అన్వేషించండి

Cheapest Diesel SUVs: Mahindra Bolero నుంచి Tata Safari వరకు 5 చౌకైన డీజిల్ SUVలు, ఇప్పటికీ ఇవి ప్రత్యేకమే!

Affordable Diesel SUVs 2025: డీజిల్‌తో నడిచే 7 సీటర్ SUVలు తెలుగు రాష్ట్రాల్లో బాగా అమ్ముడవుతున్నాయి. అత్యంత తక్కువ ధరకు లభిస్తున్న డీజిల్ SUVల లిస్ట్‌ ఇదిగో.

Cheapest Diesel SUVs 2025: డీజిల్ SUVలు తెలుగు ప్రజలకు ప్రధాన వాహనాలు. తెలుగు వాళ్లు కోరుకునే అధిక టార్క్, అత్యుత్తమ శక్తి & ఇంధన సామర్థ్యం వీటికి ఉండడమే దీనికి కారణం. ముఖ్యంగా, 7-సీటర్‌ డీజిల్ SUVలు ఫ్యామిలీతో కలిసి ఎక్కువ దూరం ప్రయాణించే వారికి అనుకూలంగా ఉంటాయి. మహీంద్రా & టాటా వంటి కంపెనీలు ఇప్పటికీ ఈ విభాగంలో బలమైన పట్టును కొనసాగిస్తున్నాయి. 

తెలుగు రాష్ట్రాల్లో అందుబాటులో ఉన్న, అత్యంత తక్కువ ధర గల 5 డీజిల్ SUVలు:

మహీంద్రా బొలెరో
మహీంద్రా బొలెరో, తెలుగు రాష్ట్రాల్లో అత్యంత పాపులర్‌ అయిన & అందుబాటు ధరలో దొరికే 7-సీటర్‌ డీజిల్ SUV. దీని ప్రారంభ ధర సుమారు ₹9.28 లక్షలు. ఇది 75 bhp & 210 Nm టార్క్ ఉత్పత్తి చేసే 1.5-లీటర్ mHawk డీజిల్ ఇంజిన్‌తో శక్తి పొందుతుంది. ఇది 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో అనుసంధానమై, లీటరుకు సుమారు 16 కి.మీ. మైలేజీ అందిస్తుంది. బొలెరో డిజైన్ సింపుల్‌గా ఉన్నప్పటికీ దృఢమైనది. ఈ డిజైన్‌ ఈ బండిని కఠినమైన భూభాగాలు & ఆఫ్-రోడ్ డ్రైవింగ్‌కు అనుకూలంగా మారుస్తుంది. పవర్ స్టీరింగ్, AC & సెంట్రల్ లాకింగ్ వంటి ప్రైమరీ ఫీచర్లు మాత్రమే ఉన్నప్పటికీ, అధిక మన్నిక & తక్కువ నిర్వహణ వంటివి దీనిని గ్రామీణ & పట్టణ వినియోగదారులకు ఇష్టమైన కారుగా మార్చాయి.

మహీంద్రా బొలెరో నియో
బొలెరో నియో అనేది క్లాసిక్ బొలెరోకు మోడ్రన్‌ టచ్‌ ఇచ్చిన వెర్షన్. దీని ప్రారంభ ధర ₹9.43 లక్షలు. ఇందులోని 1.5-లీటర్ డీజిల్ ఇంజిన్ 100 bhp & 260 Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. మైలేజ్ దాదాపు 17 కి.మీ/లీ. దీని డిజైన్ బొలెరో కంటే స్టైలిష్‌గా ఉంటుంది. LED టెయిల్‌లైట్లు, టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ & రియర్‌ పార్కింగ్ కెమెరా వంటి ఫీచర్లను ఇది అందిస్తుంది. దీనిలోని 7-సీట్ల లేఅవుట్‌లో, మూడో వరుస సీటు పిల్లలకు లేదా తక్కువ దూరం ప్రయాణాలకు అనువుగా ఉంటుంది. ఈ SUV బొలెరో కంటే సౌకర్యవంతంగా ఉంటుంది, కానీ క్లాసిక్‌ తరహాలో ఆఫ్-రోడ్ సామర్థ్యం ఉండదు.

