అన్వేషించండి

సెప్టెంబరు 20 రాశిఫలాలు, ఈ రాశివారు ఇచ్చే సలహాలు అందరకీ బాగా ఉపయోగపడతాయి

Horoscope Today : మేష రాశి నుంచి మీన రాశివరకూ ఈ రోజు మీ రాశి ఫలితం ఎలా ఉందో ఇక్కడ తెలుసుకోండి.

సెప్టెంబరు 20 రాశిఫలాలు

మేష రాశి 
ఈ రోజు మీరు మీరు తలపెట్టిన పనులేవీ పూర్తికావు. మధ్యలోనే నిలిచిపోవడంతో మీరు అశాంతికి గురవుతారు. ముఖ్యమైన నిర్ణయాలు కుటుంబ సభ్యులతో సంప్రదించిన తర్వాతే తీసుకోవడం ఉత్తమం. ఉద్యోగులు పనిపై శ్రద్ధ వహించండి. వ్యాపారులు నూతన పెట్టుబడులు పెట్టే ఆలోచన చేయవద్దు. 

వృషభ రాశి 
ఈ రాశివారు వ్యాపార భాగస్వాముల నుంచి ప్రయోజనాలు పొందుతారు. మీ వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది. ఇతరులతో మీ సమన్వయం బాగుంటుంది. పరిపాలనతో సంబంధం ఉన్న వ్యక్తులకు ఈ రోజు చాలా అద్భుతంగా ఉంటుంది. కుటుంబం , వ్యాపారం మధ్య సమతుల్యతను కాపాడుకోండి. 

మిధున రాశి
ఈ రోజు మీకు మీరు కొత్తగా కనిపిస్తారు. ఉద్యోగులు పనికి తగిన ప్రతిఫలం పొందుతారు. వ్యాపారం విస్తరించేందుకు మీరు చేసే ప్రయత్నాలు సఫలం అవుతాయి. వైద్య రంగానికి సంబంధించిన వ్యక్తులు మరింత కష్టపడాల్సి వస్తుంది. కుటుంబ సభ్యులు, సన్నిహితులతో మంచి సంబంధాలు కొనసాగించాలి.

Also Read: శ్రావణమాసంలో అష్టాదశ శక్తిపీఠాల సందర్శనం శుభకరం - మీరెన్ని దర్శించుకున్నారు!

కర్కాటక రాశి
కెరీర్‌లో మార్పులు చేయడానికి ఈ రాశివారికి ఇది సరైన సమయం కాదు. స్నేహితుల సహాయం తీసుకోవడానికి వెనుకాడకండి. మీ బాస్ వైఖరి మీ పట్ల సానుకూలంగా ఉంటుంది. ఇతరుల కోసం మంచిగా ఆలోచించండి. వేరేవారి ఆలోచనల్లో మునిగిఉంటారు..అది మీకు అంత మంచిది కాదని గుర్తించాలి.

సింహ రాశి 
ఈ రాశి విద్యార్థులు ఇతర విషయాలపై కాకుండా చదువుపై శ్రద్ధ వహించాలి. అందం, జీవనశైలిపై చాలా ఆసక్తి చూపిస్తారు. ఉద్యోగుల అభిప్రాయాలను కార్యాలయంలో ఎవ్వరూ ఏకీభవించరు. వైవాహిక జీవితం బాగానే ఉంటుంది. ఆరోగ్యం జాగ్రత్త. 

కన్యా రాశి 
ఈ రాశివారు పురోగతికి సంబంధించిన అవకాశాలు పొందుతారు. రాజకీయాలతో ముడిపడిన వ్యక్తులు విజయం సాధిస్తారు. పూర్వీకుల వివాదాలు పరిష్కారమవుతాయి. మీకు వివాహానికి సంబంధించిన ప్రతిపాదనలు వస్తాయి. కొత్త వ్యాపార ఆలోచనలు మెదులుతాయి.

