మనసులోని మాట పెదవి దాటదు, ఈ రాశివారు ఎమోషన్స్ దాచేసుకుంటారు!
జోడియాక్ సైన్ ను అనుసరించి వ్యక్తీకరణ సామర్థ్యం ఇలా ఉంటుంది. కొందరు మనసులో మాట బయట పెట్టరు. భావోద్వేగాలను బయటకు చూపించడం పెద్దగా నచ్చదు అనడం కంటే సరిగ్గా వ్యక్తం చెయ్యలేరని అనడం బావుటుంది.
మనలో ఒక్కొక్కరిది ఒక్కో రకమైన స్వభావం. కొంత మంది చాలా త్వరగా జనంలో కలిసి పోతారు. మనసులో మాట పెద్దగ దాచుకోరు. ఏ మాత్రం సంతోషం వచ్చినా పట్టుకోలేము, ఏకాస్త కోపం వచ్చినా భరించలేము అలా ఉంటుంది వీరి తీరు. మరి కొందరు మనసులో మాట అంత త్వరగా బయట పెట్టరు. అది ఆనందమైనా, దు:ఖమైనా మరేదైనా. భావోద్వేగాలను బయటకు చూపించడం పెద్దగా నచ్చదు అనడం కంటే సరిగ్గా వ్యక్తం చెయ్యలేరని అనడం బావుటుంది. అయితే రిలేషన్ షిప్ ఏదైనా సరే ఇద్దరు వ్యక్తుల మధ్య కమ్యూనికేషన్ అనేది చాలా ముఖ్యమైన విషయం అది సరిగా లేకపోతే మనసులో మాట తెలియపరచడంలో విఫలమైతే చాలా కష్టం. మనసులోని భావోద్వేగాలను ఇలా దాచుకోవడంలో కొన్ని జోడియాక్ సైన్స్ చాలా నిష్ణాతులు. వారేవరో ఒకసారి చూసి మరి అందులో మీరున్నారా? లేక మీ ఆత్మీయులు ఉన్నారా? తెలుసుకోండి.
టారస్ (వృషభ రాశి)
వీరు అంత త్వరగా ఎదుటి వ్యక్తిని నమ్మరు. మనసులో మాట తెలుసుకోవాలంటే ముందుగా వీరి నమ్మకాన్ని గెలుచుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే హర్టింగ్ ను ఎదుర్కోవడం వీరి వల్ల కాదని వీరి ఫీలింగ్. అందువల్ల అంత త్వరగా మనసులో మాట బయట పెట్టరు. ముఖ్యంగా బాధను అంత త్వరగా బయట పెట్టరు. ఒక్కరే లోపల కుమిలిపోతుంటారు. ఎంత దగ్గరి వారైనా సరే వారు నమ్మితే తప్ప తమ మనసులోని విషయాలను అంత త్వరగా షేర్ చేసేందుకు సిద్ధ పడరు.
విర్గో (కన్య రాశి)
వీరు వీరి ఏమోషన్స్ పట్ల విపరీతమైన కాన్సియస్ గా బిహేవ్ చేస్తారు. ముఖ్యంగా తమలో ఉన్న గుణాల్లో ఏదైనా బలహీనత గా వారికి అనిపిస్తే ఎట్టి పరిస్థితుల్లో అది ఇతరులకు తెలియడానికి వీల్లేదు అన్నట్టు ఉంటుంది వీరి ప్రవర్తన. హర్ట్ అవుతావేమో అనే భయం వీరికి చాలా బలంగా ఉంటుంది. మనసు బాధ పెట్టుకోవడం కంటే ఒంటరిగా ఉన్నా ఫర్వాలేదు అనుకుంటారు. ఇక ఎమోషన్స్ దాచుకోవడం వీరు చూపించే నైపుణ్యం చాలా ఎక్కువ.
