Best Affordable Electric Cars: చవకైన ఎలక్ట్రిక్ కార్లు కొనాలనుకుంటున్నారా? - అయితే మీరు చూడాల్సిన టాప్-5 ఇవే!
ప్రస్తుతం మనదేశంలో చవకైన ఎలక్ట్రిక్ కార్లు ఇవే.
Top 5 Most Affordable Electric Cars: దేశంలో ఎలక్ట్రిక్ కార్లకు నిరంతరం డిమాండ్ పెరుగుతూనే ఉంది. ఇప్పుడు పెద్ద సంఖ్యలో ప్రజలు ఎలక్ట్రిక్ కార్లపై ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో వాటి విక్రయాలు కూడా పెరిగాయి. కంపెనీలు కూడా కొత్త మోడళ్లను మార్కెట్‌లోకి తీసుకువస్తున్నాయి. ఎలక్ట్రిక్ కార్లు సాధారణ కార్ల కంటే ఖరీదైనవి. ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్న కొన్ని బడ్జెట్ ఎలక్ట్రిక్ కార్ల గురించి తెలుసుకుందాం.
టాటా టియాగో ఈవీ
ఈ జాబితాలో మొదటి కారు టాటా టియాగో ఈవీ. దీని ఎక్స్ షోరూమ్ ధర రూ. 8.69 నుంచి రూ. 11.99 లక్షల మధ్య ఉంది. టాటా టియాగో ఈవీ నాలుగు వేరియంట్‌లలో అందుబాటులో ఉంది. ఇందులో XE, XT, XZ+, XZ+ Tech LUX ఉన్నాయి. మరోవైపు బ్యాటరీ ప్యాక్ గురించి చెప్పాలంటే 19.2 కేడబ్ల్యూహెచ్, 24 కేడబ్ల్యూహెచ్ రెండు ఆప్షన్లలో అందుబాటులో ఉన్నాయి. ఇందులో మొదటి వేరియంట్ 250 కిలో మీటర్లు, రెండో వేరియంట్ 315 కిలో మీటర్ల వరకు రేంజ్ అందించనున్నాయి. టియాగోలో అమర్చిన ఎలక్ట్రిక్ మోటార్ 74 బీహెచ్‌పీ, 114 ఎన్ఎం అవుట్‌పుట్‌ను ఉత్పత్తి చేయగలదు.
ఎంజీ కామెట్ ఈవీ
ఈ జాబితాలో రెండో స్థానంలో ఎంజీ కామెట్ ఈవీ నిలిచింది. ఇందులో మీరు 17.3 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్‌ని పొందుతారు. కంపెనీ తెలుపుతున్న దాని ప్రకారం ఒక్కసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే 230 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు. కామెట్‌లో అమర్చిన రియర్ వీల్ డ్రైవ్ ఎలక్ట్రిక్ మోటార్ 42 పీఎస్ పవర్, 110 ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేయగలదు. కామెట్ బ్యాటరీని పూర్తిగా ఛార్జ్ చేయడానికి ఏడు గంటల వరకు సమయం పడుతుంది. ఈ కారులో చాలా ఫీచర్లు ఉన్నాయి. దీని ధర గురించి చెప్పాలంటే రూ. 7.98 లక్షల నుంచి రూ. 9.98 లక్షల మధ్య ఉంది. ఇది ఎక్స్ షోరూమ్ ధర.
టాటా నెక్సాన్ ఈవీ
టాటా నెక్సాన్ ఈవీ ధర గురించి చెప్పాలంటే రూ. 14.49 లక్షల నుంచి ప్రారంభం అవుతుంది. ఇది ఎక్స్ షోరూమ్ ధర. ఈ ఎలక్ట్రిక్ కాంపాక్ట్ ఎస్‌యూవీ XM, XZ+, XZ + LUX వేరియంట్‌లలో వస్తుంది. ఇది 30.2 కేడబ్ల్యూహెచ్ లిథియం అయాన్ పాలిమర్ బ్యాటరీ ప్యాక్‌ను కలిగి ఉంది. 127 బీహెచ్‌పీ పవర్‌ని, 245 ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేసే ఎలక్ట్రిక్ మోటార్‌తో ఈ కారు లాంచ్ అయింది.
సిట్రోయెన్ ఈసీ3
ఈ లిస్ట్‌లో నాలుగో ఎలక్ట్రిక్ కారు సిట్రోయెన్ ఈసీ3. ఇందులో 29.2 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్‌ని అందించారు. ఈ కారు దాదాపు 320 కిలోమీటర్ల రేంజ్‌ను ఇవ్వనుంది. ఈసీ3లో అమర్చిన ఎలక్ట్రిక్ మోటార్ 57 పీఎస్ పవర్, 143 ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేయగలదు. 15ఏ ప్లగ్ పాయింట్ ఛార్జర్‌తో దీన్ని ఛార్జ్ చేయడానికి 10 గంటల 30 నిమిషాలు పడుతుంది. అదే సమయంలో డీసీ ఫాస్ట్ ఛార్జర్‌తో 57 నిమిషాల్లో 10 నుంచి 80 శాతం వరకు ఛార్జ్ చేయవచ్చు. ధర గురించి చెప్పాలంటే దీని ఎక్స్ షోరూమ్ ధర రూ. 11.50 లక్షల నుంచి రూ. 12.76 లక్షల మధ్య ఉంది.
టాటా టిగోర్ ఈవీ
టాటా టిగోర్ ఈవీని ఐదో ఆప్షన్‌గా ఎంచుకోవచ్చు. దీని ఎక్స్ షోరూమ్ ధర రూ. 12.49 లక్షల నుంచి రూ. 13.75 లక్షల మధ్య ఉంది. టాటా టిగోర్ ఈవీ XE, XT, XZ+, XZ+ టెక్ LUX వేరియంట్‌లలో వస్తుంది. ఇందులో అమర్చిన ఎలక్ట్రిక్ మోటార్ 74 బీహెచ్‌పీ పవర్, 170ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేయగలదు. మీరు ఈ కారులో 26 కేడబ్ల్యూహెచ్ లిథియం ఇయాన్ బ్యాటరీ ప్యాక్‌ని పొందుతారు.
Read Also: వర్షంలో ఎలక్ట్రిక్ వాహనాలు నడపడం, ఛార్జ్ చేయడం సురక్షితమేనా?
Read Also: రూ.10 లక్షలలోపు లాంచ్ కానున్న లేటెస్ట్ కార్లు ఇవే - కొత్త కారు కొనాలనుకుంటే కొంచెం ఆగండి!
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial