్వీట్ 
రేవంత్ రెడ్డికి కేటీఆర్ బర్త్‌డే విశెష్‌- సీఎం పుట్టిన రోజు కేక్ కట్‌ చేస్తానంటూ ట్వీట్ 
Pushpa 2 Music Director: ‘పుష్ప 2’ సినిమానే కాదు మ్యూజిక్ డైరెక్టర్లు కూడా పాన్ ఇండియానే! - లిస్టేంటి ఇంత ఉంది?
‘పుష్ప 2’ సినిమానే కాదు మ్యూజిక్ డైరెక్టర్లు కూడా పాన్ ఇండియానే! - లిస్టేంటి ఇంత ఉంది?
Prabhas: ప్రభాస్‌తో మూడు పాన్ ఇండియా ఫిలిమ్స్... 'సలార్ 2' నుంచి మొదలు పెడితే - హోంబలే నుంచి బిగ్ అప్డేట్
ప్రభాస్‌తో మూడు పాన్ ఇండియా ఫిలిమ్స్... 'సలార్ 2' నుంచి మొదలు పెడితే - హోంబలే నుంచి బిగ్ అప్డేట్
Appudo Ippudo Eppudo OTT: ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’ ఓటీటీ ప్లాట్‌ఫాం ఫిక్స్ - ఎందులో స్ట్రీమ్ కానుందంటే?
‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’ ఓటీటీ ప్లాట్‌ఫాం ఫిక్స్ - ఎందులో స్ట్రీమ్ కానుందంటే?
Embed widget