Image Credit: Freepik
Horoscope Today 9th June 2023: జూన్ 9 మీ రాశిఫలితాలు
మేషరాశి
ఆస్తి వ్యవహారాలు కలిసి వస్తాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రయాణం ఆసక్తికరంగా సాగుతుంది. సమయం అనుకూలతను సద్వినియోగం చేసుకోండి. కెరీర్‌లో విజయం సాధిస్తారు. షేర్ మార్కెట్ , మ్యూచువల్ ఫండ్స్ వలన లాభం పొందుతారు. స్నేహితులతో సరదాగా గడుపుతారు. అనవసర వ్యవహారాల్లో తల దూర్చకండి . ఆరోగ్యం జాగ్రత్త . విచక్షణతో వ్యవహరించండి.
వృషభ రాశి
విందు వినోదాల్లో సమయం గడుపుతారు. సృజనాత్మక పనులు విజయవంతమవుతాయి. వ్యాపార వృద్ధి ప్రణాళికాబద్ధంగా ఉంటుంది. ప్రమాదకర పనులకు దూరంగా ఉండండి. ఇంటా-బయటా ఆనందం ఉంటుంది. తొందరపడి ఏ పనీ చేయకూడదు. ఎలాంటి వివాదాల జోలికి వెళ్లొద్దు.
మిధున రాశి
ఉద్యోగానికి సంబంధించి చెడు వార్తలు అందుతాయి. ఏ పని అయినా తేలికగా తీసుకోవద్దు పూర్తి బాధ్యతగా చేయండి. విలువైన వస్తువులను భద్రంగా ఉంచండి. పనులను వాయిదా వేయకుండా సకాలంలో పూర్తి చేయండి. మిత్రులతో కలిసి బయటికి వెళ్లాలని ప్లాన్ చేస్తారు. కుటుంబంతో కలిసి వినోదాలలో గడుపుతారు. ఆదాయం స్థిరంగా ఉంటుంది. వ్యాపారం బాగా వృద్ధి చెందుతుంది.
Also Read: ఈ నక్షత్రంలో జన్మించిన వారికి తెలివితేటలు, నాయకత్వ లక్షణాలు అధికంగా ఉంటాయి!
కర్కాటక రాశి
అనారోగ్య సూచన ఉండవచ్చు. ఆహార నియమాలు పాటించండి. కుటుంబ సభ్యుల్లో ఏదో ఆందోళన ఉంటుంది . ఉద్యోగులు, వ్యాపారులు కష్టానికి తగిన ఫలితం పొందుతారు. ఈరోజు మీకు గౌరవం లభిస్తుంది. స్నేహితుల నుంచి సహాయం అందుతుంది..అవసరం అయిన వారికి మీరు సహాయం చేస్తారు.
సింహరాశి
ఈ రాశివారు ఇతరులను అపహాస్యం చేయొద్దు. మీకు ప్రోత్సాహకరమైన సమాచారం అందుతుంది. ఆత్మగౌరవం పెరుగుతుంది. చిన్న నాటి మిత్రులను కలుస్తారు. కొత్త స్నేహితులు ఏర్పడతారు. నూతన కార్యక్రమాలు చేయాలనే ఆలోచన వస్తుంది. ప్రయాణాలు ఆసక్తికరంగా సాగుతాయి. వ్యాపారం బాగా సాగుతుంది. చెడు సహవాసానికి దూరంగా ఉండండి. ధన నష్టం జరిగే అవకాశం ఉంది.
కన్యా రాశి
వ్యాపారంలో పురోగతికి మార్గం సుగమం అవుతుంది. ప్రయాణం ఆసక్తికరంగా సాగుతుంది. నూతన వస్త్రాల కొనుగోలు చేస్తారు. వ్యాపారం లాభసాటిగా ఉంటుంది. ఇతరుల పనిలో జోక్యం చేసుకోకండి. స్నేహితులతో వినోదాత్మకంగా గడుపుతారు. బహుమతులు అందుకుంటారు. ఏ పనిలోనూ తొందరపడకండి.
తులారాశి
వ్యాపారంలో విజయం ఉంటుంది. వివాదాలను ప్రోత్సహించవద్దు. చేస్తున్న పని సకాలంలో నెరవేరక టెన్షన్ పడతారు. ప్రయాణాల్లో ప్రత్యేక శ్రద్ధ వహించండి. ఎవరి ప్రేరేపణకు గురికావద్దు. స్నేహితుల మద్దతు లభిస్తుంది. వినోద కార్యక్రమంలో పాల్గొంటారు.
వృశ్చికరాశి
దూరప్రాంతాల నుంచి శుభవార్తలు అందుకుంటారు. జీవిత భాగస్వామి నుంచి మద్దతు లభిస్తుంది. మీరు ఎప్పుడో ఇచ్చిన రుణాలు ఇప్పుడు మీచేతికి అందుతాయి. ప్రయాణం ఆసక్తికరంగా సాగుతుంది. సామాజిక సేవ చేయాలనే కోరిక మేల్కొంటుంది. వ్యాపారాభివృద్ధి. కుటుంబంతో ఆనందంగా గడుపుతారు.
Also Read: ఈ ఆలయం నుంచి వెళ్లిపోతూ వెనక్కు తిరిగి చూస్తే దయ్యాలు ఆవహిస్తాయట!
ధనుస్సు రాశి
వ్యాపార లావాదేవీలలో తొందరపాటు వద్దు. సమయం అనుకూలంగా ఉంటుంది. నిత్యావసర వస్తువులు సమయానికి అందకపోవడం వల్ల కొంత ఇబ్బంది పడతారు. ప్రణాళికలు విజయవంతం అవుతాయి. ఉద్యోగస్తులకు బదిలీ జరగవచ్చు. స్నేహితులతో ఆహ్లాదకరంగా ఉంటుంది. ప్రయాణాలలో జాగ్రత్త వహించండి.
మకరరాశి
మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. న్యాయపరమైన అడ్డంకులు తొలగిపోతాయి. లాభదాయకమైన అవకాశాలు చేతికి అందుతాయి. ప్రయాణం ఆసక్తికరంగా సాగుతుంది. వినోద సాధనాలు అందుబాటులో ఉంటాయి. తీర్థయాత్రలకు వెళ్లే అవకాశం ఉంది. మతపరమైన పనుల పట్ల ఆసక్తి ఉంటుంది. ఆనందంగా ఉంటారు. కుటుంబంతో సమయం గడిపే అవకాశం లభిస్తుంది.
కుంభ రాశి
స్నేహితులు, బంధువుల మద్దతు లభిస్తుంది. ఆనందంగా ఉంటారు. అనుకోని ప్రమాదాలు, గాయాల వలన ఇబ్బంది పడతారు . తొందరపాటు, అజాగ్రత్త ఎక్కువగా ఉంటుంది. ఆరోగ్యం బలహీనంగా ఉంటుంది. పరిహాసాలకు, వివాదాలకు దూరంగా ఉండండి.
మీనరాశి
మీ తెలివితేటలు ఉపయోగించి సమస్యలను పరిష్కరిస్తారు. ప్రభావవంతమైన వ్యక్తి నుంచి మార్గదర్శకత్వం పొందుతారు. స్నేహితుల మద్దతు లభిస్తుంది. లాభదాయకమైన అవకాశాలు చేతికి అందుతాయి. స్నేహితుల సహకారం, మద్దతు లభిస్తుంది. కొన్ని విభేదాలు పరిష్కారమవుతాయి. వ్యాపారం బాగా సాగుతుంది. రోజంతా ఆనందంగా గడుపుతారు.
ఈ రాశివారు భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవడం చాలా అవసరం, సెప్టెంబరు 28 రాశిఫలాలు
Vastu Tips In Telugu: అద్దె ఇంటికి వాస్తు వర్తిస్తుందా -వర్తించదా!
Ganesh Nimajjanam 2023 : గణేష్ నిమజ్జనం ఎందుకు చేయాలి, చేయకపోతే ఏమవుతుంది !
ఈ రాశులవారు చెడు సహవాసాలను వదులుకుంటే మంచిది, సెప్టెంబరు 27 రాశిఫలాలు
Chanakya Niti In Telugu : మీ జీవితంలో అస్సలు నిర్లక్ష్యం చేయకూడని 8 మంది వీళ్లే!
Pakistan Cricket Team: ఎట్టకేలకు భారత్ లో పాక్ క్రికెట్ టీమ్ - హైదరాబాద్ చేరుకున్న బాబర్ సేన
Criminal Contempt Petition: న్యాయమూర్తులపై దూషణలు- బుచ్చయ్య చౌదరి, బుద్దా వెంకన్న సహా 26 మందికి హైకోర్టు నోటీసులు!
Tamannaah: దక్షిణాది సినిమాలపై తమన్నా ఘాటు వ్యాఖ్యలు - అందుకే సినిమాలు తగ్గించుకుందట!
IND vs AUS 3rd ODI: దెబ్బకొట్టిన మ్యాడ్ మాక్సీ! రాజ్కోట్ వన్డేలో టీమ్ఇండియా ఓటమి
/body>