అన్వేషించండి

Venus Transit In Taurus 2025: వృషభం లోకి విలాసాధిపతి - జూన్ 29 నుంచి ఈ 3 రాశులవారికి ధనయోగం

Venus Transit in Taurus: మేషరాశిలో సంచరిస్తున్న శుక్రుడు..జూన్ 29న వృషభంలోకి అడుగుపెడతాడు. జూలై 26వరకూ ఇదే రాశిలో ఉంటాడు...ఈ సమయంలో 3 రాశులవారికి ధనయోగం..

Venus Transit In Taurus 2025: జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాలు ఓ రాశి నుంచి మరో రాశిలోకి ప్రవేశించిన ప్రతిసారీ ఆ ప్రభావం 12 రాశులపైనా ఉంటుంది. గ్రహసంచారం సమయంలోనూ, వేరే గ్రహాలతో సంయోగం సమయంలోనూ కొన్ని యోగాలు ఏర్పడతాయి. ముఖ్యంగా శుక్రుడు సంచారం జ్యోతిష్యశాస్త్రంలో చాలా ప్రత్యేకమైనదిగా భావిస్తారు. విలాసాలకు అధిపతి అయిన శుక్రుడు మే నెలలో మేషంలో ప్రవేశించాడు..జూన్ 29న వృషభ రాశిలోకి అడుగుపెట్టి జూలై 26 వరకూ ఇదే రాశిలో ఉంటాడు. శుక్రుడు శుభస్థానంలో ఉంటే ఆర్థికంగా లాభపడతారు. వృషభ రాశిలో శుక్రుడి సంచారం కొన్ని రాశులవారికి లాభాన్నిస్తుంది. 
 
మిథున రాశి

వృషభ రాశిలో శుక్రుడి సంచాం మిథునం నుంచి 11వ స్థానంలో జరుగుతోంది. ఈ రాశి నుంచి కుజుడు మూడో స్థానంలో ఉన్నాు. ఈ సమయంలో మిథున రాశివారికి ఆర్థికంగా లాభం ఉంటుంది. కష్టానికి తగిన ఫలితం పొందుతారు. ఏ పని ప్రారంభించినా మంచి ఫలితం సాధిస్తారు. ఎప్పటి నుంచో రావాల్సిన సొమ్ము మీ చేతికందుతుంది. ఉద్యోగులు ప్రమోషన్ కి సంబంధించిన సమాచారం వింటారు. వ్యాపారంలో లాభాలుంటాయి. కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. మీకు మంచి జరిగే సమయం ఇది.

కర్కాటక రాశి

మీ రాశి నుంచి శుక్రుడు పదో స్థానంలో సంచరిస్తున్నాడు. వృషభ రాశిలో శుక్రుడి సంచారం సమయంలో కర్కాటక రాశివారికి రాజయోగం ఏర్పడుతుంది. మీ రాశి నుంచి కుజుడు రెండో స్థానంలో ఉండడం, శుక్రుడు పదో స్థానంలో సంచారం వల్ల మీకు ధనయోగం ఉంది. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. ఉద్యోగం, వ్యాపారంలో వృద్ధి సాధిస్తారు. ఆర్థిక పరిస్థితి స్థిరంగా ఉంటుంది. ఈ సమయంలో ఇల్లు  లేదా వాహనం కొనుగోలు చేసే అవకాశం ఉంది. మానసిక ఒత్తిడి నుంచి బయటపడతారు. ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఏ పని చేసినా కలిసొస్తుంది.

కన్యా రాశి

మీ రాశి నుంచి శుక్రుడు భాగ్యస్థానంలో సంచరించడం వల్ల ప్రేమ ప్రయత్నాలు సఫలం అవుతాయి. అవివాహితులకు వివాహం నిశ్చయం అవుతుంది. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. పెండింగ్ లో ఉన్న డబ్బు చేతికందుతుంది. ఏ పని ప్రారంభించినా సక్సెస్ అవుతుంది. వివాదాలు సమసిపోయి సంతోషంగా ఉంటారు.

వృశ్చిక రాశి

వృషభంలో శుక్రుడి సంచారం అంటే మీ రాశి నుంచి ఏడో స్థానంలో ఉంది. ఈ సమయంలో ఆర్థికంగా మీరు ఊహించని లాభం పొందుతారు. శత్రువులను తెలివిగా ఎదుర్కొంటారు. జీవితంలో సానుకూలమైన ఫలితాలు సాధిస్తారు. కుజుడు మీ రాశి నుంచి పదో స్థానంలో ఉండడం వల్ల ఉద్యోగం, వ్యాపారంలో ఎదురయ్యే సమస్యలను పరిష్కరించుకోగలరు. మీరున్న ప్రతి రంగంలోనూ విజయం సాధిస్తారు. నూతన పెట్టుబడులు పెట్టేందుకు ఈ సమయం మంచిది.

మకర రాశి

వృషభంలో శుక్రుడి సంచారం అంటే మీ రాశినుంచి ఐదో స్థానంలో ఉంటుంది. ఈ సమయం మొత్తం మీకు ఉత్సాహంగా గడుస్తుంది. ఇప్పటివరకూ వెంటాడిన సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. సంతానం కారణంగా సంతోషంగా ఉంటారు. నిరుద్యోగులు ఉద్యోగంలో స్థిరపడతారు. ఆర్థిక సమస్యలు తీరిపోతాయి. పెట్టుబడులు కలిసొస్తాయి

శుక్రుడు
హిమకుంద మృణాళాభం | దైత్యానాం పరమం గురుం
సర్వ శాస్త్ర ప్రవక్తారం | భార్గవం ప్రణమామ్యహం ||

గమనిక: జ్యోతిష్య శాస్త్ర పండితులు చెప్పినవి,  పుస్తకాల నుంచి సేకరించి రాసిన వివరాలివి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం. ఆయా రాశుల్లో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకంలో ఉండే గ్రహస్థితి ఆధారంగా ఫలితాలు మార్పులుంటాయి.

About the author RAMA

జర్నలిజంలో గత 15 ఏళ్లుగా పనిచేస్తున్నారు.  ప్రముఖ తెలుగు మీడియా సంస్థలు ఈటీవీ, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతిలో పని చేసిన అనుభవం ఉంది. ఏపీ, తెలంగాణ, రాజకీయ, సినిమా, ఆధ్యాత్మిక వార్తలు సహా వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక  MJMC, MSW, PGDPM కోర్సులు పూర్తిచేశారు. జర్నలిజం కోర్సు పూర్తి చేసి పలు తెలుగు మీడియా సంస్థలలో  కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో నాలుగేళ్లుగా డిప్యూటీ ప్రొడ్యూసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. 

Read More

టాప్ హెడ్ లైన్స్

మోదీకి ఆగష్టు అగ్నిపరీక్ష, పెరగనున్న అమిత్ షా పాత్ర! యువత ఉద్యమం, పరీక్షల సంస్కరణలు, ప్రతిపక్షాల వ్యూహాలు
మోదీకి ఆగష్టు అగ్నిపరీక్ష, పెరగనున్న అమిత్ షా పాత్ర! యువత ఉద్యమం, పరీక్షల సంస్కరణలు, ప్రతిపక్షాల వ్యూహాలు
ఆగస్టు 15 లోపు ఏం జరగబోతోంది? నీట్ నుంచి యువత ఉద్యమం, వ్యవస్థాగత సంస్కరణలు తప్పవా?
ఆగస్టు 15 లోపు ఏం జరగబోతోంది? నీట్ నుంచి యువత ఉద్యమం, వ్యవస్థాగత సంస్కరణలు తప్పవా?
ఆగష్టు 2026: మోదీ ప్రభుత్వానికి జ్యోతిష్య రాజకీయ పరీక్ష? గ్రహణం, కుజ-రాహువుల ప్రభావం
ఆగష్టు 2026: మోదీ ప్రభుత్వానికి జ్యోతిష్య రాజకీయ పరీక్ష? గ్రహణం, కుజ-రాహువుల ప్రభావం
07-08-2026 శుక్రవారం మీ రాశిఫలాలు!
07-08-2026 శుక్రవారం మీ రాశిఫలాలు!

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mancherial News: ఛీ.. మీ ముఖాలు చూడ‌టం ఇష్టం లేదు... కింద కూర్చోండి! అంగన్వాడీ టీచర్లపై సర్పంచ్ అమానుషం
ఛీ.. మీ ముఖాలు చూడ‌టం ఇష్టం లేదు... కింద కూర్చోండి! అంగన్వాడీ టీచర్లపై సర్పంచ్ అమానుషం
Anakapalle Latest News:
"అనకాపల్లిలోని కళ్యాణపులోవ రిజర్వాయర్‌ను నో మైనింగ్ జోన్‌గా ప్రకటించాలి" రైతులు, గిరిజనుల జల దీక్ష !
Nethanna Seva Lo: జాతీయ చేనేత దినోత్సవం నాడు నేతన్న సేవలో పథకం ప్రారంభం! 71వేల కుటుంబాలకు ఆర్థిక ఊతం!
జాతీయ చేనేత దినోత్సవం నాడు నేతన్న సేవలో పథకం ప్రారంభం! 71వేల కుటుంబాలకు ఆర్థిక ఊతం!
Hyderabad Crime News: వినాయకుడి ప్రసాదమే పెట్టుబడిగా వ్యాపారం చేసిన గణేష్‌! 51 లక్షలకు లడ్డూ కొని 3.45కోట్లతో పరార్‌!
వినాయకుడి ప్రసాదమే పెట్టుబడిగా వ్యాపారం చేసిన గణేష్‌! 51 లక్షలకు లడ్డూ కొని 3.45కోట్లతో పరార్‌!
CBI On NEET Paper Leak: నీట్ పేపర్‌ లీక్ చేసింది ఎన్‌టీఏ నిపుణులే! సీబీఐ ఛార్జ్ షీట్‌లో దిగ్భ్రాంతికర విషయాలు!
నీట్ పేపర్‌ లీక్ చేసింది ఎన్‌టీఏ నిపుణులే! సీబీఐ ఛార్జ్ షీట్‌లో దిగ్భ్రాంతికర విషయాలు!
YSRCP Protest On DSC Irregularities: డీఎస్సీ అక్రమాలపై వైసీపీ ఆందోళనలు!సీబీఐ విచారణకు జగన్ డిమాండ్!
డీఎస్సీ అక్రమాలపై వైసీపీ ఆందోళనలు!సీబీఐ విచారణకు జగన్ డిమాండ్!
Korean Kanakaraju Review - కొరియన్ కనకరాజు రివ్యూ: హారర్ కామెడీ నవ్వించిందా? వరుణ్ తేజ్ సినిమా హిట్టా? ఫట్టా?
కొరియన్ కనకరాజు రివ్యూ: హారర్ కామెడీ నవ్వించిందా? వరుణ్ తేజ్ సినిమా హిట్టా? ఫట్టా?
Divorce After Marriage : పెళ్లయిన ఎన్ని సంవత్సరాల తర్వాత విడాకులు ఎక్కువగా జరుగుతున్నాయో తెలుసా?కారణాలు ఇవే
పెళ్లయిన ఎన్ని సంవత్సరాల తర్వాత విడాకులు ఎక్కువగా జరుగుతున్నాయో తెలుసా?కారణాలు ఇవే
Embed widget