Horoscope Today 8th January 2022: ఈ రాశివారు పక్కోళ్ల పనిలో వేలు పెట్టకండి, మీ రాశి ఫలితం ఇక్కడ తెలుసుకోండి
ఆయా రాశిలో ఫలితాలు మొత్తం ఒకే వ్యక్తికి వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా చాలా మార్పులుంటాయి. పూర్తి వ్యక్తిగత వివరాల కోసం అనుభవజ్ఞులైన జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు.
జనవరి 8 శనివారం రాశిఫలాలు
మేషం
అనారోగ్య సూచనలున్నాయి జాగ్రత్త. అప్పు ఇచ్చిన మొత్తం తిరిగి చేతికందుతుంది. కార్యాలయంలో ఎవరితోనైనా వాగ్వాదం రావొచ్చు. ప్రభుత్వ నిబంధనలను పాటించకపోతే ఇబ్బందుల్లో పడతారు. మీ ఇంటికి అతిథులు రావొచ్చు. నలుగురి మధ్య ప్రశంసలుు అందుకుంటారు.
వృషభం
ఇళ్లు లేదా స్థలాల క్రయవిక్రయాల్లో నిమగ్నమైన వ్యక్తులకు ఈ రోజు శుభసమయం. నిలుపుదల చేసిన డబ్బు చేతికందుతుంది. కుటుంబ ఆందోళనలు దూరమవుతాయి. ఉద్యోగంలో ఆశించిన ఫలితాలు పొందుతారు. సహోద్యోగులతో సంతోష సమయం గడుపుతారు. మీ నైపుణ్యంతో అందర్నీ ఆకట్టుకుంటారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది.
మిథునం
పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తవుతాయి. అప్పిచ్చిన మొత్తాన్ని తిరిగి పొందుతారు. స్నేహితుడిని కలుస్తారు. ఇతరుల పనిలో జోక్యం చేసుకోకండి. ఎవరితోనైనా వివాదాలు రావచ్చు. మతపరమైన కార్యక్రమాల పట్ల ఆసక్తి ఉంటుంది. ఆస్తికి సంబంధించిన విషయాలు పరిష్కారమవుతాయి. ఈరోజు మీరు సంతోషంగా ఉంటారు. మీ జీవిత భాగస్వామిని ఇబ్బంది పెట్టకండి. మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండండి.
Also Read: భోగి మంటలెందుకు, భోగి పళ్లెందుకు.. ఎందుకు చేయాలి ఇవన్నీ..
కర్కాటకం
ఈరోజు మీకు కుటుంబ బాధ్యత ఎక్కువగా ఉంటుంది. ఒక పనిని పూర్తి చేయడంలో వైఫల్యం మానసిక ఒత్తిడికి దారి తీస్తుంది. మీరు మీ జీవిత భాగస్వామితో సమయాన్ని గడపగలుగుతారు. ఇంట్లో ఒకరి ఆరోగ్యం క్షీణించవచ్చు. ఎవరికైనా సలహాలు ఇవ్వడం మానుకోండి. ఆలోచించిన తర్వాత అవసరమైన నిర్ణయాలు తీసుకోండి. డబ్బు లాభదాయకంగా ఉంటుంది.
సింహం
ఈరోజు మీరు వ్యాపారం నెమ్మదిగా సాగుతుంది. కొన్ని విషయాల్లో విమర్శలు ఎదుర్కొంటారు. చేసే పనిపై ఏకాగ్రతగా ఉండదు. ఏదో విషయంపై విచారంగా ఉంటారు. బంధువులతో మనస్పర్థలు వస్తాయి. ఆర్థిక పరిస్థితి చక్కగా ఉంటుంది.ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. విలువైన వస్తువులను నిర్లక్ష్యంగా వదలియేవద్దు.
కన్య
భాగస్వామ్యంతో వ్యాపారాన్ని ప్రారంభిస్తారు. దీర్ఘకాలిక వ్యాధుల నుంచి ఉపశమనం పొందే అవకాశం ఉంది. ఆహారం విషయంలో అజాగ్రత్తగా ఉండకండి. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. విద్యార్థులు మరింత కష్టపడాల్సి ఉంటుంది. ఉద్యోగులపై పని ఒత్తిడి ఉంటుంది. ఏ కారణం లేకుండా వివాదాల్లో చిక్కుకునే అవకాశం ఉంది. ప్రభుత్వ పనులు పూర్తవుతాయి. రుణం ఇచ్చే సమయంలో జాగ్రత్తగా ఉండండి.
