అన్వేషించండి

Horoscope Today December 23rd, 2023: ఈ రాశులవారికి ఆనందం - ఆ రాశులవారికి ఆందోళన, డిసెంబరు 03 రాశిఫలాలు

Horoscope Today: గ్రహాల కదలిక, నక్షత్రాల ఆధారంగా ఓ రాశివారి ఫలితాలని అంచనా వేస్తారు జ్యోతిష్యులు. డిసెంబరు 03 , 2023 ఈ రాశిఫలితం ఎలా ఉందో ఇక్కడ తెలుసుకోండి...

Horoscope Today  December 3rd 2023  (డిసెంబరు 03 రాశిఫలాలు)

మేష రాశి (Aries Horoscope in Telugu) (అశ్వని, భరణి, కృత్తిక 1వ పాదం)

ఈ రోజు మీకు మిశ్రమ ఫలితాలంటాయి. కుటుంబ సభ్యుల భవిష్యత్తు గురించి చర్చ ఉండవచ్చు. వ్యాపార సంబంధిత ప్రయాణం కూడా మీకు లాభదాయకంగా ఉంటుంది. మీ జీవిత భాగస్వామితో ఏదైనా వివాదం ఉంటే, వారిని ఒప్పించడానికి మీరు మీ వంతు ప్రయత్నం చేయాలి. మీరు ఎవరి దగ్గరైనా రుణం తీసుకోవాలని ఆలోచిస్తుంటే వెనక్కు తగ్గడమే మంచిది. మీరు శుభవార్త వినొచ్చు.

వృషభ రాశి (Taurus Horoscope in Telugu) (కృత్తిక 2,3,4 పాదాలు, రోహిణి, మృగశిర 1,2 పాదాలు)

ఈ  రోజు మంచిగా ఉంటుంది. రాజకీయాలలో పని చేసే వ్యక్తులకు సమస్యలు తప్పవు. ప్రత్యర్థుల చేతిలో ఓడిపోతారు. మీరు కుటుంబ సభ్యుల నుంచి సహాయం కోసం ఎదురు చూస్తారు కానీ సకాలంలో సహాయం అందకపోవడం వల్ల మీరు విచారంగా ఉంటారు. కుటుంబ సంబంధాలలో కొనసాగుతున్న సమస్యలను మీరు పరిష్కరించాల్సి ఉంటుంది. ఈరోజు పిల్లల కార్యకలాపాలను గమనించండి. తెలియని వ్యక్తుల పట్ల జాగ్రత్తగా ఉండండి.

Also Read: ఈ 5 రాశులవారు అపర చాణక్యులు, వ్యూహం రచిస్తే తిరుగుండదు!

మిథున రాశి (Gemini Horoscope in Telugu) (మృగశిర 3,4, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పాదాలు)
 
కార్యాలయంలోని అధికారులు ఈరోజు మిమ్మల్ని అభినందిస్తారు. వ్యాపారాలు చేసే వ్యక్తులు అజాగ్రత్తగా ఉంటే భారీ నష్టం సంభవించవచ్చు. మీరు ఇంతకుముందు డబ్బును పెట్టుబడిగా పెట్టినట్లయితే, భవిష్యత్తులో మీరు కచ్చితంగా దాని నుంచి ప్రయోజనం పొందుతారు. మీరు మీ రోజువారీ అవసరాలను తీర్చడానికి  కొంత సొమ్ము ఖర్చుచేస్తారు. ఆదాయాన్ని దృష్టిలో ఉంచుకుని ఖర్చు చేస్తే మంచిది.

కర్కాటక రాశి (Cancer Horoscope in Telugu)  (పునర్వసు 4 పాదం, పుష్యమి, ఆశ్లేష)

ఆధ్యాత్మిక కార్యకలాపాలపై ఆసక్తి పెరుగుతుంది. మీ కుటుంబ సభ్యులంతా సంతోషంగా ఉంటారు.  మీరు కొంతమంది తప్పు వ్యక్తుల సహవాసంలోకి రావచ్చు జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగులకు పని విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు, శ్రద్ధగా ఉంటారు. కుటుంబంలో కొన్ని సంఘటనల గురించి చర్చలు జరుగుతాయి. మీ జీవిత భాగస్వామికి చేసిన వాగ్దానాన్ని మీరు నెరవేర్చాలి. కుటుంబ వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది.

Also Read: ఈ 6 రాశులవారికి ఆదాయం, ఆనందం, విజయాన్నిచ్చి వెళ్లిపోతోంది 2023

సింహ రాశి (Leo Horoscope in Telugu)(మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం)

ఈ రోజు మీరు మీకు నచ్చిన పనిని మాత్రమే చేయండి. ఉద్యోగాలతో సంబంధం ఉన్న వ్యక్తులకు శుభసమయం. ఈ రోజు మీరు మీ బంధువుల నుంచి నిరుత్సాహకరమైన సమాచారాన్ని పొందవచ్చు. వృధా ఖర్చులను నియంత్రించాల్సిన అవసరం ఉంది. కొత్త స్నేహితులు ఏర్పడతారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి 

కన్యా రాశి  (Virgo Horoscope in Telugu) (ఉత్తర 2,3,4 పాదాలు, హస్త, చిత్త1,2 పాదాలు)

ఈ రాశివారు స్నేహితుల నుంచి పూర్తి మద్దతు పొందుతారు. అనవసర పరుగులు వద్దు. ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉంది. మీరు ఎవరికైనా సహాయం చేయడానికి ప్రయత్నిస్తారు, కానీ ఆ వ్యక్తి మీ కష్టాన్ని విస్మరిస్తాడు. మీరు మీ పని ప్రదేశంలో కొన్ని మార్పులు చేయవలసి వస్తే కచ్చితంగా చేయాలి. కుటుంబసభ్యుల వివాహానికి వచ్చే అడ్డంకులు ఈరోజు తొలగుతాయి. విద్యార్థులు తమ తల్లిదండ్రుల ఆశీస్సులతో పరీక్షలు రాయడం మంచిది. 

Also Read: 2023 ఎన్నికల్లో ఈ 6 రాశుల రాజకీయనాయకులకు గ్రహాలు అనుకూలంగా లేవు - ఏదైనా అద్భుతం జరగాలంతే!

తులా రాశి (Libra Horoscope in Telugu) (చిత్త 3,4, స్వాతి, విశాఖ1,2,3 పాదాలు)

ఈ రోజు మీకు ముఖ్యమైన రోజు. కొన్ని పనులను వెంటనే పూర్తి చేయవలసి ఉంటుంది. పెట్టుబడులు మీకు లాభాలను ఇస్తాయి. మీరు విహారయాత్రకు సిద్ధమవుతున్నట్లయితే ముఖ్యమైన వస్తువులను భద్రంగా ఉంచుకోవాలి. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న న్యాయపరమైన విషయాలపై శ్రద్ధ వహించండి. ఈ రోజు కుటుంబ పరిస్థితి మెరుగుపడుతుంది. మీరు చాలా ఆలోచనాత్మకంగా  లావాదేవీలు నిర్వహించాలి. 

వృశ్చిక రాశి (Scorpio Horoscope in Telugu) (విశాఖ 4 వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ)

ఈ రోజు సామాజిక రంగంలో పని చేసే వారికి సంతోషకరమైన రోజు. ఉద్యోగానికి సంబంధించిన కొన్ని శుభవార్తలను అందుకోవచ్చు. ఈ రోజు పిల్లల ఆరోగ్యంలో కొంత మెరుగుదల ఉంటుంది. మీరు వ్యాపారం కోసం ఏదైనా నిర్ణయం తీసుకోవాల్సి వస్తే తప్పకుండా మీ సోదరులను సంప్రదించండి. మీరు ఏదైనా కొత్త పనిని ప్లాన్ చేస్తే, మీరు కచ్చితంగా విజయం సాధిస్తారు. 

ధనుస్సు రాశి  (Sagittarius Horoscope in Telugu) (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం) 

ఈ రోజు మీరు మీ వ్యాపారంపై శ్రద్ధ చూపరు. పాత అనారోగ్యం తిరగబెడుతుంది. లేనిపోని ఆందోళన పెరుగుతుంది. మీరు కొన్ని నిరుత్సాహకరమైన వార్తలను అందుకోవచ్చు. ఉద్యోగంలో మీ పనిని మీరు పూర్తిస్థాయిలో చేయండి. బాధ్యతల నిర్వహణలో అలసత్వం వద్దు. 

ఏ రాశుల రాజకీయ నాయకులకు గ్రహాలు అనుకూల ఫలితాలనిస్తున్నాయో తెలుసుకునేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి...

మకర రాశి (Capricorn Horoscope in Telugu) (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పాదాలు)

ఈ రాశివారు జాగ్రత్తగా ఉండండి. శత్రువుల మిమ్మల్ని దెబ్బతీసే ప్రయత్నం చేస్తారు. పెట్టిన పెట్టుబడులకు ఆశించిన లాభాలు అందవు. వ్యాపారులు కొన్ని ప్రణాళికలు రచిస్తారు. విద్యార్థులు విహారయాత్రకు ప్లాన్ చేసుకునే అవకాశం ఉంది. కార్యాలయంలో ఏదైనా సమస్య ఉంటే అది ఈ రోజు పరిష్కారం అయిపోతుంది. 

కుంభ రాశి  (Aquarius Horoscope in Telugu) (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పాదాలు)

ఈ రోజు మీకు భౌతిక సుఖాలు పెరుగుతాయి. వ్యాపారంలో ఆకస్మిక ఆర్థిక లాభానికి అవకాశం ఉంది ఇది మీ ఆనందానికి కారణం అవుతుంది. ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది, మీరు మీ మాటలను నియంత్రించుకోవాల్సి ఉంటుంది.  కార్యాలయంలో అమలు చేసిన కొత్త ప్రణాళికలు మీకు లాభిస్తాయి. ప్రత్యర్థుల పట్ల జాగ్రత్తగా ఉండాలి. 

మీన రాశి (Pisces Horoscope in Telugu) (పూర్వాభాద్ర 4 పాదం, ఉత్తరాభాద్ర, రేవతి)

ఈ రోజు మీరు గుడ్ న్యూస్ వింటారు. మీ కెరీర్‌లో మార్పు రావచ్చు. ఆ కారణంగా మీ మనసులో కొత్త ఆలోచనలు కూడా వస్తాయి. వ్యాపారస్తులు పనిపై ఏకాగ్రత అవసరం. పోటీ పరీక్షలు రాసే విద్యార్థులు మంచి ఫలితాలు పొందుతారు. పాత బంధువులను కలుస్తారు.

Also Read: ముక్కోటి ఏకాదశి, గీతాజయంతి సహా మార్గశిరమాసం ( డిసెంబరు) లో ముఖ్యమైన రోజులివే!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Perni Nani Ration Case: రేషన్ బియ్యం మాయం కేసులో నిందితులకు 12 రోజులు రిమాండ్
Perni Nani Ration Case: రేషన్ బియ్యం మాయం కేసులో నిందితులకు 12 రోజులు రిమాండ్
Holidays List in 2025 : న్యూ ఇయర్ 2025లో 12 రోజులు లీవ్ పెడితే 50 రోజులు పండగే.. పబ్లిక్ హాలీడేలు, వీక్లీ ఆఫ్​లతో రచ్చ చేసేయండిలా
న్యూ ఇయర్ 2025లో 12 రోజులు లీవ్ పెడితే 50 రోజులు పండగే.. పబ్లిక్ హాలీడేలు, వీక్లీ ఆఫ్​లతో రచ్చ చేసేయండిలా
Gudivada Amarnath: సొంత నియోజకవర్గం లేని నేతగా గుడివాడ అమర్నాథ్! మాజీ మంత్రి వింత పరిస్థితి- భీమిలి పై కన్ను
సొంత నియోజకవర్గం లేని నేతగా గుడివాడ అమర్నాథ్! మాజీ మంత్రి వింత పరిస్థితి- భీమిలి పై కన్ను
Richest CM In India: దేశంలో ధనిక సీఎంగా చంద్రబాబు, చివరి స్థానంలో మమతా బెనర్జీ - ఆస్తులు, అప్పుల వివరాలిలా
దేశంలో ధనిక సీఎంగా చంద్రబాబు, చివరి స్థానంలో మమతా బెనర్జీ - ఆస్తులు, అప్పుల వివరాలిలా
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

