News
News
X

February Monthly Horoscope: ఈనెల ఈ రాశులవారికి ఊహించని సక్సెస్, ఆర్థిక ప్రయోజనాలు, ఆనందం - ఫిబ్రవరి రాశిఫలాలు

Rasi Phalalu February 2023 : ఆయా రాశిలో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. వ్యక్తిగత వివరాల కోసం జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు

FOLLOW US: 
Share:

February 2023  Horoscope  Predictions: కెరీర్, వ్యాపారం, ఉద్యోగం, ఆర్థిక , వైవాహిక జీవితం పరంగా ఫిబ్రవరి నెల ఈ రాశులవారికి అనుకూల ఫలితాలున్నాయి...

మేష రాశి
ఫిబ్రవరి నెల మేష రాశి వారికి సంతోషాన్ని కలిగిస్తుంది. నెల ఆరంభం మీకు అద్భుతంగా ఉంటుంది. ఉద్యోగులు, వ్యాపారులు బాగా రాణిస్తారు. ఉద్యోగం మారాలనుకుంటే ఇదే మంచి సమయం. అయితే నిర్ణయం తీసుకునే ముందు జాగ్రత్తగా ఆలోచించండి. ఈ సమయంలో చేసే ప్రయాణాలు కలిసొస్తాయి. ఆలోచించి ఖర్చు చేయండి. మేష రాశి వారు ఈ నెలలో శత్రువులతో జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యం విషయంలో అస్సలు నిర్లక్ష్యం వద్దు. మీ ప్రేమ భాగస్వామితో గడిపే సమయం దొరుకుతుంది. శుభకార్యాలకు హాజరవుతారు..నూతన వస్త్రాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు.

మిథున రాశి
చిన్న చిన్న సమస్యలు మినహా గడిచిన నెల కన్నా మిథున రాశి వారికి ఫిబ్రవరి నెల బాగుంటుంది. ఈ మాసంలో శ్రమకు ఆశించిన దానికంటే ఎక్కువ ఫలితాలు లభిస్తాయి. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నవారికి శుభసమయం. వృత్తి వ్యాపారాల అన్వేషణ పూర్తవుతుంది. మీరు చాలా కాలంగా వాహనం కొనాలని అనుకుంటున్నట్లయితే, ఈ నెలలో మీ ఆశ నెరవేరుతుంది. రెండో వారంలో పెద్ద మొత్తంలో డబ్బులు వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగులకు అదనపు ఆదాయ వనరులు పెరుగుతాయి. సామాజిక సేవలో నిమగ్నమైన వ్యక్తులకు గౌరవం పెరుగుతుంది. ఉద్యోగం, వ్యాపార పరంగా ఈ సమయం బావుంటుంది. అయితే కొన్ని విషయాల్లో అపనిందలు, వివాదాలు తప్పవు

Also Read: మాఘ పూర్ణిమ ప్రాముఖ్యత ఏంటి - ఆ రోజు సముద్రం స్నానం ఎందుకు చేయాలి!

సింహ రాశి
ఈ రాశి వారికి ఫిబ్రవరి ప్రారంభం శుభదాయకంగా ఉంటుంది, ఈ సమయంలో మీరు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న పని పూర్తవుతుంది. ఊహించని సక్సెస్ మీ సొంతమవుతుంది. మీ పనితీరుకి ప్రశంసలు లభిస్తాయి.  వృత్తి, వ్యాపారాల్లో పురోభివృద్ధికి ఆస్కారం ఉంది. కోర్టు తీర్పు అనుకూలంగా రావొచ్చు. ఆర్థికపరిస్థితి బావుంటుంది. పై అధికారులతో సత్సంబంధాలుంటాయి. శత్రువులు మిత్రులవుతారు.  సంబంధాలకు సంబంధించి నెల మధ్యలో కాస్త కష్టంగా ఉంటుంది. కుటుంబ సభ్యులు లేదా జీవిత భాగస్వామితో వివాదం ఉండొచ్చు. నెల చివర మళ్లీ బావుంటుంది.

తులా రాశి 
ఈ రాశి వారికి ఫిబ్రవరి నెల అనుకూలంగా ఉంటుంది..అయినప్పటికీ మీరు ఆరోగ్య సంబంధిత సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. నెల ప్రారంభంలో సుఖ సంతోషాలు, సంపదలు పొందే అవకాశాలున్నాయి. మీరు ఇంతకు ముందు ఏదైనా పథకంలో పెట్టుబడి పెట్టినట్టైతే ఈ నెలలో ప్రయోజనాలు పొందుతారు. ఉద్యోగంలో పురోభివృద్ధికి అవకాశం ఉంది,వ్యాపార విస్తరణకు కూడా ఇదే మంచి సమయం. ఈ నెలలో చేసే ప్రయాణాలు ఆహ్లాదకరంగా ఉంటాయి. స్థిరాస్తులకు సంబంధించి వివాదాలు నడుస్తూ ఉంటే త్వరలో పరిష్కారమవుతాయి. నిరుద్యోగులకు శుభసమయం.విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయం కోసం కష్టపడాల్సి ఉంటుంది. ప్రేమ భాగస్వామితో సత్సంబంధాలు నెలకొంటాయి. వైవాహిక జీవితంలో మాత్రం వివాదాలుండే అవకాశం ఉంది. 

వృశ్చిక రాశి 
ఫిబ్రవరి నెల ఈ రాశివారికి మిశ్రమ ఫలితాలున్నాయి.  జీవితానికి సంబంధించిన నిర్ణయాలు ఆలోచనాత్మకంగా తీసుకోవాలి. ఉద్యోగులు తమ పనిని ఇతరులకు వదిలిపెట్టకూడదు. రెండవ వారంలో వృత్తి, వ్యాపారాలకు సంబంధించి కొన్ని సమస్యలు ఎదురవుతాయి. నెల మధ్యలో కుటుంబానికి సంబంధించిన సమస్యలు ఆందోళన కలిగిస్తాయి. కుటుంబంలోని పెద్దల ఆరోగ్యం మరింత ఆందోళన కలిగిస్తుంది. నెల ద్వితీయార్థం ఉద్యోగులు, వ్యాపారులకు అనుకూలంగా ఉంటుంది.  పిత్రార్జిత ఆస్తులు కలిసొస్తాయి. ఈ సమయంలో మీరు దీర్ఘకాలిక వ్యాధి నుంచి కోలుకుంటారు. భార్య, పిల్లల కారణంగా సంతోషంగా ఉంటారు. ఉద్యోగులకు అధికారుల అనుగ్రహం లభిస్తుంది 

Also Read: ధనస్సు నుంచి మకరంలోకి బుధుడు, ఈ మూడు రాశులకు మినహా అందరికీ బావుంది

మీన రాశి 
ఫిబ్రవరి నెల మీన రాశి వారికి శుభ ఫలితాలను ఇస్తుంది. ఈ సమయంలో మీరు పనిచేసే రంగం నుంచి శుభవార్త అందుకుంటారు. ఉపాధి కోసం ప్రయత్నిస్తున్న వారికి ఈ మాసంలో విజయం లభిస్తుంది. వ్యాపారంతో సంబంధం ఉన్న వ్యక్తులు మొదటి వారంలో పెద్ద లాభాలను పొందుతారు. మార్కెట్లో క్రెడిబిలిటీ పెరుగుతుంది, వ్యాపారాన్ని విస్తరించాలని ప్లాన్ చేస్తే విజయం సాధిస్తారు. పోటీ పరీక్షలు రాసేవారు మంచి ఫలితాలు పొందుతారు. సంతానానికి సంబంధించిన విజయాలు గౌరవాన్ని పెంచుతాయి. ఉద్యోగంలో మార్పులు, ప్రమోషన్ల గురించి ఆలోచిస్తే ప్రణాళిక విజయవంతమవుతుంది. ఉద్యోగులకు అదనపు ఆదాయ మార్గాలు ఉంటాయి. సౌకర్యానికి సంబంధించిన విషయాల్లో ఖర్చులు పెరుగుతాయి. ప్రేమ సంబంధాల పరంగా ఈ మాసం శుభప్రదం.

