(Source: ECI/ABP News/ABP Majha)
Bike Under 1 Lakh: మంచి మైలేజీ బైక్స్ కొనాలని చూస్తున్నారా? కళ్లు మూసుకుని వీటిని కొనేయొచ్చు!
Best Motorcycles: మార్కెట్‌లో రూ. లక్షలోపు మంచి మైలేజీ, హై ఫర్ఫామెన్స్ కలిగిన బైక్స్ అందుబాటులో ఉన్నాయి. అందులో టాప్-5 లో ఉన్న బైక్స్ అవి అందించే ధర, ఫీచర్లు, మైలేజీల వివరాలు ఇక్కడ ఉన్నాయి.
Best Mileage Bikes Under 1 Lakh: ప్రస్తుతం దేశంలోని ప్రతీ ఇంట్లో టూ-వీలర్స్ వినియోగం తప్పనిసరి అయిపోయింది. అయితే మిడిల్ క్లాస్ ఫ్యామిలీలు చాలా వరకు మంచి మైలేజీతో పాటు హై ఫర్ఫామెన్స్‌ని కలిగి ఉండే బైక్స్‌ని కొనుగోలు చేసేందుకే ఎక్కువ ఆసక్తి చూపిస్తారు. మధ్య తరగత కుటుంబాల అవసరాలు తీర్చేలా మార్కెట్‌లో సరసమైన ధరల్లో మోటార్ సైకిళ్లు అందుబాటులో ఉన్నాయి. రోజువారీ ప్రయాణాలకు, ఆఫీస్‌లకు వెళ్లేందుకు, ఇతర పనులకు ఈ బైక్‌లు ఎక్కువగా ఉపయోగపడనున్నాయి.
అయితే మార్కెట్‌లో అందుబాటులో ఉన్న బైక్‌లు, స్కూటర్‌లతో, సరైనదాన్ని ఎంచుకోవడం కాస్త ఆందోళనకు గురిచేయవచ్చు. నేడు కొన్ని టాప్ కంపెనీలు మంచి మైలేజీని, తక్కువ మెయింటైనెన్స్ కలిగిన బైక్స్‌ని అందిస్తున్నాయి. వీటిలో హీరో స్ప్లెండర్ ప్లస్, హీరో హెచ్‌ఎఫ్ డీలక్స్, టీవీఎస్ రేడియన్, బజాజ్ ప్లాటినా 110, హోండా షైన్ 100 ఉన్నాయి. ఈ కథనంలో ఈ మోడళ్లకు సంబంధించిన వివరాలు మీకోసం..
హీరో స్ప్లెండర్ ప్లస్
హీరో స్ప్లెండర్ ప్లస్ (Hero Splendor Plus) 97.2 cc సింగిల్-సిలిండర్ ఎయిర్-కూల్డ్ పెట్రోల్ ఇంజిన్ ద్వారా పనిచేస్తుంది. ఇది గరిష్టంగా 8.02 ps పవర్‌ని, 8.05 nm టార్క్‌ను ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది లీటరుకు 80.6 కిమీల మైలేజీని అందిస్తోంది. బైక్ ధర రూ. 76,356 నుంచి రూ. 77,496 (ఎక్స్-షోరూమ్) వరకు ఉంది. ఒక్క జూన్ 2024 లోనే ఈ 3 లక్షలకు పైగా స్ప్లెండర్ యూనిట్లు అమ్ముడయ్యాయి.
హీరో HF డీలక్స్
Hero HF డీలక్స్ (HF Deluxe) 4-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జత చేసిన 97.2 cc ఎయిర్-కూల్డ్ పెట్రోల్ ఇంజిన్‌ను కలిగి ఉంది. ఇది లీటరుకు 70 కి.మీ మైలేజీని అందిస్తుంది. ఇందులో 9.6 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్ ఉంది. ఈ బైక్ ధర రూ. 62,218 నుంచి రూ. 70,098 (ఎక్స్-షోరూమ్)గా ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో ఈ బైక్‌కి ఎక్కువ ఆదరణ ఉంది.
TVS రేడియన్
TVS రేడియన్ (TVS Radion) 109.7 cc సింగిల్-సిలిండర్ ఎయిర్-కూల్డ్ పెట్రోల్ ఇంజిన్‌తో పనిచేస్తుంది. ఇది గరిష్టంగా 8.08 ps పవర్‌ని, 8.7 nm గరిష్ట టార్క్‌ను ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది 4-స్పీడ్ గేర్‌బాక్స్‌ను కూడా కలిగి ఉంది. ఈ బైక్ లీటరుకు 73.68 కిమీ మైలేజీని అందిస్తుంది. ఈ మోడల్ ధర రూ. 75,293 నుంచి రూ. 83,620 (ఎక్స్-షోరూమ్) వరకు ఉంటుంది.
బజాజ్ ప్లాటినా 110
బజాజ్ ప్లాటినా 110 (Bajaj Platina 110) 115.45 cc సింగిల్-సిలిండర్ ఎయిర్-కూల్డ్ పెట్రోల్ ఇంజిన్‌తో వస్తుంది. ఇది 8.6 ps పవర్ అవుట్‌పుట్, 9.81 nm గరిష్ట టార్క్‌ను ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది 5-స్పీడ్ గేర్‌బాక్స్‌ను కలిగి ఉంది. ఇది లీటరుకు దాదాపు 70 కిమీ మైలేజీని అందిస్తుంది. బైక్ ధర రూ. 70,451 నుంచి రూ. 80,012 (ఎక్స్-షోరూమ్) మధ్య ఉంది.
హోండా షైన్ 100
హోండా షైన్ 100 (Honda Shine 100) 98.98 cc సింగిల్-సిలిండర్ ఎయిర్-కూల్డ్ పెట్రోల్ ఇంజిన్‌తో 4-స్పీడ్ గేర్‌బాక్స్‌తో వస్తుంది. ఇది లీటరుకు సుమారుగా 68 కిలోమీటర్ల మైలేజీని అందిస్తుంది. ఇది అనలాగ్ ఇన్‌స్ట్రూమెంట్ క్లస్టర్, ఎలక్ట్రిక్ స్టార్టర్ వంటి ఫీచర్లను కలిగి ఉంటుంది. ఈ మోడల్ ధర రూ. 66,600 (ఎక్స్-షోరూమ్)గా ఉంది.
మీరు రోజువారీ ఉపయోగం కోసం కొత్త మోటార్‌సైకిల్‌ను కొనుగోలు చేయాలని ఆలోచిస్తున్నట్లయితే ఈ బైక్స్ మీకు సరైన ఆప్షన్స్ అని చెప్పవచ్చు. ఈ ఐదు బైక్‌లు ఢిఫరెంట్ ఫీచర్లను కలిగి ఉన్నాయి. అయితే వీటి ధరలన్నీ లక్ష రూపాయల లోపు ధరతో మధ్యతరగతి కుటుంబాలకు అందుబాటులో ఉంటాయి. కాబట్టి వీటిని నిరభ్యంతరంగా కొనుగోలు చేయవచ్చు. మార్కెట్‌లో ఇతర బైక్స్ కూడా ఉన్నాయి. ప్రస్తుతం సేల్స్ ఇతర అంశాలను పరిగణలోకి తీసుకుని ఈ జాబితాను మీకు అందించాం గమనించగలరు.
ALso Read: లంబోర్ఘిని ఉరుస్ SE లాంచ్, ధర అక్షరాల రూ.4.57 కోట్లు! పైసలకు తగినట్లు ఫీచర్లు