Weekly Horoscope July 7 to July 13, 2024: జూలై 7 నుంచి జూలై 13 వరకూ ఈ వారం మీ రాశిఫలితం - ఈ 5 రాశులవారికి అదృష్టం, ఐశ్వర్యం, ఆనందం!
weekly horoscope in telugu july 7th to july 13th 2024: జూలై 7 నుంచి జూలై 13 వరకూ ఈ వారం మీ రాశిఫలితం ఇక్కడ తెలుసుకోండి
![Weekly Horoscope July 7 to July 13, 2024: జూలై 7 నుంచి జూలై 13 వరకూ ఈ వారం మీ రాశిఫలితం - ఈ 5 రాశులవారికి అదృష్టం, ఐశ్వర్యం, ఆనందం! weekly horoscope in telugu july 7th to july 13th 2024 Read weekly astrological predictions Weekly Horoscope July 7 to July 13, 2024: జూలై 7 నుంచి జూలై 13 వరకూ ఈ వారం మీ రాశిఫలితం - ఈ 5 రాశులవారికి అదృష్టం, ఐశ్వర్యం, ఆనందం!](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/07/ac0d4b1f05a208406aa362465cbfacfb1720330946625217_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Weekly Horoscope July 7 to July 13, 2024
మేష రాశి
ఈ వారం మేషరాశివారికి గ్రహాల అనుగ్రహం ఉంటుంది. ఏ పని ప్రారంభించినా సకాలంలో పూర్తిచేసేస్తారు. ధైర్యంగా అడుగు ముందుకు వేస్తారు. ఉద్యోగం మారాలి అనుకునేవారికి ఇదే మంచిసమయం. నిరుద్యోగులు మంచి ఉద్యోగం, ఉద్యోగులు పదోన్నది పొందే అవకాశం ఉంది. వ్యాపారంలో పెట్టిన పెట్టుబడులు అద్భుతమైన లాభాలనిస్తాయి. ఫ్యూచర్ కోసం మంచి ప్రణాళికలు వేసుకోవడంలో సక్సెస్ అవుతారు.
వృషభ రాశి
ఈ వారం వృషభ రాశివారికి మిశ్రమ ఫలితాలున్నాయి. ఎంతో ధైర్యంగా వ్యవహరిస్తే కానీ చేపట్టిన పనులు పూర్తిచేయలేరు. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంది కానీ ఖర్చులు తగ్గించాలి. అవసర చర్చల్లో పాల్గొనవద్దు..చెప్పాలి అనుకున్న విషయాన్ని సూటిగా చెప్పేయండి. ఉద్యోగులకు చిన్న చిన్న ఇబ్బందులు తప్పవు.
మిథున రాశి
ఈ వారం మిథున రాశివారు తమ బాధ్యతలను ప్రశాంతంగా నిర్వర్తిస్తారు. ఉద్యోగులకు సహోద్యోగుల నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి. తొందపాటుతో కాకుండా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. వ్యాపారులకు శుభసమయం.ఈ వారం మీరు ఓ గుడ్ న్యూస్ వింటారు. కీలకమైన సమయాల్లో తెలివిగా వ్యవహరించండి. ఓర్పు, సహనం అవసరం..
Also Read: పూరీ జగన్నాథుడి రథయాత్రేకాదు..ప్రసాదమూ ప్రత్యేకమే - శ్రీ మహాలక్ష్మి పర్యవేక్షణలో వంటలు!
కర్కాటక రాశి
ఈ వారం మీలో కొత్త శక్తి వచ్చినట్టు అనిపిస్తుంది. మీ లక్ష్యాలను సాధించడంలో పూర్తిస్థాయిలో సక్సెస్ అవుతారు. నూతన నిర్ణయాలు తీసుకోవడంలో సక్సెస్ అవుతారు. వృత్తి, ఉద్యోగాల్లో మంచి ఫలితాలు సాధిస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. శత్రువులు మిత్రులవుతారు. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దు.
సింహ రాశి
ఈ వారం సింహరాశివారు మెరుగైన ఫలితాలు పొందుతారు. గత అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకుని ముందుకు సాగండి. వివాదాలకు దూరంగా ఉండాలి..అవసర సంభాషణలలో పాల్గొనవద్దు. వృత్తి ఉద్యోగాల్లో చిన్న చిన్న అవరోధాలున్నప్పటికీ ధైర్యంగా నిర్ణయాలు తీసుకుంటే సక్సెస్ అవుతారు.
కన్యా రాశి
ఈ వారం కన్యారాశివారు కష్టానికి తగిన ఫలితాలు పొందుతారు. ఆచరణ యోగ్యమైన లక్ష్యాలను ఎంచుకోండి. ఉద్యోగులకు పదోన్నతి సూచనలున్నాయి. ఎప్పటి నుంచో పెండింగ్ లో ఉన్న పనులు పూర్తిచేస్తారు. వ్యాపారంలో లాభాలుంటాయి. వివాదాలకు దూరంగా ఉండడం మంచిది.
తులా రాశి
ఈ వారం ఈ రాశివారు కీలక నిర్ణయాలు తీసుకోవడంలో ఆలోచించి అడుగువేయాలి. వివాదాలకు దూరంగా ఉండాలి. పరిస్థితులను అర్థం చేసుకుని ముందుకు సాగండి. కుటుంబానికి సమయం కేటాయించాలి. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యంచేయవద్దు . ఆదాయం బాగానే ఉంటుంది.
Also Read: వస్తున్నాయ్ వస్తున్నాయ్ జగన్నాథ రథచక్రాల్.. పూరీ రథయాత్ర గురించి మీకు తెలియని ఆసక్తికర విశేషాలివి!
వృశ్చిక రాశి
ఈ రాశివారికి ఈ వారం మంచి ఫలితాలున్నాయి. ఆధాయం పెరుగుతుంది. నూతన ఆస్తులు కొనుగోలు చేయాలి అనుకున్నవారి ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగులు, వ్యాపారులకు అద్భుతమై యోగం. తమ బాధ్యతలను సకాలంలో పూర్తిచేసతారు. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దు
ధనస్సు రాశి
ఈ వారం ధనస్సు రాశివారు తీసుకునే నిర్ణయాల్లో స్థిరత్వం ఉండదు.. ఓ నిర్ణయం తీసుకుని మళ్లీ మార్చాలి అనుకుంటారు. గ్రహాలు మీకు అనుకూల ఫలితాలను ఇవ్వడం లేనందున ధైర్యంగా ముందుకుసాగాలి. అనవసర విషయాల్లో అతిగా స్పందిస్తే నష్టపోతారు.
మకర రాశి
ఈ వారం మకర రాశివారికి కలిసొస్తుంది. ఆదాయం పెరుగుతుంది..ఖర్చులు తగ్గుతాయి. సరైన సమయానికి సరైన నిర్ణయాలు తీసుకుంటారు. ఉద్యోగులు పనితీరుతో ఉన్నతాధికారులను మెప్పిస్తారు. వ్యాపారంలో నూతన పెట్టుబడులకు ఇదే సరైన సమయం.
కుంభ రాశి
ఈ రాశివారికరి ఈ వారం గ్రహాల అనుగ్రహం ఉంటుంది. వృత్తి, ఉద్యోగం, వ్యాపారాలలో అనుకూల ఫలితాలున్నాయి. మీ ప్రవర్తన, పనితీరు ప్రశంసలు అందుకుంటుంది. స్నేహితుల నుంచి సహకారం అందుతుంది. ముఖ్యమైన విషయాల్లో కుటుంబ సభ్యుల నుంచి సలహాలు స్వీకరించండి. ఆస్తులు కొనుగోలు చేయాలనే ఆలోచన బలపడుతుంది
మీన రాశి
ఈ వారం ఈ రాశివారికి అద్భుతంగా ఉంటుంది. ఆదాయం పెరుగుతుంది..స్థిరాస్తులు కొనుగోలు చేసేందుకు ప్రణాళికలు వేసుకుంటారు. మీ అభిప్రాయం చెప్పాల్సిన దగ్గర సంకోచం వద్దు. ప్రణాళిక ప్రకారం పనులు పూర్తిచేసేందుకు ప్రయత్నించండి. వ్యాపారంలో నూతన పెట్టుబడులు పెట్టాలన్న ఆలోచన కొంతకాలం వాయిదా వేయడం మంచిది.
Note:ఓ రాశిలోని ఫలితాలు మొత్తం ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు..మీ జాతకంలో గ్రహస్థితి ఆధారంగా కూడా ఫలితాల్లో మార్పులుంటాయి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం.
Also Read: బోనాలు, రథయాత్ర, తొలి ఏకాదశి, గురుపూర్ణిమ సహా జూలై నెలలో ఎన్ని పండుగలో!
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)