Horoscope Today 2nd October 2022: ఈ రాశివారి మనస్సు చంచలంగా ఉంటుంది- వీరిపై సరస్వతీ కటాక్షం ఉంటుంది, అక్టోబరు 2 రాశిఫలాలు
Horoscope Today 2nd October :ఆయా రాశిలో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. వ్యక్తిగత వివరాల కోసం అనుభవజ్ఞులైన జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు
Horoscope Today 1st October 2022 : కెరీర్, వ్యాపారం, ఉద్యోగం, ఆర్థిక , వైవాహిక జీవితం పరంగా ఈ రోజు ఏ రాశివారికి ఎలా ఉందో తెలుసుకుందాం.
మేష రాశి
ఏదో తెలియని కారణాల వల్ల మనసులో భయం ఏర్పడుతుంది. వ్యాపారం పెరుగుతుంది. లాభదాయక అవకాశాలు ఉంటాయి. విద్యార్థులకు పఠనాసక్తి పెరుగుతుంది. మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి. ఖర్చులు పెరగవచ్చు.
వృషభ రాశి
తల్లిదండ్రుల ప్రేమను పొందుతారు. కుటుంబంలో మీకు గౌరవం ఉంటుంది. ఖర్చు చేస్తారు. ఆస్తి కలిసొచ్చే అవకాశం ఉంది. ఉత్సాహంతో పని చేస్తారు.
మిధున రాశి
ఈ రోజు మీ కోపాన్ని అదుపులో ఉంచుకోండి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. పిల్లల గురించి ఆందోళన చెందుతారు. ఉద్యోగులు కార్యాలయంలో అధికారులతో ఏదో ఒక విషయంలో అభిప్రాయ భేదాలు కలిగి ఉంటారు. పనిలో కొన్ని మార్పులు ఉండవచ్చు.
కర్కాటక రాశి
మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. భౌతిక సుఖాలు పెరుగుతాయి. ఆదాయం తగ్గి ఖర్చులు పెరగవచ్చు. కుటుంబంలో ఆధ్యాత్మిక కార్యక్రమం నిర్వహిస్తారు. మిత్రులను కలుసుకునే అవకాశం ఉంది.
Also Read: విజయం, ఆదాయం - అక్టోబర్ నెల ఈ ఏడు రాశులవారికి అదిరింది!
సింహ రాశి
ఈ రోజు మీరు కార్యాలయంలో చాలా కష్టపడవలసి ఉంటుంది. మనస్సు చంచలంగా ఉంటుంది. మీరు పిల్లల పట్ల మీ బాధ్యతలను చక్కగా నిర్వర్తిస్తారు. కుటుంబ సభ్యుల మద్దతు పొందుతారు.
కన్యా రాశి
కన్య రాశి వారు ఈ రోజు తమ స్నేహితులను కలుసుకోవచ్చు. ప్రయాణం చేయాల్సి రావొచ్చు. ఆదాయం పెరగాలంటే కొన్నిరోజులు ఆగాలి. మీరు మరింత కష్టపడాల్సి రావొచ్చు.
తులా రాశి
ఈ రోజు మీరు సోమరితనంగా ఉంటారు. ఉద్యోగ మార్పు లేదా బదిలీ ఉండొచ్చు. మీరు పూర్తి ఆత్మవిశ్వాసంతో ఉంటారు. ఖర్చులను నియంత్రించండి. మీరు తల్లి నుంచి ఆర్థిక లాభం పొందుతారు. మీరు దూర ప్రయాణానికి వెళ్ళవలసి రావచ్చు.
Also Read: అనుకోని వివాదాలు, ఖర్చులు - అక్టోబర్ నెల ఈ ఐదు రాశులవారికి అంత అనుకూలంగా లేదు!
వృశ్చిక రాశి
పిల్లల వైపు నుంచి కొన్ని శుభవార్తలు అందుతాయి. ఈ రోజు మీకు అద్భుతమైన రోజు అవుతుంది. ఆర్థిక పరిస్థితి లాభదాయకంగా ఉంటుంది. వివాదాల పరిష్కారంలో విజయం సాధిస్తారు.
ధనుస్సు రాశి
ఈ రోజు ధనుస్సు రాశి వారికి కోర్టు సంబంధిత విషయాలు అనుకూలంగా ఉంటాయి. పాపులారిటీ పెరుగుతుంది. కార్యాలయంలో అదనపు బాధ్యతలు మీకు అప్పగించే అవకాశం ఉంది. సన్నిహితులతో ప్రేమ పెరుగుతుంది.
మకర రాశి
ఈ రోజు విద్యార్థులకు మంచి రోజు. మీరు పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు. కుటుంబంలో ఆనందం, శాంతి ఉంటుంది. పని ప్రదేశంలో అధిక ఒత్తిడి కారణంగా మనస్సు కలత చెందుతుంది.
కుంభ రాశి
కుంభ రాశి ఉద్యోగులు తమ పనితీరుతో ప్రశంసలు అందుకుంటారు. కొత్త ఉద్యోగావకాశాలు లభిస్తాయి. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. సాయంత్రం పూట కుటుంబంతో కలిసి ఎక్కడికైనా వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటారు
మీన రాశి
ఈ రోజు మీ మనస్సు కొన్ని కారణాల వల్ల కలవరపడుతుంది. కార్యాలయంలోని సీనియర్ అధికారుల మద్దతు మీకు లభిస్తుంది. మిత్రులను కలుస్తారు. మీరు ప్రయాణం చేయవలసి రావచ్చు. ఆరోగ్యం, ఆహారం విషయంలో జాగ్రత్త...