Horoscope Today : ఈ రాశి వారికి పెండింగ్ పనులు పూర్తవుతాయి, ఆ రాశి వారు జాగ్రత్తగా ఉండాలి
Horoscope Today : మేష రాశి నుంచి మీన రాశివరకూ ఈ రోజు మీ రాశి ఫలితం ఎలా ఉందో ఇక్కడ తెలుసుకోండి.
Horoscope Today 2023 August 25th
మేషరాశి
ఈ రాశి వారు ఈ రోజు ఏ పనిని ప్రారంభించినా కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. అలా ఇబ్బందులు ఎదురైనా కూడా వాటిని అధిగమిస్తారు. కొన్ని విషయాల్లో అప్రమత్తంగా ఉండడం చాలా అవసరం. ముఖ్యంగా బంధుమిత్రులతో జాగ్రత్తగా ఉండాలి. తెలియని వారితో ఎక్కువగా మాట్లాడకపోవడమే మంచిది. శ్రీ లక్ష్మీ స్తోత్రాన్ని చదువుకుంటూ ఉండాలి.
వృషభ రాశి
ఈ రాశి వారికి శ్రమ పెరుగుతుంది. గతంలో పూర్తవ్వకుండా మిగిలిపోయిన పెండింగ్ పనులు ఈరోజు పూర్తయ్యే అవకాశం ఉంది. శుభ వేడుకల్లో పాల్గొనే అవకాశం ఉంది. ఈరోజు ఆనందోత్సాహాల మధ్య సమయం గడుస్తుంది. అయితే అష్టమంలో ఉన్న చంద్రుడు అనుకూలంగా లేడు. కాబట్టి చంద్రుడిని శాంత పరిచేందుకు చంద్ర శ్లోకాన్ని చదువుతూ ఉండండి.
మిధున రాశి
ఒక శుభవార్తను ఉంటారు. ఆ వార్త మీ ఇంట్లో సంతోషాన్ని నింపుతుంది. విందుల్లో వినోదాల్లో పాల్గొంటారు. సమయస్ఫూర్తితో వ్యవహరిస్తారు. ముఖ్యమైన వ్యవహారాల్లో సమయస్ఫూర్తి మిమ్మల్ని కాపాడుతుంది. అందరి ప్రశంసలు అందుకునే అవకాశం ఎక్కువ. దుర్గాదేవి స్తుతిస్తే ఎంతో మేలు.
కర్కాటక రాశి
కర్కాటక రాశి వారు నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. వారికి స్నేహితుల సహకారం అందుతుంది. భవిష్యత్తు ప్రణాళికలు కూడా అమలు చేయగలుగుతారు. అయితే మనశ్శాంతి లోపించే అవకాశం ఉంది. అలా లోపించకుండా జాగ్రత్త పడితే మంచిది. దుర్గాదేవి శ్లోకాలను చదువుతుంటే మనశ్శాంతిగా ఉంటుంది.
సింహరాశి
ఈ రాశి వారు ఒక శుభవార్త వినే అవకాశం ఉంది. ఆ శుభవార్త వల్ల మనోధైర్యం పెరుగుతుంది. కుటుంబంలో వాతావరణం సానుకూలంగా ఉంటుంది. ఆస్తిని వృద్ధి చేసే పనుల్లో ముందుకు వెళతారు. ఫలితాలన్నీ శుభకరంగా ఉంటాయి. మీకు ఇష్టమైన దేవతను ఆరాధిస్తే మరింత మనోశక్తి వస్తుంది.
కన్యారాశి
ఈ రాశి వారికి ధన వ్యయం జరిగే అవకాశం ఉంది. ఫలితాలు మిశ్రమంగా ఉంటాయి. కొన్ని పరిస్థితులు బాధ కలిగిస్తాయి. ఎవరినీ అతిగా నమ్మడం మంచి పద్ధతి కాదు. మీపై అధికారులతో చాలా జాగ్రత్తగా ఉండాలి. సూర్య నమస్కారాలు చేస్తూ ఉంటే మీకు మనో శక్తి పెరుగుతుంది.
