Horoscope Today 06 December 2024: ఈ రాశులవారు వివాదాలను చాలా తెలివిగా పరిష్కరించుకుంటారు
Horoscope Today : గ్రహాల కదలిక, నక్షత్రాల ఆధారంగా జ్యోతిష్యులు రాశి ఫలితాలను అంచనా వేస్తారు. ఈరోజు రాశి ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.
Horoscope Today 06th December 2024
మేష రాశి
ఈ రోజు మీరు ఓపికగా పనిచేస్తే విజయం వరిస్తుంది. వ్యక్తిత్వాన్ని మరింత మెరుగుపర్చుకుంటే ఉత్సాహంగా ఉంటారు. వ్యాపారాన్ని విస్తరించేందుకు రిస్క్ తీసుకోవడం మంచిది. తొందరపాటు నిర్ణయాల వల్ల భవిష్యత్ లో నష్టపోయే ప్రమాదం ఉంది. వ్యాపార భాగస్వాములను ఏకపక్షంగా విశ్వసించడం సరికాదు
వృషభ రాశి
ఈ రోజు ఈ రాశి ఉద్యోగులు కార్యాలయంలో ప్రశంసలు అందుకుంటారు. చేపట్టిన పనులు సక్సెస్ ఫుల్ గా పూర్తవుతాయి. నూతన ప్రణాళికలు అమలు చేసేందుకు ఈ రోజు మంచిరోజు. విద్యకు సంబంధించిన ఆటంకాలు తొలగిపోతాయి. గతంలో ఉండే వివాదాలు పరిష్కారం అవుతాయి.
మిథున రాశి
ఈ రోజు పెండింగ్ లో ఉన్న పనులపై ఎక్కువ ఫోకస్ చేయవద్దు. పనిలో నాణ్యత పెంచుకోంది. నూతన ఆస్తిని కొనుగోలు చేసేందుకు ప్లాన్ చేస్తారు. మీ సంతోషాన్ని, దుఃఖాన్ని మీ జీవిత భాగస్వామితో తప్పకుండా పంచుకోండి. యువతకు కెరీర్ కి సంబంధించిన ఆందోళనలు దూరమవుతాయి. పై అధికారులతో సరైన కమ్యూనికేషన్ లేకపోవడం వల్ల నష్టపోతారు.
Also Read: పుష్ప 2లో గంగమ్మ జాతర సీన్‌తో ఫ్యాన్స్ పూనకాలు- ఇంతకీ ఈ వేడుకలో లేడీ గెటప్‌కి ఎందుకంత ప్రాధాన్యత!
కర్కాటక రాశి
ఈ రోజు శుభవార్త వినే అవకాశం ఉంది. సన్నిహితులను కలవవచ్చు. విదేశీ ప్రయాణాలు చేద్దాం అనుకునేవారికి ఆటంకాలు తొలగిపోతాయి. ముఖ్యమైన వ్యాపార నిర్ణయాలు తీసుకోవాలి. విద్యార్థులు చదువుకోసం ఎక్కువ సమయం కేటాయిస్తారు.
సింహ రాశి
ఈ రాశివారి వైవాహిక జీవితంలో తీవ్రత పెరుగుతుంది. ముఖ్యమైన పనులు కొంత ఆలస్యంగా పూర్తవుతాయి. ఆఫీసులో కొంత టెన్షన్ ఉండవచ్చు. మార్కెటింగ్ పనుల వల్ల లాభం ఉంటుంది. చేయాల్సిన పనుల విషయంలో చురుగ్గా ఉంటారు. ఆటంకాలు అధిగమిస్తారు.
కన్యా రాశి
ఈ రాశి విద్యార్థులు చదువువుకు సంబంధించిన విషయాలపై ప్రత్యేక ఆసక్తి చూపిస్తారు. అవివాహితులకు వివాహం నిశ్చయమవుతుంది. ప్రారంభించిన పనులకు కుటుంబం నుంచి మద్దతు లభిస్తుంది. ఆస్తికి సంబంధించిన విషయాల నుంచి ప్రయోజనం పొందుతారు. పిల్లల పురోగతి చూసి ఉత్సాహంగా ఉంటారు.
తులా రాశి
ఈ రోజు ఇంట్లో వాతావరణం బావుంటుంది. మీ ప్రవర్తనా విధానం కొందరికి విసుగుతెప్పిస్తుంది. న్యాయపరమైన విషయాల్లో పొరపాట్లు జరిగే అవకాశం ఉంది. ముఖ్యమైన పత్రాల విషయంలో అప్రమత్తంగా ఉండండి. సహోద్యోగుల మోసపూరిత ప్రవర్తన పట్ల జాగ్రత్తగా ఉండాలి
Also Read: మార్గశిర మాసం నెల రోజులు నిత్యం పఠించాల్సిన స్తోత్రం!
వృశ్చిక రాశి
ఈ రోజు మీరు పెద్ద వ్యాపార ఒప్పందాన్ని పొందుతారు. కార్యాలయంలో కొత్త స్నేహితులు ఏర్పడతారు. ఆర్థిక ప్రయోజనాలు ఉంటాయి. నైపుణ్యాలను బాగా ప్రదర్శిస్తారు. మీ పనులన్నీ సకాలంలో పూర్తవుతాయి. ఆరోగ్య సంబంధిత సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు. పిల్లలతో మంచి సమయం స్పెండ్ చేస్తారు.
ధనస్సు రాశి
ఈ రోజు మీరు మీ కుటుంబ సభ్యులకు తగినంత సమయం ఇస్తారు. ఉద్యోగం , వ్యాపారంలో మంచి ఫలితాలు పొందుతారు. విద్యార్థులకు చదువుపై శ్రద్ధ పెరుగుతుంది. సృజనాత్మక పనులపై ప్రత్యేక ఆసక్తిని కనబరుస్తారు. ఈరోజు శ్రమతో కూడిన పనులు చేయడం తగదు.
మకర రాశి
ఉన్నత విద్యను అభ్యసించే విద్యార్థులు ఈరోజు సానుకూల శక్తితో ఉంటారు. చదువు, కెరీర్‌పై ఎక్కువ శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది. కొత్త ఆలోచనలను బహిరంగంగా వెల్లడిచేయండి. చాలా కొత్త విషయాలు నేర్చుకుంటారు. వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది. యువత ఉద్యోగ సంబంధిత సమాచారం పొందుతారు. మీ సామర్థ్యంపై నమ్మకం ఉంచండి.
Also Read: డిసెంబరు 02 నుంచి మార్గశిర మాసం.. 4 గురువారాలు ఇలా పూజ చేస్తే లక్ష్మీ అనుగ్రహం!
కుంభ రాశి
ఈ రోజు చాలా కష్టపడాల్సి ఉంటుంది. వ్యాపారంలో లాభాలు వచ్చే అవకాశం ఉంది. ఆనందం పెరుగుతుంది. అనవసర విషయాలపై శ్రద్ధ పెట్టకండి. ఉద్యోగులు మంచి ఫలితాలు పొందుతారు. కుటుంబ ఖర్చులు పెరుగుతాయి. ఆస్తి విషయాలలో జాగ్రత్తగా ఉండాలి.
మీన రాశి
ఈ రోజు మీరు మీ తెలివితో వివాదాలను పరిష్కరించుకుంటారు. ఇంట్లో వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. రోజంతా ఉత్సాహంగా ఉంటారు. వ్యాపారంలో వినూత్న మార్పులు చేయడానికి ఇది చాలా అనుకూలమైన రోజు. అవివాహితులకు మంచి వివాహ ప్రతిపాదనలు అందుతాయి.
Note: ఓ రాశిలోని ఫలితాలు మొత్తం ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు..మీ జాతకంలో గ్రహస్థితి ఆధారంగా కూడా ఫలితాల్లో మార్పులుంటాయి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం.