Horoscope Today 9th February 2025: మాఘమాసం ఆదివారం ఈ రాశులవారిపై సూర్యుడి అనుగ్రహం!
Horoscope Today : గ్రహాల కదలిక, నక్షత్రాల ఆధారంగా జ్యోతిష్యులు రాశి ఫలితాలను అంచనా వేస్తారు. ఈరోజు రాశి ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.

ఫిబ్రవరి 9 రాశిఫలాలు
మేష రాశి
స్థిరాస్తులు కొనుగోలు చేయాలనే ఆలోచన చేస్తారు. ప్రస్తుత పరిస్థితుల ప్రకారం, మీరు మీ వ్యూహంలో సమూల మార్పులు చేయాల్సి వస్తుంది. కుటుంబంలో ఆధ్యాత్మిక విషయాలపై చర్చంచుకుంటారు. మీ పని నాణ్యతను పెంచడానికి ప్రయత్నించండి.
వృషభ రాశి
గత కొంతకాలంగా వెంటాడుతున్న ఇబ్బందుల నుంచి బయటపడతారు. కాస్త ఓపిక పట్టిన తర్వాత అనుకున్న పనులు పూర్తిచేస్తారు. కుటుంబానికి సమయం కేటాయించండి. ఆరోగ్యం బావుంటుంది. రోజంతా సంతోషంగా ఉంటారు
మిథున రాశి
ఈ రోజు చికాకుగా ఉంటారు. ఉద్యోగంలో అధికారులు మీకు వ్యతిరేకంగా ఉంటారు. విలువైన వస్తువుల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించండి. ఒకేసారి చాలా పనులు చేయడానికి ప్రయత్నించవద్దు.
Also Read: ఈ వారం ఈ రాశులవారి జీవితంలో చాలా సర్‌ప్రైజెస్ ఉంటాయ్ - ఫిబ్రవరి 10 నుంచి 16 వార ఫలాలు!
కర్కాటక రాశి
ఈ రోజు మీ అభిప్రాయాలకు చాలా వాల్యూ ఉంటుంది. వైవాహిత బంధం సంతోషంగా సాగుతుంది. కొత్త రచనల గురించి మనస్సులో ఉత్సాహం పెరుగుతుంది. ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్న వారికి మంచి రోజు. ఆభరణాల కోసం డబ్బు ఖర్చు చేయవచ్చు.
సింహ రాశి
ఈ రోజు పనిలో నిర్లక్ష్యంగా ఉండకూడదు. వ్యాపార పరిస్థితులలో మెరుగుదల వచ్చే అవకాశం ఉంది. కుటుంబంలో ఆనంద వాతావరణం ఉంటుంది. పాత తగాదాలతో మళ్ళీ చిక్కుకోవద్దు. ఆధ్యాత్మిక విషయాలు తెలుసుకునేందుకు ప్రయత్నిస్తారు
కన్యా రాశి
ఈ రోజు మీకు రావాల్సిన సొమ్ము చేతికందడం ఆలస్యం అవుతుంది. ఆధ్యాత్మిక వియాలపై అధ్యయనం చేస్తారు. ఈ రాశి ఉద్యోగులు ఉన్నతాధికారుల అసంతృప్తిని ఎదుర్కోవలసి ఉంటుంది. కుటుంబ సభ్యులు మద్దతు మీకు ఉంటుంది.
తులా రాశి
ఈ రోజంతా పోరాటంగా ఉన్నట్టు ఉంటుంది. జీవిత భాగస్వామిపై విశ్వాసం తగ్గుతుంది. ప్రియమైనవారి సలహాను తీవ్రంగా పరిగణించండి. అనారోగ్య సమస్యలుంటాయి. కొన్ని ముఖ్యమైన పనులు పూర్తికావడంలో అడ్డంకులు ఉంటాయి. సోమరితనం వదులుకోండి.
వృశ్చిక రాశి
ఈ రాశి నిరుద్యోగులు ఉద్యోగ ఇంటర్యూలకు పిలుపు అందుకుంటారు. ఆచరణలో అహంకారం ప్రదర్శించవద్దు. మీరు చేపట్టే పని విజయవంతం అవుతుంది. రోజువారీ ఆదాయం పెరుగుతుంది.
Also Read: పెళ్లిళ్ల సీజన్ మొదలైంది.. పెళ్లికానివారు ఇది పారాయణం చేస్తే మంచి ఫలితం ఉంటుంది!
ధనస్సు రాశి
ఈ రోజు కొన్ని పనులపై కుటుంబ సమ్మతి పొందుతారు. మీరు జీవితం పట్ల మీ వైఖరిలో కొన్ని మార్పులను తీసుకొస్తారు. జీవిత భాగస్వామితో సమన్వయం చాలా మంచిది. రోజంతా సంతోషంగా ఉంటారు
మకర రాశి
ఈ రోజు మీ నిర్ణయాలతో కుటుంబం చాలా సంతోషంగా ఉంటుంది. ఈ రోజు మీరు క్రొత్త పనిని ప్రారంభించవచ్చు. స్నేహితులతో మంచి సమయం స్పెండ్ చేస్తారు. పోటీ పరీక్షలో శుభ ఫలితాలు పొందే అవకాశాలు ఉన్నాయి. పిల్లల భవిష్యత్తు గురించి ఆందోళన చెందుతారు.
కుంభ రాశి
ఈ రోజు క్రమశిక్షణతో ఉండండి. ఆఫీసులో పని ఒత్తిడి పెరుగుతుంది. పాత సమస్యల గురించి కొంచెం ఆందోళన చెందుతారు. ఇంటి పెద్దలు సంతోషంగా ఉంటారు. ప్రేమికులతో సమావేశం ప్లాన్ చేసుకుంటారు..పెళ్లి గురించి చర్చిస్తారు.
Also Read: మాఘ పూర్ణిమ ప్రత్యేకత ఏంటి..ఈ ఏడాది ఎప్పుడొచ్చింది.. ఈ రోజు సముద్ర స్నానం ఎందుకు చేయాలి!
మీన రాశి
ఈ రాశి అవివాహితుల వివాహం గురించి ఇంట్లో చర్చలు జరుగుతాయి. ప్రభావవనంతమైన వ్యక్తులను కలుస్తారు. సమస్యలను శాంతియుతంగా పరిష్కరించడానికి ప్రయత్నించండి. సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. సంతోషం కోసం ఖర్చు చేస్తారు.
Note: ఓ రాశిలోని ఫలితాలు మొత్తం ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు..మీ జాతకంలో గ్రహస్థితి ఆధారంగా కూడా ఫలితాల్లో మార్పులుంటాయి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం.





















