అన్వేషించండి

Bajaj First CNG Bike: బ‌జాజ్ నుంచి ఫస్ట్ CNG బైక్ - మతిపోగొట్టే మైలేజ్, అందుబాటు ధరలో అదిరిపోయే ఆప్షన్స్, లాంచింగ్ ఎప్పుడంటే?

Bajaj First CNG Bike: బ‌జాజ్ ఆటో రంగంలో రికార్డు సృష్టించ‌బోతోంది. సీఎన్ జీ బైక్ ను లాంచ్ చేయ‌బోతుంది. జులై 17న బైక్ ను లాంచ్ చేయ‌నున్న‌ట్లు స‌మాచారం. లాంచింగ్ కి ముందే బైక్ ఫోటోలు లీక్ అయ్యాయి .

Bajaj First CNG Bike To Launch on July 17.. Photos Leaked : బ‌జాజ్ ఆటో ప్ర‌పంచంలోనే మొట్ట‌మొద‌టి సారిగా CNG బైక్ లాంచ్ చేయ‌నుంది. జూన్ నాటికి బైక్ ని మార్కెట్ లోకి తీసుకొస్తామ‌ని ప్ర‌క‌టించిన‌ప్ప‌టికీ లాంచింగ్ పోస్ట్ పోన్ అయ్యింది. జులై 17న మార్కెట్ లోకి రిలీజ్ చేస్తున్న‌ట్లు తెలుస్తోంది. అయితే, ఈ బైక్ కి సంబంధించి కొన్ని ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. టెస్ట్ డ్రైవ్ చేస్తుండ‌గా దీనికి సంబంధించి ఫొటోలు బ‌య‌టికి వ‌చ్చాయి. ఇప్ప‌టికే త్రీ వీల‌ర్స్, ఫోర్ వీల‌ర్స్ CNG బండ్లు మార్కెట్ లో ఉన్న‌ప్ప‌టికీ టూ వీల‌ర్ రావ‌డం ఇదే మొద‌టిసారి.

మోడ‌ల్ ఎలా ఉండంటే? 

లీకైన ఫొటోల్లో బండి చాలా అంటే చాలా స్టైలిష్ గా క‌నిపించింది. డీసెంట్ గా ఉంది. బండి మొత్తం క‌వ‌ర్ల‌తో క‌ప్పి ఉంది. కొన్ని డిజైన్లు మాత్ర‌మే బ‌య‌టికి క‌నిపిస్తున్నాయి. ఫుల్ ఎల్ ఈడీ హెడ్ లైట్స్ తో మార్కెట్ లోకి రానుంది బ‌జాజ్ CNG బండి. ఇక ఈ బండిలో కేవ‌లం CNG మాత్ర‌మే కాదు పెట్రోల్ ఆప్ష‌న్ కూడా ఉంటుంది. CNG ట్యాంక్ ని కూడా స్లోప‌ర్ ఇంజిన్ డిజైన్ తో ఏర్పాటు చేశార‌ట‌. దాంతో బండి బాగా స్పేయిష్ గా అనిపిస్తుంది. ఈ CNG బైక్ 125 సీసీ క‌మ్యూట‌ర్ ఇంజిన్ తో వ‌స్తోంది. ఐదు స్పీడ్ గేర్ బాక్సులు ఉన్నాయి. 

CNG ట్యాంక్ వాల్వ్‌ను యాక్సెస్ చేసేందుకు ఫ్యూయ‌ల్ ట్యాంక్ లో పెద్ద ప్యానెల్ ని అమ‌ర్చారు. అది లీడ్ లాగా తెరుచుకుంటుది. ఈ బైక్ లో పెట్రోల్ ట్యాంక్ కూడా ఉంటుంది.  గ్యాస్ అయిపోయిన‌ప్పుడు.. పెట్రోల్‌తో బండిని న‌డ‌పొచ్చు. ఎడ‌మ వైపు స్విచ్ గేర్ కి బ్లూ స్విచ్ ఇచ్చారు. అది నొక్కితే ఫ్యూయ‌ల్ మోడ్ లోకి వెళ్లిపోతుంది. ఇక మైలేజీ విషయానికి వస్తే.. పెట్రోల్‌ బండి కంటే డబుల్ ఉంటుందట. పెట్రోల్ బండికి అయ్యే ఖర్చుతో పోల్చితే.. దీనికి సగమే ఖర్చవుతుందని బ‌జాజ్ ఆటో సీఈవో రాజీవ్ బ‌జాజ్ ఇటీవల వెల్లడించారు.

ఇక ఈ బైక్ కి బ‌జాజ్ బ్రూజ‌ర్ అనే పేరు పెట్టారు. ఈ బైక్ లో టెయిల్ పైప్ ఎమిష‌న్స్ ను త‌గ్గించారు. అంతేకాకుండా కార్బ‌న్ డ‌యాక్సైడ్ వెలువ‌డటం కూడా 50 శాతం త‌గ్గుతుంద‌ట. బజాజ్ సీఎన్‌జీ మోడల్ లో రెండో స్టోరేజ్ సిలిండర్ కూడా ఉంటుంది. దీని రేట్ మామూలు బండి కంటే.. ఎక్కువ ఉండే అవ‌కాశం ఉన్న‌ట్లు తెలుస్తోంది. దాదాపు రూ.80,000 (ex-showroom) ఉంటుంద‌ని అంచ‌నా వేస్తున్నారు.