తులారాశి
ఈ రాశి వారికి ఈరోజు అన్నీ లాభాలే. అవసరానికి సహాయం కూడా అందుతుంది. ఆత్మీయులతో ఆనందంగా ఉంటారు. జీవితం ప్రశాంతంగా ఉంటుంది. మీకు నచ్చిన దైవాన్ని ఆరాధన చేస్తే ఇంకా శుభప్రదంగా ఉంటుంది.
వృశ్చిక రాశి
మీరు పని చేస్తున్న రంగాల్లో మీకు అనుకూల వాతావరణమే లభిస్తుంది. శరీర సౌఖ్యం కూడా ఉంటుంది. ఏవైనా నిర్ణయాలు తీసుకునే ముందు బాగా ఆలోచించాలి. ఎవరినీ అతిగా నమ్మడం మంచిది కాదు. ప్రతిరోజూ సూర్య నమస్కారం చేస్తే మంచిది.
ధనుస్సు రాశి
ఇది మీకు ఉత్తమ కాలమని చెప్పాలి. మీ ఇంట్లో సంతోషం వెల్లి విరుస్తుంది. ఆర్థిక వ్యవహారాల్లో ధైర్యంగా ముందుకు వెళతారు. మీరు ఊహించిన దాని కన్నా ఎక్కువ ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. మీరు చేసే ప్రయాణాలు కూడా ఉత్తమ ఫలితాలను అందిస్తాయి. శ్రీరాముడిని దర్శించుకుంటే ఇంకా మంచి జరుగుతుంది.
మకర రాశి
మిమ్మల్ని ఇబ్బంది పెట్టేవారు ఉంటారు. వారిని పూర్తిగా పట్టించుకోవడం మానేయాలి. వారితో కలహాలు పెట్టుకుని సమయాన్ని వృధా చేసుకోవద్దు. మీ స్నేహితుల సహకారం అందుతుంది. ఆ సహకారంతో అనుకున్న పనులు పూర్తవుతాయి. మీరు చేసే ప్రయాణాలు అనుకూల ఫలితాలను ఇస్తాయి. నవగ్రహ ధ్యానం చేస్తే అంతా మంచే జరుగుతుంది.
కుంభరాశి
మీరు తీసుకునే నిర్ణయాలు స్థిరంగా ఉండాలి. ఎప్పటికప్పుడు మారిపోతూ ఉండకూడదు. స్థిర నిర్ణయాలు ఆర్థికంగా అనుకూల ఫలితాలను ఇస్తాయి. దైవ బలమే మిమ్మల్ని రక్షిస్తుంది. కాబట్టి దైవాన్ని తలుచుకుంటూ ఉండండి. ముఖ్యంగా దుర్గాదేవిని స్తుతిస్తే అన్ని శుభ ఫలితాలు కలుగుతాయి. కొన్ని బాధపెట్టే సంఘటనలు కూడా జరుగుతాయి. మీ పై అధికారులు మీకు అనుకూలంగా ఉండకపోవచ్చు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి.
మీనరాశి
ఈ రాశి వారికి ఉత్సాహాన్ని పెంచే సంఘటనలు జరిగే అవకాశం ఉంది. స్నేహితులు, బంధువులతో సంతోషంగా గడుపుతారు. ఎవరు పనిచేస్తున్న రంగాల్లో వారికి అనుకూల వాతావరణం ఏర్పడుతుంది. మీరు సూర్య భగవానుడిని ప్రతిరోజూ సందర్శిస్తే అంతా మంచి జరుగుతుంది. ప్రతిరోజు ఉదయం సూర్యోదయం సమయంలో ఆదిత్యునికి నమస్కరించండి.
గమనిక:ఓ రాశిలో ఫలితాలన్నీ ఒక్కరికే చెందుతాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. వ్యక్తిగత వివరాల కోసం జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు. ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను ధృవీకరించడం లేదని గమనించగలరు.