News
News
X

EV Fire Incidents: తయారీ లోపంతోనే ఎలక్ట్రిక్ వాహనాల్లో మంటలు- తేల్చిన కేంద్రం - నెలరోజుల్లో చర్యలు !

ఎలక్ట్రిక్ వాహనాల్లో మంటలపై నితిన్ గడ్కరీ మాట్లాడుతూ కమిటీ ఏర్పాటు చేసినట్టు వివరించారు. ఇలాంటివి జరగకుండా తీసుకోవాల్సిన చర్యలు, జరిగిన వాటికి కారణాలు తెలుసుకునేందుకు ఆ కమిటీ పని చేస్తుందని చెప్పారు.

FOLLOW US: 

ఎల‌క్ట్రిక్ వాహ‌న త‌యారీదారుల‌కు కేంద్రం షోకాజ్ నోటీసులు జారీ చేసింది. లోపాలు కలిగి ఉన్న వాహనాలు విక్రయించారని ఆరోపిస్తూ... ఎలక్ట్రిక్‌ వాహన తయారీదారులు ఓలా, ఒకినావా, ప్యూర్‌ కంపెనీలకు నోటీసులు ఇచ్చింది. ఈ నెలాఖ‌రులోగా స‌మాధానం ఇవ్వాల‌ని కేంద్రం ఆదేశించింది. 

కేంద్రం ఇచ్చిన నోటీసులకు స్పందించి కంపెనీలు ఇచ్చే సమాధానం ఆధారంగా తదుపరి చర్యలు ఉంటాయని కేంద్రం వర్గాలు చెబుతున్నాయి. లోపాలు క‌లిగిన వాహ‌నాల‌ను వినియోగ‌దారుల‌కు విక్రయించినందుకు ఎందుకు చర్యలు తీసుకోకూడదో చెప్పాలంటూ తన నోటీసులో కేంద్రం ప్రశ్నించింది. 

మెల్లిమెల్లిగా అంతా ఎలక్ట్రానికి వాహనాలవైపు మొగ్గుతున్న టైంలో వరుస ప్రమాదాలు కేంద్రానికి తలనొప్పిగా మారింది. వినియోగదారుల్లో కూడా భయాందోళనలు నెలకొన్నాయి. ఈ కంపెనీలు త‌యారు చేసిన ఎలక్ట్రిక్ వాహ‌నాల్లో కొన్నింటిలో షార్ట్ స‌ర్క్యూట్ కార‌ణంగా ఫైర్‌ యాక్సిడెంట్ అయినట్టు విచారణలో తెలినట్టు తెలుస్తోంది. వరసుబెట్టి ఇలాంటి సంఘటనలు జరగడంతో కేంద్రానికి కోపం తెప్పించింది. అందుకే ఆయా కంపెనీలకు నోటీసులు జారీ చేసినట్టు తెలుస్తోంది. 

ఈ మధ్య జరిగిన ఎలక్ట్రిక్ వాహనాల ప్రమాదంపై ఏప్రిల్‌లో కేంద్ర రోడ్లు, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ స్పందిస్తూ... ఓ కమిటీ ఏర్పాటు చేసినట్టు వివరించారు. ఇలాంటివి జరగకుండా తీసుకోవాల్సిన చర్యలు, జరిగిన వాటికి కారణాలు తెలుసుకునేందుకు ఆ కమిటీ పని చేస్తుందని చెప్పారు. ఒక వేళ ఇది కంపెనీ తప్పులు ఉంటే మాత్రం సీరియస్ యాక్షన్ తీసుకుంటామని అప్పట్లోనే హెచ్చరించారు. అలాంటి లోపాలు ఉన్న వాహనాలను వెనక్కి తీసుకునేలా కూడా ఆదేశాలు ఇస్తామని వెల్లడించారు. 

కేంద్రం ఏర్పాటు చేసిన రిపోర్ట్‌లో కంపెనీ తప్పిదాల కారణంగానే ప్రమాదం జరిగినట్టు వెల్లడైంది. ఆయా కంపెనీలు కనీసం బేసిక్‌ భద్రతా చర్యలు తీసుకోకుండానే వాహనాలు రిలీజ్ చేసినట్టు తేల్చిందా కమిటీ. బ్యాటరీ తయారీ విధానంలోనే లోపం ఉందని గుర్తించింది. సెల్‌ హీట్ అయిన తర్వాత ఆ వేడి వెళ్లేందుకు మార్గాన్ని కూడా ఇవ్వలేదని పేర్కొంది. 

రిపోర్ట్ వచ్చిన తర్వాత ఆయా కంపెనీలతో మాట్లాడిన నీతి ఆయోగ్‌... లోపాలు ఉన్న వాహనాలను వెనక్కి తీసుకోమని సూచించింది. నీతి ఆయోగ్ సూచన మేరకు ఓలా, ఒకినావా కంపెనీ తాము తయారు చేసిన 7000 వాహనాలను వెనక్కి తీసుకున్నాయి. 

Published at : 05 Jul 2022 11:36 PM (IST) Tags: Ola electric central government EV Fire Incidents EV Manufacturers Show Cause Notice Okinawa Auto Tech Pure EV

సంబంధిత కథనాలు

Mahindra Electric SUVs: మహీంద్రా నుంచి అదిరిపోయే ఎలక్ట్రిక్ SUVలు - మార్కెట్లోకి వచ్చేది అప్పుడే!

Mahindra Electric SUVs: మహీంద్రా నుంచి అదిరిపోయే ఎలక్ట్రిక్ SUVలు - మార్కెట్లోకి వచ్చేది అప్పుడే!

Ola Electric Car: చూడగానే కొనాలనిపించే ఓలా ఎలక్ట్రిక్ కారు - కేవలం నాలుగు సెకన్లలోనే - మోస్ట్ అడ్వాన్స్‌డ్ ఫీచర్లు!

Ola Electric Car: చూడగానే కొనాలనిపించే ఓలా ఎలక్ట్రిక్ కారు - కేవలం నాలుగు సెకన్లలోనే - మోస్ట్ అడ్వాన్స్‌డ్ ఫీచర్లు!

Ola New Electric Scooter: ఓలా - కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ అదిరిపోలా - ఈసారి తక్కువ ధరలోనే!

Ola New Electric Scooter: ఓలా - కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ అదిరిపోలా - ఈసారి తక్కువ ధరలోనే!

Ola Electric Car: సింగిల్ చార్జ్‌తో హైదరాబాద్ టు తిరుపతి - ఓలా ఎలక్ట్రిక్ కార్‌తో మామూలుగా ఉండదు!

Ola Electric Car: సింగిల్ చార్జ్‌తో హైదరాబాద్ టు తిరుపతి - ఓలా ఎలక్ట్రిక్ కార్‌తో మామూలుగా ఉండదు!

Kia Seltos: కొత్త మైలురాయి అందుకున్న కియా సెల్టోస్ - ఏకంగా 60 శాతానికి పైగా!

Kia Seltos: కొత్త మైలురాయి అందుకున్న కియా సెల్టోస్ - ఏకంగా 60 శాతానికి పైగా!

టాప్ స్టోరీస్

సంగం బ్యారేజ్ నిర్వహణపై రగడ- పైచేయి కోసం పోటీ పడుతున్న వైసీపీ ఎమ్మెల్యేలు!

సంగం బ్యారేజ్ నిర్వహణపై రగడ-  పైచేయి కోసం పోటీ పడుతున్న వైసీపీ ఎమ్మెల్యేలు!

బాలీవుడ్‌ భయపడుతోందా? ‘కార్తికేయ 2’ హిట్‌తో మళ్లీ కలవరం!

బాలీవుడ్‌ భయపడుతోందా? ‘కార్తికేయ 2’ హిట్‌తో మళ్లీ కలవరం!

Psycho Killer Rambabu: భార్యపై కోపంతో ఆడజాతినే అంతం చేయాలనుకున్నాడు ! విశాఖ సీరియల్ కిల్లర్ అరెస్ట్

Psycho Killer Rambabu: భార్యపై కోపంతో ఆడజాతినే అంతం చేయాలనుకున్నాడు !  విశాఖ సీరియల్ కిల్లర్ అరెస్ట్

JVVD Scheme 2022: జగనన్న విదేశీ విద్యా దీవెనకు దరఖాస్తు చేసుకోండి, చివరితేది ఎప్పుడంటే?

JVVD Scheme 2022: జగనన్న విదేశీ విద్యా దీవెనకు దరఖాస్తు చేసుకోండి, చివరితేది ఎప్పుడంటే?