అన్వేషించండి

Best Selling Cars in India: ఫిబ్రవరిలో ఎక్కువ అమ్ముడుపోయిన కార్లు ఇవే - టాప్‌లో టాటా పంచ్!

Best Selling Cars: ప్రస్తుతం భారతదేశంలో బెస్ట్ సెల్లింగ్ కార్లు ఇవే. నంబర్ వన్ స్థానంలో టాటా పంచ్ నిలిచింది.

Car Sales Report February 2024: ప్రముఖ కార్ల తయారీ కంపెనీలు 2024 ఫిబ్రవరి నెలలో తమ సేల్స్ నంబర్లను విడుదల చేశాయి. ఇందులో గత నెలలో అత్యధికంగా అమ్ముడైన కార్ల జాబితాలో మారుతి వ్యాగన్ఆర్ అగ్రస్థానంలో నిలిచింది. 2024 ఫిబ్రవరిలో అమ్ముడుపోయిన టాప్ 5 ఎస్‌యూవీ కార్ల గురించి తెలుసుకుందాం.

ఎస్‌యూవీ సెగ్మెంట్ మార్కెట్లో హాట్ ఫేవరెట్‌గా టాటా మోటార్స్ రెండు ఎంట్రీ లెవల్ ఎస్‌యూవీలు ఉన్నాయి. అవే టాటా పంచ్, టాటా నెక్సాన్. గత సంవత్సరంలో అత్యధికంగా అమ్ముడైన ఎస్‌యూవీల్లో ఒకటి. టాటా నెక్సాన్ గత నెలలో అత్యధికంగా అమ్ముడైన ఎస్‌యూవీల జాబితాలో ఐదో స్థానంలో నిలిచింది. కానీ టాటా పంచ్ ఫిబ్రవరి నెలలో అత్యధికంగా అమ్ముడైన ఎస్‌యూవీగా మారింది. రెండు, మూడు, నాలుగో స్థానాల్లో వరుసగా మారుతి సుజుకి బ్రెజా, హ్యుందాయ్ క్రెటా, మహీంద్రా స్కార్పియో ఎన్ ఉన్నాయి. కాగా మారుతీ సుజుకి ఫ్రాంక్స్ క్రాసోవర్ గత నెలలో 14,168 యూనిట్ల విక్రయాలతో ఆరో స్థానానికి చేరుకుంది.

టాప్‌లో టాటా పంచ్...
2024 ఫిబ్రవరిలో టాటా మోటార్స్ 18,438 యూనిట్ల పంచ్ మైక్రో ఎస్‌యూవీలను విక్రయించింది. 2023 ఫిబ్రవరిలో 11,169 యూనిట్లు అమ్ముడుపోయాయి. సంవత్సరానికి అమ్మకాలలో 65.08 శాతం వృద్ధిని నమోదు చేసింది. భారతదేశంలో టాటా మోటార్స్ అమ్మకాలు పెరగడానికి పంచ్ ఈవీ ప్రధాన కారణం.

మారుతి బ్రెజ్జా గత నెలలో 15,765 యూనిట్ల అమ్మకాలతో రెండో స్థానంలో ఉంది. 2023 ఫిబ్రవరిలో ఈ కారుకు సంబంధించి 15,787 యూనిట్లు అమ్ముడుపోయాయి. కేవలం 0.14 శాతం స్వల్ప క్షీణతను నమోదు చేసింది. బ్రెజాలో ఎస్‌హెచ్‌వీఎస్ మైల్డ్ హైబ్రిడ్ టెక్నాలజీతో కూడిన 1.5 లీటర్ నేచురల్లీ యాస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్ అమర్చారు. మాన్యువల్, 6 స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లు ఇందులో అందుబాటులో ఉన్నాయి.

హ్యుందాయ్ క్రెటా ఫిబ్రవరి 2024లో 15,276 యూనిట్ల అమ్మకాలతో మూడో స్థానంలో ఉంది. ఇది వార్షిక ప్రాతిపదికన 46.59 శాతం భారీ వృద్ధిని నమోదు చేసింది. 2023 ఫిబ్రవరిలో దీనికి సంబంధించి 10,421 యూనిట్లు అమ్ముడయ్యాయి. స్కార్పియో గత నెలలో 15,051 యూనిట్ల విక్రయాలతో నాలుగో స్థానంలో ఉండగా, వార్షిక ప్రాతిపదికన 116.56 శాతం వృద్ధిని సాధించింది. గత ఏడాది ఇదే నెలలో మహీంద్రా స్కార్పియో 6,950 యూనిట్లు మాత్రమే అమ్ముడయ్యాయి.

వార్షిక విక్రయాల్లో 3.46 శాతం వృద్ధి ఉన్నప్పటికీ, టాటా నెక్సాన్ 2024 ఫిబ్రవరిలో టాప్ 5 సెల్లింగ్ ఎస్‌యూవీల జాబితాలో ఐదో స్థానానికి పడిపోయింది. కంపెనీ గత నెలలో 14,395 టాటా నెక్సాన్  మోడల్స్‌ను విక్రయించింది. 2023 ఫిబ్రవరిలో 13,914 యూనిట్లు అమ్ముడుపోయాయి.

మరోవైపు దేశంలోనే నంబర్ వన్ ప్యాసింజర్ కార్ కంపెనీ మారుతి సుజుకీ మహిళలకు అతిపెద్ద ఆప్షన్‌గా మారింది. ఇప్పటి వరకు తొమ్మిది లక్షలకు పైగా కార్లను మహిళలకు విక్రయించినట్లు మారుతి సుజుకీ అధికారికంగా తెలిపింది. దీనికి సంబంధించి మారుతి సుజుకీ మహిళా దినోత్సవం సందర్భంగా ఒక నివేదికను కూడా విడుదల చేసింది. మహిళలను దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక క్యాంపెయిన్‌ను కూడా ప్రారంభించింది.

Also Read: రూ.8 లక్షల్లోపు ధరలో టాప్-5 కార్లు ఇవే - బడ్జెట్‌లో కార్లు కావాలనుకునేవారికి బెస్ట్ ఆప్షన్ - ఈవీ కూడా!

టాప్ హెడ్ లైన్స్

Honda ADV160 Vs ప్రత్యామ్నాయాలు.. ఏ స్కూటర్ బెటర్‌గా ఉంది? పూర్తి కంపారిజన్
హోండా ADV160 vs హీరో Xoom 160 vs యమహా Aerox 155 - యూత్‌కి తగిన స్కూటర్‌ ఏది?
జులై 31 వరకే ఛాన్స్.. Kawasaki Z900పై అదిరిపోయే ఆఫర్ ప్రకటించిన డీలర్
యువతకు కవాసాకి బంపర్ గిఫ్ట్.. Z900 కొంటే ఇవి కూడా 'ఫ్రీ'గా మీ సొంతం!
Maruti Brezza 2026: మారుతి బ్రెజ్జాలో బడ్జెట్‌ ఫ్రెండ్లీ వేరియంట్‌ ఇదే! - తగ్గిన ధర, పెరిగిన ఫీచర్లు
2026 మారుతి బ్రెజ్జా పూర్తి ధరల జాబితా విడుదల - ఏ వేరియంట్‌ రేటు ఎంతంటే?
Driving Safety Tips: రోడ్డు మీద హీరో కావాలంటే స్పీడ్ కాదు.. సేఫ్టీ ముఖ్యం! ప్రతి డ్రైవర్ తప్పక తెలుసుకోవాల్సిన టిప్స్
బండి స్పీడ్‌లో ఉంది.. కానీ బ్రెయిన్‌ అలర్ట్‌గా ఉందా? ప్రమాదాలను తప్పించే సింపుల్ ట్రిక్స్

వీడియోలు

Ashes Test Match To Be Hosted In India? | ఇండియాలో 'యాషెస్' టెస్ట్ మ్యాచ్?
Serial Actress Preethi Srinivas Real Life Facts | సీరియల్ నటి ప్రీతి శ్రీనివాస్ రియల్ లైఫ్ సీక్రెట్స్
Vaibhav Suryavanshi Creates World Record | 15 ఏళ్ల వయసులో వైభవ్ సూర్యవంశీ వరల్డ్ రికార్డ్
PM Modi Gains 10 Lakh Followers In 12 Hours | పీఎం మోదీ సోషల్ మీడియాలో రికార్డ్
PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Reddy HYDRA Comments: అధికారి నియామకం ప్రభుత్వ విచక్షణాధికారమన్న రేవంత్ - హైకోర్టు ఆదేశాల ప్రకారం రంగనాథ్‌ను తొలగించేందుకు సిద్ధంగా లేరా?
అధికారి నియామకం ప్రభుత్వ విచక్షణాధికారమన్న రేవంత్ - హైకోర్టు ఆదేశాల ప్రకారం రంగనాథ్‌ను తొలగించేందుకు సిద్ధంగా లేరా?
Parvathipuram Manyam Latest News:మన్యం ప్రాంతంలో సిమెంట్‌ రోడ్లకు పగుళ్లు! కాంట్రాక్టర్ బిల్లులు నిలిపేయాలని పవన్ ఆదేశాలు!
మన్యం ప్రాంతంలో సిమెంట్‌ రోడ్లకు పగుళ్లు! కాంట్రాక్టర్ బిల్లులు నిలిపేయాలని పవన్ ఆదేశాలు!
ED Rains In Hyderabad: డ్రగ్స్ కేసులో హైదరాబాద్, బెంగళూరులో ఈడీ ఆకస్మిక దాడులు.. మత్తు లింకులపై ఫోకస్!
డ్రగ్స్ కేసులో హైదరాబాద్, బెంగళూరులో ఈడీ ఆకస్మిక దాడులు.. మత్తు లింకులపై ఫోకస్!
Bonda Uma TDP: అంబటి భేటీ వివాదంపై బోండా ఉమా యూటర్న్ త్రిసభ్య కమిటీకి వివరణ - పార్టీ లైన్ దాటేదే లేదని ప్రకటన
అంబటి భేటీ వివాదంపై బోండా ఉమా యూటర్న్ - త్రిసభ్య కమిటీకి వివరణ - పార్టీ లైన్ దాటేదే లేదని ప్రకటన
BCCI Coaching Sack: టెన్ డోషేట్, దిలీప్ లపై వేటు.. టీమ్ ఇండియా సపోర్ట్ స్టాఫ్ లో కొత్త వాళ్ల కోసం బీసీసీఐ చూపు!
టెన్ డోషేట్, దిలీప్ లపై వేటు.. టీమ్ ఇండియా సపోర్ట్ స్టాఫ్ లో కొత్త వాళ్ల కోసం బీసీసీఐ చూపు!
Healthy Night Routine : మంచి నిద్ర కావాలంటే నైట్ రొటీన్ ఇలా సెట్ చేసుకోండి.. వైద్యులు సూచించే సింపుల్ అలవాట్లు ఇవే
మంచి నిద్ర కావాలంటే నైట్ రొటీన్ ఇలా సెట్ చేసుకోండి.. వైద్యులు సూచించే సింపుల్ అలవాట్లు ఇవే
Uday Krishna Reddy Arrest: పరారీలో ఉన్న ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి అరెస్ట్ - మిర్యాలగూడ వద్ద అదుపులోకి తీసుకున్న పోలీసులు!
పరారీలో ఉన్న ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి అరెస్ట్ - మిర్యాలగూడ వద్ద అదుపులోకి తీసుకున్న పోలీసులు!
PCOS vs Iron Deficiency : PCOS ఉంటే ఐరన్ తగ్గిపోతుందా? రెండింటి మధ్య సంబంధం ఏంటి? గైనకాలజిస్ట్ సూచనలివే
PCOS ఉంటే ఐరన్ తగ్గిపోతుందా? రెండింటి మధ్య సంబంధం ఏంటి? గైనకాలజిస్ట్ సూచనలివే
Embed widget