News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

జూన్ 1 రాశిఫలాలు, ఈ రాశులవారిపై ఈ రోజు లక్ష్మీదేవి కరుణాకటాక్షాలుంటాయి!

Rasi Phalalu Today June 1st : ఆయా రాశుల్లో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. వ్యక్తిగత వివరాల కోసం జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు.

FOLLOW US: 
Share:

Horoscope Today 1st June 2023: జూన్ 1 గురువారం మీ రాశిఫలితాలు

మేష రాశి

ఈ రోజు మేషరాశివారికి మిశ్రమ ఫలితాలున్నాయి. కుటుంబంలో ఏదైనా శుభకార్యం నిర్వహించేందుకు ప్లాన్ చేస్తారు. ఇతరులకు సహాయం చేయడంలో ముందుంటారు. చదువు విషయంలో విద్యార్థులు కొంత గందరగోళంగా వ్యవహరిస్తారు. రాజకీయాలతో ముడిపడిన వ్యక్తుల ప్రభావం సమాజంలో పెరుగుతుంది. ఉద్యోగులు, వ్యాపారులకు మిశ్రమ ఫలితాలుంటాయి.

వృషభ రాశి

ఈ రోజు మీకు అద్భుతమైన రోజు అవుతుంది. ఏప్పటి నుంచో ఆగిపోయిన మొత్తం చేతికందుతుంది. నూతన పెట్టుబడులు పెట్టి వ్యాపారాన్ని అభివృద్ధి చేస్తారు. మరింత కష్టపడాల్సిన సమయం ఇది. అనుకున్న పనులు పూర్తిచేస్తారు. మానసిక గందరగోళం నుంచి విముక్తి పొందుతారు. ఉద్యోగులు పనితీరుతో ఉన్నతాధికారుల ప్రశంసలు పొందుతారు.

మిథున రాశి

ఈరోజు ఈ రాశివారు మంచి లాభం పొందుతారు. పనిచేసే ప్రదేశంలో మీ బాధ్యత పెరుగుతుంది. మీరు చేపట్టిన పనిని కష్టపడి అయినా పూర్తిచేస్తారు. పిల్లల విషయంలో ఆందోళన ఉంటుంది. స్నేహితులు మీనుంచి సహకారం ఆశిస్తారు. నిరుద్యోగులు మంచి ఉద్యోగంలో స్థిరపడే అవకాశం ఉంది. రిస్క్ తీసుకుంటే నష్టపోతారు..ఆలోచించి అడుగేయండి.

Also Read: ఏరువాక పున్నమి ఎప్పుడొచ్చింది, ప్రత్యేకత ఏంటి!

కర్కాటక రాశి

ఈ రోజు మీరు పెద్ద లక్ష్యాన్ని పొందుతారు. విద్యార్థులు  పరీక్షలో మంచి ఫలితాలు పొందుతారు. ఆపదలో ఉన్నవారిని ఆదుకుంటారు. ఈ రోజు పనిలో మీ గోప్యతను కాపాడుకోండి. కుటిల వ్యక్తులకు దూరం పాటించాల్సిన అవసరం ఉంది. భాగస్వాములతో సఖ్యత ఉంటుంది.

సింహ రాశి 

ఈ రోజు పెద్ద జాబ్ ఆఫర్ వస్తుంది. మీ గృహ జీవితంలో ఆనందం ఉంటుంది. వ్యాపారులు నూతన ఒప్పందాలను కుదుర్చుకుంటారు. కార్యాలయంలో సహోద్యోగుల నుంచి సహకారం అందుతుంది. ఈ రోజు పని ఒత్తిడి తగ్గుతుంది. మీ ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. కొత్త వ్యక్తులతో పరిచయం ఏర్పడుతుంది.

కన్యా రాశి

ఈ రోజు మీ మాటలో మాధుర్యాన్ని నిలుపుకోవాల్సిన అవసరం ఉంది. వివాదాలకు దూరంగా ఉండాలి. కర్మాగారాల్లో పనిచేసేవారికి గుర్తింపు లభిస్తుంది. ఉద్యోగం, వ్యాపారం సాగుతుంది.  వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది. స్నేహితుల సహకారంతో మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. మీకు నచ్చిన వంటకాలను మీరు ఆనందిస్తారు. ప్రతికూల ఆలోచనను వదిలివేయండి.

తులా రాశి

ఈ రోజు మీ జీవితంలో ఎదురైన అడ్డంకులు తొలగిపోతాయి. ఉద్యోగులు కార్యాలయంలో ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. కుటుంబంలో సంతోషం ఉంటుంది. నూతన ప్రణాళికలు అమలుచేసేందుకు ఈ రోజు మంచి రోజు అవుతుంది. కొన్ని పనులు చేసేటప్పుడు జాగ్రత్త అవసరం. ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యంగా ఉండొద్దు.

వృశ్చిక రాశి 

ఈ రాశి ఉద్యోగులకు ఈ రోజు మంచి రోజు అవుతుంది. వ్యాపారం పుంజుకుంటుంది. స్నేహితులతో కొనసాగుతున్న మనస్పర్థలు ఈరోజుతో సమసిపోతాయి. ఒకరి భావాలు మరొకరు అర్థం చేసుకుంటారు. కంటి సమస్యలతో ఇబ్బందిపడే అవకాశం ఉంది. పనికిరాని చర్చలతో సమయాన్ని వృథా చేయకండి.

Also Read: నెల రోజుల పాటూ ఈ 4 రాశులవారికి అంత బాలేదు!

ధనుస్సు రాశి

ఈ రోజు మీకు మంచి రోజు అవుతుంది. ఏదైనా పర్యాటక ప్రదేశాన్ని సందర్శించాలనుకుంటే అందుకు తగిన ప్లాన్ చేసుకోవచ్చు. పెద్దల సలహాలు పాటించడం ద్వారా మీకు మంచి జరుగుతుంది. ఈ రోజు మీరు సోదరులతో ఓ ముఖ్యమైన విషయం గురించి చర్చిస్తారు. వైవాహిక జీవితంలో సంతోషం ఉంటుంది. నిరుద్యోగులు త్వరలోనే శుభవార్త వింటారు.

మకర రాశి

ఈ రోజు మీ పురోగతితో కుటుంబ సభ్యులు సంతోషిస్తారు. ఉద్యోగులు ఇంక్రిమెంట్లు పొందుతారు. మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ప్రైవేట్ కంపెనీలతో అనుబంధం ఉన్న వ్యక్తులు పదోన్నతి పొందుతారు. ముఖ్యమైన పనులు పూర్తయ్యే అవకాశం ఉంది. అనుకున్న పనులు ఈరోజు పూర్తవుతాయి. మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి. జీవిత భాగస్వామి నుంచి పూర్తి మద్దతు లభిస్తుంది.

కుంభ రాశి 

ఈ రోజు ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు దానిని కూలంకషంగా ఆలోచించాలి. ఈ రాశికి చెందిన అవివాహితులకు సంబంధాలు కుదురుతాయి. వ్యాపారవేత్తలు కొత్త పెట్టుబడులు పెట్టొచ్చు. ఉద్యోగులకు శుభసమయం. మీరు తలపెట్టిన పనులకు కుటుంబ సభ్యుల మద్దతు లభిస్తుంది.

Also Read: ఈ రాశులవారికి ఈ రోజు(మే 30) నుంచి లక్ష్మీయోగం

మీన రాశి

ఈ రోజు మీరు పిల్లల కోసం సమయాన్ని వెచ్చిస్తారు. కళారంగంలో ఉన్న ప్రజలకు మేలు జరుగుతుంది. కార్యాలయానికి సంబంధించిన పనిని పెండింగ్ లో ఉంచొద్దు. తొందరపాటుగా వ్యవహరించవద్దు. కొన్ని ముఖ్యమైన పనులను పూర్తిచేయండి. మోసపూరిత వ్యక్తుల పట్ల జాగ్రత్త వహించండి.  ధనలాభం ఉంటుంది.

Published at : 01 Jun 2023 06:22 AM (IST) Tags: Astrology Horoscope Today Aaj Ka Rashifal Check Astrological prediction horoscope June 1 2023 Scorpio daily Horoscope Aries daily Horoscope Gemini daily Horoscope

ఇవి కూడా చూడండి

Importance Of Bathukamma 2023: బతుకమ్మ పండుగలో పూలకు అంత ప్రాధాన్యత ఎందుకు!

Importance Of Bathukamma 2023: బతుకమ్మ పండుగలో పూలకు అంత ప్రాధాన్యత ఎందుకు!

Horoscope September 29, 2023: ఈ రాశివారికి ఆదాయం తగ్గుతుంది - ఖర్చులు పెరుగుతాయి

Horoscope September 29, 2023: ఈ రాశివారికి ఆదాయం తగ్గుతుంది - ఖర్చులు పెరుగుతాయి

Dates of Bathukamma in 2023: బతుకమ్మ పండుగ డేట్స్ ఇవే - ఏ రోజు ఏ బతుకమ్మని పూజించాలో తెలుసా!

Dates of Bathukamma in 2023: బతుకమ్మ పండుగ డేట్స్ ఇవే -  ఏ రోజు ఏ బతుకమ్మని పూజించాలో తెలుసా!

ఈ రాశివారు భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవడం చాలా అవసరం, సెప్టెంబరు 28 రాశిఫలాలు

ఈ రాశివారు భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవడం చాలా అవసరం, సెప్టెంబరు 28 రాశిఫలాలు

Vastu Tips In Telugu: అద్దె ఇంటికి వాస్తు వర్తిస్తుందా -వర్తించదా!

Vastu Tips In Telugu: అద్దె ఇంటికి వాస్తు వర్తిస్తుందా -వర్తించదా!

టాప్ స్టోరీస్

RK Roja: ఆటో డ్రైవర్‌ అవతారంలో మంత్రి రోజా, లోకేశ్‌పై తీవ్ర వ్యాఖ్యలు - ముందస్తు బెయిల్ ఎందుకు?

RK Roja: ఆటో డ్రైవర్‌ అవతారంలో మంత్రి రోజా, లోకేశ్‌పై తీవ్ర వ్యాఖ్యలు - ముందస్తు బెయిల్ ఎందుకు?

Upcoming Mobiles: స్మార్ట్ ఫోన్ల సీజన్ వచ్చేసింది - అక్టోబర్‌లో ఏయే ఫోన్లు రానున్నాయంటే?

Upcoming Mobiles: స్మార్ట్ ఫోన్ల సీజన్ వచ్చేసింది - అక్టోబర్‌లో ఏయే ఫోన్లు రానున్నాయంటే?

Pedda Kapu Review - 'పెదకాపు 1' రివ్యూ : గోదారి నెత్తుటి రాజకీయం - శ్రీకాంత్ అడ్డాల సినిమా ఎలా ఉందంటే?

Pedda Kapu Review - 'పెదకాపు 1' రివ్యూ : గోదారి నెత్తుటి రాజకీయం - శ్రీకాంత్ అడ్డాల సినిమా ఎలా ఉందంటే?

ODI World Cup 2023: అక్షర్ పటేల్ సంచలన పోస్టులు, కావాలనే తప్పించారా! అతడి బాధ వర్ణనాతీతం

ODI World Cup 2023: అక్షర్ పటేల్ సంచలన పోస్టులు, కావాలనే తప్పించారా! అతడి బాధ వర్ణనాతీతం