లిబ్రా (తులా రాశి)
తమకు సంబంధించిన విషయాలను తమ వరకే పరిమితం చేసుకోవడంలో వీరు దిట్టలు. మనసులోని విషయాలను మనసులోనే బంధించి ఉంచేస్తారు. కొన్ని సార్లు మనసులో మాటలు బయటపెట్టక పోవడం వల్ల తాము అత్యంత ప్రేమించే వ్యక్తులకు కూడా వీరికి ఎమోషన్ లేని మనుషులుగా అనిపిస్తారు. చాలా తక్కువ సందర్భాల్లో వీరు తమ మనసులో మాట బయటపెట్టెందుకు సిద్ధ పడతారు కానీ చాలా వరకు ఎమోషన్స్ దాచి ఉంచుకుంటారు.
స్కార్పియో (వృశ్చిక రాశి)
రాశి చక్రంలో వీరిది చాలా కాంప్లెక్స్ మనస్థత్వం గా చెప్పుకోవచ్చు. ఎదుటి వారిని నమ్మకపోవడం మాత్రమే కాదు ఎట్టి పరిస్థితుల్లోనూ వీరి మనసులోని మాట బయటి వారు కనిపెట్టకుండా జాగ్రత్త పడతారు. ఎవరో ఒకరు అత్యంత ఆప్తులు లేదా అత్యంత ప్రియమైన వారు జీవితంలో తరస పడి, వారి మీద వీరికి పూర్తిగా గురి కుదిరి, వీరిని బాగా అర్థం చేసుకున్నారనే నమ్మకం ఏర్పడే వరకు మనసు విప్పి మాట్లాడరు.
కాప్రికాన్ (మకర రాశి)
మనసులో మాట బయట పెట్టడం అంటేనే విపరీతమైన భయం వీరికి. ఫీలింగ్స్ దాచుకోవడం వల్ల సురక్షితంగా ఉండొచ్చు అనే ఉద్దేశంలో ఉంటారు. ఎవరో ఒకరు చాలా దగ్గరై, నమ్మకం కలిగించి, ఫీలింగ్స్ బయటికి చెప్పడం ఎలాగో అర్థం చేయించే వరకు వీరు వీరి షెల్ లో నుంచి బయట పడరు.
అక్వేరియస్ (కుంభ రాశి)
అసలు ఫీలింగ్స్, రిలేషన్ షిప్స్ అనే మాట వింటేనే ఆమడ దూరం పారిపోతారు అక్వేరియన్స్. ఫీలింగ్స్ బయటపెట్టడం అంటేనే చాలా అసౌకర్యంగా ఫీల్ అవుతారు. వీళ్ల పర్సనాలిటిలోని ఈ కోణాన్ని ఎప్పుడూ దాచి ఉంచాలని అనుకుంటారు. ఒక వేళ ఎవరైనా ఆ విషయంలో కదిలించే ప్రయత్నం చేసినా, ప్రశ్నించినా నెమ్మదిగా అక్కడి నుంచి తప్పుకోవడమో లేక వేరే వారితో మాట్లాడటమో చేస్తారు.
ఇక ఈ ఆరురాశులకు భిన్నంగా ఏరిస్ (మేషం), జెమిని (మిథునం), క్యాన్సర్ (కర్కాటకం), లియో (సింహం), సాజిటేరియస్ (ధనస్సు), పైసిస్ ( మీనం) రాశుల వారు తమ తమ ఫీలింగ్స్ ను తమకు ఆప్తులు అనే వారి ముందు బయట పెట్టడానికి వెనుకాడరు. ఇలా మన వారికి మనసులో ఫీలింగ్స్ చెప్పకపోతే అది అనుబంధాన్ని దెబ్బతీస్తుందని వీరి నమ్మకం. ఏది ఏమైనా మనసులో ఉన్న ప్రతీ ఒక్క మాట బయట పెట్టడం ఎంత ప్రమాదకరమో అవసరమైన ఫీలింగ్స్ బయట పెట్టకపోవడం కూడా అంతే ప్రమాదకరం.
Also Read: కర్వా చౌత్(అట్ల తదియ) ఎప్పుడొచ్చింది, ఆ రోజు ప్రత్యేకత ఏంటి!