Also Read: మకర సంక్రాంతి రోజున నల్ల నువ్వులు దానం చేస్తారక్కడ..
తుల
స్నేహితులతో సంబంధాలు బలంగా ఉంటాయి. మీ దినచర్య మార్చేందుకు ప్రయత్నిస్తారు. ఆఫీసులో పని ఒత్తిడి తగ్గుతుంది. ప్రత్యర్థులు ప్రశాంతంగా ఉంటారు. వ్యాపారంలో లాభాలు వచ్చే అవకాశం ఉంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. ఏదైనా వివాదాన్ని పరిష్కరించుకోవచ్చు.
వృశ్చికం
కొత్త వ్యక్తులు సోషల్ మీడియాలో మీతో కనెక్ట్ కాగలరు. ప్రేమ వ్యవహారాల్లో కాస్త భావోద్వేగానికి లోనవుతారు. ప్రేమ వివాహాల విషయంలో కుటుంబ సభ్యులతో వాదోపవాదాలు సాగుతాయి. కొన్ని ముఖ్యమైన పని విషయంలో మీరు కొంచెం గందరగోళానికి గురవుతారు. నలుగురి మధ్య ప్రశంసలు అందుకుంటారు.
ధనుస్సు
కొత్త పోటీదారుల వల్ల సవాళ్లు ఉంటాయి. మీరు వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్లాలని నిర్ణయించుకుంటారు. పై అధికారులతో స్నేహపూర్వక సంబంధాల కొనసాగిస్తారు. ఉద్యోగంలో ప్రమోషన్ కు సంబంధించిన అవకాశాలు ఉంటాయి. స్తిరాస్తి కొనుగోలు చేయొచ్చు. అప్పిచ్చిన మొత్తం చేతికందుతుంది. విద్యార్థులలో ఏకాగ్రత లోపించడం వల్ల చదువు దెబ్బతింటుంది.
Also Read: ముక్కోటి ఏకాదశి రోజు ఉపవాసం ఎందుకంటారా.. అయితే మీకు ఈ విషయం తెలియదేమో..
మకరం
మీ పని నాణ్యతను మెరుగుపరుస్తారు. ఉద్యోగాలు చేసే వారికి ఈరోజు మంచి రోజు. నిరుద్యోగులకు కొత్త ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. మీ ఒత్తిడి దూరమవుతుంది. బంధువులను కలుస్తారు. పోటీపరీక్షలు రాసిన వారు సక్సెస్ అవుతారు. ఆర్థిక పరిస్థితి బాగానే ఉంటుంది.
కుంభం
వ్యాపార పర్యటనకు ప్లాన్ చేస్తారు. అనవసర పనుల్లో సమయాన్ని వృథా చేయకండి. కడుపు నొప్పితో ఇబ్బంది పడతారు. అప్పుగా తీసుకున్న డబ్బు తిరిగి ఇచ్చే విషయంలో ఆందోళన ఉంటుంది. ఇతరుల పనిలో జోక్యం చేసుకోకండి. వాహనాన్ని జాగ్రత్తగా నడపండి. స్నేహితులతో సంతోష సమయం గడుపుతారు.
మీనం
బంధువులతో చాలా కాలంగా ఉన్న విభేదాలు పరిష్కారమవుతాయి. సామాజిక కార్యాలు పూర్తి చేయండి. పనిచేసే ప్రదేశంలో ఆటంకాలు తొలగిపోతాయి. ప్రజా జీవితంలో ఉన్న వారికి ఈ రోజంతా శుభసమయం. పిల్లల సక్సెస్ ని ఎంజాయ్ చేస్తారు.
Also Read: ముక్కోటి ఏకాదశి రోజు మాత్రమే ఉత్తర ద్వార దర్శనం ఎందుకు చేసుకోవాలి..
Also Read: 11 ఇంద్రియాలపై నియంత్రణే వైకుంఠ ఏకాదశి దీక్షలో ఆంతర్యం
Also Read: అడుగు అడుగులోనూ తన్మయత్వమే.. జీవితంలో ఒక్కసారైనా ఈ వనయాత్ర చేస్తే చాలంటారు..
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి