Best Budget Cars Under 6 Lakhs: రూ.ఆరు లక్షల్లో బెస్ట్ బడ్జెట్ కారు కావాలనుకుంటున్నారా? - అయితే ఈ ఆప్షన్లపై ఓ లుక్కేయండి!
Best Cars Under 6 Lakhs in India: ప్రస్తుతం మనదేశంలో రూ.6 లక్షల ధర రేంజ్‌లో చాలా కార్లు అందుబాటులో ఉన్నాయి. వాటిలో బెస్ట్ ఏవో చూద్దాం.
Best Cars Under Rs 6 Lakh: భారతీయులకు బడ్జెట్ కార్లంటే చాలా ఇష్టం. కార్ల తయారీ కంపెనీలు కూడా బడ్జెట్ కార్లకు ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తున్నాయి. వాటికి మరిన్ని ఫీచర్లను యాడ్ చేస్తున్నాయి. బడ్జెట్ కార్లలో స్పేస్‌ను పెంచుతూ ఫ్యామిలీలకు సరిపోయేలా చూసుకోవడంతో పాటు, రోజువారీ పనుల కోసం పవర్‌ఫుల్‌గా ఉండేలా కూడా చూస్తున్నాయి. ప్రస్తుతం మనదేశంలో రూ.ఆరు లక్షల్లోపు ధరలో అందుబాటులో ఉన్న టాప్ - 5 బడ్జెట్ కార్లపై ఓ లుక్కేద్దాం...
టాటా పంచ్ (Tata Punch)
ప్రస్తుతం మనదేశంలోనే మోస్ట్ పాపులర్ కార్లలో టాటా పంచ్ ఒకటి. మంచి గ్రౌండ్ క్లియరెన్స్ కారణంగా భారతీయ రోడ్లపై ఒక ప్రాక్టికల్ వాహనంగా దీన్ని చెప్పవచ్చు. టాటా పంచ్‌లో 1.2 లీటర్ నేచురల్లీ యాస్పిరేటెడ్ ఇంజిన్ అందించారు. 5 స్పీడ్ మాన్యువల్, ఆటోమేటిక్ వేరియంట్లలో దీన్ని కొనుగోలు చేయవచ్చు. దీని ధర రూ.5.99 లక్షల (ఎక్స్-షోరూం) నుంచి ప్రారంభం కానుంది. ఈ కారులో అన్ని లేటెస్ట్ ఫీచర్లూ అందుబాటులో ఉన్నాయి. అలాగే గ్లోబల్ ఎన్‌సీఏపీ టెస్టులో కూడా మంచి స్కోరు సాధించింది. టాటా పంచ్‌లో సీఎన్‌జీ ఆప్షన్ కూడా అందించారు. ఈ మోడల్ ఇటీవలే మార్కెట్లో లాంచ్ అయింది.
మారుతి సుజుకి వ్యాగన్ఆర్ (Maruti Suzuki WagonR)
మారుతి సుజుకి వ్యాగన్ఆర్ కూడా మనదేశంలో ఎక్కువగా అమ్ముడుపోతూ ఉంటుంది. దీని డిజైన్‌ను ఇష్టపడే వారు కొందరు ఉన్నారు. 1.0 లీటర్ నేచురల్లీ యాస్పిరేటెడ్ పెట్రోల్, 1.2 లీటర్ నేచురల్లీ యాస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ వేరియంట్లలో దీన్ని కొనుగోలు చేయవచ్చు. టాప్ ఎండ్ వేరియంట్లలో 5 స్పీడ్ మాన్యువల్ లేదా ఏఎంటీ ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. దీని ధర మనదేశంలో రూ.5.55 లక్షల నుంచి (ఎక్స్-షోరూం) ప్రారంభం కానుంది. ఇందులో కూడా సీఎన్‌జీ వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి.
టాటా టియాగో (Tata Tiago)
టాటా టియాగో మనదేశంలో అందుబాటులో ఉన్న బడ్జెట్ కార్లలో మంచి ఆప్షన్. ఇందులో మంచి ఫీచర్లు ఉన్నాయి. సేఫ్టీ స్కోరు కూడా బాగానే ఉంటుంది. 1.2 లీటర్ నేచురల్లీ యాస్పిరేటెడ్ ఇంజిన్‌ను ఈ కారులో కంపెనీ అందించింది. 5 స్పీడ్ మాన్యువల్ లేదా ఏఎంటీ వేరియంట్లలో దీన్ని కొనుగోలు చేయవచ్చు. దీని ధర రూ.5.59 లక్షల నుంచి ప్రారంభం కానుంది. ఇది ఎక్స్ షోరూం ధర. టాటా డ్యూయల్ ట్యాంక్ టెక్నాలజీ ద్వారా ఇందులో సీఎన్‌జీ వేరియంట్ కూడా అందుబాటులో ఉంది. ఇతర కంపెనీల సీఎన్‌జీ మోడల్స్‌లో వెనకవైపు స్పేస్ అస్సలు ఉండదన్న సంగతి గుర్తుంచుకోవాలి.
హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్ (Hyundai Grand i10 NIOS)
ఇది ఒక అద్భుతమైన సిటీ కారు. ఈ కారులో ఆరు ఎయిర్ బ్యాగ్స్ కూడా అందుబాటులో ఉండనున్నాయి. కారు కూడా చాలా కంఫర్టబుల్‌గా ఉంటుంది. 1.2 లీటర్ నేచురల్లీ యాస్పిరేటెడ్ ఇంజిన్‌తో ఈ కారును కొనుగోలు చేయవచ్చు. దీని ధర రూ.5.84 లక్షల (ఎక్స్ షోరూం) నుంచి ప్రారంభం కానుంది. ఈ కారులో సీఎన్‌జీ ఆప్షన్ కూడా అందుబాటులో ఉండనుంది.
హ్యుందాయ్ ఎక్స్‌టర్ (Hyundai Exter)
ఈ కారు ధర రూ.ఆరు లక్షల కంటే కాస్త ఎక్కువగా ఉంది. దీని ధర రూ.6.12 లక్షల నుంచి స్టార్ట్ అవుతుంది. ఇది ఎక్స్ షోరూం ధరనే. హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్ ఆధారంగానే దీన్ని రూపొందించారు. టాటా పంచ్‌కు ఇది మంచి పోటీదారు. ఈ కారు చాలా స్మూత్‌గా కూడా ఉంటుంది. 5 స్పీడ్ మాన్యువల్ లేదా ఆటోమేటిక్ మోడల్స్‌లో దీన్ని కొనుగోలు చేయవచ్చు. సన్‌రూఫ్, డ్యాష్ కామ్, యాంబియంట్ లైటింగ్ వంటి లేటెస్ట్ ఫీచర్లు ఇందులో ఉన్నాయి. ఈ కారులో కూడా సీఎన్‌జీ ఆప్షన్ అందుబాటులో ఉంది.