అన్వేషించండి

ఉద్యోగంలో హోదా, వ్యక్తిగత జీవితంలో ఆనందం: ఈ వారం ఈ రాశుల వారికి అద్భుతమైన సమయం!

Weekly Horoscope: మేషం నుంచి మీనం వరకూ ఈ వారం రాశిఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి...

Weekly horoscope from June 22 to June 28 

మేష రాశి

మేషరాశి వారికి ఈ వారం అదృష్టం కలిసొస్తుంది. మీరు చేసే ఏ పనిలో అయినా చొరవ మీకు లాభాన్ని చేకూరుస్తుంది. వారం మొదటి భాగంలో కొంత సమయం మినహాయిస్తే మిగిలిన వారం మొత్తం మీకు మంచే జరుగుతుంది. పనిచేసే ప్రదేశంలో సీనియర్లు మీకు మద్దతిస్తారు. ఉద్యోగం చేసే ప్రదేశంలో సమయం మీకు అనుకూలంగా ఉంటుంది. చేపట్టిన పనుల్లో మీరు మంచి పురోగతి సాధిస్తారు. వ్యాపారంలో కోరుకున్న లాభం ఉంటుంది. ఏదైనా ప్రత్యేక ప్రాజెక్ట్‌ చేపడతారు. కుటుంబంలో సంతోషం ఉంటుంది.  భూమి , భవనాల కొనుగోలు అమ్మకం కల నెరవేరుతుంది. మీ ప్రేమ సంబంధం కొత్తగా ప్రారంభమైతే జాగ్రత్తగా అడుగులు వేయాలి. వైవాహిక జీవితంలో ఆనందం ఉంటుంది. ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది. ఈ వారం రుద్రాష్టకం పారాయణం చేయండి.

మిథున రాశి

మిథున రాశి వారికి ఈ వారం సాధారణంగా ఉంటుంది. వారం ప్రారంభంలో ఓ పనిపై చేసే ప్రయాణం శుభప్రదంగా  ఉంటుంది. ఈ సమయంలో కొత్త , పాత స్నేహితులను కలిసే అవకాశాలు ఉంటాయి. బంధువుల నుంచి పూర్తి మద్దతు పొందుతారు. వారం మధ్యలో కోర్టుకు సంబంధించిన కేసుల్లో మీరు పెద్ద విజయం సాధించవచ్చు. ఈ సమయంలో మీరు మీ ప్రత్యర్థులపై విజయం సాధిస్తారు. పని రంగంలో మీ ప్రత్యర్థుల ఎత్తులు విఫలమవుతాయి. ఈ సమయంలో మీరు కుటుంబంతో కలిసి ఏదైనా మతపరమైన కార్యక్రమంలో పాల్గొనే అవకాశం లభిస్తుంది. వారం చివర్లో మీరు అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేయడం ద్వారా మీ ఉత్సాహం పెరుగుతుంది. భాగస్వామ్య  వ్యాపారం చేసేవారికి ప్రత్యేక లాభం పొందే అవకాశాలు ఉంటాయి. ఏదైనా ప్రభుత్వ నిర్ణయం నుంచి గొప్ప ఉపశమనం లభిస్తుంది. ప్రేమ వ్యవహారాలలో అనుకూలత ఉంటుంది. భాగస్వామి మీపై ప్రేమను కురిపిస్తారు. వైవాహిక జీవితంలో  ఆనందం ఉంటుంది. ఆరోగ్య పరంగా ఈ వారం సాధారణంగా ఉంటుంది. గణపతి ఆరాధన చేయండి.

సింహ రాశి

సింహ రాశి వారికి ఈ వారం అనుకూల ఫలితాలను ఇస్తుంది. ఈ వారంలో ఆదాయానికి కొత్త మార్గాలు ఏర్పడటమే కాకుండా సీనియర్ వ్యక్తి సహాయంతో ప్రియమైన వారితో ఏర్పడిన అపార్థాలు తొలగిపోతాయి. ఉద్యోగస్తులకు గత కొన్ని రోజులుగా ఉన్న ఇబ్బందులు తొలగిపోతాయి. వ్యాపారంతో సంబంధం ఉన్న వ్యక్తులకు ప్రయాణాలు వారి పురోగతి  లాభానికి ప్రధాన కారణమవుతాయి. వారం మొదటి భాగంలో ఏదైనా పెద్ద కుటుంబ సమస్య పరిష్కరారం  అయినప్పుడు మీరు ఉపశమనం పొందుతారు. వారం మధ్యలో సంబంధాల పరంగా కొంచెం ప్రతికూలంగా ఉంటుంది. ఈ సమయంలో మీరు మీ బంధువులతో మర్యాదగా వ్యవహరించండి.  చిన్న చిన్న విషయాలను పట్టించుకోకుండా ఉండండి. వారం చివరి నాటికి విషయాలు సాధారణ స్థితికి వస్తాయి .  ఉద్యోగస్తులు ఈ వారం తమ పనిలో మార్పుల గురించి తొందరపడి నిర్ణయాలు తీసుకోకుండా ఉండాలి. ప్రేమ సంబంధాల్లో అనుకూలత ఉంటుంది. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. విష్ణు సహస్రనామం పారాయణం చేయండి.

తులా రాశి

తులా రాశి వారికి ఈ వారం చాలా శుభప్రదంగా ఉండబోతోంది. ఈ వారం మీకు ఆదాయానికి కొత్త మార్గాలు ఏర్పడతాయి. మీరు సమాజసేవ లేదా రాజకీయాలలో ఉంటే వారం మొదటి భాగంలో ప్రత్యేక విజయాన్ని సాధించవచ్చు. ఈ సమయంలో మీ హోదా పెరుగుతుంది.  మీ ప్రజాదరణ పెరుగుతుంది. ప్రజలు మీ నిర్ణయాలను మెచ్చుకుంటారు. ఈ సమయంలో పిల్లల నుంచి శుభవార్త వినవచ్చు. పూర్వీకుల ఆస్తిని పొందడంలో ఉన్న ఆటంకాలు వాటంతటవే తొలగిపోతాయి. ఉన్నత విద్య కోసం ప్రయత్నిస్తున్నట్లయితే  వారం మధ్యలో  చేసిన ప్రయత్నం విజయవంతమవుతుంది. ఈ సమయంలో చదువులో ఉన్న పెద్ద ఆటంకం తొలగిపోతుంది. ఉద్యోగస్తులు తమ పనితో సంతోషించి, వారి సీనియర్లు వారి పదోన్నతిని పెంచవచ్చు. మీరు విదేశాలలో కెరీర్ లేదా వ్యాపారం కోసం ప్రయత్నిస్తున్నట్లయితే, ఈ వారం అక్కడ నుంచి మీకు మంచి అవకాశాలు లభిస్తాయి. విదేశాలకు వెళ్లే అవకాశం కూడా లభిస్తుంది. ప్రేమ వ్యవహారాలకు ఈ వారం మొత్తం అనుకూలంగా ఉంటుంది. శ్రీసూక్తం పారాయణం చేయండి.

ధనుస్సు రాశి

ధనుస్సు రాశి వారికి ఈ వారం కొంచెం ఎక్కువ బిజీగా ఉంటుంది. వారం ప్రారంభంలో మీరు కెరీర్ లేదా వ్యాపారం కోసం ప్రయాణం చేయవలసి రావచ్చు. ఈ సమయంలో ఉద్యోగస్తులకు పని రంగంలో సవాలుతో కూడిన పనులు చేయాల్సి వస్తుంది. మీ ఉన్నత అధికారులు మీ సామర్థ్యాన్ని పరీక్షిస్తారు.  మీ ప్రత్యర్థులు మీ పనిలో ఆటంకాలు కలిగించడానికి ప్రయత్నిస్తారు. సహచరుల సహాయంతో చివరికి అప్పగించిన పనిని పూర్తి చేయగలుగుతారు. పరీక్షలకు మరియు పోటీలకు సిద్ధమవుతున్న విద్యార్థులు ఈ వారం చివరి నాటికి శుభవార్త వినవచ్చు. వ్యాపారంతో సంబంధం కలిగి ఉంటే, మీ వ్యాపారాన్ని విస్తరించే ప్రణాళికలు నెరవేరుతాయి. గృహిణులు ఎక్కువ సమయం మతపరమైన పనులలో గడుపుతారు. వారం చివరి నాటికి ఆర్థిక సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. ఈ వారం కుటుంబ నిర్ణయాలలో మీ పాత్ర ముఖ్యమైనది. వారం చివరి భాగంలో కుటుంబంతో కలిసి ఏదైనా శుభ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం లభిస్తుంది. ప్రేమ సంబంధాలు బలపడతాయి.  ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది. ఆదిత్య హృదయ స్తోత్రం పారాయణం చేయండి.

మీన రాశి

మీన రాశి వారికి ఈ వారం అదృష్టం కలిసొస్తుంది.  అనుకున్న పనులన్నీ సకాలంలో పూర్తవుతాయి. మీరు పదోన్నతికి అర్హులైతే, ఈ వారం మీ హోదా మరియు పదవి ఊహించిన దానికంటే ఎక్కువగా పెరుగుతుంది. పని రంగంలో సీనియర్లు మీకు పెద్ద బాధ్యతలను అప్పగించవచ్చు. వ్యాపారానికి సంబంధించిన సమస్యలు తొలగిపోతాయి. వ్యాపారాన్ని విస్తరించే ప్రణాళికలు నెరవేరుతాయి. మీరు మీ స్నేహితులు , బంధువుల నుంచి పూర్తి సహకారం అందుతుంది. కుటుంబం మీ నిర్ణయాలకు విలువ పెరుగుతుంది. సోదరులు, సోదరీమణులతో ప్రేమ  సామరస్యం ఉంటుంది. వారం చివరి భాగంలో భూమి , ఆస్తికి సంబంధించిన చట్టపరమైన విషయాలలో మీకు గొప్ప ఉపశమనం లభిస్తుంది. మీరు చాలా కాలంగా ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నట్టైతే సమయం కలిసొస్తుంది.  వారం చివర్లో ఇంటికి ప్రియమైన వారి రాక సంతోషాన్నిస్తుంది. ఆరోగ్యంబావుంటుంది. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. ఓం నమో భగవతే వాసుదేవాయ మంత్రాన్ని జపించండి.

గమనిక: జ్యోతిష్య శాస్త్ర పండితులు చెప్పినవి,  పుస్తకాల నుంచి సేకరించి రాసిన వివరాలివి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం. ఆయా రాశుల్లో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకంలో ఉండే గ్రహస్థితి ఆధారంగా ఫలితాలు మార్పులుంటాయి.

About the author RAMA

జర్నలిజంలో గత 15 ఏళ్లుగా పనిచేస్తున్నారు.  ప్రముఖ తెలుగు మీడియా సంస్థలు ఈటీవీ, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతిలో పని చేసిన అనుభవం ఉంది. ఏపీ, తెలంగాణ, రాజకీయ, సినిమా, ఆధ్యాత్మిక వార్తలు సహా వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక  MJMC, MSW, PGDPM కోర్సులు పూర్తిచేశారు. జర్నలిజం కోర్సు పూర్తి చేసి పలు తెలుగు మీడియా సంస్థలలో  కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో నాలుగేళ్లుగా డిప్యూటీ ప్రొడ్యూసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. 

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Nicolas Maduro: ఇంటి నుంచి నన్ను కిడ్నాప్ చేశారు.. నేను యుద్ధ ఖైదీని, నిజాయితీపరుడిని: అమెరికా కోర్టులో నికోలస్ మదురో
నన్ను కిడ్నాప్ చేశారు.. నేను యుద్ధ ఖైదీని, నిజాయితీపరుడిని: అమెరికా కోర్టులో నికోలస్ మదురో
Telangana Ticket Hikes: తెలంగాణలో టికెట్ రేట్స్... అటు 'దిల్' రాజు, ఇటు కోమటిరెడ్డి... మధ్యలో సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణలో టికెట్ రేట్స్... అటు 'దిల్' రాజు, ఇటు కోమటిరెడ్డి... మధ్యలో సీఎం రేవంత్ రెడ్డి
Blowout: గ్యాస్ డ్రిల్లింగ్ బ్లో అవుట్లు అసలు ఎలా జరుగుతాయి? ఎలా ఆపాలి ?
గ్యాస్ డ్రిల్లింగ్ బ్లో అవుట్లు అసలు ఎలా జరుగుతాయి? ఎలా ఆపాలి ?
Hyderabad Water Supply: హైదరాబాద్‌లో ఇక తాగునీటి సమస్య ఉండదు! 8 వేల కోట్లతో రింగ్ మెయిన్ ప్రాజెక్ట్
హైదరాబాద్‌లో ఇక తాగునీటి సమస్య ఉండదు! 8 వేల కోట్లతో రింగ్ మెయిన్ ప్రాజెక్ట్

వీడియోలు

History Behind Peppé Buddha Relics | భారత్‌కు తిరిగి వచ్చిన బుద్ధుని అస్థికలు! | ABP Desam
అగార్కర్‌పై మహ్మద్ షమి కోచ్ సంచలన కామెంట్స్
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా!
ఫార్మ్ లో లేడని తెలుసు  కానీ ఇలా చేస్తారని అనుకోలేదు: రికీ పాంటింగ్
ఇంకా అందని ఆసియా కప్ ట్రోఫీ.. నఖ్వీ షాకింగ్ కామెంట్స్..

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nicolas Maduro: ఇంటి నుంచి నన్ను కిడ్నాప్ చేశారు.. నేను యుద్ధ ఖైదీని, నిజాయితీపరుడిని: అమెరికా కోర్టులో నికోలస్ మదురో
నన్ను కిడ్నాప్ చేశారు.. నేను యుద్ధ ఖైదీని, నిజాయితీపరుడిని: అమెరికా కోర్టులో నికోలస్ మదురో
Telangana Ticket Hikes: తెలంగాణలో టికెట్ రేట్స్... అటు 'దిల్' రాజు, ఇటు కోమటిరెడ్డి... మధ్యలో సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణలో టికెట్ రేట్స్... అటు 'దిల్' రాజు, ఇటు కోమటిరెడ్డి... మధ్యలో సీఎం రేవంత్ రెడ్డి
Blowout: గ్యాస్ డ్రిల్లింగ్ బ్లో అవుట్లు అసలు ఎలా జరుగుతాయి? ఎలా ఆపాలి ?
గ్యాస్ డ్రిల్లింగ్ బ్లో అవుట్లు అసలు ఎలా జరుగుతాయి? ఎలా ఆపాలి ?
Hyderabad Water Supply: హైదరాబాద్‌లో ఇక తాగునీటి సమస్య ఉండదు! 8 వేల కోట్లతో రింగ్ మెయిన్ ప్రాజెక్ట్
హైదరాబాద్‌లో ఇక తాగునీటి సమస్య ఉండదు! 8 వేల కోట్లతో రింగ్ మెయిన్ ప్రాజెక్ట్
TG Sankranti Holidays: విద్యార్థులకు పండగే.. సంక్రాంతి సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
విద్యార్థులకు పండగే.. సంక్రాంతి సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
AP Caravan Tourism: ఏపీలో కారవాన్ టూరిజం ప్రారంభం.. ఎంచక్కా 4 మార్గాల్లో ప్రయాణం- ప్యాకేజీ, బుకింగ్ పూర్తి వివరాలు
ఏపీలో కారవాన్ టూరిజం ప్రారంభం.. 4 మార్గాల్లో ప్రయాణం- ప్యాకేజీ, బుకింగ్ పూర్తి వివరాలు
ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Kavitha: కవిత కన్నీరు వెనుక భావోద్వేగ వ్యూహం - రాజకీయ పార్టీ ప్రకటనకు సరైన ప్రణాళికతోనే వెళ్తున్నారా?
కవిత కన్నీరు వెనుక భావోద్వేగ వ్యూహం - రాజకీయ పార్టీ ప్రకటనకు సరైన ప్రణాళికతోనే వెళ్తున్నారా?
Embed widget