Year Ender 2023: 2023లో లాంచ్ అయిన చవకైన ఎలక్ట్రిక్ కార్లు ఇవే - ఏది బెస్ట్ అంటారు?
Affordable Electric Cars in 2023: 2023లో మనదేశంలో లాంచ్ అయిన అత్యంత చవకైన ఎలక్ట్రిక్ కార్లు ఇవే.
Cheapest Electric Cars in 2023: ప్రపంచంలోనే కాకుండా భారతదేశంలో కూడా ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్ వేగంగా పెరుగుతోంది. ప్రస్తుతం దేశంలో చాలా ఎలక్ట్రిక్ కార్లు అందుబాటులో ఉన్నాయి, అయితే వాటి ధర పెట్రోల్, డీజిల్ కార్ల కంటే ఎక్కువగా ఉంది. 2023లో కాస్త తక్కువ ధరతో భారతీయ మార్కెట్లోకి వచ్చిన కొన్ని ఎలక్ట్రిక్ కార్ల గురించి తెలుసుకుందాం.
టాటా నెక్సాన్ ఈవీ ఫేస్‌లిఫ్ట్
నెక్సాన్ ఈవీ ఫేస్‌లిఫ్ట్ మీడియం రేంజ్‌లో 30 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్‌తో మార్కెట్లోకి వచ్చింది. దీనిలో ఎలక్ట్రిక్ మోటార్ అవుట్‌పుట్ 127 బీహెచ్‌పీ, 215 ఎన్ఎంగా ఉంది. ఒక్కసారి పూర్తిగా ఛార్జింగ్ పెడితే 325 కిలోమీటర్ల పాటు ప్రయాణించవచ్చని తెలుస్తోంది. ఇది మాత్రమే కాకుండా 40.5 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్ లాంగ్ రేంజ్‌లో కూడా అందుబాటులో ఉంది. ఇది 143 బీహెచ్‌పీ పవర్‌ని, 215 ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీని రేంజ్ 465 కిలోమీటర్లుగా ఉంది. ఇది 15 కేడబ్ల్యూ పోర్టబుల్ ఛార్జర్, 7.2 కేడబ్ల్యూ హోమ్ ఛార్జర్, డీసీ ఫాస్ట్ ఛార్జర్‌తో సహా మల్టీపుల్ ఛార్జింగ్ ఆప్షన్లను కలిగి ఉంది. దీని ఎక్స్ షోరూమ్ ధర రూ. 14.74 లక్షల నుంచి రూ. 19.94 లక్షల మధ్య ఉంది.
ఎంజీ కామెట్ ఈవీ
భారతదేశపు చవకైన ఎంజీ కామెట్ ఈవీ రెండు డ్యూయల్ టోన్, మూడు మోనోటోన్ కలర్ ఆప్షన్‌ల్లో అందుబాటులో ఉంది. ఇందులో యాపిల్ గ్రీన్ విత్ స్టార్రీ బ్లాక్, క్యాండీ వైట్, స్టార్రీ బ్లాక్, అరోరా సిల్వర్, క్యాండీ వైట్ అండ్ స్టార్రీ బ్లాక్ ఉన్నాయి. ఈ 2 డోర్ ఈవీ 4 సీటర్ లేఅవుట్‌ను కలిగి ఉంది. ఇది 17.3 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్‌తో రానుంది. ఒక్క సారి ఛార్జింగ్ పెడితే 230 కిలోమీటర్ల రేంజ్‌ను అందిస్తుందని కంపెనీ పేర్కొంది. దీని వెనుక చక్రాల ఎలక్ట్రిక్ మోటార్ 42 పీఎస్ పవర్, 110 ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 3.3 కేడబ్ల్యూ ఛార్జర్‌తో ఈ కారును ఛార్జ్ చేయడానికి ఏడు గంటల సమయం పడుతుంది. దీని ఎక్స్ షోరూమ్ ధర రూ.7.98 లక్షల నుంచి రూ.9.98 లక్షల మధ్య ఉంది.
సిట్రోయెన్ ఈసీ3
సిట్రోయెన్ ఈసీ3 ఎలక్ట్రిక్ మోటార్‌తో పాటు 29.2 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్‌ను పొందుతుంది. ఇది 57 పీఎస్ పవర్, 143 ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీని రేంజ్ 320 కిలోమీటర్లుగా ఉండనుంది. 15ఏ ప్లగ్ పాయింట్ ఛార్జర్‌తో దీన్ని 10 గంటల 30 నిమిషాల్లో పూర్తిగా ఛార్జ్ చేయవచ్చు. డీసీ ఫాస్ట్ ఛార్జర్‌తో కేవలం 57 నిమిషాల్లోనే 10 నుంచి 80 శాతం వరకు ఛార్జ్ చేయవచ్చు. సిట్రోయెన్ ఈసీ3 ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్‌ప్లేలను సపోర్ట్ చేసే 10.2 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, మాన్యువల్ ఏసీ, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ వంటి ఫీచర్లను కూడా పొందుతుంది. దీని ఎక్స్ షోరూమ్ ధర రూ. 11.61 లక్షల నుంచి రూ. 12.79 లక్షల మధ్య ఉండనుంది.
టాటా టియాగో ఈవీ
టాటా గత సంవత్సరం దీన్ని లాంచ్ చేసింది. ఈ సంవత్సరం దాని డెలివరీ ప్రారంభమైంది. ఇది రెండు బ్యాటరీ ప్యాక్‌లతో వస్తుంది. 19.2 కేడబ్ల్యూహెచ్, 24 కేడబ్ల్యూహెచ్ ఎంపికలలో అందుబాటులో ఉంది. వీటిలో మొదటి బ్యాటరీ 250 కిలోమీటర్లు, రెండో బ్యాటరీ 315 కిలోమీటర్ల రేంజ్‌ను అందిస్తున్నట్లు పేర్కొన్నారు. 19.2 కేడబ్ల్యూహెచ్ వేరియంట్ 60 బీహెచ్‌పీ పవర్, 110 ఎన్ఎం పీక్ టార్క్‌ను, 24 కేడబ్ల్యూహెచ్ వేరియంట్ 74 బీహెచ్‌పీ, 114 ఎన్ఎం పీక్ టార్క్‌లను అవుట్‌పుట్‌లను అందిస్తాయి. టియాగో ఈవీ వేరియంట్‌ను బట్టి 3.3 కేడబ్ల్యూ లేదా 7.2 కేడబ్ల్యూ హోమ్ ఛార్జర్‌తో వస్తుంది. డీసీ ఫాస్ట్ ఛార్జింగ్ ద్వారా 57 నిమిషాల్లో 10 నుంచి 80 శాతం వరకు ఛార్జ్ చేయవచ్చు. దీని ఎక్స్ షోరూమ్ ధర రూ.8.69 లక్షల నుంచి ప్రారంభం అవుతుంది.
ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. *T&C Apply
Also Read: 2024 జనవరిలోనే లాంచ్ కానున్న టాప్ కార్లు ఇవే - కొనాలంటే కాస్త వెయిట్ చేయండి!