అన్వేషించండి

బిహార్ ఎన్నికలు 2025

(Source:  ECI | ABP NEWS)

5 Seater Cars Under 10 Lakhs:10 లక్షల రూపాయాల్లో కొనగలిగే సన్ రూఫ్‌ ఉన్న కార్లు ఇవే!

5 Seater Cars Under 10 Lakhs:భారతీయ మార్కెట్లో సన్‌రూఫ్ కార్ల డిమాండ్ పెరిగింది. సురక్షితమైన ఫీచర్లతో 10 లక్షల్లో అనేక కార్లు లభిస్తున్నాయి.

5 Seater Cars Under 10 Lakhs: భారతదేశంలో 5-సీటర్ కార్లకు డిమాండ్‌ పెరుగుతూ ఉంది. ఈ కార్లలో సన్‌రూఫ్ ఫీచర్ కోసం కూడా ఎక్కువ వంది చూస్తున్నారు. అంతేకాకుండా, 10 లక్షల రూపాయల ధరలో మంచి సేఫ్లీట లక్షణాలతో కూడిన కార్లు కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ రకమైన కార్లలో మారుతి, టాటా, హుందాయ్‌, మహీంద్రా టాప్‌నాచ్‌ మోడళ్ళు అందిస్తున్నాయి.  వీటిలో అద్భుతమైన భద్రతాపరమైన ఫీచర్స్‌తోపాటు సన్‌రూఫ్ కూడా అందుబాటులో ఉంది.

టాటా నెక్సాన్ (Tata Nexon)

టాటా నెక్సాన్ ఎక్స్‌లెంట్‌ 5-సీటర్ కారు. ఈ కారు 51 వేరియంట్లు మార్కెట్లో ఉన్నాయి. టాటా కంపెనీకి చెందిన ఈ కారు పెట్రోల్, డీజిల్, CNG మూడు పవర్‌ట్రెయిన్ ఆప్షన్లతో వస్తుంది. టాటా నెక్సాన్ ఎలక్ట్రిక్ వేరియంట్ కూడా మార్కెట్లో ఉంది. ఈ కారులో ఎలక్ట్రిక్ సన్‌రూఫ్ ఉంది. ఈ కారుకు గ్లోబల్ NCAP నుంచి క్రాష్ టెస్ట్‌లో 5-స్టార్ సేఫ్టీ రేటింగ్ లభించింది.

ఈ కారులో 1.5-లీటర్ టర్బోచార్జ్డ్ రెవోట్రాన్ ఇంజన్ ఉంది, ఇది 3,750 rpm వద్ద 84.5 PS పవర్‌ని.. 1,500 నుంచి 2,750 rpm వద్ద 260 Nm టార్క్‌ను అందిస్తుంది. కారు ఇంజన్‌తో మాన్యువల్ , ఆటోమేటిక్  ట్రాన్స్‌మిషన్ ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. టాటా నెక్సాన్ ధర విషయానికి వస్తే, ఈ కారు  ఎక్స్-షోరూమ్ ధర 8,89,900 రూపాయల నుంచి ప్రారంభమవుతుంది.

5 Seater Cars Under 10 Lakhs:10 లక్షల రూపాయాల్లో కొనగలిగే సన్ రూఫ్‌ ఉన్న కార్లు ఇవే!

మహీంద్రా XUV 3XO (Mahindra XUV 3XO)

మహీంద్రా XUV 3XO కూడా మెరుగైన భద్రతా ఫీచర్స్‌తో కూడిన కారు. ఈ కారుకు భారత NCAP నుంచి క్రాష్ టెస్ట్‌లో 5-స్టార్ సేఫ్టీ రేటింగ్ లభించింది. ఈ కారులో ఆటోహోల్డ్‌తోపాటు ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ ఫీచర్ ఉంది. మహీంద్రా కంపెనీకి చెందిన ఈ కారులో స్కైరూఫ్ కూడా ఉంది. ఈ కారు 16 కలర్‌ ఆప్షన్లతో వస్తుంది.

XUV 3XOలో పవర్‌ట్రెయిన్ మూడు ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. ఈ కారులో 1.2-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ ఉంది, ఇది 82 kW శక్తిని, 200 Nm టార్క్‌ను అందిస్తుంది. ఈ కారు 1.2-లీటర్ TGDi పెట్రోల్ ఆప్షన్‌తో కూడా వస్తుంది, ఇది 96 kW శక్తిని, 230 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. అంతేకాకుండా, ఈ కారును 1.5-లీటర్ డీజిల్ ఇంజన్‌తో కూడా కొనుగోలు చేయవచ్చు. ఈ ఇంజన్ 86 kW శక్తిని, 300 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. మహీంద్రా XUV 3XO ఎక్స్-షోరూమ్ ధర 7.99 లక్షల రూపాయల నుంచి ప్రారంభమవుతుంది.

