అన్వేషించండి

Best Electric Scooters Under 50000: సామాన్యుడికి అందుబాటులో 50 వేల రూపాయల్లో లభించే ఎలక్ట్రిక్ స్కూటర్లు! రేంజ్‌, ఫీచర్స్‌లో సూపర్‌!

Best Electric Scooters: చమురు సంక్షోభం దేశాన్నే కాదు ప్రపంచాన్ని పట్టి పీడిస్తోంది. అందుకే భారత్‌ ఈవీలను ప్రోత్సహిస్తోంది. ఈ సందర్భంగా 50 వేల ధరతో లభించే ఎలక్ట్రిక్ వెహికల్స్ గురించి చూద్దాం. 

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • తక్కువ ధరలో లభించే ఎలక్ట్రిక్ స్కూటర్లు అందుబాటులోకి వచ్చాయి.
  • 15 వేల నుంచి 30 వేల మధ్య గ్రీన్ ఈవీ వంటివి లభిస్తున్నాయి.
  • 30-50 వేల మధ్య యాకుజా, కోమకి మోడల్స్ మంచి రేంజ్ ఇస్తున్నాయి.
  • బడ్జెట్ స్కూటర్లలో బ్యాటరీ రకం, రేంజ్ కీలక పాత్ర పోషిస్తాయి.

Best Electric Scooters Under 50000: చమురు సంక్షోభం వెంటాడుతున్న వేళ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కీలక ప్రకటన చేశారు. ప్రజలు ఈవీలను, పబ్లిక్ ట్రాన్స్‌ఫోర్ట్‌ను ఎక్కువ ఉపయోగించుకోవాలని సూచించారు. అయితే పబ్లిక్ ట్రాన్స్‌ఫోర్ట్‌లో ట్రావెల్ చేసేందుకు ఇష్టం లేని వాళ్లు తక్కువలో కొనగలిగే ఎలక్ట్రిక్ వెహికల్స్ గురించి సెర్చ్ చేస్తున్నారు. అలాంటి వారి కోసం 50 వేల రూపాయల కంటే తక్కువ ధరకు మార్కెట్‌లో అందుబాటులో ఉన్న ఈవీలను పరిశీలిద్దాం. 

ఒకప్పుడు ఈవీలు అంటే లక్షల రూపాయలు పెట్టాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు టెక్నాలజీ పెరగడంతోపాటు అందుబాటు ధరల్లోనే ఈవీలను అమ్మకానికి ఉంచుతున్నారు. ముఖ్యంగా నగరాల్లో తక్కువ దూరాలు ప్రయాణించేందుకు, విద్యార్థులు, వృద్ధుల అవసరాల కోసం రూపొందించిన లో స్పీడ్‌ ఎలక్ట్రిక్ స్కూటర్లకు ఆదరణ పెరుగుతోంది. ప్రస్తుతం భారత మార్కెట్‌లో20 వేల నుంచి ఈ స్కూటర్లు అమ్మకానికి ఉన్నాయి. 

30 వేల రూపాయల బడ్జెట్ విభాగంలో గ్రీన్ ఈవీ వంటి కంపెనీలు తక్కువ ధరకే వాహనాలను అందిస్తున్నాయి. ఇవి ప్రాథమిక అవసరాలు ఎంతో అనువైనవి. 

గ్రీన్ ఉడాన్ 

ఈ వెహికల్ ప్రారంభ ధర 27, 362. ఇందులో రెండు రకాలు ఉన్నాయి. 30 కిలోమీటర్ల రేంజ్ ఇచ్చే మోడల్, 60 కిలోమీటర్ల రేంజ్ ఇచ్చే మోడల్‌ అందుబాటులో ఉన్నాయి. ఈ వాహనంలో 250 వాట్ల మోటార్ అమర్చి ఉంటుంది. బ్యాటరీ పూర్తి కావడానికి నాలుగు నుంచి ఆరు గంటల సమయం పడుతుంది. 

