2025 నవంబర్ 22 రాశిఫలాలు - మేషం నుంచి మీనం.. ఈ రోజు మీ రాశి ఎలా ఉందో తెలుసుకోండి!
2025 నవంబర్ 22 రాశిఫలం: మేషం, తులా, కన్య, వృశ్చిక రాశుల వారు ధనం, వ్యాపారంలో జాగ్రత్త వహించండి.

2025 నవంబర్ 22 రాశిఫలాలు - Rasi Phalalu Today in Telugu 22 November 2025
మేష రాశి
ఈ రోజు మీరు పని రంగంలో మీ మంచి ఆలోచనల నుంచి ప్రయోజనం పొందుతారు. అందరూ మీ సూచనలను స్వాగతిస్తారు. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు ప్రయత్నం కొనసాగించాలి. పిల్లలతో సరదాగా గడుపుతారు. సహోద్యోగులతో స్నేహపూర్వకంగా ఉండండి. మాట తీరు గౌరవాన్ని తెస్తుంది, కాని పని రంగంలో ఏదైనా తప్పుడు ఆరోపణలు రావచ్చు
అదృష్ట సంఖ్య: 3
అదృష్ట రంగు: ఎరుపు
పరిహారం: హనుమంతునికి బెల్లం సమర్పించండి.
వృషభ రాశి
రాజకీయాల్లో ఉన్నవారికి ఈ రోజు బాగుంటుంది. గతంలో తీసుకున్న అప్పు చాలా వరకు తీర్చవచ్చు. కుటుంబ సభ్యులలో ఒకరు ఉద్యోగం కోసం దూరంగా వెళతారు. చాలా పనులు ఒకేసారి రావడంతో బిజీగా ఉంటారు, ఆలోచించి అడుగులు వేయండి. అవివాహితులకు మంచి సంబంధం రావచ్చు.
అదృష్ట సంఖ్య: 6
అదృష్ట రంగు: తెలుపు
పరిహారం: లక్ష్మీదేవిని పూజించండి
మిథున రాశి
ఈ రోజు బాధ్యతలతో కూడిన రోజు అవుతుంది. నిర్లక్ష్యం చేయవద్దు. కొత్త పెట్టుబడుల నుంచి లాభం పొందుతారు. కుటుంబ సభ్యులలో ఒకరి ఆరోగ్యం కారణంగా పరుగెత్తాల్సి వస్తుంది. శుభ కార్యక్రమాలతో ఇంట్లో ఆనందం పెరుగుతుంది. ఇచ్చిన డబ్బు తిరిగి వచ్చే అవకాశం ఉంది. తల్లిదండ్రుల ఆశీస్సులతో ఆగిపోయిన పని పూర్తవుతుంది.
అదృష్ట సంఖ్య: 5
అదృష్ట రంగు: ఆకుపచ్చ
పరిహారం: రావి చెట్టు కింద దీపం వెలిగించండి.
కర్కాటక రాశి
ఈ రోజు పురోగతికి దారి తీస్తుంది. పనుల్లో అలసత్వం చూపించవద్దు. డిజైనింగ్ , మార్కెటింగ్ రంగంలో ఉన్న వ్యక్తులు కష్టానికి ప్రతిఫలం పొందుతారు. గృహ జీవిత సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఏదైనా పాత తప్పు బయటపడితే క్షమాపణ చెప్పవలసి రావచ్చు.
అదృష్ట సంఖ్య: 2
అదృష్ట రంగు: నీలం
పరిహారం: శివునికి పాలతో అభిషేకం చేయండి
సింహ రాశి
ఈ రోజు మంచి ఫలితాలను ఇస్తుంది. మీరు ఏదైనా కొత్త పనిని ప్రారంభించవచ్చు. ఆస్తి వివాదంలో మీ వైపున నిర్ణయం రావచ్చు. కుటుంబ సభ్యులకు సలహా ఇచ్చేటప్పుడు జాగ్రత్త వహించండి. ఇంటి పునరుద్ధరణ కోసం ఎక్కువ ఖర్చు చేస్తారు.
అదృష్ట సంఖ్య: 1
అదృష్ట రంగు: బంగారు
పరిహారం: ఇంట్లో దీపం వెలిగించండి.
కన్యా రాశి
ఈ రోజు బాగానే ఉంటుంది. పనిచేసే ప్రదేశంలో సహచరుల మద్దతు లభిస్తుంది, కాని ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు. వాహనాన్ని జాగ్రత్తగా నడపండి. కుటుంబంతో కలిసి మతపరమైన కార్యక్రమంలో పాల్గొంటారు. విద్యార్థులు సోమరితనం వదిలి ప్రవర్తనలో మార్పులు తీసుకురావాలి.
అదృష్ట సంఖ్య: 9
అదృష్ట రంగు: లేత ఆకుపచ్చ
పరిహారం: ఆవుకు ఆకుకూరలు తినిపించండి.
