అన్వేషించండి

Navagraha Homam :ఆరోగ్యం బాగోపోతే హోమం చేయాలని ఎందుకంటారు!

Navagraha Homam : తరచూ అనారోగ్య సమస్యలు వెంటాడుతున్నప్పుడు ఇంట్లో హోమం చేసుకోండి మంచిది అని చెబుతారు. హోమం చేస్తే నిజంగా అరోగ్యం బాగవుతుందా…ఇందులో నిజమెంత..!

“పూర్వజన్మ కృతం పాపం వ్యాధిరూపేణ పీడ్యతే
తచ్చాంతిఃఔషధైఃదానైఃజపహోమ క్రియాదిభిః”

శారీరక,మానసిక లోపాలకు శాంతిగా ఔషధాలు తీసుకోవడం, దానాలు-జపాలు-హోమాలు చేయడం హిందువుల సంప్రదాయం. వీటన్నింటిలో ముఖ్యమైనది హోమ ప్రక్రియ...దీన్నే జ్యోతిర్వైద్యం అని కూడా అంటారు. ఒక్కో గ్రహానికి వేరు వేరు వృక్షాల సమిధలతో హోమం చేస్తే జాతకంలో ఆ గ్రహాల ప్రభావం తగ్గడం మాత్రమే కాదు సంపూర్ణ ఆరోగ్యవంతులవుతారు. 

రవి
తెల్లజిల్లేడు సమిధలతో రవికి హోమం చేస్తే..వాత,కఫ వ్యాధులు తగ్గుతాయి. కళ్ళకి సంబంధించిన అనారోగ్యం నయమవుతుంది. కోప స్వభావం తగ్గుతుంది. ఆయుర్వేదం ప్రకారం తెల్లజిల్లేడుకి కుష్టు వ్యాధిని నివారించే శక్తి ఉంది. వాస్తు దోషాలు కూడా నయమవుతాయి.

చంద్రుడు
మోదుగ సమిధలతో చంద్రుడికి హోమం చేస్తే ఆలోచనా విధానంలో మార్పులుంటాయి. సుఖవ్యాధులు దరిచేరవు. మోదుగాకును మెత్తగా నూరి పాలలో వేసుకుని తాగితే.. స్త్రీలకు ఋతుసంబంధ సమస్యలు,గర్భ సంబంధ సమస్యలు ఉండవు.మోదుగ పువ్వులు,గింజలు ఎండబెట్టి నీటిలో ఒక పావు చెంచా వేసి మరిగించి తాగితే సన్నబడతారట. జీర్ణ వ్యవస్థను మెరుగుపరిచే శక్తి కూడా మోదుగకు ఉందంటారు ఆయుర్వేద వైద్యులు.

Also Read: నవంబరు 8న చంద్రగ్రహణం, పట్టు-విడుపు సమయాలు, ఏ రాశులవారు చూడకూడదంటే!

కుజుడు
కుజుడికి చండ్ర సమిధలతో హోమం చేస్తారు. ఈ పొగ పీల్చడం వల్ల ఎర్రరక్త కణాల ఇబ్బందులు,ఎముకల బలహీనత తగ్గుతుంది. పచ్చి పోక చెక్కలు కషాయం పెట్టి సేవిస్తే మదుమేహం, కోపస్వభావం తగ్గుతుంది.

బుధుడు
ఉత్తరేణి సమిధతో హోమం చేస్తే చర్మ వ్యాధులు తగ్గుతాయి. జీర్ణ సంభంధ సమస్యలు ఉండవు. ఉత్తరేణి పుల్లతో నిత్యం దంతధావనం చేస్తే పళ్లు స్ట్రాంగ్ గా ఉంటాయి. ఉత్తరేణి ఆకులు,గింజలు పొగ వేసి పీలిస్తే దీర్ఘ కాలంగా ఉన్న దగ్గు,జలుబు,ఆయాసం తగ్గుతాయని ఆయుర్వేద నిపుణులు చెబుతారు

