అన్వేషించండి

జూలై 31 రాశిఫలాలు, ఈ రాశివారికి ఇంట్లో-కార్యాలయంలో బాధ్యతలు పెరుగుతాయి

Horoscope Today : మేష రాశి నుంచి మీన రాశివరకూ మీ రాశి ఫలితం ఎలా ఉందో ఇక్కడ తెలుసుకోండి.

Horoscope Today 2023 July 31st 

మేష రాశి
ఈ రాశివారిలో ఈ రోజు ఆత్మవిశ్వాసం నిండి ఉంటుంది. మనస్సు చంచలంగా ఉంటుంది. ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి పెరుగుతుంది. స్నేహితుని సహాయంతో నిరుద్యోగులు ఉద్యోగావకాశాలు పొందుతారు. ఆదాయం పెరుగుతుంది. మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి. వ్యాపారంలో లాభం ఉంటుంది. మీ భావోద్వేగాలను అదుపులో ఉంచుకోండి. జీవిత భాగస్వామికి ఆరోగ్య సమస్యలు ఉండవచ్చు. 

వృషభ రాశి
ఈ రాశివారు ఈ రోజంతా ఆనందంగా ఉంటారు. మీపై మీకు పూర్తి విశ్వాసం ఉంటుంది. భవనం నిర్వహణ, అలంకరణ పనులపై ఖర్చులు పెరగొచ్చు. కుటుంబ సభ్యుల మద్దతు లభిస్తుంది. మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి. కుటుంబ సమస్యలు తగ్గుతాయి. ఆహారంపై ఆసక్తి పెరుగుతుంది. మీరు ప్రారంభించే పనులకు కుటుంబ సభ్యుల నుంచి మద్దతు లభిస్తుంది. విద్యార్థులు మరింత కష్టపడాలి.

మిథున రాశి
ఈ రాశివారు భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవాలి. ఉన్నత విద్య, పరిశోధన పనుల కోసం విదేశాలకు వెళ్లే అవకాశం ఉంది.  ఉన్నతాధికారుల సహకారం ఉద్యోగులకు ఉంటుంది. మీ బాధ్యతలు పెరుగుతాయి. వ్యక్తిగత జీవితం కొంత గందరగోళంగా అనిపిస్తుంది. మితిమీరిన కోపాన్ని తగ్గించుకోండి. ధార్మిక ప్రదేశానికి వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటారు.

కర్కాటక రాశి
ఈ రాశివారు జీవిత భాగస్వామి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. తల్లిదండ్రుల నుంచి మీకు సంపూర్ణ మద్దతు లభిస్తుంది. ఖర్చులు పెరుగుతాయి. మీ మాటల్లో మాధుర్యం నిండి ఉంటుంది. మీపై మీకు పూర్తి విశ్వాసం ఉంటుంది. వాహన సౌఖ్యం లభిస్తుంది. స్నేహితుల నుంచి సంపూర్ణ మద్దతు లభిస్తుంది. మనసులో ప్రశాంతత ఉంటుంది. సహనంగా వ్యవహరించండి.

Also Read: ఆగష్టు మొదటివారం ఈ 3 రాశులవారికి లక్కు మామూలుగా లేదు!
 
సింహ రాశి
ఈ రాశివారి కుటుంబంలో సంతోషం ఉంటుంది. ఉద్యోగులు పనిప్రదేశంలో శ్రమ పెరుగుతుంది. అవసరానికి డబ్బు చేతికందుతుంది. మీ భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవాలి. ప్రణాళికేతర ఖర్చులు పెరుగుతాయి. మితిమీరిన కోపం తగ్గించుకోవాలి. వ్యాపారం బాగానే సాగుతుంది. పాత స్నేహితులను కలుస్తారు. 

కన్యా రాశి
అనవసరమైన కోపం, వాదోపవాదాలకు దూరంగా ఉండండి. కుటుంబంతో కలిసి మతపరమైన స్థలాన్ని సందర్శించే అవకాశం ఉంది. వ్యాపారం వృద్ధి చెందుతుంది. మీలో ఆత్మవిశ్వాసం నిండిఉంటుంది. ఆదాయ పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి.  అనవసరమైన వివాదాలకు దూరంగా ఉండాలి. వ్యాపారంలో ఇబ్బందులు తలెత్తవచ్చు. 