తులా రాశి
శుభవార్త మీద శుభవార్త వినే అవకాశం ఉంది. తండ్రి ఆస్తి పంపకాల గురించి ఇంట్లో చర్చజరుగుతుంది. పాత పథకం పూర్తవుతుంది. పిల్లల కెరీర్ గురించి ముఖ్యమైన నిర్ణయం తీసుకోవలసి రావచ్చు. పదోన్నతికి సంబంధించిన సమాచారం వింటారు
అదృష్ట సంఖ్య: 8
అదృష్ట రంగు: గులాబీ
పరిహారం: దుర్గామాతకు ఎర్రటి పువ్వులు సమర్పించండి.
వృశ్చిక రాశి
ఏదైనా పని పూర్తి కాకపోవడంతో మనస్సు కలత చెందుతుంది. అనారోగ్య సమస్యలు ఉండవచ్చు. ఎవ్వరి మాటలు పట్టించుకోవద్దు.. పనిలో పురోగతి సాధిస్తారు. తండ్రి సలహా ఉపయోగకరంగా ఉంటుంది. పరీక్ష ఫలితాలతో ఆనందం లభిస్తుంది. ఇంట్లో అభిరుచి గల వస్తువులను తీసుకురండి
అదృష్ట సంఖ్య: 4
అదృష్ట రంగు: మెరూన్
పరిహారం: మంగళవారం హనుమాన్ ని ధ్యానించండి
ధనుస్సు రాశి
మీ మాటలలో ప్రవర్తనలో మాధుర్యాన్ని ఉంచుకోండి. సామాజిక రంగంలో పనిచేసే వారికి కొత్త గుర్తింపు లభిస్తుంది. ఉద్యోగం చేసేవారికి పదోన్నతి బదిలీ అవకాశాలు లభిస్తాయి. పిల్లల చదువు మిమ్మల్ని ఆందోళనకు గురి చేస్తుంది, దీని కోసం మీరు కోర్సులో చేర్పించవచ్చు. వ్యాపారంలో భాగస్వామ్యాన్ని నివారించండి.
అదృష్ట సంఖ్య: 7
అదృష్ట రంగు: పసుపు
పరిహారం: గురువారం అరటి చెట్టుకు పూజ చేయండి.
మకర రాశి
ఈ రోజు సమస్యలతో నిండి ఉంటుంది. ఆరోగ్యంలో హెచ్చు తగ్గులు ఉంటాయి. డబ్బు వస్తుంది కాని ఖర్చులు పెరుగుతాయి. కుటుంబ బాధ్యతలను నిర్లక్ష్యం చేయవద్దు. ప్రేమ జీవితం ఆనందంగా ఉంటుంది. భాగస్వామి ప్రతి పనిలోనూ మద్దతు ఇస్తారు.
అదృష్ట సంఖ్య: 10
అదృష్ట రంగు: బూడిద రంగు
పరిహారం: నల్ల నువ్వులను నీటిలో వేయండి
కుంభ రాశి
వ్యాపారం కోసం కొత్త పథకాలు రూపొందిస్తారు. పెద్దల సహాయంతో కుటుంబ సమస్యలు పరిష్కారమవుతాయి. ప్రవర్తనలో మాధుర్యాన్ని కొనసాగించండి. కొత్త పనిలో ఆసక్తి పెరుగుతుంది. రాజకీయాల్లో ఉన్నవారికి పనులు పెరుగుతాయి.
అదృష్ట సంఖ్య: 11
అదృష్ట రంగు: నీలం
పరిహారం: అవసరమైన వారికి దుప్పటి దానం చేయండి.
మీన రాశి
ఈ రోజు మిశ్రమ ఫలితాలను ఇస్తుంది. జీవిత భాగస్వామి కెరీర్ గురించి ఆందోళన ఉంటుంది. విద్యార్థులు చదువులో నిర్లక్ష్యం చేయకూడదు. స్నేహితులు డబ్బు అడగవచ్చు, ఆలోచించి ఇవ్వండి. ఏదైనా పని అసంపూర్తిగా మిగిలిపోవచ్చు. ఉద్యోగంలో శుభవార్త వింటారు
అదృష్ట సంఖ్య: 12
అదృష్ట రంగు: ఊదా
పరిహారం: విష్ణు సహస్రనామం పారాయణం చేయండి లేదా వినండి.
గమనిక: జ్యోతిష్య శాస్త్ర పండితులు చెప్పినవి, పుస్తకాల నుంచి సేకరించి రాసిన వివరాలివి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం. ఆయా రాశుల్లో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకంలో ఉండే గ్రహస్థితి ఆధారంగా ఫలితాలు మార్పులుంటాయి.





