తులా రాశి
అనవసర చర్చలకు దూరంగా ఉండడం మంచిది. కోపంతో నిర్ణయాలు తీసుకోవద్దు, ఏ తప్పూ చేయవద్దు. కొత్త పనిని ప్రారంభించే ముందు, నిపుణుల నుండి కూడా సలహా తీసుకోవాలి. ముఖ్యమైన పనులను ఆలస్యం చేయవద్దు. సంపదలో పెరుగుదల ఉంటుంది.

వృశ్చిక రాశి 
గతంలో ఉన్న వివాదాలు పరిష్కారం అవుతాయి.  మీ జీవనశైలితో రాజీ పడకండి. కాస్త ఓపికగా వ్యవహించాలి. అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి. కొన్ని పనుల నిమిత్తం బయటకు వెళ్లవచ్చు. ఒత్తిడి తగ్గుతుంది. మీరు స్నేహితుడిని కలుస్తారు. 

Also Read: అమ్మవారి వెంటే అయ్యవారు, ఇంత ప్రేమ పొందడం ఎవరికి సాధ్యం!

ధనుస్సు రాశి 
మీరు అనుకోని సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. వైవాహిక జీవితంలో అసంతృప్తి ఉంటుంది. మీ మనస్సులో ఆకస్మిక ఆలోచనల ప్రవాహం మిమ్మల్ని బాధపెడుతుంది. మీరు దూర ప్రయాణాలకు దూరంగా ఉండాలి. విదేశాల్లో చదువుకునే వారికి ఈ రోజు చాలా మంచిది.

మకర రాశి 
ఈ రాశివారు వ్యాపారంలో మంచి ఫలితాలను పొందుతారు. మీరు కోరుకున్న లక్ష్యాలను సులభంగా సాధిస్తారు. మీరు మీ పని శైలిని రీడిజైన్ చేయడానికి ప్రయత్నిస్తారు. స్నేహితులను కలుస్తారు. ఆరోగ్యం బావుంటుంది.

కుంభ రాశి 
మీరు మీ ప్రతిభను మెరుగుపరుచుకోవడానికి ప్రయత్నిస్తారు. కుటుంబంలో శాంతి ఉంటుంది. బ్యాంకింగ్ రంగానికి సంబంధించిన వ్యక్తులు కొన్ని శుభవార్తలను అందుకుంటారు. ఆరోగ్యం చాలా బాగుంటుంది. మీరు మీ లక్ష్యాన్ని చేరుకునేందుకు గట్టిగానే ప్రయత్నిస్తారు.

