Horoscope Today 05 December 2024: ఈ రాశులవారు సవాళ్లు స్వీకరించేందుకు సిద్ధంగా ఉంటారు!
Horoscope Today : గ్రహాల కదలిక, నక్షత్రాల ఆధారంగా జ్యోతిష్యులు రాశి ఫలితాలను అంచనా వేస్తారు. ఈరోజు రాశి ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.
Horoscope Today 05th December 2024
మేష రాశి
ఈ రాశి ఉద్యోగులకు కార్యాలయంలో అధికారులతో సంబంధాలు బలపడతాయి. యువత తమ భవిష్యత్తు గురించి కొంత ఆందోళన చెందుతారు. విద్యార్థులకు చదువులో ఏకాగ్రత లోపిస్తుంది. శరీరంలో దృఢత్వం సమస్య ఉండవచ్చు. మీరు మానసికంగా బలహీనంగా ఉన్నట్టు భావిస్తారు
వృషభ రాశి
ఈ రోజు మీరు మీ కుటుంబానికి మంచి సమయం కేటాయిస్తారు. ప్రత్యర్థులు మిమ్మల్ని అవమానపర్చేందుకు ప్రయత్నిస్తారు. ప్రేమ సంబంధాల విషయంలో కొంత బాధపడతారు. అనారోగ్య సమస్యలున్నాయి జాగ్రత్త. తెలియని వ్యక్తులను అతిగా నమ్మొద్దు.
మిథున రాశి
ఈ రోజు కొత్త పనిని ప్రారంభించడానికి అనుకూలమైన రోజు. మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. దాంపత్య జీవితంలో సంతోషం ఉంటుంది. ఆర్థికంగా లాభపడతారు. ఉన్నత విద్యలో అద్భుతమైన ఫలితాలు పొందుతారు. వ్యాపారంలో పెద్ద డీల్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. పెద్దల సలహాతో లాభపడతారు.
కర్కాటక రాశి
ఈ రోజు కార్యాలయంలో పని ఒత్తిడి పెరుగుతుంది. శత్రువుల పట్ల జాగ్రత్త అవసరం. కొన్ని పెద్ద పనులకు ఆటంకాలు తొలగిపోతాయి. మీరు ఉద్యోగానికి సంబంధించి పెద్ద ఆఫర్‌ను పొందవచ్చు. మీరు మీ ఆలోచనలను మీ జీవిత భాగస్వామితో పంచుకోవడం ద్వారా మంచి సూచనలు పొందుతారు.
సింహ రాశి
ఈ రోజు మీరు వ్యాపారంలో లక్ష్యాలను సకాలంలో పూర్తి చేస్తారు. దాంపత్య జీవితం సంతోషంగా ఉంటుంది. స్నేహితులతో ఎక్కడికైనా వెళ్ళేందుకు ప్లాన్ చేసుకుంటారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలున్నాయి.
కన్యా రాశి
ఈ రోజు వ్యాపారంలో విస్తరణకు అవకాశం ఉంది. మీరు కొత్త వాహనం కొనుగోలు చేసే ఆలోచన చేయవచ్చు. ముఖ్యమైన పనులు వాయిదా వేయవద్దు. ఆలయాలను సందర్శిస్తారు.చిన్నపాటి గాయాలయ్యే అవకాశం ఉంది జాగ్రత్తపడండి.
తులా రాశి
ఈ రోజు సన్నిహిత వ్యక్తులతో సంబంధాలు మధురంగా ఉంటాయి. ఆర్థిక ఇబ్బందులు తీరిపోతాయి. పిల్లలతో మంచి సమయం గడుపుతారు. మీ జీవిత భాగస్వామి భావాలను జాగ్రత్తగా చూసుకోండి. మీరు ఉద్యోగం కోసం చూస్తున్నట్లయితే ఈ రోజు శుభప్రదంగా ఉంటుంది.
Also Read: 2025లో రాశిమారుతున్న కేతువు.. ఈ రాశులవారి వ్యక్తిగత జీవితం గందరగోళం - వృత్తి జీవితం అద్భుతం!
వృశ్చిక రాశి
ఈ రోజు కార్యాలయంలో పని సులభంగా జరుగుతుంది. వ్యాపారంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. శుభకార్యాల నిర్వహణకు ప్లాన్ చేసుకుంటారు. ఇంటి అలంకరణ కోసం డబ్బు వెచ్చిస్తారు. మీ మాటతీరు మెచ్చుకోలుగా ఉంటుంది.
ధనస్సు రాశి
ఈ రాశివారు ప్రతికూల వ్యక్తులకు దూరంగా ఉండడం మంచిది. చేపట్టిన పనుల్లో వైఫల్యాలు ఎదుర్కొనే అవకాశం ఉంది. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. పూర్వీకుల ఆస్తిలో వాటా పొందుతారు. శారీరకంగా బలహీనంగా ఉంటారు.
మకర రాశి
ఈ రోజు చాలా మంచి ప్రారంభం అవుతుంది. వ్యాపారంలో భారీ ఆర్థిక లాభం ఉంటుంది. కార్యాలయంలో పెద్ద బాధ్యతలను పొందవచ్చు. వివాహ సంబంధాలకు తగినంత సమయం ఇవ్వండి. మీ పరిమితులను ఉల్లంఘించవద్దు. అనవసర ఖర్చులు పెరుగుతాయి.
కుంభ రాశి
ఈ రోజు పనిలో ఉన్న అడ్డంకులు తొలగిపోతాయి. అనారోగ్య సమస్యలు పరిష్కారమవుతాయి. కుటుంబ వాతావరణం చాలా బాగుంటుంది. వ్యాపారంలో పెద్ద విజయాలు సాధించే అవకాశం ఉంది. కొత్త ఆదాయ వనరులు లభిస్తాయి.
Also Read: డిసెంబరు 02 నుంచి మార్గశిర మాసం.. 4 గురువారాలు ఇలా పూజ చేస్తే లక్ష్మీ అనుగ్రహం!
మీన రాశి
ఈ రోజు వైవాహిక సంబంధాలకు సంబంధించిన సమస్యలు పరిష్కారం అవుతాయి. కొత్తగా ఏదైనా చేయాలని ఆలోచిస్తారు. మీకు నచ్చిన వంటకాలను మీరు రుచి చూడగలరు. కార్యాలయంలో మీ కార్యాచరణ పెరుగుతుంది. ఇతరుల విషయాలలో జోక్యం చేసుకోకండి. సవాళ్లు స్వీకరించేందుకు సిద్ధంగా ఉంటారు. వ్యాపారంలో లాభం ఉంటుంది.
Note: ఓ రాశిలోని ఫలితాలు మొత్తం ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు..మీ జాతకంలో గ్రహస్థితి ఆధారంగా కూడా ఫలితాల్లో మార్పులుంటాయి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం.