By: ABP Desam | Updated at : 25 Jun 2023 11:34 PM (IST)
వర్షాకాలంలో కారు డ్రైవింగ్ టిప్స్ ( Image Source : ABP Gallery )
Safety Tips For Rainy Season: వాతావరణం వల్ల జరిగే రోడ్డు ప్రమాదాల్లో సగానికి పైగా వర్షాల వల్లనే అంటే ఏమాత్రం అతిశయోక్తి కాదు. చిన్నపాటి వర్షమైనా, భారీ వర్షమైనా, నెమ్మదిగా లేదా బలమైన గాలులతో కూడిన గాలి వీస్తున్నా, ఇది డ్రైవింగ్ పరంగా రోడ్లను మరింత ప్రమాదకరంగా మారుస్తుంది. దీని వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం కూడా ఎక్కువగా ఉంది.
వీలైతే డ్రైవింగ్ అవాయిడ్ చేయండి
వీలైతే వర్షంలో డ్రైవింగ్ చేయకుండా ఉండటానికి ప్రయత్నించండి. ఇదే మొదటి, అతి ముఖ్యమైన సలహా. తప్పనిసరి పరిస్థితుల్లో డ్రైవింగ్ చేయాల్సి వస్తే ఎక్కువ స్పీడ్‌గా డ్రైవ్ చేయకుండా ప్రత్యేక శ్రద్ధ తీసుకుని మెల్లగా నడపాలి. దీని వల్ల ప్రమాదాలు జరిగే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి.
బయలుదేరే ముందు కారును చెక్ చేసుకోండి
మీరు వర్షంలో డ్రైవింగ్ చేస్తుంటే, డ్రైవింగ్ ప్రారంభించే ముందే వాహనాన్ని పరిశీలించడం చాలా ముఖ్యం. ముఖ్యంగా దాని హెడ్‌లైట్, టెయిల్ లైట్, టర్న్ ఇండికేటర్, బ్రేక్, వైపర్, ఎయిర్ ప్రెజర్ అన్నీ సరిగ్గా పని చేస్తున్నాయా లేదా అనేవి సరిగ్గా చూసుకోవాలి.
హెడ్‌లైట్స్‌ను ఎప్పుడూ ఆన్‌లో ఉంచండి
వర్షాల సమయంలో డ్రైవింగ్ చేస్తున్నప్పుడు మనం ఎదుర్కొనే అతి పెద్ద సమస్య ఎదురుగా వచ్చే వాహనాలు సరిగ్గా కనిపించకపోవడం. కాబట్టి హెడ్‌లైట్లు ఎప్పుడూ ఆన్‌లో ఉంచాలి. చాలా దేశాల్లో వర్షాల సమయంలో హెడ్‌లైట్లు ఆన్ చేసి నడపడం తప్పనిసరి.
డ్రైవింగ్ చేసే సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి
మిగిలిన సమయంలో కంటే వర్షాలు పడేటప్పుడు డ్రైవింగ్ చేయడంపై ఎక్కువ శ్రద్ధ అవసరం. ముఖ్యంగా మీరు ఓవర్‌టేక్ చేసేటప్పుడు లేదా గాలి అతి వేగంతో వీస్తున్నప్పుడు రెండు చేతులతో స్టీరింగ్ వీల్‌ను పట్టుకోండి. తద్వారా వాహనం ఓవర్ టేక్ చేసేటప్పుడు బలమైన గాలుల కారణంగా మీ వాహనం బ్యాలెన్స్ తప్పకుండా ఉంటుంది.
మీ లేన్‌లోనే ఉంచండి
వర్షంలో బ్రేకులు వేసేటప్పుడు వాహనం స్కిడ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందుకే ముందుగా ఉన్న వాహనానికి, మీ వాహనానికి మధ్యలో దూరం పాటించడం మంచిది. అలాగే మీ లేన్‌లో మాత్రమే డ్రైవ్ చేయండి. మీకు ఎదురుగా వాహనం నడుస్తుంటే, దాని కంటే కొంత దూరంలో వెనుక డ్రైవ్ చేయడం మంచిది.
నీటిలో డ్రైవ్ చేయకండి
రోడ్డుపై నిలిచి ఉన్న నీరు కనిపించినప్పుడు, వాటి లోతు మీకు తెలియకపోతే వేరే దారిలో వెళ్లడం మంచిది. అక్కడ ఊహించిన దాని ఎక్కువ లోతు ఉంటే మీ వాహనం డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది.
క్రూయిజ్ కంట్రోల్ ఫీచర్‌ను ఉపయోగించకండి
క్రూయిజ్ కంట్రోల్ అనేది గొప్ప ఫీచర్ అనడంలో సందేహం లేదు. కానీ వర్షాకాలంలో దీనిని ఉపయోగించడం కూడా చాలా ప్రమాదకరం. కాబట్టి వర్షాకాలంలో కారు నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే వాతావరణం కారణంగా జరిగే రోడ్డు ప్రమాదాల్లో ఎక్కువ వర్షాల కారణంగానే జరుగుతూ ఉంటాయి.
Upcoming SUVs in 2024: 2024లో కారు కొనాలనుకుంటున్నారా? - ఈ నాలుగు ఎస్‌యూవీలు ఎంట్రీ ఇస్తున్నాయి - ఒక్కసారి చూడండి!
New Kia Sonet Facelift: మరికొద్ది రోజుల్లో కొత్త కియా సోనెట్ - డిజైన్‌లో భారీ మార్పులు!
Tesla Cybertruck: మోస్ట్ అవైటెడ్ టెస్లా సైబర్ ట్రక్ రేట్ చెప్పిన మస్క్ - అనుకున్నదానికంటే 50 శాతం ఎక్కువగా!
Mahindra Pending Bookings: మహీంద్రా ఎస్‌యూవీలకు పెరుగుతున్న డిమాండ్ - దాదాపు మూడు లక్షల వరకు ఆర్డర్లు పెండింగ్‌లో!
Best Bikes Under Rs 1 lakh: రూ.లక్షలోపు బెస్ట్ బైకులు - బడ్జెట్ ధరలో డబ్బులకు న్యాయం!
Andhra Telangana Dispute : కేంద్రం అధీనంలోకి సాగర్, శ్రీశైలం డ్యాములు - ఏపీ ప్రభుత్వ దూకుడుతో సాధించిందేంటి ?
KCR On Results: హైరానా వద్దు, 3న సంబరాలు చేసుకుందాం- పార్టీ నేతలకు సీఎం కేసీఆర్ భరోసా
Salaar - Ugramm: 'సలార్' ట్రైలర్ విడుదల తర్వాత కొత్త డౌట్స్ - ప్రశాంత్ నీల్ మోసం చేస్తున్నారా?
Chandra Babu Meeting : చంద్రబాబు రాజకీయ సమావేశాలు షురూ- తొలి భేటీలో ఏం చర్చించారంటే!
/body>