మహీంద్రా స్కార్పియో క్లాసిక్ & స్కార్పియో N
స్కార్పియో క్లాసిక్ పాతదే అయినప్పటికీ ఇప్పటికీ పాపులర్‌ SUV. దీని ప్రారంభ ధర ₹13.03 లక్షలు. ఇది 2.2-లీటర్ డీజిల్ ఇంజిన్‌తో పని చేస్తుంది, 130 bhp & 300 Nm టార్క్‌ను ఇస్తుంది. దీని మైలేజ్ దాదాపు 15 కి.మీ/లీ. దీని దూకుడైన రూపం & బలమైన సస్పెన్షన్ వల్ల గ్రామీణ & పట్టణ ప్రాంతాలలో ఈ SUV ఒక పాపులర్‌ ఆప్షన్‌ అయింది. 

స్కార్పియో N ఈ విభాగంలో మరింత ఆధునిక SUV. దీని ప్రారంభ ధర ₹13.61 లక్షలు. దీని 2.2-లీటర్ డీజిల్ ఇంజిన్ 200 bhp వరకు జనరేట్‌ చేస్తుంది & 14.5 km/లీ మైలేజీ ఇస్తుంది. దీనిలో పనోరమిక్ సన్‌రూఫ్, వెంటిలేటెడ్ సీట్లు & ADAS వంటి ఫీచర్లు ఉన్నాయి. దీని 4x4 వేరియంట్ ఆఫ్-రోడింగ్ కోసం అద్భుతంగా ఉంటుంది & ప్రీమియం SUV లుక్స్‌ను ఇష్టపడే వారికి ఇది సరైనది.

మహీంద్రా XUV700 
మహీంద్రా XUV700, ఈ బ్రాండ్‌ ప్రీమియం SUVల్లో ఒకటి. దీని ప్రారంభ ధర ₹14.18 లక్షలు. ఇది 200 bhp పవర్‌ ఇచ్చే 2.2-లీటర్ డీజిల్ ఇంజిన్‌తో పని చేస్తుంది. మైలేజ్ దాదాపు 17 కి.మీ/లీ. 10.25 అంగుళాల టచ్‌స్క్రీన్, లెవెల్-2 ADAS, 360-డిగ్రీ కెమెరా & పనోరమిక్ సన్‌రూఫ్‌ దీని అడ్వాన్స్‌డ్‌ ఫీచర్లు. ఈ కారు 6  లేదా 7 సీట్ల కాన్ఫిగరేషన్‌లలో లభిస్తుంది & AWD ఎంపికను కూడా అందిస్తుంది. టెక్నాలజీ & లగ్జరీ లక్షణాలకు ప్రాధాన్యతనిచ్చే వారి వచ్చింది ఈ SUV.

టాటా సఫారి 
టాటా సఫారీ చాలా కాలంగా తెలుగు ప్రజలకు ప్రియమైన పేరు. ₹14.66 లక్షల ధరతో, ఇది 2.0-లీటర్ క్రియోటెక్ డీజిల్ ఇంజిన్‌తో పని చేస్తుంది, ఇది 170 bhp & 350 Nm టార్క్ జనరేట్‌ చేస్తుంది. మైలేజ్ సుమారు 16.3 కి.మీ/లీ. సఫారీ కూడా 6 & 7-సీట్ల లేఅవుట్‌లలో లభిస్తుంది. వెంటిలేటెడ్ సీట్లు, 12.3 అంగుళాల టచ్‌స్క్రీన్ & పనోరమిక్ సన్‌రూఫ్ వంటివి దీని ఫీచర్లు. ఈ SUV బోల్డ్ డిజైన్ & విశాలమైన మూడో వరుస సీటు దీనిని ఫ్యామిలీ SUV విభాగంలో బలమైన పోటీదారుగా నిలబెట్టాయి.

భారతదేశంలో, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌ & తెలంగాణలో డీజిల్ SUVల పట్ల క్రేజ్ ఇంకా తగ్గలేదు, అందుకే ఈ ఐదు డీజిల్ SUVలకు కూడా డిమాండ్‌ తగ్గలేదు.

టాప్ హెడ్ లైన్స్

రూ.1.5 లక్షలు చెల్లించి 6 సీటర్ Mahindra XEV 9S తీసుకుంటే EMI ఎంత చెల్లించాలి
రూ.1.5 లక్షలు చెల్లించి 6 సీటర్ Mahindra XEV 9S తీసుకుంటే EMI ఎంత చెల్లించాలి
8 స్పీడ్‌ AT నుంచి సీట్‌ మసాజర్‌ వరకు.. కొత్త స్కోడా స్లావియాలో వచ్చిన ఇంప్రూవ్‌మెంట్స్‌ ఇవే
పాత స్లావియాకు గుడ్‌బై చెప్పొచ్చు! కొత్త స్లావియా ఫేస్‌లిఫ్ట్‌లో అదిరిపోయే అప్‌డేట్స్‌
మారుతి బలెనో ఫేస్‌లిఫ్ట్‌ వచ్చేస్తోంది.. ధర పెరిగినా ఫీచర్లలో మాత్రం అదిరిపోయే అప్‌డేట్స్!
సెప్టెంబర్ 5న కొత్త మారుతి బలెనో.. భారీ స్క్రీన్‌ నుంచి న్యూ లుక్‌ వరకు కీలక మార్పులు!
మారుతి ఆల్టో K10 vs మారుతి ఎస్-ప్రెస్సో.. మీ బడ్జెట్‌కు, డైలీ డ్రైవింగ్‌కు ఏ కారు బెస్ట్‌?
మారుతి ఆల్టో K10 vs మారుతి ఎస్-ప్రెస్సో... రూ.3.50 లక్షల బడ్జెట్‌లో ఏ కారు బెస్ట్?

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
MP Lingamaneni Ramesh: రోడ్డు ప్రమాదంలో యువతి మృతిపై జనసేన ఎంపీ లింగమనేని రమేష్ తీవ్ర విచారం
రోడ్డు ప్రమాదంలో యువతి మృతిపై జనసేన ఎంపీ లింగమనేని రమేష్ తీవ్ర విచారం
Rahul Gandhi: పట్టువదలని రాహుల్ గాంధీ.. ఎట్టకేలకు FIR నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు, ఆందోళన విరమణ
రాహుల్ గాంధీ తగ్గేదేలే.. పెల్లెట్ గన్ వినియోగంపై FIR నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు, ఆందోళన విరమణ
Rayadurgam Land Auction: రాయదుర్గం భూములకు రికార్డు ధర.. TGIIC వేలంలో రూ.264 కోట్లు పలికిన ఎకరా భూమి
రాయదుర్గం భూములకు రికార్డు ధర.. TGIIC వేలంలో రూ.264 కోట్లు పలికిన ఎకరా భూమి
NO BPL This Year:  పాపం బంగ్లా.. న‌ష్టాల‌తో బీపీఎల్ ర‌ద్దు.. టీమిండియా టూర్ పైనే గంపెడాశలు..
పాపం బంగ్లా.. న‌ష్టాల‌తో బీపీఎల్ ర‌ద్దు.. టీమిండియా టూర్ పైనే గంపెడాశలు..
Viral News: ఆత్మహత్యకు యత్నించిన కొడుకుని కాపాడబోయి కొండపై నుంచి పడి తండ్రి, దూకేసి తల్లి సైతం మృతి
ఆత్మహత్యకు యత్నించిన కొడుకుని కాపాడబోయి కొండపై నుంచి పడి తండ్రి, దూకేసి తల్లి సైతం మృతి
Janasena Politics: స్థానిక సంస్థల ఎన్నికల కోసం 14 మందితో జనసేన కమిటీ నియమించిన పవన్ కళ్యాణ్
స్థానిక సంస్థల ఎన్నికల కోసం 14 మందితో జనసేన కమిటీ నియమించిన పవన్ కళ్యాణ్
Foods To Reduce Stress : ఒత్తిడి, ఆందోళన ఎక్కువగా ఉందా? అయితే ఈ ఫుడ్స్ తినేయండి.. బెటర్​గా ఫీల్ అవుతారు
ఒత్తిడి, ఆందోళన ఎక్కువగా ఉందా? అయితే ఈ ఫుడ్స్ తినేయండి.. బెటర్​గా ఫీల్ అవుతారు
Nellore Viral Video: తండ్రి నిర్వాకాన్ని పోలీసుల ఎదుట బయటపెట్టిన కొడుకు నిజాయితీ.. వీడియో వైరల్
తండ్రి నిర్వాకాన్ని పోలీసుల ఎదుట బయటపెట్టిన కొడుకు నిజాయితీ.. వీడియో వైరల్
Embed widget