Monthly Horoscope for May 2025: మే 2025 ఈ రాశులవారికి విశేష యోగకాలం, ఈ 4 రాశులవారికి చికాకులు ఆర్థిక ఇబ్బందులు తప్పవ్!
May 2025 Rasi Phalalu in Telugu: మే నెలలో ఏ రాశులవారికి అనుకూల ఫలితాలున్నాయి, ఏ రాశులవారికి ప్రతికూల ఫలితాలున్నాయో మేషం to మీనం మాస ఫలితాలు ఇక్కడ తెలుసుకోండి

Monthly Rasi Phalalu May 2025
మేష రాశి (Aries Monthly Predictions for May 2025)
మేష రాశివారికి మే నెల శుభ ఫలితాలున్నాయి. గత నెల వరకూ పడిన సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఉద్యోగం, వృత్తి, వ్యాపారాల్లో లాభాలుంటాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది. శత్రువులే స్నేహితులవుతారు. నూతన పరిచయాలు కలిసొస్తాయి.అనుకున్న పనిని పూర్తిచేసేస్తారు. ఆస్తులు కొనుగోలు చేసేందుకు ప్లాన్ చేసుకుంటారు.
వృషభ రాశి (Taurus Monthly Predictions for May 2025)
వృషభ రాశివారికి మే నెలలో మిశ్రమ ఫలితాలున్నాయి. అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. ఎలాంటి కారణం లేకుండానే విరోధాల్లో చిక్కుకుంటారు. ఆదాయంలో పెరుగుదల ఉంటుంది. ఉద్యోగం,వ్యాపారంలో శుభఫలితాలుంటాయి. శత్రువులపై విజయం సాధిస్తారు. నెల చివర్లో దూర ప్రయాణాలు చేస్తారు.
మిథున రాశి (Gemini Monthly Predictions for May 2025)
మె నెల మిథున రాశివారికి మంచి ఫలితాలు లేవు. 12వ స్థానంలో గ్రహసంచారం ఇబ్బందిపెడుతుంది. ఆదాయం పెరిగినా ఖర్చులు కూడా అదే స్థాయిలో ఉంటాయి. కుటుంబంలో దుబారా ఖర్చు పెరుగుతుంది. వ్యాపారంలో లాభాలుంటాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది. నూతన పరిచయాలు కలిసొస్తాయి. ఆర్థిక ఇబ్బందులుంటాయి.
కర్కాటక రాశి (Cancer Monthly Predictions for May 2025)
మే నెలలో కర్కాటక రాశివారికి కలిసొస్తుంది. ఆరోగ్యం బావుంటుంది, ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. నూతన కార్యక్రమాలు ప్రారంభించేందుకు ఇదే మంచి సమయం. కుటుంబంలో సంతోషం వెల్లివిరుస్తుంది. కొన్ని సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది.
సింహ రాశి (Leo Monthly Predictions for May 2025)
సింహ రాశివారికి మే నెలలో మెరుగైన ఫలితాలుంటాయి. ఆర్థికంగా కలిసొస్తుంది. శుభకార్యాలు నిర్వహించేందుకు ప్రణాళికలు వేసుకుంటారు. ఆర్థికంగా లాభపడతారు. శత్రులుపై పైచేయి సాధిస్తారు. నెల మొదట్లో కన్నా గడిచేకొద్ది మంచి ఫలితాలుంటాయి. ద్దీ ఇంకా శుభఫలితాలున్నాయి
కన్యా రాశి (Virgo Monthly Predictions for May 2025)
మే నెల కన్యా రాశివారికి లాభదాయకంగా ఉంటుంది. అనుకున్న పనులు అనుకున్న సమయం కన్నా తొందరగా పూర్తవుతాయి. వాహనం కొనుగోలు చేసేందుకు ప్లానే చేసుకుంటారు. ఇంటా బయటా మీకు గౌరవం పెరుగుతుంది. నూతన పరిచయాలు కలిసొస్తాయి
తులా రాశి (Libra Monthly Predictions for May 2025)
తులా రాశివారికి మే నెలలో గ్రహసంచారం కలసిరాదు. అనుకున్న పనులేవీ పూర్తికావు. పని ఒత్తిడి పెరుగుతుంది. అనుకోని తగాదాల్లో చిక్కుకుంటారు. సంతాకం కారణంగా ఇబ్బంది పడతారు. వాహన ప్రమాద సూచనలున్నాయి జాగ్రత్తపడండి.
వృశ్చిక రాశి (Scorpio Monthly Predictions for May 2025)
ఈ నెలలో వృశ్చిక రాశి ఉద్యోగులు, వ్యాపారులుకు మంచి ఫలితాలే ఉన్నాయి. కానీ కోపం అధికంగా ఉంటుంది. అసహనంగా వ్యవహరిస్తారు. ప్రతి చిన్న విషయానికి ఆందోళన చెందుతారు. వైవాహిక జీవితంలో భాగస్వామితో విరోధం తప్పదు
ధనుస్సు రాశి (Sagittarius Monthly Predictions for May 2025)
ధనస్సు రాశివారికి మే నెలలో మంచి ఫలితాలున్నాయి. సమస్యలు వచ్చినట్టే వచ్చి తొలగిపోతాయి. ఉద్యోగంలో వృద్ధి ఉంటుంది. గౌరవం పెరుగుతుంది. వాహనం కొనుగోలు చేస్తారు.శత్రువులపై పైచేయి సాధిస్తారు. కోర్టు వ్యవహారాల్లో మీరు లాభపడతారు. భపడతారు.
మకర రాశి (Capricorn Monthly Predictions for May 2025)
మే నెలలో మకర రాశివారికి మంచి ఫలితాలుంటాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది. సమయానికి డబ్బు చేతికందుతుంది. శుభకార్యాలకు హాజరవుతారు. బంధుమిత్రులతో టైమ్ స్పెండ్ చేస్తారు. చేపట్టిన పనులు పూర్తిచేస్తారు.
కుంభ రాశి (Aquarius Monthly Predictions for May 2025)
కుంభ రాశివారికి మే నెల యోగదాయకంగా ఉంటుంది. ఉద్యోగులు ప్రమోషన్ పొందుతారు. వ్యాపారులు లాభాలు ఆర్జిస్తారు. ఆదాయం పెరుగుతుంది. గతంలో ఉండే సమస్యల నుంచి బయటపడతారు. శుభకార్యాల నిర్వహణకు ప్లాన్ చేసుకుంటారు. చేపట్టిన పనులు పూర్తిచేసేందుకు స్నేహితుల నుంచి సహకారం ఉంటుంది. కోర్టు వ్యవహారాల్లో అనుకూల ఫలితాలు సాధిస్తారు.
మీన రాశి (Pisces Monthly Predictions for May 2025)
మే నెలలో మీన రాశివారికి అన్ని విధాలుగా యోగకాలం అనే చెప్పాలి. ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఆదాయం పెరుగుతుంది. సంతోషంగా ఉంటారు. చేపట్టిన పనులకు అడ్డంకులు ఎదురైనా ధైర్యంగా దూసుకెళ్తారు. నూతన పరిచయాలు ఏర్పడతాయి వాటి వల్ల భవిష్యత్ లో లాభపడతారు. సంతానం కారణంగా మీ సంతోషం రెట్టింపు అవుతుంది.
గమనిక: జ్యోతిష్య శాస్త్ర పండితులు చెప్పినవి, పుస్తకాల నుంచి సేకరించి రాసిన వివరాలివి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం. ఆయా రాశుల్లో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకంలో ఉండే గ్రహస్థితి ఆధారంగా ఫలితాలు మార్పులుంటాయి.





