5 Seater Cars Under 10 Lakhs:10 లక్షల రూపాయాల్లో కొనగలిగే సన్ రూఫ్‌ ఉన్న కార్లు ఇవే!

మారుతి బ్రెజా (Maruti Brezza)

మారుతి బ్రెజా కూడా ఒక 5-సీటర్ కారు. ఈ కారులో ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, హెడ్‌అప్ డిస్ప్లే, 360-డిగ్రీ వ్యూ కెమెరా వంటి అనేక అప్‌డేటెడ్‌ ఫీచర్స్‌ ఉన్నాయి. మారుతికి చెందిన ఈ కారుకు గ్లోబల్ NCAP క్రాష్ టెస్ట్‌లో 4-స్టార్ సేఫ్టీ రేటింగ్ లభించింది. ఈ మారుతి సుజుకి కారు 10 కలర్‌ ఆప్షన్లతో వస్తుంది.

మారుతి బ్రెజాలో K15B ISG బై-ఫ్యూయల్ ఇంజన్ ఉంది. ఈ కారును పెట్రోల్, CNG రెండు మోడ్‌లలో నడపవచ్చు. పెట్రోల్ మోడ్‌లో ఈ ఇంజన్ 74 kW శక్తిని, 137.1 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. అదే సమయంలో CNG మోడ్‌లో ఈ కారు 64.6 kW శక్తిని, 121.5 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. మారుతి బ్రెజా  ఎక్స్-షోరూమ్ ధర 8.69 లక్షల రూపాయల నుంచి ప్రారంభమవుతుంది.

5 Seater Cars Under 10 Lakhs:10 లక్షల రూపాయాల్లో కొనగలిగే సన్ రూఫ్‌ ఉన్న కార్లు ఇవే!

హ్యుందాయ్‌ ఎక్స్టర్ (Hyundai Exter)

హ్యుందాయ్‌ ఎక్స్టర్ కూడా 10 లక్షల రూపాయల ధరలో అందుబాటులో ఉన్న కారు. ఈ కారులో భద్రత కోసం 6 ఎయిర్‌బ్యాగ్‌లు ఉన్నాయి. అంతేకాకుండా, ఈ కారులో ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, హిల్ స్టార్ట్ అసిస్ట్ కంట్రోల్ వంటి లక్షణాలు ఉన్నాయి. ఈ హ్యుందాయ్‌ కారులో వాయిస్ అసిస్ట్ స్మార్ట్ ఎలక్ట్రిక్ సన్‌రూఫ్ కూడా ఉంది.

హ్యుందాయ్‌ ఎక్స్టర్‌లో 1.2-లీటర్ బై-ఫ్యూయల్ కమ్‌ పెట్రోల్+CNG ఇంజన్ ఉంది. ఈ కారులో ఉన్న ఈ ఇంజన్ 6,000 rpm వద్ద 50.5 kW శక్తిని, 4,000 rpm వద్ద 95.2 Nm టార్క్‌ను అందిస్తుంది. ఈ కారు ఇంజన్‌తో 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ ఉంది. ఈ హ్యుందాయ్‌ కారు ఎక్స్-షోరూమ్ ధర 6 లక్షల రూపాయల నుంచి ప్రారంభమై 10.51 లక్షల రూపాయల వరకు ఉంటుంది.

5 Seater Cars Under 10 Lakhs:10 లక్షల రూపాయాల్లో కొనగలిగే సన్ రూఫ్‌ ఉన్న కార్లు ఇవే!

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Jubilee Hills By Election Results 2025: జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్ విజయం!
జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్ విజయం!
Bihar Election Result 2025 LIVE: బిహార్‌లో డబుల్ సెంచరీ కొట్టిన ఎన్డీఏ
బిహార్‌లో డబుల్ సెంచరీ కొట్టిన ఎన్డీఏ
Jubilee Hills By Election Results 2025:  జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్‌ ఆధిక్యం- రప్పా రప్పా, తగ్గేదేలే అంటున్న నాయకులు
జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్‌ ఆధిక్యం- రప్పా రప్పా, తగ్గేదేలే అంటున్న నాయకులు
Dude OTT: 'డ్యూడ్' ఓటీటీ స్ట్రీమింగ్... ఒక్కటి కాదు, ఐదు భాషల్లో - ప్రదీప్ రంగనాథన్, మమితా బైజు సినిమా ఎందులో ఉందంటే?
'డ్యూడ్' ఓటీటీ స్ట్రీమింగ్... ఒక్కటి కాదు, ఐదు భాషల్లో - ప్రదీప్ రంగనాథన్, మమితా బైజు సినిమా ఎందులో ఉందంటే?
Advertisement

వీడియోలు

Jubilee Hills By Election Results 2025 | దూసుకుపోతున్న కాంగ్రెస్
Jubilee hills Election Result 2025 | పోస్టల్ బ్యాలెట్ లో కాంగ్రెస్ దే ఆధిక్యం...జూబ్లీహిల్స్ పీఠం ఎవరిదో.? | ABP Desam
Ruturaj Gaikwad Century vs South Africa A | ఛాన్స్ దొరికితే సెంచరీ కొట్టి గంభీర్ నే క్వశ్చన్ చేస్తున్న రుతురాజ్
Ruturaj gaikwad Century vs SA A | ఛాన్స్ దొరికితే సెంచరీ కొట్టి గంభీర్ నే క్వశ్చన్ చేస్తున్న రుతురాజ్
Ind vs SA First Test Match Preview | సౌతాఫ్రికాతో నేటి నుంచి మొదటి టెస్ట్ లో తలపడనున్న భారత్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Jubilee Hills By Election Results 2025: జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్ విజయం!
జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్ విజయం!
Bihar Election Result 2025 LIVE: బిహార్‌లో డబుల్ సెంచరీ కొట్టిన ఎన్డీఏ
బిహార్‌లో డబుల్ సెంచరీ కొట్టిన ఎన్డీఏ
Jubilee Hills By Election Results 2025:  జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్‌ ఆధిక్యం- రప్పా రప్పా, తగ్గేదేలే అంటున్న నాయకులు
జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్‌ ఆధిక్యం- రప్పా రప్పా, తగ్గేదేలే అంటున్న నాయకులు
Dude OTT: 'డ్యూడ్' ఓటీటీ స్ట్రీమింగ్... ఒక్కటి కాదు, ఐదు భాషల్లో - ప్రదీప్ రంగనాథన్, మమితా బైజు సినిమా ఎందులో ఉందంటే?
'డ్యూడ్' ఓటీటీ స్ట్రీమింగ్... ఒక్కటి కాదు, ఐదు భాషల్లో - ప్రదీప్ రంగనాథన్, మమితా బైజు సినిమా ఎందులో ఉందంటే?
Tirumala: టీటీడీ AI చాట్‌బాట్! ఇకపై శ్రీవారి దర్శనం మరింత సులభం – 13 భాషల్లో సమాచారం!
టీటీడీ AI చాట్‌బాట్! ఇకపై శ్రీవారి దర్శనం మరింత సులభం – 13 భాషల్లో సమాచారం!
Jubilee Hills By Poll Results 2025: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో దూసుకెళ్తోన్న నవీన్ యాదవ్.. బీఆర్ఎస్‌కు బిగ్ షాక్! పూర్తిగా సైడైన బీజేపీ
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో దూసుకెళ్తోన్న నవీన్ యాదవ్.. బీఆర్ఎస్‌కు బిగ్ షాక్! పూర్తిగా సైడైన బీజేపీ
Delhi Blast Case Update: ఢిల్లీ పేలుడు మాస్టర్ మైండ్ ఉమర్ ఇంటిని పేల్చివేసిన భద్రతా బలగాలు
ఢిల్లీ పేలుడు మాస్టర్ మైండ్ ఉమర్ ఇంటిని పేల్చివేసిన భద్రతా బలగాలు
MLA Defection: ఫిరాయింపు ఎమ్మెల్యేపై కోల్‌కతా హైకోర్టు అనర్హతా వేటు - తెలంగాణలో ఆ పది మందికి కొత్త టెన్షన్ !
ఫిరాయింపు ఎమ్మెల్యేపై కోల్‌కతా హైకోర్టు అనర్హతా వేటు - తెలంగాణలో ఆ పది మందికి కొత్త టెన్షన్ !
Embed widget