అన్వేషించండి

Summer Car AC Maintenance Tips: భగభగమండే వేసవిలో కారు ఏసీ సూపర్ కూలింగ్ ఇవ్వాలా? ఈ 5 స్మార్ట్ టిప్స్ ఫాలో అవ్వండి!

వేసవి తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో కారు ఏసీ పనితీరును మెరుగుపరిచే చిట్కాల గురించి తెలుసుకుందాం. ఈ చిన్న జాగ్రత్తలు పాటించడం వల్ల త్వరగా కూలింగ్ రావడమే కాకుండా ఇంధనం కూడా ఆదా అవుతుంది.

5 Essential Summer Car AC Maintenance Tips: దేశవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు అమాంతం పెరుగుతున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో కారు ప్రయాణం సుఖమయంగా సాగాలంటే ఏసీ వ్యవస్థ పక్కాగా పనిచేయడం చాలా అవసరం. అయితే చాలామంది వాహనదారులు ఏసీని వాడేటప్పుడు కొన్ని చిన్న చిన్న విషయాలను నిర్లక్ష్యం చేస్తుంటారు. దీనివల్ల ఏసీ మీద ఒత్తిడి పెరగడమే కాకుండా కూలింగ్ కూడా సరిగ్గా రాదు. మీ కారు ఏసీ పర్ఫార్మెన్స్‌ను పెంచి, సిస్టమ్ లైఫ్ పెంచడానికి ప్రతి డ్రైవర్ పాటించాల్సిన ఐదు ముఖ్యమైన చిట్కాలు తెలుసుకోండి.

ఏసీ ఆన్ చేసే ముందు గాలిని బయటకు పంపండి..
ఎండలో పార్క్ చేసిన కారు లోపల వేడి గాలి పేరుకుపోయి ఉంటుంది. కారులోకి ఎక్కిన వెంటనే ఏసీ ఆన్ చేయడం కంటే, ముందుగా అన్ని డోర్లు లేదా విండోస్ ఒక నిమిషం పాటు ఓపెన్ చేసి ఉంచాలి. ఇలా చేయడం వల్ల లోపల ట్రాప్ అయిన హాట్ ఎయిర్ బయటకు వెళ్ళిపోతుంది. ఆ తర్వాత ఏసీ ఆన్ చేస్తే కేబిన్ చాలా వేగంగా చల్లబడుతుంది.

డ్రైవింగ్ మొదలుపెట్టిన తర్వాతే కూలింగ్ పెంచండి..
కారు స్టార్ట్ చేసిన వెంటనే ఏసీని లోయెస్ట్ టెంపరేచర్‌లో ఉంచడం కంటే, కొంచెం దూరం ప్రయాణించిన తర్వాత టెంపరేచర్ తగ్గించడం మంచిది. కారు కదలికలో ఉన్నప్పుడు కంప్రెసర్ మరింత సమర్థవంతంగా పనిచేస్తుంది. దీనివల్ల ఎయిర్ ఫ్లో పెరిగి ఏసీ సిస్టమ్ మీద అనవసరమైన భారం పడకుండా ఉంటుంది.

రీసర్క్యులేషన్ మోడ్‌ను తెలివిగా వాడండి..
కారు ఏసీలోని రీసర్క్యులేషన్ మోడ్ బయట ఉన్న వేడి గాలిని లోపలికి రాకుండా అడ్డుకుంటుంది. కేబిన్‌లోని చల్లటి గాలిని మాత్రమే లోపల తిరిగేలా చేయడం వల్ల కూలింగ్ ఎక్కువ సేపు ఉంటుంది. ముఖ్యంగా ట్రాఫిక్ లో ఉన్నప్పుడు, ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు ఈ మోడ్ వాడటం వల్ల ఏసీకి తక్కువ శ్రమ ఉంటుంది. అయితే సుదీర్ఘ ప్రయాణాల్లో అప్పుడప్పుడు దీన్ని ఆపి బయట గాలి లోపలికి వచ్చేలా చూడటం వల్ల ఎయిర్ క్వాలిటీ బాగుంటుంది.

స్మార్ట్ పార్కింగ్ - హీట్ మేనేజ్‌మెంట్..
కారును సాధ్యమైనంత వరకు నీడ ఉన్న చోట పార్క్ చేయడానికి ప్రయత్నించండి. అది కుదరని పక్షంలో విండ్ షీల్డ్ సన్ షేడ్స్ వాడటం వల్ల లోపల ఉష్ణోగ్రత పెరగకుండా ఉంటుంది. కేబిన్ తక్కువ వేడి ఎక్కితే, ఏసీకి పని తక్కువ అవుతుంది. దీనివల్ల కారు మైలేజీ పెరగడమే కాకుండా ఏసీ విడిభాగాలు త్వరగా పాడవవు.

రెగ్యులర్ ఏసీ సర్వీసింగ్..
ఏసీ పర్ఫార్మెన్స్ బాగుండాలంటే కాలానుగుణంగా సర్వీసింగ్ చేయించడం తప్పనిసరి. క్యాబిన్ ఎయిర్ ఫిల్టర్లను ఎప్పటికప్పుడు క్లీన్ చేయాలి లేదా మార్చాలి. రిఫ్రిజరెంట్ గ్యాస్ లెవల్స్ చెక్ చేయడం, లీకేజీలు లేకుండా చూసుకోవడం వల్ల తీవ్రమైన ఎండల్లో కూడా ఏసీ మొరాయించదు. వేసవి పరిస్థితులు కఠినంగా మారుతున్న ఈ సమయంలో ఇటువంటి సింపుల్ టిప్స్ పాటించడం వల్ల మీ ప్రయాణం సౌకర్యవంతంగా మారుతుంది. కారు కూలింగ్ సిస్టమ్ ఎక్కువ కాలం మన్నడానికి ఇవి ఎంతో దోహదపడతాయి.

టాప్ హెడ్ లైన్స్

రూ.1.5 లక్షలు చెల్లించి 6 సీటర్ Mahindra XEV 9S తీసుకుంటే EMI ఎంత చెల్లించాలి
రూ.1.5 లక్షలు చెల్లించి 6 సీటర్ Mahindra XEV 9S తీసుకుంటే EMI ఎంత చెల్లించాలి
8 స్పీడ్‌ AT నుంచి సీట్‌ మసాజర్‌ వరకు.. కొత్త స్కోడా స్లావియాలో వచ్చిన ఇంప్రూవ్‌మెంట్స్‌ ఇవే
పాత స్లావియాకు గుడ్‌బై చెప్పొచ్చు! కొత్త స్లావియా ఫేస్‌లిఫ్ట్‌లో అదిరిపోయే అప్‌డేట్స్‌
మారుతి బలెనో ఫేస్‌లిఫ్ట్‌ వచ్చేస్తోంది.. ధర పెరిగినా ఫీచర్లలో మాత్రం అదిరిపోయే అప్‌డేట్స్!
సెప్టెంబర్ 5న కొత్త మారుతి బలెనో.. భారీ స్క్రీన్‌ నుంచి న్యూ లుక్‌ వరకు కీలక మార్పులు!
మారుతి ఆల్టో K10 vs మారుతి ఎస్-ప్రెస్సో.. మీ బడ్జెట్‌కు, డైలీ డ్రైవింగ్‌కు ఏ కారు బెస్ట్‌?
మారుతి ఆల్టో K10 vs మారుతి ఎస్-ప్రెస్సో... రూ.3.50 లక్షల బడ్జెట్‌లో ఏ కారు బెస్ట్?

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Supreme Court: రాయదుర్గం భూముల వేలానికి లైన్ క్లియర్.... స్టే ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరణ
Supreme Court: రాయదుర్గం భూముల వేలానికి లైన్ క్లియర్.... స్టే ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరణ
Konda Surekha: తెలంగాణ మంత్రి కొండా సురేఖపై కాంగ్రెస్ ఎమ్మెల్యేల తిరుగుబాటు! బర్తరఫ్‌ చేయాలని డిమాండ్!
తెలంగాణ మంత్రి కొండా సురేఖపై కాంగ్రెస్ ఎమ్మెల్యేల తిరుగుబాటు! బర్తరఫ్‌ చేయాలని డిమాండ్!
Revanth Reddy US Visit Cancelled: రేవంత్ అమెరికా పర్యటన రద్దుకు కారణమేంటి? సీఎంల విదేశీ టూర్లకు కేంద్రం అనుమతి ఎందుకు? కాదని వెళ్తే ఏమవుతుంది?
రేవంత్ అమెరికా పర్యటన రద్దుకు కారణమేంటి? సీఎంల విదేశీ టూర్లకు కేంద్రం అనుమతి ఎందుకు? కాదని వెళ్తే ఏమవుతుంది?
CM Revanth's US trip cancelled | లండన్‌లో ఆగిన రేవంత్.. కేంద్ర అనుమతి నిరాకరణకు కారణమేంటి??
CM Revanth's US trip cancelled | లండన్‌లో ఆగిన రేవంత్.. కేంద్ర అనుమతి నిరాకరణకు కారణమేంటి??
KTR Comments on Voters: ఇప్పటికీ ప్రజలే తప్పు చేశారంటున్న కేటీఆర్ - ఇది రాజకీయ వ్యూహమా? ప్రజల్ని కించపర్చడమా?
ఇప్పటికీ ప్రజలే తప్పు చేశారంటున్న కేటీఆర్ - ఇది రాజకీయ వ్యూహమా? ప్రజల్ని కించపర్చడమా?
Irumudi Review - 'ఇరుముడి' రివ్యూ: సెంటిమెంట్‌తో కొట్టిన రవితేజ... మాస్ కాదు, ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా ఎలా ఉందంటే?
'ఇరుముడి' రివ్యూ: సెంటిమెంట్‌తో కొట్టిన రవితేజ... మాస్ కాదు, ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా ఎలా ఉందంటే?
ED Raids On YSRCP MP Avinash Reddy: వైసీపీ ఎంపీ అవినాష్‌ రెడ్డి సహా పది మంది నివాసాల్లో ఈడీ ఆకస్మిక తనిఖీలు!
వైసీపీ ఎంపీ అవినాష్‌ రెడ్డి సహా పది మంది నివాసాల్లో ఈడీ ఆకస్మిక తనిఖీలు!
Lenin TV Premiere Date : బుల్లితెరపై అయ్యగారు వచ్చేస్తున్నారు - అఖిల్ అక్కినేని లెనిన్ టీవీల్లోకి వచ్చేది ఎప్పుడంటే?
బుల్లితెరపై అయ్యగారు వచ్చేస్తున్నారు - అఖిల్ అక్కినేని లెనిన్ టీవీల్లోకి వచ్చేది ఎప్పుడంటే?
Embed widget