గ్రీన్ సన్నీ

దీని ధర సుమారు 29 , 438. ఒకసారి ఛార్జ్ చేస్తే 40 కిలోమీటర్ల దూరం ప్రయాణించగలదు. గమనించ దగ్గ విషయం ఏంటంటే, ఈ విభాగంలోని వాహనాల గరిష్ట వేగం 30 కిలోమీటర్ల లోపు మాత్రమే ఉంటుంది. 

30 వేల నుంచి 50 వేల మధ్య లభించే ఈ స్కూటర్లు 

ఈ విభాగంలో పోటీ చాలా ఎక్కువగా ఉంది. సుమారు 21 మోడల్స్ మార్కెట్‌లో అందుబాటులో ఉన్నాయి. 

యాకుజా ఎలక్ట్రిక్ 

ఈ కంపెనీ అనేక మోడల్స్‌ను అందిస్తోంది. యాకుజా రూబీ మోడల్ 38, 318 నుంచి ప్రారంభమవుతుంది. ఒక ఛార్జ్ చేస్తే 55 కిలోమీటర్‌ రేంజ్ ఇస్తుంది. ఇందులో 48V, 60V, 72V వంటి వివిధ బ్యాటరీ వేరియంట్లు ఉన్నాయి. యాకూజా న్యూ ధర 40, 025 నుంచి ప్రారంమవుతుంది. ఇది 55 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుంది. యాకుజా విరాజ్, అంబర్ మోడల్స్ కూడా మార్కెట్‌లో ఉన్నాయి. ఇందులో విరాజ్ మోడల్ ధర 41, 509 కాగా, అంబర్‌ మోడల్ ధర 46, 676 నుంచి ప్రారంభమవుతుంది.  

కోమకి 

నమ్మకమైన బ్రాండ్‌గా ఎదిగిన కోమకి తక్కువ ధరల్లోనే మంచి రేంజ్ ఇస్తోంది. కోమకి ఎక్స్‌వన్ ధర 38,032. గ్రాఫిన్ బ్యాటరీతో వచ్చే ఈ స్కూటర్‌ 60కిలోమీటర్ రేంజ్ ఇస్తుంది. ఇందులో 70 కిలోమీటర్ల రేంజ్ ఇచ్చే లిథియం అయాన్ మోడల్ కూడా 46, 162 రూపాయలకు లభిస్తుంది. కోమకి ఎక్స్ జీటీ కేఎం 43, 876 రూపాయలకు లభించే స్కూటర్ ఏకంగా వంద కిలోమీటర్ల రేంజ్ ఇస్తుంది. 

భారీ రేంజ్ ఇచ్చే స్కూటర్లు

43, 114 రూపాయల ధరకు లభించే వారివో నియో 120 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుందని కంపెనీ పేర్కొంది. జెలో జూప్‌ 49, 110 రూపాయలకు కొనుగోలు చేయవచ్చు. ఈ మోడల్‌ బ్యాటరీ రకాన్ని బట్టి 65 నుంచి 140 కిలోమీటర్ల వరకు రేంజ్ ఇవ్వగలదు. 

బడ్జెట్‌ ఈవీలలో బ్యాటరీ చాలా ముఖ్యం. ప్రస్తుతం మార్కెట్‌లో మూడు రకాల బ్యాటరీలు అందుబాటులో ఉన్నాయి. లెడ్ యాసిడ్‌ బ్యాటరీలు చాలా చౌకగా ఉంటాయి. కానీ బరువు ఎక్కువ. టన్వాల్ మినీ లిథినో వంటి మోడళ్లు వీటిని వాడుతున్నాయి. 

లిథియం అయాన్ తేలికగా ఉంటుంది. ఎక్కువ కాలం మన్నుతాయి. కోమకి ఎక్స్‌ వన్‌లో వీటిని చూడవచ్చు. గ్రాఫిన్ బ్యాటరీ జెలో జూప్ , కోమకి వంటి మోడల్స్‌లో చూడవచ్చు. ఇవి వేగంగా ఛార్జ్ అవుతాయి. 

