Revanth Reddy Astrology 2023 : ఇదీ రేవంత్ రెడ్డి జాతకం - అందుకే అఖండ విజయం- రాజయోగం!
Revanth Reddy Astrology: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి గురించి, తన జాతకం గురించి సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది....
![Revanth Reddy Astrology 2023 : ఇదీ రేవంత్ రెడ్డి జాతకం - అందుకే అఖండ విజయం- రాజయోగం! Revanth Reddy Astrology Horoscope 2023 Revanth Reddy Jathakam Telangana Revanth Reddy Birth Chart knoe in telugu Revanth Reddy Astrology 2023 : ఇదీ రేవంత్ రెడ్డి జాతకం - అందుకే అఖండ విజయం- రాజయోగం!](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/12/03/9728571f02dec4777b432c7e5c0bdfec1701615368814217_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Revanth Reddy Astrology 2023: ఈ రోజు తెలంగాణ గడ్డపై కాంగ్రెస్ జెండా మళ్లీ ఎగురుతోందంటే మొత్తం క్రెడిట్ ద వన్ అండ్ ఓన్లీ రేవంత్ రెడ్డి అని స్ట్రాంగ్ గా చెప్పాలి. కొండారెడ్డి పల్లె అనే చిన్న ఊళ్లో రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టిన రేవంత్ రెడ్డి..ఏకంగా కుంభస్థలాన్నే కొట్టారు. తెలంగాణ గడ్డమీద కేసీఆర్ ను కొట్టేవారున్నారా అనే సందేహాలకు చెక్ పెడుతూ విజయం సాధించారు. హస్తం పార్టీ గెలుపు వెనుక వంద కారణాలు చెప్పినా కానీ... క్రెడిట్ మాత్రం రేవంత్ రెడ్డిదే అని చెప్పాలి. ఇంత సాధించారంటే.. రేవంత్ లో ఆత్మవిశ్వాసం, పోరాటతత్వంతో పాటూ గ్రహాల అనుకూలత కూడా అని చెబుతారు జ్యోతిష్య శాస్త్ర పండితులు...
ఇదీ రేవంత్ రెడ్డి జాతకం
రేవంత్ రెడ్డి నక్షత్రం - చిత్త
రాశి- తులా రాశి
ఏడో స్థానంలో గురుడు ( బృహస్పతి)
ఈ నక్షత్రానికి ఏడో స్థానంలో గురుడు( బృహస్పతి) సంచరిస్తున్నాడు. జాతకంలో గురుబలం బలంగా ఉంటే విశేషమైన బలం, ఆత్మస్థైర్యం ఉంటుంది. ఎలాంటి కష్టాన్ని అయినా ఎదుర్కొనే చాకచక్యం వస్తుంది. సమస్యలకి తలొంచి ఆగిపోకుండా దూసుకెళ్లే ఆలోచన కలుగుతుంది. రేవంత్ లో ఈ తీరు స్పష్టంగా కనిపిస్తుంది
రాశ్యాధిపతి శుక్రుడు
తులా రాశికి అధిపతి శుక్రుడు. శుక్రుడు రాజయోగాన్ని, వైభోగాన్ని కల్పిస్తాడు. అందుకే తెలంగాణలో కాంగ్రెస్ గట్టిపోటీ ఇస్తుంది కానీ తప్పనిసరిగా గెలుస్తారని ఊహించలేదు...కానీ...ఇదే శుక్రబలం రేవంత్ ని రాజుగా నిలబెట్టింది..రాజయోగాన్నిచ్చింది.
తగ్గిన కుజుడి ప్రభావం
ఈ నక్షత్రానికి అధిపతి కుజుడు. కుజుడు ఏ జాతకుడికి అయినా ఏడేళ్లపాటూ ఉహించనంత దెబ్బకొట్టి, మళ్లీ కోలుకుంటారో లేదో తెలియనంత ఇబ్బందులకు గురిచేసి...ఆ తర్వాత ఉన్నపాటుగా ఊహించనంత ఉపశమనం ఇస్తాడు. దాదాపు ఏడెనిమిదేళ్లుగా రేవంత్ ఎదుర్కోని ఇబ్బంది లేదు. ఓ దశలో రాజకీయ జీవితం ముగిసిపోతుందనుకున్నారు. కానీ ఈ రోజు ఈ ఏడాది కుజుడి ప్రభావం తగ్గడంతో పాటూ ఊహించనంత ఉపశమనం లభించింది.
ఐదో స్థానంలో శని
చిత్తా నక్షత్రం తులారాశివారికి ప్రస్తుతం శని ఐదో స్థానంలో సంచరిస్తున్నాడు. శని జన్మంలో, అష్టమంలో ఉన్నప్పుడు తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తాడు కానీ...ఐదో స్థానంలో ఉన్నప్పుడు శనిప్రభావం అంతగా ఉండదు. పైగా గురువు, శుక్రుడు బలంగా ఉన్నప్పుడు శని ప్రభావం అంతంత మాత్రమే.
జాతకంలో శుక్రుడి బలం ఉంటే
సాధారణంగా శుక్రుడి సంచారం బావుంటే.. జీవితంలో సంపద, శ్రేయస్సు, ఆనందం, ఆకర్షణ, అందం, ప్రేమ, యోగం ఉంటుంది. ఇది సృజనాత్మకత, కళలు, సంగీతం, కవిత్వం, రాజకీయం, విలాసవంతమైన ప్రయాణం, విలాసవంతమైన ఆహారం, లగ్జరీ కి సంబంధించిన అంశాలను సూచిస్తుంది.
జాతకంలో బృహస్పతి బలం ఉంటే
గురుడు మంచి స్థానంలో సంచరిస్తే అన్నీ శుభఫలితాలే ఉంటాయంటారు జ్యోతిష్యశాస్త్ర నిపుణులు. పెద్ద గ్రహాల్లో ఒకటిగా చెప్పే బృహస్పతి మంచి స్థానంలో ఉంటే విద్య, సమాజంలో ఉన్నతస్థానం, వివాహం, పిల్లలు, దాంపత్యానికి సంబంధించి శుభఫలితాలు ఇస్తుంది.
ఓవరాల్ గా చెప్పుకుంటే రేవంత్ రెడ్డికి...రాష్ట్రంలో పరిస్థితులు, ప్రభుత్వ వ్యతిరేకత, తన పట్టుదల, కష్టపడే తత్వంతో పాటూ గ్రహాలు కూడా సంపూర్ణంగా అనుకూలించాయి.
నోట్: ఇంటర్నెట్లో రేవంత్ రెడ్డి రాశిచక్రం, అంశచక్రం ఇదే అని వైరల్ అవుతోంది. దాని ఆధారంగా రాసిన కథనం ఇది. దీనిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం...
Also Read: వికటించిన వ్యూహాలు - కాంగ్రెస్ విజయానికి దోహదం చేసిన బీజేపీ, బీఆర్ఎస్ !
కవచకుండలాల్ని వదేలిసి ఎన్నికలకు కేసీఆర్ - టీఆర్ఎస్‌ను బీఆర్ఎస్‌గా మార్చడమే దెబ్బకొట్టిందా ?
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)