KA Paul Interview on Allu Arjun | అంబేడ్కర్ ని తిట్టినోళ్లు యూజ్ లెస్ ఫెలోస్ | ABP DesamDeputy CM Pawan kalyan on Allu Arjun | సంధ్యా థియేటర్ వ్యవహారంపై పవన్ కళ్యాణ్ | ABP DesamISRO SpaDEX Docking Experiment | తొలిసారిగా డాకింగ్ ప్రయోగం చేస్తున్న ఇస్రో | ABP Desamఅమిత్ షాకి అదో ఫ్యాషన్, మాలల సత్తా చూపిస్తాం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Perni Nani Ration Case: రేషన్ బియ్యం మాయం కేసులో నిందితులకు 12 రోజులు రిమాండ్
Perni Nani Ration Case: రేషన్ బియ్యం మాయం కేసులో నిందితులకు 12 రోజులు రిమాండ్
Holidays List in 2025 : న్యూ ఇయర్ 2025లో 12 రోజులు లీవ్ పెడితే 50 రోజులు పండగే.. పబ్లిక్ హాలీడేలు, వీక్లీ ఆఫ్​లతో రచ్చ చేసేయండిలా
న్యూ ఇయర్ 2025లో 12 రోజులు లీవ్ పెడితే 50 రోజులు పండగే.. పబ్లిక్ హాలీడేలు, వీక్లీ ఆఫ్​లతో రచ్చ చేసేయండిలా
Gudivada Amarnath: సొంత నియోజకవర్గం లేని నేతగా గుడివాడ అమర్నాథ్! మాజీ మంత్రి వింత పరిస్థితి- భీమిలి పై కన్ను
సొంత నియోజకవర్గం లేని నేతగా గుడివాడ అమర్నాథ్! మాజీ మంత్రి వింత పరిస్థితి- భీమిలి పై కన్ను
Richest CM In India: దేశంలో ధనిక సీఎంగా చంద్రబాబు, చివరి స్థానంలో మమతా బెనర్జీ - ఆస్తులు, అప్పుల వివరాలిలా
దేశంలో ధనిక సీఎంగా చంద్రబాబు, చివరి స్థానంలో మమతా బెనర్జీ - ఆస్తులు, అప్పుల వివరాలిలా
New Year Gift Ideas: మ్యూచువల్ ఫండ్, షేర్లు లేదా గోల్డ్ బాండ్ - కొత్త సంవత్సరంలో ఏ బహుమతి ఇవ్వాలి?
మ్యూచువల్ ఫండ్, షేర్లు లేదా గోల్డ్ బాండ్ - కొత్త సంవత్సరంలో ఏ బహుమతి ఇవ్వాలి?
Hyderabad Traffic Restrictions : హైదరాబాద్‌లో న్యూ ఇయర్ 2025 సెలబ్రేషన్స్‌పై బిగ్ అలర్ట్- ఇవి తెలుసుకోకుంటే జైలుకెళ్లాల్సిందే
హైదరాబాద్‌లో న్యూ ఇయర్ 2025 సెలబ్రేషన్స్‌పై బిగ్ అలర్ట్- ఇవి తెలుసుకోకుంటే జైలుకెళ్లాల్సిందే
Ind Vs Aus Test Series: సిడ్నీ టెస్టులో కోహ్లీ, విరాట్ తప్పుకుంటారా? తప్పిస్తారా? సెలెక్టర్లే మాజీ క్రికెటర్ ఫైర్
సిడ్నీ టెస్టులో కోహ్లీ, విరాట్ తప్పుకుంటారా? తప్పిస్తారా? సెలెక్టర్లే మాజీ క్రికెటర్ ఫైర్
Madanapalli News: మదనపల్లె ఫైల్స్ దగ్దం కేసులో తొలి అరెస్ట్, 6 నెలల తరువాత కేసులో కదలిక
మదనపల్లె ఫైల్స్ దగ్దం కేసులో తొలి అరెస్ట్, 6 నెలల తరువాత కేసులో కదలిక
Embed widget