గురువు
రావి సమిధలతో హోమంచేస్తే సంతాన దోషాలు తొలగిపోతాయి. రావి చెక్క కషాయాన్ని తేనెలో కలిపి తీసుకుంటే రక్తంలో దోషాలు తొలగిపోతాయి, కాలేయ సమస్యలు ఉండవు, వివిధ కఫ దోషాలు పోతాయి

శుక్రుడు
మేడి చెట్టు సమిధలతో శుక్రుడికి హోమంచేస్తే వివాహ సమస్యలు,వైవాహిక సంబంధ సమస్యలు ఉండవు. మోడిపండులో విత్తనాలు పొడిచేసి తేనెతో కలపి తీసుకుంటే మధుమేహం దరిచేరదు.

Also Read: నవంబరు 8 కార్తీక పౌర్ణమి రోజు చంద్రగ్రహణం, ఏ రాశులపై ఎలాంటి ప్రభావం ఉంటుందంటే!

శని
జమ్మి సమిధలతో హోమంచేస్తే అప మృత్యు భయం తొలగి పోతుంది.దీర్ఘకాల అనారోగ్యాలుండవు. శమీ వృక్ష గాలి శరీరానికి తగిలితే శారీరక ఇబ్బందలు తొలగిపోతాయి. అందుకే నిత్యం శమీవృక్షానికి ప్రదిక్షిణలు చేస్తే అనారోగ్య సమస్యలుండవంటారు.

రాహువు
గరికలతో హోమంచేస్తే ఇంటిలో నరదృష్టి తొలగిపోయి సర్ప సంభంద దోషాలు తొలగిపోతాయి. గరిక రసాన్ని గజ్జి,చర్మంపైన ఉన్న కురుపులపై రాస్తే చర్మరోగాలుండవు. దెబ్బతగిలి రక్తం కారుతున్నప్పుడు గరిక రసాన్ని పిండితే రక్తం ఆగి పోతుంది.

కేతువు
దర్భలతో  హోమం చేస్తే కాలసర్పదోషం తొలగిపోతుంది. దర్భలు మూర్ఛ రోగాన్ని తగ్గిస్తాయి

వాస్తవానికి జాతకంలో, ఇంట్లో సమస్యలకు చాలామంది దేవాలయంలో హోమాలు చేయిస్తారు...కానీ.. ఆహోమాలు ఇంట్లో చేసినప్పుడే అధిక ఫలం ఉంటుంది. ఏ ఇంట్లో ఇబ్బంది ఉంటే అక్కడే హోమం చేయడం ప్రత్యక్షంగా ఆరోగ్యానికి, పరోక్షంగా నవగ్రహాలపై ప్రభావం చూపుతుందంటారు పండితులు..

నోట్: ఇది కొన్ని పుస్తకాల నుంచి, పండితుల నుంచి సేకరించి రాసిన సమాచారం..దీన్ని ఎంతవరకూ విశ్వసించాలి అన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం....

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Chandrababu :  జగన్‌కు చంద్రబాబు 7 సూటి ప్రశ్నలు - సమాధానం చెప్పాలని రాప్తాడు ప్రజాగళం సభలో సవాల్
జగన్‌కు చంద్రబాబు 7 సూటి ప్రశ్నలు - సమాధానం చెప్పాలని రాప్తాడు ప్రజాగళం సభలో సవాల్
Telangana BJP :   తెలంగాణ బీజేపీలో టిక్కెట్ల మార్పు రచ్చ -  కొన్ని చోట్ల  తప్పదా ?
తెలంగాణ బీజేపీలో టిక్కెట్ల మార్పు రచ్చ - కొన్ని చోట్ల తప్పదా ?
Allu Arjun Wax Statue: 'మైల్‌ స్టోన్‌ మూమెంట్‌' - దుబాయ్‌లో అల్లు అర్జున్‌ వ్యాక్స్‌ స్టాట్చ్యూ ఆవిష్కరణ, బన్నీ ఇంట్రెస్టింగ్ పోస్ట్‌
'మైల్‌ స్టోన్‌ మూమెంట్‌' - దుబాయ్‌లో అల్లు అర్జున్‌ వ్యాక్స్‌ స్టాట్చ్యూ ఆవిష్కరణ, బన్నీ ఇంట్రెస్టింగ్ పోస్ట్‌
Ap Elections: ఏపీకి ముగ్గురు ప్రత్యేక పరిశీలకులు - కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం
ఏపీకి ముగ్గురు ప్రత్యేక పరిశీలకులు - కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

TDP Sankar | Srikakulam | పదవి ఉంటే ఒకమాట.. లేదంటే మరో మాట... ధర్మాన ఎప్పుడూ అంతేElections 2024 Tirupati Public Talk: తిరుపతి ఓటర్ల మదిలో ఏముంది..? ఎవరికి ఓటేస్తారు..?KTR on Phone Tapping Case | దొంగలవి ఫోన్ ట్యాపింగ్ చేసి ఉండొచ్చు..నీకేం భయం రేవంత్..? అంటూ కేటీఆర్ ప్రశ్నHardik Pandya vs Rohit Sharma: రాజకీయాల్లోనే కాదు ఇప్పుడు ఆటల్లోనూ క్యాంపులు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu :  జగన్‌కు చంద్రబాబు 7 సూటి ప్రశ్నలు - సమాధానం చెప్పాలని రాప్తాడు ప్రజాగళం సభలో సవాల్
జగన్‌కు చంద్రబాబు 7 సూటి ప్రశ్నలు - సమాధానం చెప్పాలని రాప్తాడు ప్రజాగళం సభలో సవాల్
Telangana BJP :   తెలంగాణ బీజేపీలో టిక్కెట్ల మార్పు రచ్చ -  కొన్ని చోట్ల  తప్పదా ?
తెలంగాణ బీజేపీలో టిక్కెట్ల మార్పు రచ్చ - కొన్ని చోట్ల తప్పదా ?
Allu Arjun Wax Statue: 'మైల్‌ స్టోన్‌ మూమెంట్‌' - దుబాయ్‌లో అల్లు అర్జున్‌ వ్యాక్స్‌ స్టాట్చ్యూ ఆవిష్కరణ, బన్నీ ఇంట్రెస్టింగ్ పోస్ట్‌
'మైల్‌ స్టోన్‌ మూమెంట్‌' - దుబాయ్‌లో అల్లు అర్జున్‌ వ్యాక్స్‌ స్టాట్చ్యూ ఆవిష్కరణ, బన్నీ ఇంట్రెస్టింగ్ పోస్ట్‌
Ap Elections: ఏపీకి ముగ్గురు ప్రత్యేక పరిశీలకులు - కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం
ఏపీకి ముగ్గురు ప్రత్యేక పరిశీలకులు - కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం
CJI: సీజేఐకు 600 మంది లాయర్ల లేఖ - కారణం ఏంటంటే.?
సీజేఐకు 600 మంది లాయర్ల లేఖ - కారణం ఏంటంటే.?
Citroen Basalt: బసాల్ట్ కారును పరిచయం చేసిన సిట్రోయెన్ - ఏం డిజైన్ భయ్యా!
బసాల్ట్ కారును పరిచయం చేసిన సిట్రోయెన్ - ఏం డిజైన్ భయ్యా!
Nandyala News: జగన్‌ను కలిసేందుకు వచ్చిన అఖిల ప్రియ- యర్రగుంట్లలో కాసేపుట టెన్షన్ టెన్షన్
జగన్‌ను కలిసేందుకు వచ్చిన అఖిల ప్రియ- యర్రగుంట్లలో కాసేపుట టెన్షన్ టెన్షన్
Kejriwal: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు మరో షాక్ - ఈడీ కస్టడీ పొడిగించిన న్యాయస్థానం
ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు మరో షాక్ - ఈడీ కస్టడీ పొడిగించిన న్యాయస్థానం
Embed widget