Horoscope Today: ఈ రాశులవారికి ఈ రోజు అద్భుతంగా ఉంటుంది… ఆ మూడు రాశులవారు దుర్వార్తలు వింటారు…
ఆయా రాశిలో ఫలితాలు మొత్తం ఒకే వ్యక్తికి వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా చాలా మార్పులుంటాయి. పూర్తి వ్యక్తిగత వివరాల కోసం అనుభవజ్ఞులైన జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు…
2021 ఆగస్టు 11 బుధవారం రాశిఫలాలు
మేషం
మేషరాశివారు ఈ రోజు ఏపనీ సక్రమంగా చేయలేకపోవడంతో ఆందోళన చెందుతారు. బంధువుల నుంచి వినకూడని వార్తలు వింటారు. ఉద్యోగాలు మారాలనుకుంటే మరోసారి ఆలోచించండి. పెద్ద బాధ్యతలు స్వీకరిస్తారు. కార్యాలయంలో ఒత్తిడి పెరుగుతుంది. ఆదాయం నిలకడగా ఉంటుంది. రిస్క్ తీసుకోవద్దు. అనవసర వాదనలు వద్దని భావిస్తారు.
వృషభం
మీకు ఈరోజు బావుంటుంది. కార్యాలయంలో కొత్త సమాచారం అందుతుంది. చేపట్టిన పనులు పూర్తిచేస్తారు. బంధువుల నుంచి శుభవార్తలు వింటారు. మతపరమైన కార్యక్రమం ఇంట్లో జరగొచ్చు. పొదుపు పథకాల్లో పెట్టుబడి పెట్టే అవకాశం ఉంది. ఖ్యాతి పెరుగుతుంది. వ్యాపారం సజావుగా సాగుతుంది. దినచర్యను మార్చుకునేందుకు ప్రయత్నించండి.
మిథునం
ఈ రోజంతా మీకు గందరగోళంగా ఉంటుంది. తెలియని వ్యక్తులకు దూరంగా ఉండండి. వ్యాపారంలో నష్టం రావొచ్చు. కుటుంబంలో వివాదాలు జరిగే అవకాశం ఉంది. ఉద్యోగంలో ఒత్తిడి ఉంటుంది. ప్రయాణం విజయవంతమవుతుంది. సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఆసక్తి చూపుతారు. గుర్తింపు పొందుతారు. సంతోషంగా ఉంటారు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి.
కర్కాటక రాశి
ఈ రోజు సాధారణంగా ఉంటుంది. ఖర్చు ఎక్కువగా ఉండొచ్చు. ఉద్యోగస్తలు శుభవార్తలు వింటారు. టెన్షన్ తగ్గుతుంది. వైవాహిక జీవితంలో మధురానుభూతి ఉంటుంది. ఇష్టమైన ఆహారాన్ని తింటారు. విద్యార్థులు విజయం సాధిస్తారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ఆర్థిక ప్రయోజనాలు ఉంటాయి.
సింహం
ఈ రోజు సింహరాశివారికి మిశ్రమ ఫలితాలున్నాయి. వ్యసనాలకు దూరంగా ఉండండి. వ్యాపార ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. పరీక్షలు, ఇంటర్వ్యూలో విజయం సాధిస్తారు. జీవిత భాగస్వామితో విభేదాలు తొలగిపోతాయి. మీరు ఏదైనా పెద్ద సమస్య నుంచి బయటపడతారు. కుటుంబంలో ఆనందం ఉంటుంది. బంధువులను కలిసే అవకాశం ఉంది. కుటుంబంలో ఎవరితోనైనా వివాదాలు ఉండవచ్చు. ఇష్టదైవాన్ని పూజించండి..
కన్య
ఈరోజు ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. పూర్వీకుల విషయాలు సంక్లిష్టంగా మారవచ్చు. ఎవరితోనైనా వివాదానికి అవకాశం ఉంది. దీర్ఘకాలిక అనారోగ్యం బయటపడొచ్చు. స్నేహితులతో వివాదం వద్దు. సహనం తగ్గుతుంది. ఏదైనా ముఖ్యమైన నిర్ణయం తీసుకోవడానికి తొందరపడకండి. యువతకు ఉద్యోగాలు లభిస్తాయి. వాహనాన్ని జాగ్రత్తగా నడపండి. పెట్టుబడిని వాయిదా వేయండి.
తులారాశి
ఈ రోజు మీరు జాగ్రత్తగా ఉండాలి.ఆర్థిక పరిస్థితి బావుంటుంది. ఉద్యోగస్తులకు ఎవరితోనైనా వివాదం ఉండవచ్చు. కొత్త పరిచయాలొద్దు. భాగస్వామి ఆరోగ్యం గురించి ఆందోళన ఉంటుంది. శుభవార్త వింటారు. కొత్త ప్రణాళికలు రూపొందిస్తారు. దినచర్య మెరుగుపడుతుంది. బంధువులకు సహాయపడే అవకాశాలు ఉంటాయి. మతపరమైన కార్యక్రమాలపై ఆసక్తి ఉంటుంది.
వృశ్చికరాశి
మీ ఒత్తిడి దూరమవుతుంది. సమయానికి బాధ్యతలు నిర్వర్తించగలరు. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. ప్రత్యర్థులు ఓడిపోతారు. కోర్టు, ప్రభుత్వ కార్యాలయాల్లో పెండింగ్ పని పూర్తయిన తర్వాత శాంతి ఉంటుంది. చాలా సంతోషంగా ఉంటారు. లావాదేవీల కోసం తొందరపడకండి. వ్యాపారం బాగానే ఉంటుంది.
ధనుస్సు
నిలిచిపోయిన మీ పని పూర్తయ్యే అవకాశం ఉంది. ఈ రోజు బిజీగా ఉంటుంది. ఆఫీసులో బాధ్యతలు పెరుగుతాయి. వాహనం, యంత్రాలను ఉపయోగించేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. తెలియని వ్యక్తితో అనవసర వివాదాలు తలెత్తవచ్చు. ఓపికగా ఉండండి. కుటుంబం గురించి ఆందోళన ఉంటుంది. వ్యాపారం బాగానే సాగుతుంది. అనుకోని ప్రయాణం ఉండొచ్చు. తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి.
మకరం
మీ భాగస్వాములతో జాగ్రత్తగా ఉండండి. విలువైన వస్తువులను మీ వద్ద ఉంచుకోండి. నిరుద్యోగులకు శుభ సమయం. వ్యాపారం బాగానే ఉంటుంది. ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తుల నుంచి మద్దతు లభిస్తుంది. ఆర్థిక లాభాల కోసం అవకాశాలు వస్తాయి. బాగా అలసిపోతారు. చట్టపరమైన విషయాలు ముందుకు సాగుతాయి. ఇంట్లో ఉన్న వృద్ధులను జాగ్రత్తగా చూసుకోండి.
కుంభం
ఆనందంగా ఉంటారు. గొప్ప బాధ్యతను నిర్వర్తించగలుగుతారు. తెలియని వ్యక్తుల వల్ల కొంత నష్టం ఉండవచ్చు. రుణం మొత్తాన్ని తిరిగి చెల్లించగలుగుతారు. ఆహారాన్ని నిర్లక్ష్యం చేయవద్దు. విలువైన వస్తువులను సురక్షితంగా ఉంచండి. శత్రువులు ఓడిపోతారు. వ్యాపారానికి సంబంధించి చేసిన ప్రయాణాలు విజయవంతమవుతాయి. బకాయిలు రాబట్టుకునే ప్రయత్నంలో విజయం సాధిస్తారు. ఆర్థిక ప్రయోజనాలు ఉంటాయి.
మీనం
ఈరోజు మీకు సంతోషంగా గడుస్తుంది. శత్రువు పై ఆధిపత్యం చెలాయిస్తారు. పెట్టిన పెట్టుబడుల వల్ల లాభం పొందుతారు. వృత్తికి సంబంధించి చేసిన ప్రయత్నాలు విజయవంతమవుతాయి. ఉద్యోగంలో ప్రమోషన్ ఉంటుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. రిస్క్ తీసుకోకండి. ఏదైనా పనిని ప్రారంభించడానికి తొందరపడకండి. కుటుంబంలో శాంతి ఉంటుంది.