Maruti Family Car: సింపుల్‌గా రూ.లక్ష ఉంటే ఎర్టిగా CNG మీ సొంతం, మిగిలిన డబ్బు ఆడుతూపాడుతూ కట్టేయొచ్చు!
Maruti Ertiga CNG On EMI: మారుతి సుజుకి ఎర్టిగా CNG వేరియంట్ కిలోగ్రాముకు దాదాపు 26.11 కి.మీ. మైలేజీని ఇస్తుంది. ఇది 1.5 లీటర్ పెట్రోల్ ఇంజిన్‌తో మార్కెట్‌లో లాంచ్ అయింది.

Maruti Suzuki Ertiga Finance Plan And EMI Details: భారతీయ మార్కెట్‌లో, మారుతి సుజుకి ఎర్టిగా బడ్జెట్-ఫ్రెండ్లీ ఫ్యామిలీ కార్ అని పేరు తెచ్చుకుంది. ఇది 7-సీటర్ MPV. విశాలమైన మూడు వరుసల క్యాబిన్ వల్ల ఒక పెద్ద కుటుంబం మొత్తం ఎలాంటి చింత లేకుండా దీనిలో జర్నీ చేయవచ్చు. ఈ కారు VXi (O) CNG & ZXi (O) CNG వేరియంట్‌లలో దొరుకుతుంది. ఈ కార్ కొనాలని మీరు మనసు పడినప్పటికీ మీ దగ్గర పూర్తి స్థాయిలో డబ్బు లేకపోతే, ఏ మాత్రం బాధ పడాల్సిన అవసరం లేదు. మీరు కేవలం లక్ష రూపాయలతో మారుతి షోరూమ్‌కు వెళ్లండి, ఎర్టిగా CNGని డ్రైవ్ చేస్తూ ఇంటికి తిరిగి వెళ్లండి.
మారుతి సుజుకి ఎర్టిగా ధర
మారుతి సుజుకి ఎర్టిగా CNG ఎక్స్-షోరూమ్ ధర (Maruti Ertiga CNG ex-showroom price) రూ. 11 లక్షలు. మీరు ఈ కారును తెలంగాణ లేదా ఆంధ్రప్రదేశ్‌లో కొనుగోలు చేస్తే... రూ. 1,95,085 రిజిస్ట్రేషన్ ఫీజ్, రూ. 54,524 ఇన్సూరెన్స్, రూ. 11,005 TCS, రూ. 1,500 హైపొథికేషన్ ఛార్జీలు, రూ. 500 ఫాస్టాగ్ కలిపి రూ. 13,63,114 ఆన్-రోడ్ ధర (Maruti Ertiga CNG on-road price) చెల్లించాలి.
డౌన్ పేమెంట్ & EMI లెక్క
మీరు, రూ. 13.63 లక్షల ఆన్-రోడ్ ధరపై రూ. 1 లక్ష డౌన్ పేమెంట్ చేస్తే, మిగిలిన రూ. 12.63 లక్షలను కార్ లోన్‌గా తీసుకోవాలి. బ్యాంక్ మీకు 9 శాతం వార్షిక వడ్డీ రేటుతో లోన్ మంజూరు చేసిందనుకుందాం. మీరు ఐదేళ్లలో (60 నెలలు) లోన్ తిరిగి చెల్లించేలా కాల పరిమితి నిర్ణయించుకుంటే, ప్రతి వాయిదాలో 26,218 రూపాయలు బ్యాంక్‌కు చెల్లించాలి. ఈ విధంగా, ఐదేళ్లలో (60 EMIలు) మొత్తంగా రూ. 3,10,068 వడ్డీ చెల్లించాలి.
EMI మొత్తం తగ్గించాలంటే...
ఇదే లెక్కను ఆరు సంవత్సరాలకు వర్తింపజేస్తే, ప్రతి నెలా రూ. 22,766 EMI కట్టాలి & ఆరేళ్లలో (72 EMIలు)మొత్తం రూ. 3,76,170 వడ్డీ చెల్లించాలి. ఏడు సంవత్సరాల (84 EMIలు) టెన్యూర్ పరిగణలోకి తీసుకుంటే, ప్రతి నెలా రూ. 20,321 EMI బ్యాంక్‌లో జమ చేయాలి & ఏడేళ్లలో మొత్తం వడ్డీ రూ. 4,43,922 అవుతుంది. కాల పరిమితిని పెంచుకుంటే నెలవారీ EMI తగ్గుతుంది. అయితే, రుణ కాల వ్యవధిలో చెల్లించే వడ్డీ మొత్తం పెరుగుతుంది.
మారుతి సుజుకి ఎర్టిగా ఫీచర్లు & మైలేజ్
ARAI సర్టిఫై చేసిన ప్రకారం, ఎర్టిగా CNG వేరియంట్ కిలోకు దాదాపు 26.11 కి.మీ. మైలేజీని (Maruti Ertiga CNG Mileage) ఇస్తుంది. CNG ట్యాంక్ కెపాసిటీ 60 లీటర్లు. ఈ కారులో 1.5 లీటర్ పెట్రోల్ ఇంజిన్ అందించారు. 1462cc పెట్రోల్ ఇంజిన్ నుంచి ఈ 7-సీటర్ కారు శక్తిని పొందుతుంది. ఎర్టిగా ఇంజిన్ గరిష్టంగా 101.64 bhp పవర్‌ను, 136.8 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్‌తో ఫ్రంట్ వీల్ డ్రైవ్ (FWD)తో దూసుకెళ్తుంది. ARAI ప్రకారం, లీటరు పెట్రోల్‌కు 20.51 కి.మీ. మైలేజీని కూడా అందించగలదు. స్పెసిఫికేషన్ల పరంగా.. మారుతి సుజుకి ఎర్టిగా మార్కెట్లోని అత్యుత్తమ MPVలలో ఒకటిగా చెప్పుకుంటున్నారు.





