ప్ర‌స్తుతం పెట్రోల్ రేట్లు ఆకాశాన్ని అంటుతున్నాయి. అంతేకాకుండా ఆ బండ్ల వ‌ల్ల పొల్యూష‌న్ కూడా ఎక్కువ అవుతున్న త‌రుణంలో అంద‌రూ ఎల‌క్ట్రిక్ బండ్లపై ఆధార‌ప‌డుతున్నారు. ఇప్ప‌టికే మార్కెట్ లో ఎల‌క్ట్రిక్ బండ్లు చాలా వ‌చ్చాయి. CNG కార్లు, ఆటోలు ఉండ‌గా.. బండ్లు రావ‌డం ఇదే మొద‌టిసారి. దీంతో ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా? అని వెయిట్ చేస్తున్నారు చాలామంది. 

Also Read: టాటా నెక్సాన్ ఈవీ.. సేఫ్టీలో సూప‌ర్ - భార‌త్ NCAP ఎంత రేటింగ్ ఇచ్చిందంటే?

టాప్ హెడ్ లైన్స్

సీరియస్‌ రైడర్లకు బెస్ట్ బడ్జెట్ ఆప్షన్‌! రైడా రోవర్ రైడింగ్ ప్యాంట్స్ పూర్తి రివ్యూ
రైడా రోవర్ రైడింగ్ ప్యాంట్స్ - డైలీ జర్నీ, లాంగ్‌ టూరింగ్‌ కోసం ప్రత్యేకంగా డిజైనింగ్‌, ధర ఎంతంటే?
రెనాల్ట్ డస్టర్ 1.0 Vs 1.3 టర్బో పెట్రోల్ - పవర్‌ ఎంత, టార్క్‌ ఎంత, మైలేజ్‌లో ఏది బెస్ట్?
పవర్ ఎక్కువైతే మైలేజ్ తగ్గుతుందా? రెనాల్ట్ డస్టర్ 1.0 - 1.3 రియల్‌ వరల్డ్‌ మైలేజ్‌ టెస్ట్‌ ఫలితాలు ఇవే!
E20తో మైలేజ్‌ 5 శాతం వరకు తగ్గొచ్చని ఒప్పుకున్న కేంద్రం, కానీ ప్రయోజనాలే ఎక్కువని స్పష్టీకరణ
E20తో మైలేజ్ 5 శాతం వరకు తగ్గొచ్చు - అంగీకరించిన కేంద్రం, కానీ..!
Nissan Tekton: నిస్సాన్ టెక్టన్ కొనడానికి మీరు ఎంత డౌన్ పేమెంట్ చెల్లించాలి? EMI ఎంత ఉంటుంది?
నిస్సాన్ టెక్టన్ కొనడానికి మీరు ఎంత డౌన్ పేమెంట్ చెల్లించాలి? EMI ఎంత ఉంటుంది?

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan Surgery: పవన్‌ కుడి భుజానికి చికిత్స పూర్తి- మూడున్నర గంటలపాటు సర్జరీ!
పవన్‌ కుడి భుజానికి చికిత్స పూర్తి- మూడున్నర గంటలపాటు సర్జరీ!
Rotator Cuff Injury: రొటేటర్ కఫ్ ఇంజ్యూరీస్ ఎలా అవుతాయి? సమస్య రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటీ?
రొటేటర్ కఫ్ ఇంజ్యూరీస్ ఎలా అవుతాయి? సమస్య రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటీ?
Malla Reddy Skips KTR Meeting:కేటీఆర్ అత్యవసర భేటీకి మల్లారెడ్డి డుమ్మా! గులాబీ గూటికి గుడ్‌బై చెప్పి కమలం వైపు అడుగులు?
కేటీఆర్ అత్యవసర భేటీకి మల్లారెడ్డి డుమ్మా! గులాబీ గూటికి గుడ్‌బై చెప్పి కమలం వైపు అడుగులు?
Ramayana Trailer : విజువల్ వండర్ రామాయణ ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్ - రూమర్స్‌కు చెక్
విజువల్ వండర్ రామాయణ ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్ - రూమర్స్‌కు చెక్
Leopard In Tirumala: తిరుమలకు వెళ్లే అలిపిరి నడక మార్గంలో చిరుత- భక్తుల్లో భయాందోళన
తిరుమలకు వెళ్లే అలిపిరి నడక మార్గంలో చిరుత- భక్తుల్లో భయాందోళన
HYDRAA Inaction On Owaisi Encroachments: ఓవైసీ కాలేజీలకు ప్రభుత్వం క్లీన్ చిట్ - చెరువులోనే లేదని క్లారిటీ - మజ్లిస్ కోసం రూల్స్ మార్చేశారా?
ఓవైసీ కాలేజీలకు ప్రభుత్వం క్లీన్ చిట్ - చెరువులోనే లేదని క్లారిటీ - మజ్లిస్ కోసం రూల్స్ మార్చేశారా?
Telangana Political Mind Games: విపక్షాలపై రేవంత్ మార్క్ మైండ్ గేమ్ - ప్రశాంతంగా పాలన చేసుకోనివ్వాల్సిందేనా ?
విపక్షాలపై రేవంత్ మార్క్ మైండ్ గేమ్ - ప్రశాంతంగా పాలన చేసుకోనివ్వాల్సిందేనా ?
Thamizh Murugan Vs God of War: ధనుష్ 'తమిళ్ మురుగన్'... ఎన్టీఆర్ - త్రివిక్రమ్ సినిమాకు కౌంటరా?
ధనుష్ 'తమిళ్ మురుగన్'... ఎన్టీఆర్ - త్రివిక్రమ్ సినిమాకు కౌంటరా?
Embed widget