News
News
X

Horoscope Today 23rd September 2022: ఈ రోజు మీరు వేసే ప్లాన్స్ సక్సెస్ అవుతాయి, సెప్టెంబరు 23 రాశిఫలాలు

Horoscope Today 23 September :ఆయా రాశిలో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. వ్యక్తిగత వివరాల కోసం అనుభవజ్ఞులైన జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు

FOLLOW US: 

Horoscope 23 September 2022: కెరీర్, వ్యాపారం, ఉద్యోగం, ఆర్థిక , వైవాహిక జీవితం పరంగా ఈ రోజు ఏ రాశివారికి ఎలా ఉందో తెలుసుకుందాం.

మేష రాశి
నిత్యం చింతించే స్వభావం మీ ఆరోగ్యంపై చెడు ప్రభావం చూపుతుంది. అదే సమయంలో ఆర్థిక ప్రయోజనాలు ఉంటాయి. ఉద్యోగస్తులు ఇతరుల సహాయాన్ని ఆశించకూడదు. వైవాహిక జీవితంలో ఇతర వ్యక్తుల జోక్యం సమస్యలు సృష్టించవచ్చు.

వృషభ రాశి
తల్లిదండ్రుల పట్ల శ్రద్ధ వహించండి. డబ్బు జాగ్రత్త చేయడం చాలా అవసరం..లేకపోతే మీరు తర్వాత పశ్చాత్తాపపడవలసి ఉంటుంది. మీరు వైవాహిక జీవితాన్ని ఆనందిస్తారు. ఊహాత్మక ఆలోచనల్లో కూరుకుపోకుండా, మీ పనిపై దృష్టి పెట్టండి.

మిథున రాశి
పాత స్నేహితులతో మాట్లాడతారు. జీవిత భాగస్వామితో మంచి సంబంధం కొనసాగాలి అంటే కొంత సమయం వెచ్చించండి. మీ ప్రతిష్టను దెబ్బతీసే వ్యక్తులకు దూరంగా ఉండండి. జీవిత భాగస్వామి నుంచి బహుమతి అందుకుంటారు.

కర్కాటక రాశి
కుటుంబంలో  వ్యక్తుల మధ్య దూరం కారణంగా మీ ఆందోళనలు పెరుగుతాయి. భవిష్యత్ ప్రణాళికల గురించి ఆలోచించేందుకు ఇదే మంచి సమయం. చాలా కాలంగా ఉన్న మనస్తాపాలనుంచి ఈ రోజు బయటపడండి.

Also Read: ఈ 5 రాశులవారు లైఫ్ ని చాలా సీరియస్ గా తీసుకుంటారు

సింహ రాశి
ఈ రోజు  మీ మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. జీవిత భాగస్వామి స్వభావం మీ పట్ల బావుంటుంది. ఖాళీ సమయంలో పనులు పూర్తి చేసేందుకు ప్రయత్నించండి. ఇతరుల అవసరాల గురించి ఆలోచించిన తర్వాతే నిర్ణయం తీసుకోవడం మంచిది.

కన్యా రాశి
ఈ రోజు స్నేహితులు, కుటుంబ సభ్యులతో స్పెండ్ చేసేందుకు మంచి రోజు అవుతుంది. భాగస్వామ్య ప్రణాళికలు విజయం సాధిస్తాయి. వ్యాపారులు లాభపడతారు. ప్రయాణాల్లో లాభపడతారు. వైవాహిక జీవితం కొంత ప్రశాంతంగా ఉంటుంది. మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. 

తులా రాశి
మీపై మీరు నమ్మకం ఉంచండి. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తిచేయండి. తొందరపడి ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దు. గృహ సంబంధిత పెట్టుబడి లాభదాయకంగా ఉంటాయి. మీ ప్రియమైన వారి పట్ల మీ భావాలను వ్యక్తపరచడంలో కొంత సంకోచం ఉండొచ్చు.

Also Read: బుధుడు, సూర్యుడు ఉన్న రాశిలోనే శుక్రుడి సంచారం, ఈ 5 రాశులవారికి శుభసమయం

వృశ్చిక రాశి 
ఈ రోజు వృశ్చిక రాశి వారి ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. అకస్మాత్తుగా ఇంటికి అతిథి రావడం వల్ల మీ పనికి భంగం కలిగించవచ్చు. కార్యాలయంలో కొంత ఇబ్బంది ఉంటుంది. వ్యాపారం బాగానే సాగుతుంది.

ధనుస్సు రాశి
ఈ రోజు మీరు ఇంట్లో ఉన్న వృద్ధుల నుంచి డబ్బు పొందుతారు. ప్రేమికులకు మంచి రోజు. మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. పనిపై ఏకాగ్రత మీకు విజయాన్ని ఇస్తుంది.