భారత ప్రభుత్వం ఫే్ పథకం ద్వారా ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహిస్తోంది. బ్యాటరీ టెక్నాలజీ మెరుగుపడటంతో తయారీ వ్యయం తగ్గి సామాన్యులకు ఇవి అందుబాటులోకి వస్తున్నాయి. 50 వేల లోపు ధరలో ఎలక్ట్రిక్ స్కూటర్లు ఇప్పుడు ఒక ఆచరణాత్మకమైన ఎంపికగా మారాయి. తక్కువ వేగం ఉన్నప్పటికీ, నగర జీవితంలో ఇవి సౌలభ్యం, ఆర్థిక పొదుపు సాటిలేనిది. 

మరిన్ని ఆసక్తికరమైన వార్తల కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి

Frequently Asked Questions

50 వేల రూపాయల లోపు లభించే ఎలక్ట్రిక్ స్కూటర్ల ధరలు ఎంత?

50 వేల రూపాయల లోపు ఎలక్ట్రిక్ స్కూటర్లు 15 వేల రూపాయల నుండి మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. 15 వేల నుండి 30 వేల వరకు, 30 వేల నుండి 50 వేల వరకు వివిధ మోడళ్లు లభిస్తాయి.

గ్రీన్ ఉడాన్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఎంత రేంజ్ ఇస్తుంది?

గ్రీన్ ఉడాన్ ఎలక్ట్రిక్ స్కూటర్ రెండు మోడళ్లలో అందుబాటులో ఉంది. ఒక మోడల్ 30 కిలోమీటర్ల రేంజ్ ఇస్తే, మరొకటి 60 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుంది.

కోమకి ఎక్స్ జీటీ కేఎం స్కూటర్ ఎంత రేంజ్ ఇస్తుంది?

కోమకి ఎక్స్ జీటీ కేఎం స్కూటర్ 43,876 రూపాయలకు లభిస్తుంది మరియు ఇది వంద కిలోమీటర్ల వరకు రేంజ్ అందిస్తుంది.

జెలో జూప్ స్కూటర్ ఎంత రేంజ్ వరకు ఇవ్వగలదు?

జెలో జూప్ స్కూటర్ 49,110 రూపాయలకు లభిస్తుంది. ఇది బ్యాటరీ రకాన్ని బట్టి 65 నుండి 140 కిలోమీటర్ల వరకు రేంజ్ ఇవ్వగలదు.

టాప్ హెడ్ లైన్స్

మీ దగ్గర 1.82 లక్షలు ఉంటే చాలు, టాటా పంచ్ EV ని కొనేయొచ్చు! వడ్డీ రేట్లు, EMI పూర్తి లెక్కలు ఇవిగో!
కొత్త Tata Punch EV కొనడానికి లోన్‌ ఎంత ఇస్తారు? తక్కువ EMI కోసం ఎన్నేళ్ల టెన్యూర్‌ ఎంచుకోవాలి?
2026 Tata Punch EV: 468km రేంజ్ అని కంపెనీ చెప్పింది.. కానీ రియల్ వరల్డ్‌లో ఎంతదూరం వెళ్లిందంటే?
ఫుల్‌ ఛార్జ్‌తో టాటా పంచ్ EV నిజంగా ఎంతదూరం ప్రయాణిస్తుందో తెలుసా? అసలైన రేంజ్ ఇదే!
రూ.1.10 లక్షల ధరతో సింపుల్‌ వేవ్‌ ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ లాంచ్‌.. సింగిల్‌ ఛార్జ్‌తో 243km తిరిగిరావచ్చు!
బజాజ్ చేతక్, టీవీఎస్ ఐక్యూబ్‌కు పోటీగా కొత్త 'సింపుల్‌ వేవ్‌'.. రూ.1.10 లక్షలకే 243km రేంజ్!
బ్యాంక్‌ ఇచ్చే లోన్‌ను బట్టి కాదు.. మీ ఆదాయానికి తగ్గట్లు ఎంత విలువైన కారు కొనాలో ఇలా లెక్కించండి!
మీ జీతానికి మీరు ఎంత ఖరీదైన కారు కొనవచ్చు?, సింపుల్‌గా ఇలా లెక్కించండి!