తులా రాశి 
 ఈ రాశివారి ఆలోచనల్లో స్థిరత్వం ఉండదు. తల్లిదండ్రుల ప్రేమాభిమానాలు మీపై ఉంటాయి. కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. వేరే ప్రదేశానికి వెళ్లాల్సి రావొచ్చు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగులకు కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. అధికారులతో విభేదాలు ఉండే అవకాశం ఉంది. పనిభారం పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితి మాత్రం ఆశాజనకంగా ఉంటుంది. 

వృశ్చిక రాశి
ఈ రాశివారి మాటల్లో మాధుర్యం ఉంటుంది. పూర్తిస్థాయిలో కాన్ఫిడెన్స్ గా ఉంటారు. అవివాహితులకు మంచి సంబంధాలు కుదురుతాయి. రచన, మేధోపరమైన పనుల్లో నిమగ్నమైఉంటారు. పాత స్నేహితుడిని కలుస్తారు. కుటుంబంతో కలిసి ప్రయాణం చేయాల్సి రావొచ్చు. ప్రణాళికేతర ఖర్చులు పెరుగుతాయి.కార్యాలయంలో సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. మీ ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండండి 

ధనుస్సు రాశి
ఈ రాశివారు జీవిత భాగస్వామి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. ఉద్యోగంలో చాలా మార్పులొస్తాయి. కొత్తగా వ్యాపారం ప్రారంభించాలి అనుకునేవారు అందుకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందించుకోవచ్చు. కుటుంబంలో మతపరమైన కార్యక్రమాలు నిర్వహిస్తారు. తోబుట్టువులతో వివాదాలు ఏర్పడే అవకాశం ఉంది. కుటుంబ జీవితం ఆనందంగా ఉంటుంది.

 

Also Read: రాముడితో పాటూ సోదరుల దర్శనభాగ్యం దక్కాలంటే ఇక్కడకు వెళ్లాలి!

మకర రాశి
ఈ రాశివారు ప్రశాంతంగా ఉంటారు. కోపం తగ్గించుకుని మాటల్లో సున్నితత్వం ఉండేలా జాగ్రత్తపడండి. ఉద్యోగులకు పనిభారం పెరుగుతుంది. తీర్థయాత్రలకు వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటారు. శ్రమ పెరుగుతుంది. మీపై ప్రతికూల ఆలోచనల ప్రభావం ఉంటుంది. మానసిక సమస్యలు ఎదురవుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. సంతానం కారణంగా సంతోషంగా ఉంటారు.

కుంభ రాశి
ఈ రాశివారికి చదువుపట్ల ఆసక్తి పెరుగుతుంది. ఉద్యోగంలో పురోగతి ఉంటుంది. ఉన్నతాధికారుల నుంచి సహకారం అందుతుంది. ఆదాయం పెరుగుతుంది. పని ఒత్తిడి పెరుగుతుంది. పిల్లల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. ఖర్చులు పెరుగుతాయి. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. 
సంభాషణలో ప్రశాంతత ఉండేలా చూసుకోవాలి. అనవసర ఆలోచనలతో మనసు కలత చెందుతుంది. 

మీన రాశి 
ఈ రాశివారికి మనసులో ఏదో నిస్పృహ ఉంటుంది. కుటుంబ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. ఖర్చులు పెరుగుతాయి. వ్యాపారులకు  స్నేహితుల నుంచి సహకారం లభిస్తుంది. చేసే పనిపై పూర్తిస్థాయిలో శ్రద్ధ పెడతారు. వైవాహిక జీవితం బావుంటుంది. 

About the author RAMA

జర్నలిజంలో గత 15 ఏళ్లుగా పనిచేస్తున్నారు.  ప్రముఖ తెలుగు మీడియా సంస్థలు ఈటీవీ, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతిలో పని చేసిన అనుభవం ఉంది. ఏపీ, తెలంగాణ, రాజకీయ, సినిమా, ఆధ్యాత్మిక వార్తలు సహా వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక  MJMC, MSW, PGDPM కోర్సులు పూర్తిచేశారు. జర్నలిజం కోర్సు పూర్తి చేసి పలు తెలుగు మీడియా సంస్థలలో  కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో నాలుగేళ్లుగా డిప్యూటీ ప్రొడ్యూసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. 

Read More

టాప్ హెడ్ లైన్స్

23-08-2026 ఆదివారం మీ రాశిఫలాలు! ధనస్సు, మకరం, కుంభం, మీన రాశుల దినఫలాలు!
23-08-2026 ఆదివారం మీ రాశిఫలాలు! ధనస్సు, మకరం, కుంభం, మీన రాశుల దినఫలాలు!
23-08-2026 ఆదివారం మీ రాశిఫలాలు! సింహం, కన్యా, తులా, వృశ్చిక రాశుల దినఫలాలు!
23-08-2026 ఆదివారం మీ రాశిఫలాలు! సింహం, కన్యా, తులా, వృశ్చిక రాశుల దినఫలాలు!
23-08-2026 ఆదివారం మీ రాశిఫలాలు! మేషం, వృషభం, మిథునం, కర్కాటక రాశుల దినఫలాలు!
23-08-2026 ఆదివారం మీ రాశిఫలాలు! మేషం, వృషభం, మిథునం, కర్కాటక రాశుల దినఫలాలు!
మీన రాశి ఆగస్టు 23-29 వారఫలం
మీన రాశి ఆగస్టు 23-29 వారఫలం

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Job Calendar: 10,060 ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. ఏపీ జాబ్‌ క్యాలెండర్‌ వచ్చేసింది
10,060 ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. ఏపీ జాబ్‌ క్యాలెండర్‌ వచ్చేసింది
CM Chandrababu: వచ్చే నెలలో అనకాపల్లి, విశాఖకు గోదావరి జలాలు! ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన!
వచ్చే నెలలో అనకాపల్లి, విశాఖకు గోదావరి జలాలు! ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన!
Veligonda Project: వెలిగొండ ప్రాజెక్టు తొలిదశ ప్రారంభానికి సర్వం సిద్ధం! నిర్వాసితులకు 250 కోట్ల అందజేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు! 
వెలిగొండ ప్రాజెక్టు తొలిదశ ప్రారంభానికి సర్వం సిద్ధం! నిర్వాసితులకు 250 కోట్ల అందజేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు! 
Sheik Sadiq Khan Arrest: పంచాయతీరాజ్ ఏఈ కుటుంబ ఆత్మహత్య కేసులో కీలక ముందడుగు! ఢిల్లీలో చిక్కిన రైఫిల్ షూటింగ్ కోచ్‌ సాధిక్ ఖాన్!
పంచాయతీరాజ్ ఏఈ కుటుంబ ఆత్మహత్య కేసులో కీలక ముందడుగు! ఢిల్లీలో చిక్కిన రైఫిల్ షూటింగ్ కోచ్‌ సాధిక్ ఖాన్!
Lok Sabha Delimitation Freeze: డీలిమిటేషన్‌కు కాంగ్రెస్ నో - 50 ఏళ్లుగా 90 కోట్లు పెరిగిన జనాభా - మరి ఎంపీ సీట్లు పెరగొద్దా?
డీలిమిటేషన్‌కు కాంగ్రెస్ నో - 50 ఏళ్లుగా 90 కోట్లు పెరిగిన జనాభా - మరి ఎంపీ సీట్లు పెరగొద్దా?
iPhone Crimes India: ఐఫోన్ మోజులో ముక్కలవుతున్న భారతీయ కుటుంబాలు! రోజురోజుకు పెరుగుతున్న హత్యలు, ఆత్మహత్యలు!
ఐఫోన్ మోజులో ముక్కలవుతున్న భారతీయ కుటుంబాలు! రోజురోజుకు పెరుగుతున్న హత్యలు, ఆత్మహత్యలు!
Revanth Reddy US Tour Cancellation : రేవంత్‌కు కావాల్సిందే కేంద్రం చేసిందా ? - అమెరికా టూర్ పర్మిషన్ క్యాన్సిల్ వెనుక రాజకీయం ఉందా?
రేవంత్‌కు కావాల్సిందే కేంద్రం చేసిందా ? - అమెరికా టూర్ పర్మిషన్ క్యాన్సిల్ వెనుక రాజకీయం ఉందా?
Deepika Padukone : ప్రభాస్ స్పిరిట్ కాంట్రవర్సీపై దీపికా పదుకోన్ రియాక్షన్ - ఒక్క లైక్‌తో...
ప్రభాస్ స్పిరిట్ కాంట్రవర్సీపై దీపికా పదుకోన్ రియాక్షన్ - ఒక్క లైక్‌తో...
Embed widget