మకర రాశి
మీ మనస్సు ప్రశాంతంగా ఉండాలంటే యోగా, ధ్యానం  మీ నిత్యకృత్యంలో భాగంగా చేర్చుకోండి. ఖర్చులను కాస్త తగ్గించుకుంటే మంచిది. మీరు మీ ఖాళీ సమయంలో మీకు ఇష్టమైన పనులు చేస్తారు. ఇంట్లో పెద్దవారితో సమయం వెచ్చించండి. 

కుంభ రాశి
ఆహార పానీయాల విషయంలో జాగ్రత్త వహించండి. కుటుంబ అవసరాలను చూసుకోవడంతో పాటు, మీ కోసం కూడా సమయాన్ని వెచ్చించండి. ఈరోజు ఎవ్వరికీ అప్పులు ఇవ్వొద్దు. రోజంతా సంతోషంగా ఉంటారు. 

మీన రాశి
స్నేహితులు, సన్నిహితుల మద్దతు మీకు లభిస్తుంది. ఈ రోజు జాగ్రత్తగా డ్రైవ్ చేయండి. వాహనం ప్రమాదం ఉంది జాగ్రత్త. మీ బాధ్యతలను చక్కగా నిర్వర్తించండి. ప్రేమ సంబంధాలు బావుంటాయి. ఆరోగ్యంలో హెచ్చుతగ్గులు ఉండొచ్చు.

Published at : 22 Sep 2022 08:51 PM (IST) Tags: Weekly Horoscope september 2022 horoscope today's horoscope 23 september 2022 23 september 2022 horoscope

సంబంధిత కథనాలు

October 2022 Horoscopes:  విజయం, ఆదాయం - అక్టోబర్ నెల ఈ ఏడు రాశులవారికి అదిరింది!

October 2022 Horoscopes: విజయం, ఆదాయం - అక్టోబర్ నెల ఈ ఏడు రాశులవారికి అదిరింది!

October 2022 Horoscopes: అనుకోని వివాదాలు, ఖర్చులు - అక్టోబర్ నెల ఈ ఐదు రాశులవారికి అంత అనుకూలంగా లేదు!

October 2022 Horoscopes: అనుకోని వివాదాలు, ఖర్చులు - అక్టోబర్ నెల ఈ ఐదు రాశులవారికి అంత అనుకూలంగా లేదు!

Numerology Today: ఈ తేదీల్లో పుట్టినవారి కెరీర్ అద్భుతంగా ఉంటుంది, అక్టోబరు 1 న్యూమరాలజీ

Numerology Today: ఈ తేదీల్లో పుట్టినవారి కెరీర్ అద్భుతంగా ఉంటుంది, అక్టోబరు 1 న్యూమరాలజీ

Horoscope Today 1st October 2022: నవరాత్రుల ఆరో రోజు ఈ 5 రాశుల సంపద పెరుగుతుంది, అక్టోబరు 1 రాశిఫలాలు

Horoscope Today 1st October 2022: నవరాత్రుల ఆరో రోజు ఈ 5 రాశుల సంపద పెరుగుతుంది, అక్టోబరు 1 రాశిఫలాలు

మీకు ఎప్పుడైనా అనుకోకుండా 111 లేదా 11:11 కనిపించాయా? ఈ విషయం తెలుసుకోవల్సిందే!

మీకు ఎప్పుడైనా అనుకోకుండా 111 లేదా 11:11 కనిపించాయా? ఈ విషయం తెలుసుకోవల్సిందే!

టాప్ స్టోరీస్

YSR Kalyanamasthu : నేటి నుంచి అమల్లోకి వైఎస్సార్ కళ్యాణమస్తు, షాదీ తోఫా- వెబ్ సైట్ ప్రారంభించిన సీఎం జగన్

YSR Kalyanamasthu : నేటి నుంచి అమల్లోకి వైఎస్సార్ కళ్యాణమస్తు, షాదీ తోఫా- వెబ్ సైట్ ప్రారంభించిన సీఎం జగన్

Nagarjuna No Politics : విజయవాడ ఎంపీగా పోటీపై నాగార్జున క్లారిటీ - అంటే వైఎస్ఆర్‌సీపీ అభ్యర్థిగా ?

Nagarjuna No Politics :  విజయవాడ ఎంపీగా పోటీపై నాగార్జున క్లారిటీ - అంటే వైఎస్ఆర్‌సీపీ అభ్యర్థిగా ?

Nanjiyamma: ఎవరీ నంజియమ్మ - మొదటి ప్రొఫెషనల్ సినిమాతోనే నేషనల్ అవార్డు!

Nanjiyamma: ఎవరీ నంజియమ్మ - మొదటి ప్రొఫెషనల్ సినిమాతోనే నేషనల్ అవార్డు!

Rains In AP Telangana: మరో 2 రోజులు ఆ జిల్లాల్లో భారీ వర్షాలు, పిడుగులు పడే ఛాన్స్ - IMD ఎల్లో అలర్ట్

Rains In AP Telangana: మరో 2 రోజులు ఆ జిల్లాల్లో భారీ వర్షాలు, పిడుగులు పడే ఛాన్స్ - IMD ఎల్లో అలర్ట్