వీడియోలు

Gundenininda Gudigantalu Serial September 3 | సంజూ రాజకీయాన్ని దెబ్బకొట్టిన మీనా
Asian Games Accommodation Issue | ఏషియన్ గేమ్స్‌ వివాదంపై జపాన్ క్రికెట్ కామెంట్స్
Vaibhav Creates History In Duleep Trophy | దులీప్ ట్రోఫీలో వైభవ్ సూర్యవంశీ ఆల్ టైమ్ రికార్డ్
IND vs AFG T20s | అఫ్గాన్‌ సిరీస్‌ పై కృనాల్ పాండ్యా పోస్ట్ వైరల్
Gundenininda Gudigantalu Serial August 31 | రోహిణి మోసాలపై బాలు ఫైర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Konda Surekha: నన్ను తొలగించడం కుట్రే.. కాంగ్రెస్‌లోనే ఉంటా - కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు!
నన్ను తొలగించడం కుట్రే.. కాంగ్రెస్‌లోనే ఉంటా - కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు!
Konda Surekha Out: మంత్రివర్గం నుంచి కొండా సురేఖ బర్తరఫ్ - రాజీనామాకు నిరాకరించడంతో రేవంత్ సంచలన నిర్ణయం
మంత్రివర్గం నుంచి కొండా సురేఖ బర్తరఫ్ - రాజీనామాకు నిరాకరించడంతో రేవంత్ సంచలన నిర్ణయం
AP IPS Officers Suspension Lifted: ఐపీఎస్‌లు కాంతి రాణా, విశాల్ గున్నీలకు రిలీఫ్ - రెండేళ్ల తర్వాత సస్పెన్షన్ ఎత్తివేత - త్వరలో పోస్టింగులు !
ఐపీఎస్‌లు కాంతి రాణా, విశాల్ గున్నీలకు రిలీఫ్ - రెండేళ్ల తర్వాత సస్పెన్షన్ ఎత్తివేత - త్వరలో పోస్టింగులు !
Abhinandan Varthaman: ఎయిర్‌ఫోర్స్ నుంచి అభినందన్ వర్థమాన్ రిటైర్ - ప్రైవేటు విమానయాన సంస్థలో కీలక బాధ్యతలు
ఎయిర్‌ఫోర్స్ నుంచి అభినందన్ వర్థమాన్ రిటైర్ - ప్రైవేటు విమానయాన సంస్థలో కీలక బాధ్యతలు
YS Jagan: సాగునీటి ప్రాజెక్టులపై సీఎం చంద్రబాబు డ్రామాలు.. ముందు పోలవరం ఎత్తు తేల్చండి? - వైఎస్ జగన్
సాగునీటి ప్రాజెక్టులపై సీఎం చంద్రబాబు డ్రామాలు.. ముందు పోలవరం ఎత్తు తేల్చండి? - వైఎస్ జగన్
Son Kills Father Chittoor: తల్లి మందిలిస్తే తండ్రి నవ్వాడట - గొంతు కోసి చంపేసిన కొడుకు - సైకో అంటే వీడే !
తల్లి మందిలిస్తే తండ్రి నవ్వాడట - గొంతు కోసి చంపేసిన కొడుకు - సైకో అంటే వీడే !
Kadiri BJP Flexies Torn:కదిరిలో పొత్తు చిచ్చు - బీజేపీ ఫ్లెక్సీల చించివేత.. ఎమ్మెల్యే కందికుంట వర్గీయులపై అనుమానాలు!
కదిరిలో పొత్తు చిచ్చు - బీజేపీ ఫ్లెక్సీల చించివేత.. ఎమ్మెల్యే కందికుంట వర్గీయులపై అనుమానాలు!
Pawan Kalyan: మన కోసం కుటుంబం ఉందని గుర్తుంచుకోండి... అభిమాని మృతిపై పవన్ స్పందన
మన కోసం కుటుంబం ఉందని గుర్తుంచుకోండి... అభిమాని మృతిపై పవన్ స్పందన
Embed widget