మీన రాశి 
ఈ రోజు మీకు చాలా మంచి రోజు కానుంది. ఉద్యోగులు, వ్యాపారులకు శుభసమయం. మీ సూచనల వల్ల మీ సన్నిహితులు ప్రయోజనం పొందుతారు. కెరీర్‌లో ముందుకు సాగే అవకాశాలు ఉంటాయి. పిల్లల విషయంలో పూర్తిస్థాయిలో శ్రద్ధ వహించాలి. కుటుంబంలో మీ గౌరవం మరింత పెరుగుతుంది. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Hyderabad News: పంజాగుట్ట నిమ్స్ హాస్పిటల్ వద్ద పేషెంట్లు, వారి బంధువులు నిరసన - కారణం ఏంటంటే
Hyderabad News: పంజాగుట్ట నిమ్స్ హాస్పిటల్ వద్ద పేషెంట్లు, వారి బంధువులు నిరసన - కారణం ఏంటంటే
Devara Japan Release Date: జపాన్‌లో 'దేవర' తాండవానికి అంతా రెడీ... ఎన్టీఆర్ సినిమా జపాన్ రిలీజ్ డేట్ ఇదే
జపాన్‌లో 'దేవర' తాండవానికి అంతా రెడీ... ఎన్టీఆర్ సినిమా జపాన్ రిలీజ్ డేట్ ఇదే
Telangana Holiday: మన్మోహన్ సింగ్ మృతి - నేడు తెలంగాణలో సెలవు ప్రకటించిన ప్రభుత్వం
మన్మోహన్ సింగ్ మృతి - నేడు తెలంగాణలో సెలవు ప్రకటించిన ప్రభుత్వం
Trivikram Srinivas: నాకు పోటీగా ఉండే ఏరియాలోకి నేను రాను, పోటీ లేని ఇంకో ఏరియాని వెతుక్కుంటా - త్రివిక్రమ్
నాకు పోటీగా ఉండే ఏరియాలోకి నేను రాను, పోటీ లేని ఇంకో ఏరియాని వెతుక్కుంటా - త్రివిక్రమ్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Manmohan Singh Death | చూసేందుకు మౌనముని..కానీ మేథస్సులో అపర చాణక్యుడు | ABP DesamPuliputti Village Name History | పేరుతోనే ఫేమస్ అవుతున్న ఊరు ఇదే | ABP DesamManmohan Singh Death | మాజీ ప్రధాని, ఆర్థికవేత్త మన్మోహన్ సింగ్ కన్నుమూత | ABP Desamసీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయిన టాలీవుడ్ ప్రముఖులు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad News: పంజాగుట్ట నిమ్స్ హాస్పిటల్ వద్ద పేషెంట్లు, వారి బంధువులు నిరసన - కారణం ఏంటంటే
Hyderabad News: పంజాగుట్ట నిమ్స్ హాస్పిటల్ వద్ద పేషెంట్లు, వారి బంధువులు నిరసన - కారణం ఏంటంటే
Devara Japan Release Date: జపాన్‌లో 'దేవర' తాండవానికి అంతా రెడీ... ఎన్టీఆర్ సినిమా జపాన్ రిలీజ్ డేట్ ఇదే
జపాన్‌లో 'దేవర' తాండవానికి అంతా రెడీ... ఎన్టీఆర్ సినిమా జపాన్ రిలీజ్ డేట్ ఇదే
Telangana Holiday: మన్మోహన్ సింగ్ మృతి - నేడు తెలంగాణలో సెలవు ప్రకటించిన ప్రభుత్వం
మన్మోహన్ సింగ్ మృతి - నేడు తెలంగాణలో సెలవు ప్రకటించిన ప్రభుత్వం
Trivikram Srinivas: నాకు పోటీగా ఉండే ఏరియాలోకి నేను రాను, పోటీ లేని ఇంకో ఏరియాని వెతుక్కుంటా - త్రివిక్రమ్
నాకు పోటీగా ఉండే ఏరియాలోకి నేను రాను, పోటీ లేని ఇంకో ఏరియాని వెతుక్కుంటా - త్రివిక్రమ్
Jagan Family: ఫ్యామిలీతో కలసిపోయిన జగన్ - వైసీపీకి కొత్త వెలుగులు తెచ్చిన క్రిస్మస్
ఫ్యామిలీతో కలసిపోయిన జగన్ - వైసీపీకి కొత్త వెలుగులు తెచ్చిన క్రిస్మస్
Aus Vs Ind Test Series: ఆసీస్ 474 పరుగులకు ఆలౌట్.. స్మిత్ భారీ సెంచరీ.. నాలుగు వికెట్లతో రాణించిన బుమ్రా
ఆసీస్ 474 పరుగులకు ఆలౌట్.. స్మిత్ భారీ సెంచరీ.. నాలుగు వికెట్లతో రాణించిన బుమ్రా
Venkatesh: వెంకీ ఖాతాలో మరో ‘జింగిడి జింగిడి’... 'సంక్రాంతికి వస్తున్నాం' కోసం ఈసారి పట్టుబట్టి మరీ!
వెంకీ ఖాతాలో మరో ‘జింగిడి జింగిడి’... 'సంక్రాంతికి వస్తున్నాం' కోసం ఈసారి పట్టుబట్టి మరీ!
AP Weather Updates: ఏపీలో 2 రోజులు వర్షాలు, పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ - తెలంగాణలో చలి పంజా
ఏపీలో 2 రోజులు వర్షాలు, పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ - తెలంగాణలో చలి పంజా
Embed widget