Published at : 01 Feb 2023 06:53 AM (IST) Tags: Monthly Horoscope Horoscope Today Aries Horoscope February 2023 February 2023 Predictions in telugu Leo Horoscope February 2023

సంబంధిత కథనాలు

Magnetic Mud Pot: చేతిలో డబ్బులు నిలవడం లేదా? ఈ మ్యాజిక్ మట్టి కుండ మీ ఇంట్లో పెట్టేసుకోండి

Magnetic Mud Pot: చేతిలో డబ్బులు నిలవడం లేదా? ఈ మ్యాజిక్ మట్టి కుండ మీ ఇంట్లో పెట్టేసుకోండి

Sri Rama Pattabhishekam 2023: శ్రీరామ పట్టాభిషేకం ఫొటో ఇంట్లో పెట్టుకోవచ్చా లేదా!

Sri Rama Pattabhishekam 2023: శ్రీరామ పట్టాభిషేకం ఫొటో ఇంట్లో పెట్టుకోవచ్చా లేదా!

Sri Rama Pattabhishekam 2023: పాలకులు ఎలా ఉంటే ప్రజలు అలానే ఉంటారు, కలియుగంలో రామరాజ్యం సాధ్యమా!

Sri Rama Pattabhishekam 2023: పాలకులు ఎలా ఉంటే ప్రజలు అలానే ఉంటారు, కలియుగంలో రామరాజ్యం సాధ్యమా!

మార్చి 31 రాశిఫలాలు, ఈ రాశివారు ఇతరుల మాటకాదు మనసు చెప్పింది వినండి!

మార్చి 31 రాశిఫలాలు,  ఈ రాశివారు ఇతరుల మాటకాదు మనసు చెప్పింది వినండి!

Sri Rama Navami 2023: నూట ఎనిమిది నామాలలో సంపూర్ణ రామాయణం

Sri Rama Navami 2023: నూట ఎనిమిది నామాలలో సంపూర్ణ రామాయణం

టాప్ స్టోరీస్

Sukesh Letter BRS : బీఆర్ఎస్ కు రూ.75 కోట్లు ఇచ్చా, కలకలం రేపుతున్న సుఖేష్ చంద్రశేఖర్ లేఖ

Sukesh Letter BRS : బీఆర్ఎస్ కు రూ.75 కోట్లు ఇచ్చా, కలకలం రేపుతున్న సుఖేష్ చంద్రశేఖర్ లేఖ

AP Cabinet : సీదిరి అవుట్, తమ్మినేని ఇన్- మంత్రి వర్గ మార్పులపై ఏపీలో జోరుగా ప్రచారం!

AP Cabinet : సీదిరి అవుట్, తమ్మినేని ఇన్- మంత్రి వర్గ మార్పులపై ఏపీలో జోరుగా ప్రచారం!

IPL 2023 Opening Ceremony: తెలుగు పాటలకు ఊగిపోయిన స్టేడియం - అదిరే స్టెప్పులతో అలరించిన తమన్నా, రష్మిక!

IPL 2023 Opening Ceremony: తెలుగు పాటలకు ఊగిపోయిన స్టేడియం - అదిరే స్టెప్పులతో అలరించిన తమన్నా, రష్మిక!

Stree Nidhi: స్త్రీనిధి నుంచి 3 లక్షల వరకు రుణాలు, వడ్డీ 3 శాతం తగ్గింపు: మంత్రి ఎర్రబెల్లి

Stree Nidhi: స్త్రీనిధి నుంచి 3 లక్షల వరకు రుణాలు, వడ్డీ 3 శాతం తగ్గింపు: మంత్రి ఎర్రబెల్లి